నైనార్ నాగేంద్రన్
| నైనార్ నాగేంద్రన్ | |||
పరిశ్రమల శాఖ మంత్రి | |||
| పదవీ కాలం 2002 జూన్ 10 – 2006 మే 12 | |||
| ముందు | ఎస్.ఎం. వేలుసామి | ||
|---|---|---|---|
| తరువాత | ఎం.కరుణానిధి | ||
| నియోజకవర్గం | తిరునల్వేలి | ||
విద్యుత్ శాఖ మంత్రి | |||
| పదవీ కాలం 2002 మార్చి 2 – 2003 జూన్ 2 | |||
| ముందు | డి. జయకుమార్ | ||
| తరువాత | డి. జయకుమార్ | ||
| నియోజకవర్గం | తిరునల్వేలి | ||
గ్రామీణ పరిశ్రమల శాఖ మంత్రి | |||
| పదవీ కాలం 2002 ఆగస్టు 29 – 2002 నవంబర్ 12 | |||
| ముందు | ఆర్. విల్వనాథన్ | ||
| తరువాత | ఆర్. వడివేల్ | ||
| నియోజకవర్గం | తిరునల్వేలి | ||
రవాణా శాఖ మంత్రి | |||
| పదవీ కాలం 2001 మే 19 – 2002 మార్చి 2 | |||
| ముందు | కె. పొన్ముడి | ||
| తరువాత | నాథం ఆర్. విశ్వనాథన్ | ||
| నియోజకవర్గం | తిరునల్వేలి | ||
| ప్రస్తుత పదవిలో | |||
| అధికార కాలం 2021 మే 11 | |||
| ముందు | ఏ.ఎల్.ఎస్. లక్ష్మణన్ | ||
| నియోజకవర్గం | తిరునల్వేలి | ||
| పదవీ కాలం 2011 మే 23 – 2016 మే 21 | |||
| ముందు | ఎన్. మలై రాజా | ||
| తరువాత | ఏ.ఎల్.ఎస్. లక్ష్మణన్ | ||
| నియోజకవర్గం | తిరునల్వేలి | ||
| పదవీ కాలం 2001 మే 22 – 2006 మే 12 | |||
| ముందు | ఎ.ఎల్. సుబ్రమణియన్ | ||
| తరువాత | ఎన్. మలై రాజా | ||
| నియోజకవర్గం | తిరునల్వేలి | ||
| ప్రస్తుత పదవిలో | |||
| అధికార కాలం 2025 ఏప్రిల్ 13 | |||
| ముందు | కె. అన్నామలై | ||
| పదవీ కాలం 2020 జూలై 3 – 2025 ఏప్రిల్ 11 | |||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1960 అక్టోబరు 16 వడివీశ్వరం, మద్రాసు రాష్ట్రం, భారతదేశం (ప్రస్తుత తమిళనాడు, భారతదేశం) | ||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| ఇతర రాజకీయ పార్టీలు | అన్నాడీఎంకే (2017 వరకు) | ||
| నివాసం | 540/1A1B, సెయింట్ థామస్ స్ట్రీట్, పెరుమాళ్పురం, తిరునెల్వేలి - 627007, తమిళనాడు , భారతదేశం | ||
నైనార్ నాగేంద్రన్ (జననం 16 అక్టోబర్ 1960) తమిళనాడు రాష్ట్రానికి చెందిన భారతీయ రాజకీయ నాయకుడు. ఆయన తమిళనాడు శాసనసభకు తిరునల్వేలి శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 2001 మే 19 నుండి 2006 మే 12 వరకు జె. జయలలిత, ఓ. పన్నీరు సెల్వం మంత్రివర్గంలో మంత్రిగా పని చేశాడు.
నైనార్ నాగేంద్రన్ జయలలిత మరణాంతరం అన్నాడీఎంకే పార్టీని వీడి 2017లో భారతీయ జనతా పార్టీలో చేరాడు. ఆయన 2025 ఏప్రిల్ 12న భారతీయ జనతా పార్టీ తమిళనాడు అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.[1][2][3]
రాజకీయ జీవితం
[మార్చు]నైనార్ నాగేంద్రన్ 1989 నుండి తమిళనాడు రాజకీయాల్లో అడుగుపెట్టి ఎంజిఆర్ మరణం తర్వాత జయలలిత, ఎంజిఆర్ భార్య జానకిల హయాంలో పార్టీ విడిపోయిన అన్నాడీఎంకేలో చేరాడు. ఆయన జయలలిత వర్గం వైపు నిలిచి అన్నాడీఎంకే తిరునల్వేలి యూనిట్‌లోని పనగుడి పట్టణ కార్యదర్శిగా పని చేసి 1998లో 2001 శాసనసభ ఎన్నికల్లో తిరునల్వేలి శాసనసభ నియోజకవర్గం నుండి అన్నాడీఎంకే పార్టీ నుండి పోటీ చేసి గెలిచి జయలలిత మంత్రివర్గంలో రవాణా, పరిశ్రమలు శాఖలను మంత్రిగా పని చేశాడు.
నైనార్ నాగేంద్రన్ 2006లో జయలలిత అధికారం కోల్పోయినప్పుడు నాగేంద్రన్ తిరునల్వేలి నియోజకవర్గం నుండి కేవలం 600 ఓట్ల తేడాతో ఓడిపోయి తిరిగి 2011లో తిరునల్వేలి నుండి రెండవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2016లో జయలలిత మరణం తర్వాత వీకే శశికళ & టీ.టీ.వీ. దినకరన్ పక్షాన నిలిచాడు. నైనార్ నాగేంద్రన్ ఆ తరువాత 2017లో భారతీయ జనతా పార్టీలో చేరి 2019 లోక్‌సభ ఎన్నికల్లో రామనాథపురం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.
నైనార్ నాగేంద్రన్ 2020 జూలై 3 నుండి 2025 ఏప్రిల్ 11 వరకు భారతీయ జనతా పార్టీ తమిళనాడు ఉపాధ్యక్షుడిగా పని చేశాడు. ఆయన 2021లో జరిగిన శాసనసభ ఎన్నికలలో తిరునల్వేలి నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి మూడవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. నైనార్ నాగేంద్రన్ 2024 లోక్‌సభ ఎన్నికల్లో తిరునెల్వేలి నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.
నైనార్ నాగేంద్రన్ 2025 ఏప్రిల్ 12న భారతీయ జనతా పార్టీ తమిళనాడు అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.[4][5]
ఎన్నికలలో పోటీ
[మార్చు]లోక్‌సభ
[మార్చు]| ఎన్నికలు | లోక్ సభ | నియోజకవర్గం | రాజకీయ పార్టీ | ఫలితం | ఓట్ల శాతం | వ్యతిరేకత | ||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| అభ్యర్థి | రాజకీయ పార్టీ | ఓట్ల శాతం | ||||||||||
| 2019 | 17వ | రామనాథపురం | బీజేపీ | ఓటమి | 32.13% | కె. నవస్కానీ | ఐయుఎంఎల్ | 44.05% | ||||
| 2024 | 18వ | తిరునెల్వేలి | బీజేపీ | ఓటమి | 31.54% | సి. రాబర్ట్ బ్రూస్ | ఐఎన్‌సీ | 47.06% | ||||
శాసనసభ
[మార్చు]| ఎన్నికలు | అసెంబ్లీ | నియోజకవర్గం | రాజకీయ పార్టీ | ఫలితం | ఓట్ల శాతం | వ్యతిరేకత | ||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| అభ్యర్థి | రాజకీయ పార్టీ | ఓట్ల శాతం | ||||||||||
| 2001 | 12వ | తిరునెల్వేలి | ఏఐఏడీఎంకే | గెలిచాడు | 40.93% | ఎ.ఎల్. సుబ్రమణియన్ | డీఎంకే | 40.24% | ||||
| 2006 | 13వ | తిరునెల్వేలి | ఏఐఏడీఎంకే | ఓటమి | 45.42% | ఎన్. మలై రాజా | డీఎంకే | 45.85% | ||||
| 2011 | 14వ | తిరునెల్వేలి | ఏఐఏడీఎంకే | గెలిచాడు | 54.81% | ఏ.ఎల్.ఎస్. లక్ష్మణన్ | డీఎంకే | 30.34% | ||||
| 2016 | 15వ | తిరునెల్వేలి | ఏఐఏడీఎంకే | ఓటమి | 42.81% | ఏ.ఎల్.ఎస్. లక్ష్మణన్ | డీఎంకే | 43.13% | ||||
| 2021 | 16వ | తిరునెల్వేలి | బీజేపీ | గెలిచాడు | 46.70% | ఏ.ఎల్.ఎస్. లక్ష్మణన్ | డీఎంకే | 35.01% | ||||
మూలాలు
[మార్చు]- ↑ "బీజేపీ కొత్త సారథిగా నైనార్ నాగేంద్రన్.. ప్రకటించిన అన్నామలై". Andhrajyothy. 12 April 2025. the original నుండి 14 April 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 April 2025.
- ↑ "భాజపా తమిళనాడు సారథిగా నైనార్ నాగేంద్రన్". Eenadu. 12 April 2025. the original నుండి 14 April 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 April 2025.
- ↑ "Nainar Nagenthran elected as Tamil Nadu BJP president after alliance with AIADMK" (in Indian English). The Hindu. 12 April 2025. the original నుండి 14 April 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 April 2025.
- ↑ "ఎవరీ నైనర్ నాగేంద్రన్..?". Sakshi. 11 April 2025. the original నుండి 14 April 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 April 2025.
- ↑ "తమిళనాడు బీజేపీకి కొత్త బాస్ వచ్చేశారు! అన్నామలై స్థానంలో ఏకగ్రీవ ఎన్నిక". TV9 Telugu. 11 April 2025. the original నుండి 14 April 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 April 2025.