నేపాల ప్రజ్ఞా ప్రతిష్ఠానం
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
नेपाल प्रज्ञा प्रतिष्ठान | |
ప్రతిష్ఠానపు భవనం | |
స్థాపన | జూన్ 22, 1957 |
---|---|
రకం | ప్రభుత్వ సంస్థ |
కేంద్రీకరణ | సాంస్కృతికాభివృద్ధి |
ప్రధాన కార్యాలయాలు | కాఠమాండు |
కార్యస్థానం | |
సేవా ప్రాంతాలు | నేపాల్ |
అధికారిక భాష | నేపాలీ |
సంచాలకుడు | భూపాల రాయ్ |
జాలగూడు | https://nepalacademy.gov.np/academic-council/ |
మారుపేరు | నేపాల రాజకీయ ప్రజ్ఞా ప్రతిష్ఠానం |
మునుపు నేపాల రాజకీయ ప్రజ్ఞా ప్రతిష్ఠానంగా పిలవబడిన నేపాల ప్రజ్ఞా ప్రతిష్ఠానం అనేది నేపాలులోని భాషలూ, సంస్కృతీ, సాహిత్యం, తత్వశాస్త్రం, సామాజిక శాస్త్రాల అభివృద్ధికై ఏర్పాటు చేసిన ఒక జాతీయ సంస్థ. ఈ సంస్థ పరిశోధనలు చేయించడంతో పాటు, జాతీయ, అంతర్జాతీయ కార్యక్రమాలను నడిపించి, సాంస్కృతిక, బౌద్ధిక వికాసాన్ని ప్రోత్సహించడం దీని లక్ష్యం.[1]
నేపథ్యం
[మార్చు]నేపాల జాతీయ సాంస్కృతిక ప్రతిష్ఠాన ఏర్పాటుకు ఉద్యమం 20వ శతాబ్దంలో మొదలైంది. లక్ష్మీప్రసాద్ దేవకోట లాంటి జాతీయ ప్రముఖులు ఇలాంటి సంస్థ ఏర్పాటుకు పిలుపునిచ్చారు.[2] 1957లో నేపాల సాహిత్య, కళా ప్రతిష్ఠానం అనే పేరుతో ఈ సంస్థ ఏర్పాటు అయ్యింది. 1974లో అమలు ఐన నేపాల రాజకీయ ప్రజ్ఞా ప్రతిష్ఠాన చట్టం 1974ను అనుసరించి దీని పేరు నేపాల రాజకీయ ప్రజ్ఞా ప్రతిష్ఠానం అయింది. 2008లో నేపాల్ ప్రజాస్వామ్యంగా మారాక, నేపాల్ సంసద్ 2007 చట్ట సవరణతో దీని పేరును నేపాల ప్రజ్ఞా ప్రతిష్ఠానంగా మార్చింది.[3]
క్రియాశీలత
[మార్చు]ప్రతిష్ఠానం ప్రతీ ఏటా జాతీయ జానపద సంగీత, నృత్యోత్సవం, జాతీయ సాంస్కృతికోత్సవం నిర్వహించడంతో పాటు కవి భానుభక్త ఆచార్య జ్ఞాపకార్థం ప్రతి ఏటా జాతీయ కావ్య స్పర్ధా, ఇతర రంగస్థల కార్యక్రమాలతో భాను జయంతి నిర్వహిస్తుంటుంది.[4]
ఇవి కూడా చూడండి
[మార్చు]- నేపాల దేశ మహానుభావులు – నేపాల దేశ గుర్తింపు
మూలాలు
[మార్చు]- ↑ "नेपाल प्रज्ञा प्रतिष्ठान - Objectives". Nepal Academy (in ఇంగ్లీష్). 2012-04-06. Archived from the original on 2014-04-09. Retrieved 2014-03-11.
- ↑ "103rd birth anniversary of Devkota being marked" [దేవకోటా 103వ జయంతి జరుపుకోబడుతోంది]. reviewnepal.com (in ఇంగ్లీష్). 2012-11-12. Archived from the original on 2013-09-21.
- ↑ "History". Nepal Academy (in ఇంగ్లీష్). Archived from the original on 2013-06-16.
- ↑ "नेपाल प्रज्ञा प्रतिष्ठान - Yearly Activities". Nepal Academy (in ఇంగ్లీష్). 2012-04-06. Archived from the original on 2014-04-09. Retrieved 2014-03-11.