నైనారు కండ్రిగ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నైనారు కండ్రిగ గ్రామ పంచాయితీ గురించి కొన్ని విషయాలు:

ఈ గ్రామ పంచాయితీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, తిరుపతి జిల్లా, నారాయణవనం మండలం.[1] లోని ఒక చిన్న ఉన్నతమైన పంచాయితీ. ఈ గ్రామ పంచాయితీ పరిధిలో 6 ఆవాస గ్రామం.[1]లు ఉన్నాయి. అవి 1. నైనారు కండ్రిగ 2. నైనారు కండ్రిగ హరిజనవాడ 3. మిట్ట నైనారు కండ్రిగ 4. కృష్ణమరాజులు కండ్రిగ 5. కృష్ణమరాజులు కండ్రిగ ఆది ఆంధ్రవాడ 6. నైనారు కండ్రిగ యానాది కాలని ఈ గ్రామం.[1] నకు పంచాయితీ భవనము కలదు, ఈ గ్రామం.[1]లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది. ఈ గ్రామం.[1] నకు నైనారు కండ్రిగ పేరు ఎలా వచ్చినదంటే? మా గ్రామం.[1]లో పురాతనమైనటువంటి, శ్రీరామభజన మందిరము, నైనారయ్య గుడి, అంకమ్మ, నడివీధి గంగమ్మ దేవతల గుడులు ఉన్నాయి. పైన కనపరచిన నైనారయ్య గుడియందు పురాతనముగా ప్రతి సంవత్సరము ఆడినెలలో పొంగల్లు పెట్టి విశేషపూజలు చేస్తున్నారు. పైన తెలిపిన దేవతలపై పూర్తి నమ్మకముంచిన గ్రామస్థులు ఈ గ్రామం.[1] నకు నైనారు కండ్రిగ అను పేరుపెట్టుకునట్లు గ్రామ పెద్దల నుండి తెలియవచ్చింది.

ఈ నైనారు కండ్రిగ గ్రామం.[1]లో 100 కుటుంబాలు ఉన్నాయి. ఈ గ్రామం.[1]లో సుమారు 500 నుండి 600 వందల వరకు జనాభా ఉంది. ఈ గ్రామం.[1] లోని ప్రజలకు వ్యవసాయమే జీవనాధారము ఈ గ్రామం.[1]లో గల ప్రజలు 100% అక్షరాభ్యాసము కలిగినవారు. ఈ గ్రామం.[1] లోని ప్రతి కుటుంబం నుండి పిల్లలు చక్కగా చదువుకొని కొందరు విదేశములలో, కొందరు ప్రక్క రాష్ట్రములలో, కొందరు మన రాష్ట్రము లోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలలో ఉపాధి పొందుచున్నారు. ఈ గ్రామం.[1] లోని ప్రజలు అందరు కలసి కట్టుగా ఉంటూ ప్రక్క గ్రామం.[1] లకు ఆదర్శముగా నిలుచుచున్నారు. ఈ గ్రామం.[1]లో కల శ్రీరామ భజనమందిరము నిత్యపూజలు, దూపదీప నైవేద్యములతో విశేషపూజలను అందుకోంటున్నది. ఇచ్చట ప్రతిసంవత్సరము శ్రీరామనవమి వేడుకలు 11రోజులు చాలా వైభవంగా నిర్వహించబడును. గ్రామం.[1]లో గల గంగమ్మ ప్రతి వారము మంగ్ల, ఆదివారములలో విశేషపూజలు నిర్వహించి అమ్మను శాంతింపజేయుటకు నైవేద్యముగా అంబిల్లు పోయుదురు. నడివీధి గంగమ్మకు ప్రతి సంవత్సరము మే లేదా జూన్ మాసములలో జాతరచేయుదురు. ఈ కార్యక్రమమును ఆదివారము ప్రారంభించి గురువారము ముగుస్తుంది. గ్రామం.[1]లో ప్రాచీనముగా వస్తున్నటువంటి కళలైన "కోలాటము" "కులుకు భజన, పండరి భజనల యందు" చిన్నపిల్లలకు శిక్షణ ఇచ్చి వారిని ఈ కళలయందు నైపుణ్యులుగా తీర్చిదిద్దుతారు. వీరిచే గ్రామం.[1]లో నిర్వహించే ఉత్సవ సందర్భములలో కోలాటము, భజనలు చేయించి గ్రామస్తులకు వినోదమును పంచుదురు. ఈ భజన బృందములు తిరుపతి తిరుమల దేవస్థానము వారు ప్రతిసంవత్సరము నిర్వహించే శ్రీవారి బ్రహ్మోత్సవములలో పాల్గొని సందర్శకులకు, ఆత్యాద్మికతను పెంచుటయందు తమవంతు పాత్రను చక్కగా పోషించెదరు.


మూలాలు

[మార్చు]
  1. 1.00 1.01 1.02 1.03 1.04 1.05 1.06 1.07 1.08 1.09 1.10 1.11 1.12 1.13 1.14 1.15 1.16 1.17 "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-09-13. Retrieved 2015-09-01.