నేల
Jump to navigation
Jump to search
![]() | ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
నేల అనేది సేంద్రియ పదార్థాలు, ఖనిజాలు, వాయువులు, ద్రవాలు, జీవుల యొక్క మిశ్రమం. పెడోస్పియర్ అని పిలువబడే నేల యొక్క భూ పొర నాలుగు ముఖ్యమైన విధులను కలిగి ఉంది:
- మొక్కల పెరుగుదలకు ఒక మాధ్యమంగా
- నీటి నిల్వ, సరఫరా, శుద్దీకరణ సాధనంగా
- భూమి యొక్క వాతావరణం యొక్క సవరణగా
- జీవుల నివాసంగా
ఈ విధులన్నీ నేలను మార్పులకు గురిచేస్తూవుంటాయి.
భూమి ఉపరితలంపై కొన్ని చోట్ల రాతి భాగం ఉంటుంది. భూమి పైపొరలో రాతి భాగం లేనిచోట నేలను తవ్వినప్పుడు భూమిలోపల రాయి కనిపిస్తుంది. భూమి యొక్క లోపలి రాతి భాగం కొన్ని చోట్ల తక్కువ లోతు లోను, కొన్ని చోట్ల చాలా ఎక్కువ లోతు లోను ఉంటుంది. నేలను తవ్వి భూమి లోపల ఉన్న ఖనిజాలను, వాయువులను, ద్రవాలను వెలికితీస్తారు, వీటిని గనులు అంటారు.
Vishnu vs anil