నేపాల దేశ మహానుభావులు
నేపాల దేశ మహానుభావులు (Nepali: नेपालका राष्ट्रिय विभूतिहरू) అనేది నేపాల చరిత్రపై విశేష ప్రభావాన్ని చూపిన నేపాలీల జాబితా. ప్రాచీన కాలం నుండి ఆధునిక కాలం వరకు మొత్తం 18 మంది వ్యక్తుల పేర్లు ఉన్న ఈ జాబితాని 1955లో ప్రముఖ నేపాల రచయిత బాలకృష్ణ సమ నేతృత్వంలో ఒక కమిటీ తయారు చేసింది.
నేపథ్యం
[మార్చు]నాటి నేపాల రాజు మహేంద్ర ఈ కమిటీని నియమించి, ఈ జాబితాకి పేర్లు ప్రతిపాదించవలసిందిగా నిర్దేశించాడు. వివిధ చారిత్రాక వ్యక్తులు నేపాల జాతికి అందించిన సేవలూ, వాటి పరిణామాలూ, ప్రభావాలను పరిగణలోకి తీసుకుని ఈ ప్రతిపాదనలు చేయవలసిందిగా రాజనిర్దేశం. నిర్దేశాన్ని అనుసరించి సాంస్కృతిక, ఆర్థిక మతపరమైన సంస్కరణలు చేసిన వారినీ, యుద్ధంలో వీరత్వం చూపిన వారినీ, సాహిత్య పటిమా, నిర్మాణశాస్త్ర సేవలు అందించిన వారినీ, ప్రజాస్వామ్య స్ఫూర్తి పెంపొందించిన వారినీ కమీషన్ ప్రతిపాదించింది.[1]
నేటి పరిస్థితి
[మార్చు]నేడు ఈ కమీషన్ నేపాల ప్రజ్ఞా ప్రతిష్ఠాన నేతృత్వంలో నడుస్తోంది. ఈ కమీషన్ ఈ గుర్తింపుని వ్యక్తి తదనంతరం చర్చోపచర్చల ఆధారంగా ఇస్తుంటుంది.
ఈ గుర్తింపుకు వచ్చిన చివరి ప్రతిపాదనా, అలాగే ఊ గుర్తింపు పొందిన చివరి వ్యక్తీ రాజా జయ పృథ్వీ బహాదుర్ సింహ. జూన్ 20, 2022న ఈయనికి ఈ గుర్తింపు లభించింది.
చిట్టా
[మార్చు]ఈ చిట్టాలో మొత్తం 18 మంది ఉన్నారు.[2] వీరి పేర్లు:
- గౌతమ బుద్ధుడు
- జనకుడు
- అంశువర్మ
- సీత
- అరనికో
- రామ శాహ్
- పృథ్వీనారాయణ్ శాహ్
- అమర సింహ థాపా
- భీమసేన థాపా
- భానుభక్త ఆచార్య
- బలభద్ర కుఁవర్
- మోతీరామ భట్ట
- శంఖధర సాఖ్వా
- పాసాఙ్ ల్హాము శేర్పా
- ఫాల్గునానంద
- త్రిభువన వీర విక్రమ శాహ్
- భక్తి థాపా
- జయ పృథ్వీబహాదుర్ సింహా
మూలాలు
[మార్చు]- ↑ "National Heroes / Personalities / Luminaries of Nepal". ImNepal.com (in అమెరికన్ ఇంగ్లీష్). 2011-12-23. Retrieved 2025-02-06.
- ↑ "Bhakti Thapa is the latest national hero of Nepal". OnlineKhabar (in బ్రిటిష్ ఇంగ్లీష్). July 2021. Archived from the original on 2021-07-01. Retrieved 2025-02-06.