న్యాయం

వికీపీడియా నుండి
(న్యాయశాస్త్రం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
  • అలాగే న్యాయం అనునది నీతి శాస్త్రానికి సంబంధించినది కూడా. నీతి, సత్యం, హేతువులు, చట్టం, ప్రకృతినియమం, సమానత్వం మొదలగు అంశాలపై ఆధారపడిన ఒక నీతి అంగము. [1]


న్యాయస్థానాలు

[మార్చు]

న్యాయస్థానాలు వివిధ స్థాయిలలో పనిచేస్తాయి.

గ్రామ న్యాయస్థానాలు

[మార్చు]

2002లో అత్యున్నత న్యాయస్తానం (సుప్రీం కోర్టు) ఇచ్చిన తీర్పు ప్రకారం దేశంలో 2007 నాటికి ప్రతి 10 లక్షల మందికి 50 మంది జడ్జీలు ఉండాలి.ఈ లెక్కన ఇప్పటి జనాభా ప్రకారం చూస్తే దేశవ్యాప్తంగా 50 వేల జడ్జీలు ఉండాలి. ఇప్పుడున్నది కేవలం 16వేల మంది మాత్రమే.2009లో గ్రామ న్యాయాలయాల బిల్లుకు ఆమోదం లభించింది.దేశవ్యాప్తంగా 6 వేల గ్రామీణ న్యాయాలయాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. పేదలకు వారి ఇంటి గడపవద్దే న్యాయం అందించడమే ఈ చట్టం ప్రధాన లక్ష్యం. కొత్త కేసులతోపాటు కింది కోర్టుల నుంచి కూడా కొన్ని కేసులను గ్రామీణ న్యాయాలయాలకు తరలించాలన్న ప్రతిపాదన చట్టంలో ఉంది. వీటి పరిధిలోకి వచ్చే పాత కేసులన్నింటినీ బదిలీ చేస్తే కోర్టులపై భారం తగ్గుతుంది.గ్రామీణ న్యాయాలయాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిసి ఏర్పాటు చేయాలి. మొదట మౌలిక సదుపాయాలు, ఏడాదిపాటు నిర్వహణకు కొంత మొత్తాన్ని కేంద్రం భరిస్తుంది. మొదట కాస్త పెద్ద పంచాయతీ, లేదంటే కొన్ని పంచాయతీలను కలిపిగానీ ఒక్కో గ్రామ న్యాయాలయం ఏర్పాటు చేయాలి. అక్కడి పరిస్థితులనుబట్టి అదనంగా మరొకటి ఏర్పాటు చేయాలనుకుంటే ప్రధాన న్యాయస్థానం (హైకోర్టును) సంప్రదించి నోటిఫికేషన్‌ జారీ చేయవచ్చు. ప్రధాన న్యాయస్థానం (హైకోర్టును) సంప్రదించి న్యాయాధికారిని గవర్నరు నియమిస్తారు. మేజిస్ట్రేట్‌ నియామకానికి గల అర్హతలే న్యాయాధికారిగా నియమితులయ్యే వ్యక్తికీ ఉండాలి. కేవలం చట్టాల పరిధిలోనే పనిచేయకుండా సహజ న్యాయసూత్రాలకు అనుగుణంగా పనిచేయాలన్న నిర్ణయం ఈ చట్టంలో కీలకాంశం. ఆస్తి కొనుగోలు, కాలువ నీరు వినియోగంలో వివాదాలు, కనీస వేతనాల చట్టం, వ్యవసాయ భూమి భాగస్వామ్య వివాదాలు తదితరాలు గ్రామ న్యాయాలయాల పరిధిలోకి వస్తాయి. సివిల్‌ కేసులను తొలుత రాజీ మార్గంలో పరిష్కరించేలా ఇవి చొరవ చూపాలి. గ్రామీణ న్యాయాలయాలు ఇచ్చే తీర్పులపై ఒకే అప్పీలు ఉంటుంది. క్రిమినల్‌ కేసులను తీర్పు వెలువడిన 30 రోజుల్లో అసిస్టెంట్‌ సెషన్స్‌ జడ్జి వద్ద అప్పీలు చేసుకోవాలి. వీరు ఇచ్చిన తీర్పులపై తదుపరి అప్పీళ్లు ఉండవు. దీనివల్ల పైకోర్టులపై మళ్లీ ఒత్తిడి పెరిగే అవకాశం ఉండదు.

గ్రామీణ ప్రాంతాలలో. ఇప్పుడు తాతలు ముత్తాతలు అప్పటి వారి దగ్గర ఆస్తులు

[మార్చు]

భూమి భూమి ఆస్తులు కొన్నారు ఇప్పటికీ మూడు నాలుగు తరాలు అయినా కొన్న వారి బిడ్డలకు మనుమలకు భూమి పట్టలు కాలేదు. ఇప్పుడు న్యాయవ్యవస్థలో గ్రామంలో ప్రజలను విచారించి వాళ్ల దగ్గర భూమి కొన్నారా లేదని నిర్ధారణ అయిన తర్వాత ప్రజల పక్షాన న్యాయం జరిపి వాళ్లకు భూమి పట్ట చేయాలి. దీనికి ఒక కాల పరిమితి పెట్టాలి ఐదు సంవత్సరాలు ప్రభుత్వం నడిపిస్తే. రెండున్నర సంవత్సరాలకు ఒకసారి. రెండు నెలల టైం వ్యవధి ఇచ్చి పట్టాలు చేస్తే. భూమి తగాదాలు ఉండవు ఆ వ్యవస్థకు నమస్కరించుచున్నాను జై భీమ్ జై జై భీమ్ [2]




  1. Journal of Economic Literature, 41(4), p. 1188.
  2. Venkat, Bandi venkataiah. రెండున్నర సంవత్సరాల కాలం రోజుల్లో.
"https://te.wikipedia.org/w/index.php?title=న్యాయం&oldid=4270784" నుండి వెలికితీశారు