నేలకొండపల్లి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
నేలకొండపల్లి
—  మండలం  —
ఖమ్మం జిల్లా పటములో నేలకొండపల్లి మండలం యొక్క స్థానము
ఖమ్మం జిల్లా పటములో నేలకొండపల్లి మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 17°07′04″N 80°02′27″E / 17.117824°N 80.040779°E / 17.117824; 80.040779
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఖమ్మం
మండల కేంద్రము నేలకొండపల్లి
గ్రామాలు 22
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 62,220
 - పురుషులు 31,103
 - స్త్రీలు 31,117
అక్షరాస్యత (2001)
 - మొత్తం 56.40%
 - పురుషులు 67.05%
 - స్త్రీలు 45.70%
పిన్ కోడ్ 507160

నేలకొండపల్లి, తెలంగాణ రాష్ట్రములోని ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్ నం. 507 160 ., ఎస్.టి.డి.కోడ్ = 08742.

గ్రామజనాబా[మార్చు]

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

  • శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం:- కలియుగవరదుడైన శ్రీ వెంకటేశ్వరస్వామి ఇక్కడ భక్తాభీష్ట వరదుడై కొలువుదీరి ఉన్నాడు. చూపరులను

ఆకట్టుకొనే ఆలయశోభతో, వివిధ దేవీదేవతలతో ఈ ధామం అలరారుతోంది. ప్రతి శుక్ర, శనివారాలలో, ఇక్కడ విశేషపూజలు జరుగుతవి. ఈ ఆలయదర్శనం సర్వశుభదాయకంగా భక్తులు భావిస్తారు. [2]

చరిత్ర[మార్చు]

నేలకొండపల్లి స్థూపం
నేలకొండపల్లి స్థూపం సమీప దృశ్యం

నేలకొండపల్లి గ్రామం గొప్ప చారిత్రక స్థలం. మహాభారతంతో ముడిపడ్డ కథలొకవైపు, బౌద్ధ అవశేషాల తాలూకు చారిత్రక వాస్తవాలు మరొక వైపు ఈ ప్రాంతానికి ప్రాముఖ్యత నిస్తున్నాయి. నేలకొండపల్లికి ఒక మైలు దూరంలో విరాటరాజు దిబ్బ, కీచక గుండం అనే స్థలాలు మహాభారత కథతో సంబంధం కలిగి ఉన్నాయి.

పాండవులు అజ్ఞాతవాస సమయంలో విరాట నగరాన్ని పాలించే విరాట రాజు కొలువులో మారువేషాల్లో చేరారు. విరాట రాజు బావమరిది కీచకుడు సైరంధ్రి వేషంలో ఉన్న ద్రౌపదిని కామించగా, వలలుడి వేషంలో ఉన్న భీముడు కీచకుణ్ణి చంపేసాడు. ఆ విరాటనగరం ఈ ప్రాంతమేనని పౌరాణిక గాధ. మహాభారతం జరిగిందని చెప్పబడుతున్న కాలం నాటి అవశేషాలు ఇక్కడ దొరకడం విశేషం. 1977 లో జరిపిన తవ్వకాల్లో బౌద్ధ అవశేషాలు, స్థూపాలు, విగ్రహాలు దొరకడంతో ఈ ప్రాంతంలో బౌద్ధం విలసిల్లిందని రూఢి అవుతున్నది.

ఇటీవలి చరిత్రకు వస్తే.., నేలకొండపల్లి భక్త రామదాసుగా ప్రసిద్ధి గాంచిన కంచర్ల గోపన్న ఇక్కడే జన్మించాడు. ఆయన పుట్టిన ఇంటిని భక్త రామదాసు ధ్యాన మందిరం గా పిలుస్తున్నారు. గ్రామంలో పురాతన దేవాలయాలు కూడా ఉన్నాయి.

వ్యవసాయ విషయాలు[మార్చు]

గ్రామంలో సౌకర్యాలు[మార్చు]

  • ఇక్కడ మండల రెవెన్యూ కార్యాలయం, మండల అభివృద్ధి కార్యాలయం, పోలీస్ స్టేషను,ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాల ,దిగ్రీ కళాశాల,పలు బ్యాన్క్ లు ,షొపిన్గ్ లు ఉన్నాయి.

దేవాలయములు[మార్చు]

  • చారిత్రకంగా ప్రసిద్ధి చెందిన వేంకటేశ్వరాలయం , భీమేశ్వరాలయం , వేణుగోపాలస్వామి మరియు ఉత్తరేశ్వర ఆలయములు ఉన్నవి. వీటిని కనీసం 400 సంవత్సరముల క్రితం నిర్మించారని ప్రతీతి.
  • రాజగోపాలస్వామి ఆలయం:- పాహి రామప్రభో . . పాహి భద్రాద్రి వైదేహి . . . రామప్రభో అంటూ రాముడిని పరిపరివిధాలా ఆర్తిగా కీర్తించిన భక్తకవి రామదాసు స్వస్థలం నేలకొండపల్లి. రామదాసు నేలకొండపల్లిలోని రాజగోపాలస్వామి అనుగ్రహంతోనే జన్మించాడని ప్రతీతి. రామదాసు తల్లిదండ్రులు, రామదాసు ఇలవేల్పుగా ఇష్టదైవంగా ఆరాధించుకున్న దైవం శ్రీ రాజగోపాలస్వామి. [1]

[1] ఈనాడు జిల్లా ఎడిషన్ 18 సెప్టెంబరు 2013. 1వ పేజీ. [2] ఈనాడు జిల్లా ఎడిషన్ 25 అక్టోబరు 2013.

రవాణా సౌకర్యాలు[మార్చు]

నేలకొండపల్లి ఖమ్మం నుండి కోదాడ (నల్లగొండ జిల్లా)రహదారిపై ఉన్నది. ఖమ్మం నుండి కోదాడ, నల్లగొండ, మిర్యాలగూడ, తిరుపతి, గుంటూరు వంటి ప్రదేశాలకు వెళ్ళే బస్సులు ఇక్కడ ఆగుతాయి. హైదరాబాదు వెళ్ళాలంటే ఖమ్మం లేదా కోదాడ నుండి ఎక్స్ ప్రెస్స్ బస్సులు దొరకుతాయి. ఖమ్మం నుండి దేశం లోని అన్ని ముఖ్య ప్రదేశాలకు రైలు సౌకర్యం ఉన్నది. అతి దగ్గర విమానాశ్రయం హైదరాబాదు విజయవాడ లో ఉన్నవి.

సకలజనుల సమ్మె[మార్చు]

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

మండలంలోని గ్రామాలు[మార్చు]

ఇతర లంకెలు[మార్చు]