నోనె జిల్లా
నోనె జిల్లా | |
---|---|
మణిపూర్ రాష్ట్ర జిల్లా | |
Coordinates: 24°48′N 93°36′E / 24.8°N 93.6°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మణిపూర్ |
ముఖ్య పట్టణం | నోనె |
భాషలు | |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
Vehicle registration | ఎంఎన్ |
నోనె జిల్లా, భారతదేశంలోని మణిపూర్ రాష్ట్ర ఒక కొత్త జిల్లా. తమెంగ్‌లాంగ్ జిల్లా నుండి ఈ జిల్లా ఏర్పడింది.[1][2][3][4][5][6] నోనె (లాంగ్‌మై) పట్టణంలో జిల్లా ప్రధాన కార్యాలయం ఉంది.
జనాభా
[మార్చు]ఈ జిల్లాలో 100% జనాభా గ్రామీణ ప్రాంతంలోనే నివసిస్తున్నారు. ఈ జిల్లాలో 6568 గృహాలు ఉండగా, ప్రతి కుటుంబంలో సగటున 6 మంది నివసిస్తున్నారు. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం, ఈ జిల్లాలో 36,671 మంది జనాభా ఉన్నారు. ఇందులో 18,917 (52%) మంది పురుషులు, 17,754 (48%) మంది స్త్రీలు ఉన్నారు. ఈ మొత్తం జనాభాలో సాధారణ కులానికి చెందినవారు 2,798 (8%) మంది కాగా, షెడ్యూల్ తెగలకు చెందినవారు 33,867 (92%) మంది ఉన్నారు. మొత్తం జనాభాలో 5,638 (15%) మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు.[7]
మతం
[మార్చు]ఇక్కడి జనాభాలో క్రైస్తవులు 35,019 మంది, హిందువులు 719 మంది, ముస్లింలు 157 మంది, సిక్కులు 13 మంది, బౌద్ధులు 48 మంది, జైనులు 13 మంది, ఇతరులు 702 మంది ఉన్నారు.
ఉప విభాగాలు
[మార్చు]నేనె జిల్లాలో 4 ఉప విభాగాలు ఉన్నాయి.
- నోనె (లాంగ్‌మై)
- నుంగ్బా
- ఖౌపుం
- హాచాంగ్
తెగలు, భాషలు
[మార్చు]ఇక్కడ రోంగ్మీ నాగ, ఇన్పుయ్ నాగ తెగలకు చెందిన వారు ఉన్నారు. ఇక్కడి ప్రజలు ఎక్కువగా రోంగ్మీ భాష మాట్లాడుతారు. ఇన్పు, చిరు, గాంగ్టే, థాడో వంటి మిగతా భాషలు కూడా మాట్లాడుతారు.
మూలాలు
[మార్చు]- ↑ "7 new districts formed in Manipur amid opposition by Nagas". Indiatoday.intoday.in. 2016-12-09. Retrieved 2021-01-10.
- ↑ "Manipur Creates 7 New Districts". Ndtv.com. 2016-12-09. Retrieved 2021-01-10.
- ↑ "New districts to stay, says Manipur CM". The Hindu. 2016-12-31. Retrieved 2021-01-10.
- ↑ "Manipur Chief Minsiter [sic] inaugurates two new districts amid Naga protests". Timesofindia.indiatimes.com. 2016-12-16. Retrieved 2021-01-10.
- ↑ "Simply put: Seven new districts that set Manipur ablaze". The Indian Express. 2016-12-20. Retrieved 2021-01-10.
- ↑ "Creation of new districts could be game-changer in Manipur polls | opinion". Hindustan Times. 2016-04-22. Retrieved 2021-01-10.
- ↑ "Noney (District, Manipur, India) - Population Statistics, Charts, Map and Location". citypopulation.de. Retrieved 2021-01-10.
వెలుపలి లంకెలు
[మార్చు]