Jump to content

నౌషాద్ ఆలం

వికీపీడియా నుండి
నౌషాద్ ఆలం

పదవీ కాలం
2010 – 2020
ముందు గోపాల్ కుమార్ అగర్వాల్
తరువాత సౌద్ ఆలం
నియోజకవర్గం ఠాకూర్‌గంజ్

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ జనతాదళ్ (యునైటెడ్)
ఇతర రాజకీయ పార్టీలు లోక్ జనశక్తి పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

నౌషాద్ ఆలం బీహార్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బీహార్ శాసనసభకు ఠాకూర్‌గంజ్ శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

నౌషాద్ ఆలం లోక్ జనశక్తి పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2010 బీహార్ శాసనసభ ఎన్నికలలో ఠాకూర్‌గంజ్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎల్‌జేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జేడీ (యు) అభ్యర్థి గోపాల్ కుమార్ అగర్వాల్ పై 6,963 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 36,372 ఓట్లతో విజేతగా నిలవగా, గోపాల్ కుమార్ అగర్వాల్ 29,409 రెండోస్థానంలో నిలిచాడు.[1]

నౌషాద్ ఆలం ఆ తరువాత జనతాదళ్ (యునైటెడ్) పార్టీలో చేరి 2015 బీహార్ శాసనసభ ఎన్నికలలో ఠాకూర్‌గంజ్ శాసనసభ నియోజకవర్గం నుండి జేడీ (యు) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎల్‌జేపీ అభ్యర్థి గోపాల్ కుమార్ అగర్వాల్ పై 8087 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] ఆయన 2020 శాసనసభ ఎన్నికలలో జేడీ (యు) అభ్యర్థిగా పోటీ చేసి 22082 ఓట్లతో మూడోస్థానంలో నిలిచాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. "Bihar Assembly Election Result 2010" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2010. the original నుండి 26 August 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 August 2023.
  2. "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. the original నుండి 26 August 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 August 2023.
  3. "Thakurganj Constituency Election Results 2015 -2025" (in ఇంగ్లీష్). The Times of India. 14 November 2025. the original నుండి 31 December 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 31 December 2025.