నైసియా సామ్రాజ్యం
Empire of Nicaea | |||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| 1204–1261 | |||||||||||
| Status | Rump state of the Byzantine Empire | ||||||||||
| రాజధాని | Nicaea (İznik) (de jure) Nymphaion (Kemalpaşa) (de facto) | ||||||||||
| Common languages | Byzantine Greek | ||||||||||
| Religion | Greek Orthodoxy (official)[2] | ||||||||||
| Demonyms | Romaios, Hellene[3] | ||||||||||
| ప్రభుత్వం | Monarchy | ||||||||||
| Emperor | |||||||||||
• 1204–1222 | Theodore I Laskaris | ||||||||||
• 1222–1254 | John III Doukas Vatatzes | ||||||||||
• 1254–1258 | Theodore II Laskaris | ||||||||||
• 1258–1261 | John IV Laskaris | ||||||||||
• 1259–1261 | Michael VIII Palaiologos | ||||||||||
| Historical era | High Middle Ages | ||||||||||
• Established | 1204 | ||||||||||
• Disestablished | July 1261 | ||||||||||
| |||||||||||
నైసియా సామ్రాజ్యం (Greek: Βασιλεία Ῥωμαίων), దీనిని నైసీన్ సామ్రాజ్యం అని కూడా పిలుస్తారు,[4] మూడవ గ్రీకు, [5][6][7]నాలుగవ క్రూసేడు (దీనిని కాన్స్టాంటినోపులు దోపిడీగా పిలుస్తారు) సమయంలో పశ్చిమ ఐరోపా, వెనిస్ సాయుధ దళాలు కాన్స్టాంటినోపులును ఆక్రమించినప్పుడు అక్కడి నుండి పారిపోయిన బైజాంటైన్ సామ్రాజ్యం నాటి కులీన వర్గం వారు స్థాపించిన శేష రాజ్యాలు ఇవి. 1204లో సామ్రాజ్యం విచ్ఛిన్నం కావడం వలన ఏర్పడిన ట్రెబిజాండ్ సామ్రాజ్యం, ఎపిరసు డెస్పోటేటు వంటి ఇతర బైజాంటైను శేష రాజ్యాల మాదిరిగానే ఇది కూడా మధ్య యుగాల వరకు మనుగడ సాగించిన రోమన్ సామ్రాజ్యం తూర్పు భాగపు కొనసాగింపుగా నిలిచింది. కాన్స్టాంటినోపులు దాని పరిసర ప్రాంతాలను స్వాధీనం చేసుకున్న తర్వాత క్రూసేడర్ల సైన్యం, వెనిస్ గణతంత్రం వారు స్థాపించిన నాలుగవ రాజ్యం ఒకటి ఉంది; చరిత్ర రచనలో దీనిని లాటిన్ సామ్రాజ్యంగా పేర్కొంటారు.
లాస్కారిసు కుటుంబం ద్వారా స్థాపించబడిన ఈ రాజ్యం,[6] 1204 నుండి 1261 వరకు కొనసాగింది; 1261లో నైసియా పాలకులైన వారు కాన్స్టాంటినోపులును తిరిగి స్వాధీనం చేసుకుని బైజాంటైను సామ్రాజ్యాన్ని పునరుద్ధరించారు. ఈ విధంగా నైసియా సామ్రాజ్యం బైజాంటైను సామ్రాజ్యానికి ప్రత్యక్ష కొనసాగింపుగా పరిగణించబడుతుంది; ఎందుకంటే 1205లోనే ఇది బైజాంటైన్ల సంప్రదాయ బిరుదులను, ప్రభుత్వ వ్యవస్థను పూర్తిగా స్వీకరించింది.
ఎపిరసు డెస్పోటేటు 1224లో ఈ వాదనను సవాలు చేసి థెస్సలోనికా సామ్రాజ్యంగా అవతరించింది; అయితే నైసియా పాలకుల ఒత్తిడి కారణంగా అది తన వాదనను ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. 1242లో 1204లో కాన్స్టాంటినోపులు నగరం దోపిడీకి గురవడానికి కొన్ని వారాల ముందే తన స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్న 'ట్రెబిజాండు సామ్రాజ్యం', 1282 నాటి ఒప్పందం ద్వారా బైజాంటైను సామ్రాజ్యానికి తామే కొనసాగింపు అని చెప్పుకునే అన్ని హక్కులను ఉపసంహరించుకుంది.
చరిత్ర
[మార్చు]స్థాపన
[మార్చు]1204లో క్రూసేడర్లు కాన్స్టాంటినోపులు నగరం మీద దండెత్తిన తర్వాత బైజాంటైను చక్రవర్తి 5వ అలెక్సియోసు డూకాసు మౌర్ట్జూఫ్లోసు అక్కడి నుండి పారిపోయాడు. ఆ వెంటనే చక్రవర్తి 3వ అలెక్సియోసు ఏంజెలోసు అల్లుడైన 1వ థియోడరు లాస్కారిసు చక్రవర్తిగా ప్రకటించబడ్డాడు; కానీ కాన్స్టాంటినోపులులో పరిస్థితి ఆశారహితంగా ఉందని గ్రహించి ఆయన కూడా బిథినియా ప్రాంతంలోని నైసియా నగరానికి పారిపోయాడు.
క్రూసేడర్లు కాన్స్టాంటినోపులులో స్థాపించిన లాటిను సామ్రాజ్యానికి పూర్వ బైజాంటైను భూభాగాల మీద పట్టు అంత బలంగా లేదు. దీనితో ఎపిరసు ట్రెబిజాండు నైసియా ప్రాంతాలలో బైజాంటైను సామ్రాజ్యానికి వారసత్వంగా ఏర్పడిన గ్రీకు రాజ్యాలు ఆవిర్భవించాయి. కాన్స్టాంటినోపులు పతనం కావడానికి కొన్ని వారాల ముందే ట్రెబిజాండు ఒక స్వతంత్ర రాజ్యంగా విడిపోయింది.[8] అయితే నైసియా నగరం లాటిను సామ్రాజ్యానికి అత్యంత సమీపంలో ఉండటంతో పాటు బైజాంటైను సామ్రాజ్యాన్ని తిరిగి స్థాపించడానికి ప్రయత్నించడానికి అత్యంత అనుకూలమైన స్థితిలో ఉంది.
థియోడరు లాస్కారిసుకు ఆరంభంలోనే విజయం దక్కలేదు; ఎందుకంటే 1204లో హెన్రీ ఆఫ్ ఫ్లాండర్సు ఆయనను పాయిమనెనాన్ ప్రూసా (ప్రస్తుతం బుర్సా) వద్ద ఓడించాడు. అయితే అడ్రియానోపుల్ యుద్ధంలో లాటిను చక్రవర్తి 1వ బాల్డ్విన్ ను బల్గేరియన్లు ఓడించిన తర్వాత థియోడరు వాయవ్య అనటోలియాలోని చాలా భాగాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోగలిగాడు. దీనికి కారణం టిఎస్‌ఎఆర్ కలోయన్ ఆఫ్ బల్గేరియా దండయాత్రల నుండి రక్షణ కల్పించేందుకు హెన్రీని తిరిగి ఐరోపాకు పిలిపించడమే.[9] థియోడరు ట్రెబిజాండు సైన్యాన్ని అలాగే ఇతర చిన్నపాటి ప్రత్యర్థులను కూడా ఓడించాడు; తద్వారా బైజాంటైను సామ్రాజ్య వారసత్వ రాజ్యాలలో అత్యంత శక్తివంతమైన రాజ్యానికి అధిపతిగా నిలిచాడు.
తర్వాతి కొన్ని సంవత్సరాలలో అనేక సంధి ఒప్పందాలు, కూటములు ఏర్పడటం, విచ్ఛిన్నం కావడం జరుగుతూనే ఉన్నాయి. బైజాంటైను వారసత్వ రాజ్యాలు లాటిన్ సామ్రాజ్యం, బల్గేరియన్ సామ్రాజ్యం, ఐకోనియంకు చెందిన సెల్జుకు టర్కులు (వీరి భూభాగం నైసియా సరిహద్దులో కూడా ఉండేది) ఒకరితో ఒకరు పోరాడుకోవడమే దీనికి కారణం. 1211లోఆంటియోక్ ఆన్ ది మీండర్ వద్ద సెల్జుకు టర్కులు చేసిన భారీ దండయాత్రను థియోడరు తిప్పికొట్టాడు; అధికారాన్ని తిరిగి చేజిక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్న 3వ అలెక్సియోసు ఏంజెలోస్‌కు సెల్జుకు టర్కులు మద్దతు ఇస్తున్నారు. అయితే ఆంటియోకు వద్ద జరిగిన పోరులో సంభవించిన నష్టాల కారణంగా రిండాకసు నది వద్ద లాటిన్ సామ్రాజ్యం చేతిలో థియోడరు ఓటమి పాలయ్యాడు. ఫలితంగా ఆ తర్వాత కుదిరిన నింఫేయం ఒప్పందం ద్వారా మైసియాలోని అధిక భాగం మర్మారా సముద్ర తీరప్రాంతం ఆయన చేజారిపోయాయి. 1212లో డేవిడు కొమ్నెనోసు మరణంతో పాఫ్లగోనియా లోని అతని భూములను నికేన్లు స్వాధీనం చేసుకోవడానికి వీలు కలిగినప్పుడు ఈ భూభాగ నష్టానికి వారికి పరిహారం లభించింది.[10]
1205లో థియోడరు బైజాంటైను చక్రవర్తుల సాంప్రదాయ బిరుదులను స్వీకరించాడు. మూడు సంవత్సరాల తరువాత ఆయన ఒక కొత్త ఆర్థోడాక్సు కాన్స్టాంటినోపులు పాట్రియార్కును ఎన్నుకోవడానికి ఒక చర్చి మండలిని సమావేశపరిచాడు. కొత్త పాట్రియార్కు థియోడరుకు చక్రవర్తిగా పట్టాభిషేకం చేసి ఆయన రాజధాని అయిన నికేయాలో తన పీఠాన్ని స్థాపించాడు. 1219లో ఆయన లాటిను సామ్రాజ్ఞి యోలాండా ఆఫ్ ఫ్లాండర్సు కుమార్తెను వివాహం చేసుకున్నాడు. కానీ ఆయన 1221లో మరణించాడు. ఆయన అల్లుడు జాన్ 3వ డూకాసు వటాట్జెసు ఆయన వారసుడయ్యాడు.
విస్తరణ
[మార్చు]
వటాట్జెసు సింహాసనారోహణను మొదట లస్కారిడ్లు సవాలు చేశారు. 1వ థియోడరు సోదరులైన సెబాస్టోక్రేటరులు ఐజాకు, అలెక్సియోసు లాటిన్ సామ్రాజ్యం సహాయం కోరారు. అయితే పొయిమనేనను యుద్ధంలో వటాట్జెసు వారి సంయుక్త బలగాల మీద విజయం సాధించి తన సింహాసనాన్ని సురక్షితం చేసుకున్నాడు. ఈ క్రమంలో లాటిన్ సామ్రాజ్యం ఆధీనంలో ఉన్న దాదాపు అన్ని ఆసియా భూభాగాలను తిరిగి పొందాడు.
1224లో లాటిను థెస్సలోనికా రాజ్యంను ఎపిరసు నిరంకుశ పాలకుడు థియోడరు కొమ్నెనోసు డౌకాసు స్వాధీనం చేసుకున్నాడు. ఆయన వటాట్జెసుకు పోటీగా తనకు తాను చక్రవర్తిగా పట్టాభిషేకం చేసుకుని థెస్సలోనికా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అయితే 1230లో క్లోకోట్నిట్సా యుద్ధం తర్వాత అది బల్గేరియన్ల నియంత్రణలోకి రావడంతో ఆ సామ్రాజ్యం స్వల్పకాలికంగానే నిలిచింది. ట్రెబిజాండుకు ఎటువంటి నిజమైన అధికారం లేకపోవడంతో నికేయా మాత్రమే మిగిలిన ఏకైక ప్రభావవంతమైన బైజాంటైను రాజ్యంగా మారింది. 3వ జాన్ తన భూభాగాన్ని ఏజియన్ సముద్రం ఆవలి వైపుకు విస్తరించాడు. 1235లో ఆయన బల్గేరియాకు చెందిన ఇవాన్ 2వ అసెనుతో పొత్తు పెట్టుకున్నాడు; దీనివలన థెస్సలోనికా, ఎపిరసుల మీద తన ప్రభావాన్ని విస్తరించుకోవడం ఆయనకు సాధ్యమైంది.
1242లో మంగోలులు నైసియాకు తూర్పున ఉన్న సెల్జుకు భూభాగం మీద దండెత్తారు; వారు తదుపరి తనపైనే దాడి చేస్తారేమోనని 3వ జాన్ ఆందోళన చెందనప్పటికీ అంతిమంగా ఆ మంగోలులే నైసియాకు సెల్జుక్ల నుండి ఉన్న ముప్పును తొలగించారు. 1245లో జాన్ పవిత్ర రోమన్ చక్రవర్తి అయిన 2వ ఫ్రెడరికు కుమార్తె 2వ కాన్స్టాన్సు ఆఫ్ హోహెనుస్టాఫెనును వివాహం చేసుకోవడం ద్వారా పవిత్ర రోమన్ సామ్రాజ్యంతో పొత్తు కుదుర్చుకున్నాడు. 1246లో జాన్ బల్గేరియా మీద దాడి చేసి థ్రేసు మాసిడోనియా ప్రాంతాలలో అధిక భాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నాడు; ఆ తర్వాత ఆయన థెస్సలోనికాను కూడా తన సామ్రాజ్యంలో విలీనం చేసుకున్నాడు. 1248 నాటికి జాన్ బల్గేరియన్లను ఓడించి లాటిన్ సామ్రాజ్యాన్ని చుట్టుముట్టాడు. 1254లో తన మరణం సంభవించేంత వరకు ఆయన లాటిన్ల నుండి భూభాగాలను ఆక్రమించుకుంటూనే ఉన్నాడు.
3వ జాన్ కుమారుడైన 2వ థియోడరు లాస్కారిసు థ్రేసు ప్రాంతంలో బల్గేరియన్ల దండయడలను ఎదుర్కొన్నప్పటికీ ఆ భూభాగాన్ని విజయవంతంగా రక్షించుకున్నాడు. 1257లో నైసియా, ఎపిరసు మధ్య ఒక సంఘర్షణ (యుద్ధం) చెలరేగింది. 1258లో 2వ థియోడరు మరణించినప్పుడు ఎపిరసు పాలకుడు సిసిలీకి చెందిన మాన్‌ఫ్రెడుతో పొత్తు కుదుర్చుకున్నాడు. 4వ జాన్ లాస్కారిసు ఆయన వారసుడిగా సింహాసనాన్ని అధిష్టించాడు; అయితే ఆయన అప్పటికి ఇంకా బాలుడే కావడంతో సైన్యాధిపతి అయిన మైఖేలు పాలైయోలోగోసు సంరక్షణలో (రీజెన్సీ కింద) ఉంచబడ్డాడు. 1259లో మైఖేలు తనను తాను సహ-చక్రవర్తిగా (8వ మైఖేలు గా) ప్రకటించుకున్నాడు; ఆ వెంటనే పెలగోనియా యుద్ధంలో మాన్‌ఫ్రెడు, ఎపిరసు పాలకుడు డెస్పాటు, లాటిను ఆకైయా యువరాజు కలిసి చేసిన సంయుక్త దండయాత్రను ఆయన విజయవంతంగా తిప్పికొట్టి ఓడించాడు.
కాన్స్టాంటినోపులు పునఃస్వాధీనం
[మార్చు]
1260లో మైఖేలు తన పూర్వీకులు చేయలేని విధంగా స్వయంగా కాన్స్టాంటినోపులు మీద దాడిని ప్రారంభించాడు. ఆయన జెనోవాతో పొత్తు పెట్టుకున్నాడు. ఆయన సేనాపతి అలెక్సియోసు స్ట్రాటెగోపౌలోసు తన దాడికి ప్రణాళిక రచించడానికి నెలల తరబడి కాన్స్టాంటినోపులును గమనించాడు. 1261 జూలైలో లాటిను సైన్యంలో ఎక్కువ భాగం ఇతర చోట్ల పోరాడుతున్నప్పుడు అలెక్సియోసు నగర ద్వారాలను తెరవమని కావలివారిని ఒప్పించగలిగాడు. లోపలికి ప్రవేశించాక ఆయన వెనిసు ప్రాంతాన్ని తగలబెట్టాడు (ఎందుకంటే వెనిసు జెనోవాకు శత్రువు 1204లో ఆ నగరాన్ని స్వాధీనం చేసుకోవడం ప్రధానంగా కారణమైంది).
కొన్ని వారాల తర్వాత మైఖేలు చక్రవర్తిగా గుర్తింపు పొందాడు. దీంతో బైజాంటైన్ సామ్రాజ్యం పునరుద్ధరించబడింది. అఖియాలోని కొంత భాగం త్వరలోనే తిరిగి స్వాధీనం చేసుకోబడింది. కానీ ట్రెబిజాండు, ఎపిరసు స్వతంత్ర బైజాంటైను గ్రీక్ రాజ్యాలుగా మిగిలిపోయాయి. సెల్జుక్ల స్థానంలో ఒట్టోమన్లు ఉద్భవించినప్పుడు పునరుద్ధరించబడిన సామ్రాజ్యం వారి నుండి ఒక కొత్త ముప్పును కూడా ఎదుర్కొంది.
పరిణామాలు
[మార్చు]1261 తర్వాత కాన్స్టాంటినోపులు మరోసారి బైజాంటైను సామ్రాజ్యానికి రాజధానిగా మారింది. తరువాత బైజాంటైను పూర్వపు నైసియా సామ్రాజ్య భూభాగాలలోని సంపదను దోచుకున్నది. ఆ సంపదను కాన్స్టాంటినోపులును పునర్నిర్మించడానికి అలాగే ఐరోపాలో లాటిను రాజ్యాలు ఎపిరసుకు వ్యతిరేకంగా జరిగిన అనేక యుద్ధాలకు నిధులు సమకూర్చడానికి ఉపయోగించారు. సైనికులను ఏషియా మైనరు నుండి ఐరోపాకు తరలించారు. దీనివలన పాత సరిహద్దు ప్రాంతం దాదాపుగా రక్షణ లేకుండా పోయింది. టర్కీకి చెందిన ఘాజీల దాడులను అదుపు చేయకుండా వదిలేశారు. సరిహద్దు ప్రాంతం క్రమంగా ఆక్రమణలకు గురైంది.
1261లో 8వ మైఖేలు పాలైయోలోగోసు చట్టబద్ధమైన లస్కారిడు పాలకుడైన 4వ జాన్ లస్కారిసును సింహాసనం నుండి తొలగించడంతో కాన్స్టాంటినోపులులో పునరుద్ధరించబడిన బైజాంటైన్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ప్రజలలో అధిక శాతం మంది దూరం అయ్యారు. 4వ జాన్ నైసియాలో వెనుకబడిపోయాడు. తరువాత ఆయన పదకొండవ పుట్టినరోజున 1261 డిసెంబరు 25న మైఖేలు ఆదేశాల మేరకు ఆయన కళ్ళు తీయబడ్డాయి. దీనివలన ఆయన సింహాసనానికి అనర్హుడయ్యాడు. ఆయనను బహిష్కరించి బిథినియాలోని ఒక కోటలో ఖైదు చేశారు. ఈ చర్య పాట్రియార్కు ఆర్సెనియోసు ఆటోరియానోసు చేత 8వ మైఖేలు పాలైయోలోగోసును మతభ్రష్టుడిగా ప్రకటించడానికి, తరువాత నైసియా సమీపంలో ఒక నకిలీ 4వ జాన్ నాయకత్వంలో తిరుగుబాటు జరగడానికి దారితీసింది.
పూర్వపు నైసియా సామ్రాజ్య భూభాగం తదుపరి చరిత్ర టర్కులచే క్రమంగా జరిగిన ఆక్రమణల సమాహారం. 1282లో 8వ మైఖేలు మరణం తరువాత టర్కీ దాడులలో ఇది శాశ్వత స్థిరనివాసంగా, పూర్వపు బైజాంటైను భూభాగంలో టర్కీ బేలికులు స్థాపనగా మారాయి. చక్రవర్తి 2వ ఆండ్రోనికోసు పరిస్థితిని మెరుగుపరచడానికి ప్రయత్నించినప్పటికీ అది విఫలమైంది. సుమారుగా... 1300 నాటికి పూర్వపు నికేయా సామ్రాజ్యం దాదాపు పూర్తిగా టర్కులచే జయించబడింది. కేవలం కాన్స్టాంటినోపులుకు సరిగ్గా ఎదురుగా ఉన్న ఒక చిన్న భూభాగం మాత్రమే మిగిలి ఉంది. 1326లో జరిగిన బుర్సా పతనం 1331లో జరిగిన నికేయా 1337లో జరిగిన నికోమీడియాలతో బైజాంటైను ఆసియా మైనరుకు తుది ముగింపు పలికింది.
సైనిక
[మార్చు]లాటిను/బల్గర్ల నియంత్రణలో ఉన్న థ్రేస్ మినహా బైజాంటియంలోని అత్యధిక జనాభా కలిగిన గ్రీకు ప్రాంతం నికేను సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. అందువలన ఈ సామ్రాజ్యం తన ఉచ్ఛస్థితిలో సుమారు 20,000 మంది సైనికులతో కూడిన గణనీయమైన సైనిక శక్తిని సమీకరించగలిగింది – క్రూసేడరు రాజ్యాలకు వ్యతిరేకంగా జరిగిన దాని అనేక యుద్ధాలలో ఈ సైనికులే పాల్గొన్నట్లు నమోదు చేయబడింది.
నైసీన్లు కొమ్నేనియను సైన్యం కొన్ని అంశాలను కొనసాగించారు. కానీ కొమ్నేనియను చక్రవర్తులకు అందుబాటులో ఉన్న వనరులు లేకపోవడంతో, నైసీన్ బైజాంటియన్లు చక్రవర్తి 1వ మాన్యుయెలు కొమ్నెనోసు ఆయన పూర్వీకులు రంగంలోకి దించిన సైన్యాల సంఖ్యతోనూ, నాణ్యతతోనూ సరిపోలలేకపోయారు. పశ్చిమ ఆసియా మైనరుకు సముద్ర మార్గం ఉండటంతో అది చుట్టుపక్కల ఉన్న చాలా చీలిక రాజ్యాల కంటే సంపన్నంగా మారింది. కాలక్రమేణా కొద్ది కాలం పాటు మాత్రమే అయినప్పటికీ ఆ ప్రాంతంలో అత్యంత శక్తివంతమైన రాజ్యంగా అవతరించింది.
సిద్ధాంతం - హెలెనిజం
[మార్చు]నైసియా రాజ్యపు ఆస్థానం తన గ్రీకు మాట్లాడే ప్రజలను వర్ణించడానికి అంతకు ముందు వాడుకలో ఉన్న రోమన్లు అనే పదానికి బదులుగా హెలెన్లు అనే పదాన్ని విస్తృతంగా ఉపయోగించింది.[11] ఆనాటి సమకాలీనులు నైసియా సామ్రాజ్యాన్ని సూచించడానికి "హెల్లాసు" అనే పదాన్ని లేదా "హెలెనికాను" అనే విశేషణాన్ని ఉపయోగించడానికి మొగ్గు చూపారు.[12][1] ఈ క్రమంలోనే చక్రవర్తి థియోడరు లాస్కారిసు కొన్నిసార్లు రోమాయి - (రోమన్లు), గ్రైకోయి అనే పదాల స్థానంలో ( హెలెన్లు) అనే పదాన్ని ప్రయోగించారు.[3] చక్రవర్తి 2వ థియోడరు తన రాజ్యాన్ని నూతన హెల్లాసుగా అభివర్ణించారు.[13] పితృస్వామి 2వ జర్మనోసు పాశ్చాత్య ప్రపంచంతో జరిపిన అధికారిక సంభాషణలలో స్థానిక జనాభాను వర్ణించడానికి ఓట్టమన్ గ్రీకులు అనే పదాన్ని రాజ్యాన్ని సూచించడానికి "గ్రీకుల సామ్రాజ్యం" Greek: Βασιλεία των Γραικών) అనే పేరును ఉపయోగించారు.[14]ఆ కాలంలో గ్రీకు జాతికి చెందినవారిలో తమ జాతి గుర్తింపును చాటుకునే దిశగా ఒక సమన్వయంతో కూడిన ఉద్యమం కొనసాగింది.[15]
కొందరు మేధావులు నైసియా సామ్రాజ్య కాలాన్ని, పెరుగుతున్న హెలెనికు (గ్రీకు) జాతి చైతన్యానికి, గ్రీకు జాతీయవాదానికి ఒక సూచికగా పరిగణిస్తారు. అయితే జాతి చైతన్యం పెరిగినప్పటికీ అది అధికారిక సామ్రాజ్య సిద్ధాంతం మీద ఎటువంటి ప్రభావం చూపలేదని ఈ మేధావులు హెచ్చరిస్తున్నారు. [16] అధికారిక సిద్ధాంతంలో బైజాంటియంను రోమన్ సామ్రాజ్యంగా పరిగణించే సంప్రదాయ దృక్పథం ఏమాత్రం మారలేదు; నైసియా చక్రవర్తుల ప్రజలను సూచించడానికి 'రోమాయోయి అనే పదాన్ని ఉపయోగించడమే ఇందుకు నిదర్శనం.[15] నైసియా సామ్రాజ్యం అధికారిక సిద్ధాంతం పునరాక్రమణ, సైనికవాదం మీద ఆధారపడి ఉండేది; 14వ శతాబ్దం చివరలో వచ్చిన పాలైయోలోగను కాలపు వాక్చాతుర్యంలో ఈ ధోరణి కనిపించదు.[17]
13వ శతాబ్దపు నైసియా సిద్ధాంతం కాన్స్టాంటినోపులు నగరానికి ఉన్న నిరంతర ప్రాముఖ్యత మీద ఆ నగరాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలనే ఆశ మీద ప్రధానంగా ఆధారపడి ఉండేది. ఈ సిద్ధాంతం రాజకీయ విశ్వజనీనత లేదా హెల్లెనికు జాతీయవాద వాదనల కంటే యూదుల దైవ సంరక్షణకు సంబంధించిన పాత నిబంధన భావనల నుండే ఎక్కువ ప్రేరణ పొందింది. ఈ కాలపు చక్రవర్తిని తరచుగా మోషే[18] లేదా జొరోబాబెల్తో పోల్చేవారు; కొన్నిసార్లు దేవుని ప్రజలను వాగ్దాన భూమి నడిపించే "అగ్ని స్తంభం"గా కూడా వర్ణించేవారు. ఉదాహరణకు నికెటాసు చోనియేట్సు రచించిన 1వ థియోడరు లాస్కారిసు చేసిన ఒక ప్రసంగంలో ఈ పోలిక కనిపిస్తుంది.[19]
ఈ కాలపు వాక్చాతుర్యం పాత నిబంధన గ్రంథం నుండి తీసుకోని రూపకాలను ఉపయోగించి యుద్ధాన్ని, కాన్స్టాంటినోపులు పునరాక్రమణను గొప్పగా కీర్తించింది. ఉదాహరణకు 1వ థియోడరు లాస్కారిసు మీద రాసిన తన ప్రశంసా కావ్యంలో చోనియేట్సు ఒక సెల్జుకు సుల్తానుతో జరిగిన యుద్ధాన్ని క్రైస్తవం, ఇస్లాం మధ్య జరిగిన పోరుగా వర్ణించాడు; అంతేకాక స్వయంగా ఒక శత్రు సేనాధిపతిని సంహరించిన థియోడరు శరీరానికి తగిలిన గాయాలను శిలువ మీద ఉన్న క్రీస్తు గాయాలతో అలంకారికంగా పోల్చాడు. పునరాక్రమణకు సంబంధించిన ఈ దృక్పథం అభివృద్ధి చెందడంలో పాశ్చాత్య క్రూసేడ్ల భావజాలం ప్రభావం ఉండి ఉండవచ్చని డిమిటరు ఏంజెలోవు అభిప్రాయపడ్డారు. ఈ కాలంలోనే యుద్ధానికి సిద్ధమవుతున్న నైసియా సైనికులకు పూర్తి పాపవిమోచనను ప్రసాదిస్తానని పాట్రియార్కు 4వ మైఖేలు ఆటోరియానోసు ప్రకటించినట్లు ప్రస్తావన ఉంది; ఇది పాశ్చాత్య సంప్రదాయంలోని పూర్ణ పాపవిమోచన పత్రాల పద్ధతిని దాదాపుగా పోలి ఉంటుంది. అయితే ఇటువంటి పాపవిమోచనలను మంజూరు చేసే పద్ధతి స్వల్పకాలికమే అయ్యింది. క్రూసేడ్ల ప్రభావానికి సంబంధించిన అనేక అంశాలు 1211 తర్వాత కనుమరుగైనట్లు కనిపిస్తుంది.
13వ శతాబ్దపు బైజాంటైను ప్రజలు 1204 తర్వాత తమ సామ్రాజ్యం ఎదుర్కొన్న పరిస్థితులకు ప్రాచీన గ్రీకుల పరిస్థితులకు మధ్య సమాంతరాలను గీశారు. ఈ ఆధారాలు ఎ.ఇ వకలోపౌలోసు వంటి కొంతమంది మేధావులు దృక్పథాన్ని బలపరచడంలో సహాయపడ్డాయి; వీరు ఈ ప్రస్తావనలను, బైజాంటియం ప్రాచీన గ్రీకు గతం మీద జరిగిన పునఃమూల్యాంకనంతో కలిపి చూస్తూ వీటినే గ్రీకు జాతీయవాదానికి మూలాలుగా పరిగణిస్తారు. కాన్స్టాంటినోపులు పతనంతో ఈ పోలిక అనాగరికుల మధ్య చిక్కుకున్న హెల్లెనెసు (గ్రీకులు) అనే భావనను ప్రముఖంగా చాటిచెప్పింది; చోనియేట్సు 1వ థియోడరు చేతిలో హతమైన సెల్జుకు సుల్తానును పర్షియా చక్రవర్తి జెర్క్సెసుతో పోల్చాడు. అలాగే పాట్రియార్కు 2వ జెర్మానోసు 3వ జాన్ వటాట్జెసు సాధించిన విజయాన్ని మరొక 'మారథాను యుద్ధం' లేదా 'సలామిసు యుద్ధం'గా అభివర్ణించాడు. అదే విధంగా 2వ థియోడరు లాస్కారిసు తన తండ్రి విజయాలను అలెగ్జాండర్ ది గ్రేట్ విజయాలతో పోల్చాడు. అంతేకాక ఆనాటి "హెలెన్లు యుద్ధ పరాక్రమ విలువలను కీర్తించాడు.[20]
అదనంగా ఈ కాలంలో బైజాంటైను వ్యవహారాలలో "హెలెనె " అనే పదాన్ని ఉపయోగించే విధానంలో ఒక మార్పు వచ్చినట్లు కనిపిస్తుంది. ఈ సమయం వరకు "హెలెనె " అనే పదానికి ప్రతికూల అర్థం ఉండేది; ముఖ్యంగా ఇది అన్యమత (పాగన్) అవశేషాలతో ముడిపడి ఉండేది. అయితే ఈ కాలంలో "గ్రైకొయి ", "హెలెనసు" అనే రెండు పదాలు సామ్రాజ్యం దౌత్య వ్యవహారాలలో మతపరమైన, జాతిపరమైన స్వీయ-గుర్తింపు రూపాలుగా ప్రవేశించినట్లు కనిపిస్తుంది. లాటిన్ల నుండి సామ్రాజ్యాన్ని దాని పౌరులను వేరు చేసి చూపించాలనే కోరిక దీనికి ప్రధాన ప్రేరణగా నిలిచింది.[21] ముఖ్యంగా పాట్రియాచ్ 2వ జర్మనోసు జాతి, మతపరమైన గుర్తింపుకు సంబంధించిన ఈ కొత్త దృక్పథానికి ఒక చక్కటి ఉదాహరణగా నిలుస్తాడు. ఆయన లేఖలలో మంచి వంశం కలిగి ఉండటాన్ని తన హెలెనిస్టికు పూర్వీకుల స్వచ్ఛతతో సమానంగా పరిగణించాడు; కాన్స్టాంటినోపులుతో ఉన్న ఏ అనుబంధం కంటే కూడా తన హెలెనిస్టికు భాషా, జాతి నేపథ్యానికే ఆయన అధిక ప్రాధాన్యతనిచ్చాడు. అంతేకాక ఆ నగరం తమ ఆధీనంలో ఉన్నందుకు గర్వపడే లాటిన్ల పట్ల తన తిరస్కారాన్ని కూడా ఆయన వ్యక్తం చేశాడు. "హెలెనె " అనే పదం అర్థంలో వచ్చిన మార్పు ఖచ్చితంగా ఏ సమయంలో సంభవించిందనే విషయం మీద మేధావుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. 12వ శతాబ్దంలో "హెలెనసు" అనే పదం వినియోగానికి సంబంధించిన ఆధారాలను పరిగణనలోకి తీసుకున్న రోడరిక్ బీటన్ ఈ పదం పునఃమూల్యాంకనం 1204లో కాన్స్టాంటినోపులు పతనం జరగకముందే సంభవించిందని అభిప్రాయపడ్డాడు. అంతేకాకుండా వకలోపౌలోసు [22] వలె కాకుండా బీటను దీనిని గ్రీకు జాతీయవాదం ఆవిర్భావంగా కాకుండా ప్రధానంగా భాష మీద ఆధారపడిన ఒక ప్రాథమిక "జాతి" చైతన్యంగా పరిగణించాడు.[23]
మైకేలు అంగోల్డు గమనించినట్లుగా ఆ కాలపు సిద్ధాంతం బైజాంటైనులు మారుతున్న సాంస్కృతిక, రాజకీయ పరిస్థితులకు—దేశ బహిష్కరణ వంటి వాటికి కూడా—ఎలా స్పందించగలరో ఎలా అనుగుణంగా మారగలరో తెలిపే సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది. అయితే ఈ కాలంలో జరిగిన సిద్ధాంతపరమైన పరిణామాలు చాలా వరకు తిరిగి స్థాపించబడిన పాలైయోలోగోసు సామ్రాజ్యం ద్వారా అడ్డుకోబడ్డాయి. పక్కన పెట్టబడ్డాయి; ఎందుకంటే 8వ మైకేలు తిరిగి మునుపటి కాలాల సిద్ధాంతాలనే అనుసరించడం ప్రారంభించారు.[24]
చక్రవర్తులు
[మార్చు]- థియోడరు 1వ లాస్కారిసు (1204–1222)
- (1222–1254)
- థియోడరు 2వ లాస్కారిసు (1254–1258)
- జాన్ 4వ లాస్కరీసు (1258–1261)
- మైఖేలు 3వ పాలియోలోగసు (సహ-చక్రవర్తి 1259–1261; బైజాంటైను సామ్రాజ్యాన్ని పునరుద్ధరించినవారు)
ఇవి కూడా చూడండి
[మార్చు]- లాస్కరీసు వంశం, సంబంధిత వంశవృక్షం
- వటట్జెసు వంశం, సంబంధిత వంశవృక్షం
- బైజాంటైను సామ్రాజ్య వంశాల వంశవృక్షాలు
మూలాలు
[మార్చు]- 1 2 Stavridou-Zafraka, Alkmeni (2015). "Byzantine Culture in Late Mediaeval Greek States". Βυζαντιακά. 32: 211.
- ↑ Melton, J. Gordon (2014). Faiths Across Time: 5,000 Years of Religious History [4 Volumes]: 5,000 Years of Religious History. ABC-CLIO. p. 800. ISBN 978-1-61069-026-3.
- 1 2 Maltezou, Chryssa; Schreine, Peter (2002). Bisanzio, Venezia e il mondo franco-greco (in ఫ్రెంచ్). Istituto ellenico di studi bizantini e postbizantini di Venezia. p. 33. ISBN 978-960-7743-22-0.
Theodoros Laskaris totally avoids the terms Latinoi in his letters and uses Italoi instead, he also replaces the terms Romaioi (Romans) and Greek by Hellenes.
- ↑ Vasiliev, Alexander A. (1952). History of the Byzantine Empire, 324–1453. Univ of Wisconsin Press. p. 546. ISBN 978-0-299-80926-3.
{{cite book}}: ISBN / Date incompatibility (help) - ↑ The Columbia history of the world by John Arthur Garraty, Peter Gay (1972), p. 454: "The Greek empire in exile at Nicaea proved too strong to be driven out of Asia Minor, and in Epirus another Greek dynasty defied the intruders".
- 1 2 A Short history of Greece from early times to 1964 by W. A. Heurtley, H. C. Darby, C. W. Crawley, C. M. Woodhouse (1967), p. 55: "There in the prosperous city of Nicaea, Theodoros Laskaris, the son in law of a former Byzantine Emperor, establish a court that soon become the Small but reviving Greek empire."
- ↑ Alexander A. Vasiliev (1958), History of the Byzantine Empire, Vol 2. 324–1453, second edition (Madison: University of Wisconsin Press, p. 506: "... on the territory of the disintegrated eastern empire, three independent Greek centers were formed; The empire of Nicaea and the empire of Trebizond in Asia Minor and the Despotat of Epirus in Northern Greece."
- ↑ Michael Panaretos, Chronicle, ch. 1. Greek text in Original-Fragmente, Chroniken, Inschiften und anderes Materiale zur Geschichte des Kaiserthums Trapezunt, part 2; in Abhandlungen der historischen Classe der königlich bayerischen Akademie 4 (1844), abth. 1, pp. 11; German translation, p. 41
- ↑ Alice Gardiner, The Lascarids of Nicaea: The Story of an Empire in Exile, 1912, (Amsterdam: Adolf M. Hakkert, 1964), pp. 75–78
- ↑ Angold 1999, p. 547.
- ↑ Bialor, Perry (2008). "Chapter 2, Greek Ethnic Survival Under Ottoman Domination". ScholarWorks@UMass Amherst (in ఇంగ్లీష్): 73. the original నుండి 2020-08-18 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2026-05-21.
- ↑ Meyendorff, John (2010). Byzantium and the Rise of Russia: A Study of Byzantino-Russian Relations in the Fourteenth Century (in ఇంగ్లీష్). Cambridge University Press. p. 100. ISBN 978-0-521-13533-7.
The Empire of Nicaea, in particular, was seen as the Hellenikon, or as Hellas
- ↑ Doumanis, Nicholas (2009). A History of Greece (in ఇంగ్లీష్). Macmillan International Higher Education. p. 140. ISBN 978-1-137-01367-5.[permanent dead link]
- ↑ Hilsdale, Cecily J. (2014). Byzantine Art and Diplomacy in an Age of Decline (in ఇంగ్లీష్). Cambridge University Press. p. 84. ISBN 978-1-107-72938-4.
- 1 2 Angelov, Dimiter. Imperial ideology and political thought in Byzantium (1204–1330). Cambridge: University Press, 2007. p. 95 Also Kaldellis, Anthony. Hellenism in Byzantium : the transformations of Greek identity and the reception of the classical tradition.
- ↑ Cambridge: University Press, 2007.
- ↑ Angelov, pp. 99–101
- ↑ Angold, Michael. A Byzantine government in exile : government and society under the Laskarids of Nicaea, 1204–1261. London: Oxford University Press, 1975. p. 13
- ↑ Angelov, p. 99
- ↑ Angelov, p. 97
- ↑ Angelov, pp. 96–97
- ↑ A. E. Vacalopoulos, The Origins of the Greek Nation:the Byzantine Period (1204–1461) (New Brunswick, 1970).
- ↑ Beaton, Roderick. "Antique Nation? 'Hellenes' on the Eve of Greek Independence and in Twelfth-Century Byzantium," Byzantine and Modern Greek Studies, 31 (2007), pp. 76–95
- ↑ Angold, Michael (1975). "Byzantine 'Nationalism' and the Nicaean Empire" (subscription required). Byzantine and Modern Greek Studies, 1, 1 p. 70