న్యాయ మీమాంస

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
"చట్టం అంటే ఏమిటి?" న్యాయ తత్వవేత్తలు ప్రశ్నిస్తుంటారు. అంతేకాక "అది ఏమి అయి వుంటుంది" అనేది కూడా వీరి ప్రశ్న.

న్యాయ మీమాంస అనేది న్యాయానికి సంబంధించిన సిద్ధాంతం మరియు తత్త్వంగా చెప్పుకోవచ్చు. న్యాయ మీమాంస పండితులు, లేక న్యాయ తత్వవేత్తలు, న్యాయం యొక్క స్వభావాన్ని, న్యాయ తర్కాన్ని లేక న్యాయ వ్యవస్థలను మరియు న్యాయ సంస్థలను లోతుగా అర్థం చేసుకోవాలని ఆశిస్తారు. ఆధునిక న్యాయ మీమాంస అనేది 18 వ శతాబ్దంలో ప్రారంభమై సహజ న్యాయము, పౌర న్యాయము మరియు జాతీయ న్యాయము ల పై దృష్టి కేంద్రీకరించింది.[1] పండితులు ఏ రకమైన ప్రశ్నలకు జవాబులు వెతుకుతారో వాటి ఆధారంగా మరియు ఈ ప్రశ్నలకు వివిధ న్యాయ మీమాంస సిద్ధాంతాలు లేక ఆలోచనా విధానాలు ఎంత బాగా సమాధానాలివ్వగలవో వాటి ఆధారంగా సాధారణ న్యాయ మీమాంసను వివిధ రకాలుగా వర్గీకరించవచ్చు. సాధారణ న్యాయ మీమాంసతో వ్యవహరించే సమకాలీన న్యాయ తత్వము సమస్యలను రెండు వర్గాలుగా పరిష్కరిస్తుంది:[2]

 • 1.) న్యాయానికి మరియు న్యాయ వ్యవస్థలకు అంతర్గతంగా ఉండే సమస్యలు
 • 2.) ఏ విశాల రాజకీయ మరియు సామాజిక పరిస్థితుల నేపథ్యంలో ఉంటుందో దానితో సంబధం కలిగి ఉండే ఒక ప్రత్యేకమైన సామాజిక సంస్థగా న్యాయ సమస్యలు

ఈ ప్రశ్నలకు సమాధానాలు సాధారణ న్యాయ మీమాంస లోని నాలుగు ప్రధాన ఆలోచనా విధానాలనుండి లభిస్తాయి:[2]

 • శాసన పరిపాలకుల యొక్క అధికారాలకు హేతుబద్ధమైన భౌతిక పరిమితులు ఉంటాయని సహజ న్యాయం చెపుతుంది. న్యాయం యొక్క పునాదులను అందుకోవడం మానవ వనరులకు సాధ్యమవుతుంది. ఇంతేకాక మానవులు రూపొందించిన చట్టాలకు వాటికున్న శక్తి ఈ ప్రకృతి న్యాయాల నుండే లభిస్తుంది.[2]
 • సహజ న్యాయానికి భిన్నంగా న్యాయ రూడివాదం అనేది న్యాయానికి మరియు నైతికతకు ఎటువంటి సంబంధం ఉండవలసిన అవసరం లేదని చెపుతూ న్యాయానికి ఉండే శక్తి కొన్ని కనీస వాస్తవాలనుండి లభిస్తుందని చెపుతుంది. అయితే ఈ వాస్తవాలు ఏమిటి అనేవాటిపై రూడి వాదుల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి.[3]
 • న్యాయ మీమాంస సిద్ధాంతాలలో మూడవది అయిన న్యాయ వాస్తవికత వాస్తవ ప్రపంచం ఏ న్యాయాన్ని పాటిస్తుందో అదే న్యాయమంటే ఏమిటి అనేదానిని నిర్ణయిస్తుందని వాదిస్తుంది. శాసన కర్తలు, న్యాయ మూర్తులు మరియు అమలు చేసేవారు దానితో ఏమి చేస్తారో దాని ఆధారంగానే చట్టానికి బలం చేకూరుతుంది.
 • విమర్శనాత్మక న్యాయ అధ్యయనము అనేది సాధారణ న్యాయ మీమాంసలో కొత్తగా వచ్చిన సిద్ధాంతం.1970 లలో అభివృద్ధి చేయబడిన ఈ సిద్ధాంతము న్యాయం అనేది చాలావరకు విభేదించ తగినది అనే అభిప్రాయాన్ని కలిగి ఉండి, దానిని ఆధిపత్య సామాజిక వర్గం యొక్క విధాన లక్ష్యాల యొక్క వ్యక్తీకరణగా విశ్లేషిస్తుంది.[4]

రోనాల్డ్ ద్వోర్కిన్ అనే సమకాలీన న్యాయ తత్వవేత్త యొక్క పని కూడా ప్రముఖంగా గుర్తించదగినది. ఈయన సహజ న్యాయం మరియు సాధారణ న్యాయ మీమాంసకు చెందిన అనుకూల సిద్ధాంతాలకు మధ్యే మార్గంగా చెప్పుకోదగిన న్యాయ మీమాంస యొక్క నిర్మాణాత్మక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.[5]

న్యాయ మీమాంస యొక్క ఆంగ్ల పదము jurisprudentia అనే లాటిన్ పదము నుండి వచ్చింది: న్యాయం అనే అర్ధం గల jus అనే పదం యొక్క రూపాంతరమే juris, మరియు prudentia అనగా జ్ఞానము అని అర్ధము. 1628 లో ఆంగ్లములో మొదటగా ఈ పదాన్ని రూపొందించే నాటికి[6], prudence అనే పదాన్ని ఇప్పుడు పాతబడిపోయిన "ఒక విషయానికి సంబంధించిన జ్ఞానము లేక నైపుణ్యము" అనే అర్ధంలో వాడేవారు. ఈ పదం బహుశా ముందుగానే రూపొందించబడిన ఫ్రెంచ్ jurisprudence నుండి వచ్చి ఉండవచ్చు.

న్యాయ మీమాంస యొక్క చరిత్ర[మార్చు]

ది సెంట్రల్ క్రిమినల్ కోర్ట్ ఆఫ్ ఇంగ్లాండ్ అండ్ వేల్స్ ఎట్ ది వోల్డ్ బైలి

పురాతన రోమ్లో jurisprudence అనేది ఇదే అర్ధంలో వాడబడేది. అయితే దీని మూలాలు మాత్రం తండ్రి నుండి కొడుకులకు వారసత్వంగా వచ్చే ఒక మౌఖిక న్యాయంఅయిన జుస్ ఆఫ్ మోస్ మాయోరం (సాంప్రదాయ న్యాయం) అనే శాస్త్రంలో (periti ) ఉన్నాయి. కొన్ని అసాధారణ కేసులను శాసనం ప్రకారం, విచారించదగిన నేరాల విషయంలో వార్షిక తీర్పుల ఆధారంగా లేక కొన్ని అసాధారణ పరిస్థితులలో శాసనానికి చేయబడిన సవరణల ఆధారంగా విచారించ గలమా లేదా అని నిర్ణయించడం ఆధారంగా ప్రేటర్స్ కొన్ని అమలుపరచదగిన చట్టాలను రూపొందించారు. ఒక ఐయుడెక్స్ అప్పుడు కేసు యొక్క నిజానిజాల ఆధారంగా ఒక పరిష్కారాన్ని నిర్ణయిస్తారు.

వారి తీర్పులు ప్రతి కేసుకు సంబంధించి సాంప్రదాయం అయిన న్యాయ అలవాట్లలో ఏమి ఉందొ సమీక్షించడంతో పాటు సాంప్రదాయ ఆచార వ్యవహారాలనును దృష్టిలో పెట్టుకుని చేసిన వ్యాఖ్యానాలుగా ఉంటాయని అనుకునేవారు. కాని నిజానికి అది నూతన సామాజిక పరిస్థితులకు అనుగుణంగా చట్టాలను మార్చుకునే ఒక కార్యక్రమం. అప్పుడు సాంప్రదాయ పరిధిలో ఉంటూనే నూతనంగా రూపుదిద్దుకున్న సంస్థల (న్యాయ భావనలు) తో చట్టం అమలు చేయబడింది. క్రీస్తు పూర్వం 3 వ శతాబ్దంలో ప్రేటర్స్ స్థానంలో ప్రుడెంట్స్ అనే చట్ట బద్ధమైన సంస్థను నెలకొల్పడం జరిగింది. సామర్ధ్యము మరియు అనుభవాలను రుజువు చేసుకుంటేనే ఈ సంస్థలో స్థానం లభిస్తుంది.

పురాతన భారత వైదిక సమాజంలో అనేక పద్యాల రూపంలో ఉన్న "మను స్మృతి" అనే హిందూ ధర్మ శాస్త్రం పాపాలకు నిర్వచనాన్ని ఇచ్చి వాటికి ప్రాయశ్చిత్తాలను కూడా తెలియచేసింది. మను ధర్మ శాస్త్రంలోని పద్యాలు క్రీస్తు పూర్వం 200 నుండి క్రీస్తు శకం 200 వరకు వ్రాయబడినవి అని అంటారు. నిజానికి, ఇవి న్యాయ సూత్రాలు కావు కానీ ఆ శకం లోని సామాజిక బాధ్యతలు మరియు ఆచార వ్యవహారాలకు సంబంధించిన కట్టుబాట్లు అనవచ్చు.

రోమన్ సామ్రాజ్యంలో న్యాయ పాఠశాలలు స్థాపించబడి న్యాయ మీమాంస అనేది ఒక విద్య విషయంగా మారిపోయింది. రోమన్ సామ్రాజ్య ప్రారంభ దశ నుండి 3 వ శతాబ్దం వరకు, ప్రోక్యులియన్లు మరియు సబినియన్లు వంటి కొని గుర్తించదగిన సమూహాలు దీనికి సంబంధించిన సాహిత్యాన్ని రూపొందించారు. పురాతన కాలంలోని విద్యలో శాస్త్రీయ అవగాహన అనేది ఎంతో లోతైనది అయి ఉండి ఈనాటికి సాటిలేని నైపుణ్యాలను అందించేదిగా ఉండేది.

3 వ శతాబ్దం తర్వాత జురిస్ ప్రుడెన్షియా అనేది కొద్ది మంది చెప్పుకోదగిన రచయితలతో చాలా వరకు అధికారిక కార్యక్రమంగా మారిపోయింది. బైజాన్ టైన్ సామ్రాజ్యం (5 వ శతాబ్దం)సమయంలో తిరిగి లోతైన న్యాయ అద్యయనం ప్రారంభమైనది.ఈ సాంస్కృతిక ఉద్యమం సమయం నుండే జ్యుస్తీనియన్కార్పస్ జురిస్ సివిలిస్ పుట్టింది.

సహజ న్యాయము[మార్చు]

ప్రకృతిలో సహజంగా కొన్ని న్యాయ సూత్రాలు ఉంటాయి, మనం రూపొందించుకునే చట్టాలు వాటికీ అనుగుణంగా ఉండాలి అని సహజ న్యాయ సిద్ధాంతం తెలియ చేస్తుంది. ఒక అన్యాయమైన చట్టము నిజమైన చట్టము కాదు, lex iniusta non est lex, అని తరచుగా చెప్పబడే ఒక సూక్తిలో ఇదే దృక్పధం కనిపిస్తుంది.ఇక్కడ 'అన్యాయమైన చట్టము' అంటే సహజ న్యాయానికి విరుద్ధముగా ఉన్నది అనే అర్థంలో నిర్వచించడం జరిగింది. సహజ న్యాయము అనేది భగవంతుని కోరికలకు అనుగుణంగా చారిత్రకంగా రూపుదిద్దుకున్న విలువలకు సంబంధించిన అంశంగా చూడబడుతుంది. సహజ న్యాయ భావనను మరింత సరళంగా చెప్పాలంటే, సహజ న్యాయ సిద్ధాంతం అనేది సమాజంలో'మంచి' ని పెంపొందించే ఉద్దేశంతో రాజ్యం యొక్క చట్టాలను రూపొందించే అధికారానికి విలువలకు సంబంధించిన దిక్సూచిగా ఉపయోగపడి దిశా నిర్దేశనం చేస్తుంది. మానవులచే రూపొందించబడిన న్యాయ వ్యవస్థలకు బయట ఉండి విలువల రూపంలో సమాజంలో స్థిరపడిపోయిన సూత్రాలనే సహజ న్యాయంగా చెప్పుకోవచ్చు. వ్యక్తులు ఏ ప్రయోజనాల మీదైతే దృష్టి పెడతారో దాని ఆధారంగా ఏది మంచి ఏది చెడు అనేది మారుతూ ఉంటుంది. "ఒక అన్యాయమైన చట్టము అసలు చట్టమే కాదు" అనే సూక్తితో సహజ న్యాయం కొన్ని సందర్భాలలో ఏకీభవిస్తుంది. అయితే ఆధునిక సహజ న్యాయవాదులలో ఎంతో ప్రముఖులైన జాన్ ఫినిస్ అభిప్రాయం ప్రకారం ఇది ప్రాచీన థామిస్ట్ దృక్పథానికి సరైన మార్గదర్శక సూత్రము కాదు.

అరిస్టాటిల్[మార్చు]

అరిస్టాటిల్, బై ఫ్రాన్సేస్కో హైజ్

అరిస్టాటిల్ ను సహజ న్యాయ పితామహులుగా చెబుతుంటారు.[7] సోక్రటిస్, ప్లేటో వంటి ఆయనకు ముందు తత్వేవేత్తలలాగే అరిస్టాటిల్ కూడా సహజ న్యాయము, సహజ హక్కులు (dikaion physikon, δικαίον φυσικόν, Latin ius naturale ) ఉంటాయని రుజువు చేసే ప్రయత్నం చేసారు. అరిస్టాటిల్ రచనలకు థామస్ అక్వినాస్ చేసిన వ్యాఖ్యానాల వల్లే ఆయనకు సహజ న్యాయంతో ఉన్న సంబంధం వెలుగులోకి వచ్చింది.[8] సహజ న్యాయము మరియు సహజ హక్కులను కలిపి అక్వినాస్ చేసిన పని ఆధారంగా ఇది తెలియడం జరిగింది. వీటిలో రెండవదానిని అరిస్టాటిల్ తన నికోమచియన్ ఎథిక్స్ లోని ఐదవ పుస్తకంలో (=Book IV of the Eudemian Ethics )పొందుపరిచారు. ఈ పుస్తక భాగాల యొక్క తోలి అనువాదాల అన్నింటిలోను అక్వినాస్ ప్రభావం ఉన్నప్పటికీ[9], ఇటీవలి అనువాదాలు మాత్రం వాటిని మరింత స్పష్టమైన అర్ధంతో వ్యఖపరచడం జరిగింది.[10]

అరిస్టాటిల్ యొక్క న్యాయ సిద్ధాంతం ఆయన యొక్క గోల్డెన్ మీన్ అనే తన ఆలోచన పరిధిలోనే ఉంటుంది. ఆయన వివరించిన ప్రతి ఇతర విలువలాగే, చెడు అలవాట్లకు వ్యతిరేకంగా రూపొందించుకున్న నైతిక విలువల నే "న్యాయము"గా వ్యవహరించే ఆయన చర్చలనుండే అరిస్టాటిల్ ప్రతిపాదించిన రాజకీయ న్యాయం అనే భావన రూపుదిద్దుకోవడం జరిగింది.[11] నికోమాచియన్ ఎథిక్స్లో న్యాయ సిద్ధాంతం గురించి అయ్యాన చేసే సుదీర్ఘ చర్చ ఒక న్యాయబద్ధమైన పని ఎటువంటి అర్ధాని ఇస్తుంది అనే ప్రశ్నతో మొదలవుతుంది. "న్యాయం" అనే పదం నిజానికి దగ్గరి సంబంధం ఉన్న రెండు వేర్వేరు అర్దాలనిస్తుందని అరిస్టాటిల్ వాదిస్తారు: సాధారణ న్యాయము మరియు ప్రత్యేక న్యాయము.[12][13]

ఒక వ్యక్తి యొక్క చర్యలు ఇతరులతో పోలిస్తే పూర్తిగా అన్ని అంశాలలో నైతికమైనవి అయివుంటే అరిస్టాటిల్ ఆ న్యాయాన్ని 'సాధారణ న్యాయం' గా చెబుతారు. కాబట్టి ఈ న్యాయ సిద్ధాంతము చాలావరకు మంచి పనులకు అనుగుణంగా ఉంటుంది.[14] 'ప్రత్యేక లేదా పాక్షిక న్యాయం' అనేది దీనికి భిన్నంగా 'సాధారణ న్యాయం' లో ఒక భాగంగా ఉండడం లేక ఇతరులను సమానత్వే భావనతో చూసే వ్యక్తిగత విలువతో సంబంధం కలిగి ఉంటుంది.[15] ఈ విధమైన అంతగా ప్రాధాన్యత లేని న్యాయ చర్చలనుండి అరిస్టాటిల్ మరింత మెరుగైన దృక్పధం అయిన రాజకీయ న్యాయం వైపు మళ్లుతారు. రాజకీయ న్యాయం అంటే అరిస్టాటిల్ దృష్టిలో ఆధునిక న్యాయ మీమాంసకు దగ్గరగా ఉండే అంశము.
రాజకీయ న్యాయం గురించి మాట్లాడుతూ, ఇది కొంత ప్రకృతి నుండి గ్రహించినది మరికొంత సంప్రదాయాలకు సంబంధించిన విషయంగా అరిస్టాటిల్ వాదిస్తారు.[16] ఆధునిక సహజ న్యాయ సిద్ధాంత కర్తల ద్రుక్పధాలకు దగ్గరి సంబంధం ఉన్న అంశంగా దీనిని భావించవచ్చు. అయితే అరిస్టాటిల్ నైతిక విలువలకు సంబంధించిన దృక్పధాన్ని తెలియ చేస్తున్నారే గాని ఒక న్యాయ వ్యవస్థ గురించి వివరించడం లేదని గుర్తుంచుకోవాలి.కాబట్టి ఇక్కడ అయన ప్రకృతి గురించి చేసిన వ్యాఖ్యానాలు చట్టంగా రూపుదిద్దుకున్న నైతిక విలువల గురించే తప్ప అవే చట్టాలు కాదు. ఈ ప్రశ్నకు సంబంధించినంతవరకు ఇక్కడ ఇచ్చిన పుస్తక భాగం సమాధానం ఇవ్వలేదు.

ప్రతి వ్యక్తీ లేక సమాజము తన కోసం తను ఏర్పాటు చేసుకున్న "ప్రత్యేక" చట్టాలు కాక ప్రకృతికి అనుగుణంగా ఉండే 'ఉమ్మడి' చట్టాలు ఉంటాయనే అయన వాదనను స్పష్టంగా వ్యక్తపరిచే ఆయన రచనలే సహజ న్యాయం ఉంటుందనే ఆలోచన అరిస్టాటిల్ కు ఉన్నదనే దానికి సరైన రుజువు.[17] ఇటువంటి ఒక చట్టము ఇతరులను ఒప్పించగలిగేటందుకు మాత్రమే బాగుంటుందని ఈ వ్యాఖ్యానం యొక్క నేపథ్యము సూచిస్తుంది. ముఖ్యంగా, నిజానికి అక్కడ అటువంటి చట్టమేమి లేనప్పుడు కూడా, ఒకరి పట్టణంలో ఏదేని ప్రత్యేక కేసుకు అక్కడి ప్రత్యేక చట్టాలు వ్యతిరేకంగా ఉండే సందర్భములో;[18] ఇంతేకాక ఈ పుస్తకభాగంలో సూచించిన అందటు అంగీకరించిన సహజ న్యాయమును తప్పు అని రుజువు చేసేందుకు అరిస్టాటిల్ ప్రతి ముగ్గురిలో ఇద్దరిని పరిగణనలోనికి తీసుకున్నారు.[19] ఈ సహజ న్యాయ సిద్ధాంతానికి అరిస్టాటిల్ పితామహుడు అనే వాదన తరువాతి కాలంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం జరిగింది.[ఉల్లేఖన అవసరం]

ఇస్లాంలో షేరియా మరియు ఫిక్[మార్చు]

ది ఫస్ట్ సుర ఇన్ ఏ ఖురానిక్ మాన్యుస్క్రిప్ట్ బై హాతాట్ అజీజ్ ఎఫెండి.

ఇస్లామిక్ న్యాయంలో షేరియా (شَرِيعَةٌ ) అనేది ప్రధాన భాగము. దీని అర్ధం "దారి" లేక "మార్గము"; ఇస్లామిక్ న్యాయ సూత్రాలకు లోబడిన న్యాయ వ్యవస్థలో జీవించే వారి జీవితం లోని బయట మరియు ఆంతరంగిక విషయాలకు సంబంధించిన నియంత్రణలను తెలియచేసే న్యాయ చట్రం (framework ) గా దీనిని చెప్పుకోవచ్చు. ఫిక్ అనేది ఇస్లామిక్ న్యాయ నిపుణులతో రూపొందించబడిన నియమాలతో కూడిన ఇస్లామిక్ ధర్మ శాస్త్రం. ఇస్లామిక్ స్టడీస్ లో ఒక భాగమైన ఫిక్ ప్రాథమిక మరియు సెకండరీ మూలాల నుండి ఈ విధంగా ఇస్లామిక్ చట్టాలు రూపొందించబడ్డాయో తెలియచేస్తుంది.

పండితులు రూపొందించిన నియమాలను మరియు వివరణలను అర్ద్ధంచేసుకోవదాన్ని ఫిక్ గాను, ఈ ఫిక్ వెనక ఉన్న సూత్రాలను షేరియా గాను ఆధునిక ఇస్లాం వర్గీకరిస్తుంది. ఏ సందర్భంలోనైన ఫిక్ మరియు షేరియాలు సామరసతోనే ఉంటాయని పండితులు ఆశిస్తారు కాని ఇది జరుగుతుందో లేదో స్పష్టంగా తెలియదు.[20]

ఖియాస్ అనే ఒక పద్ధతి ద్వారా ఇస్లామిక్ తత్వ తర్కం యొక్క తోలి రూపాలను ఇస్లామిక్ ధర్మ శాస్త్రంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇస్లామిక్ స్వర్ణ యుగ కాలంలో, ఈ ఖియాస్ అనేది సాదృశ్య తర్కాన్ని,ప్రేరేపిత తర్కాన్ని లేక స్పష్టమైన న్యాయ ప్రయోగాన్ని వీటిలో దేనిని సూచిస్తుంది అనేదానిపై ఇస్లామిక్ తత్వవేత్తలు, న్యాయ నిపుణులు మొదలైన వారిలో ఏంటో తార్కికమైన చర్చ జరిగేది. కొంతమంది ఇస్లామిక్ పండితులు ఖియాస్ అనేది హేతువాదనను సూచిస్తుందని వాదించినప్పటికీ ఐన్ హజం (994-1064) వంటి వారు దీనితో విభేదించారు. ఈయన వాదన ప్రకారం ఖియాస్ అనేది ప్రేరేపిత తర్కాన్ని కాక నిజమైన అర్ధంలో స్పష్టమైన న్యాయ ప్రయోగాన్ని మరియు ప్రతీకాత్మకఅర్ధంలో సాదృశ్య తర్కాన్ని సూచిస్తుంది. మరోవైపు, అల్-ఘజాలి (1058 - 1111 )(మరియు ఆధునిక యుగంలోఅబూ మొహమ్మద్ అసెం అల్-మక్దిసి) ఖియాస్ అనేది వాస్తవ అర్ధంలో సాదృశ్య తర్కాన్ని మరియు ప్రతీకాత్మక అర్ధంలో స్పష్టమైన న్యాయ ప్రయోగాన్ని సూచిస్తుందని వాదించారు. అయితే ఆ సమయంలోని ఇతర ఇస్లామిక్ పండితులు ఖియాస్ అనేది నిజమైన అర్ధంలో సాదృశ్య తర్కము మరియు స్పష్టమైన న్యాయ ప్రయోగము రెండిటిని సూచిస్తుందని వాదించారు.[21]

థామస్ అక్వినాస్[మార్చు]

పాశ్చాత్య మధ్యయుగ న్యాయ పండితులలో థామస్ అక్వినాస్ ముఖ్యులు.

సెయింట్ థామస్ అక్వినాస్ (థామస్ ఆఫ్ అక్విన్, లేక అక్వినో) (c. 1225 – 7 March 1274) was a philosopher and theologian in the scholastic tradition, known as "Doctor Angelicus, Doctor Universalis". 1225-7 మార్చి 1274) పాండిత్య సాంప్రదాయంలో తత్వవేత్త లేక వేదాంతి. ఈయనను డాక్టర్ అన్గేలికాస్, డాక్టర్ యూనివర్సలీస్ అనేవారు. ఈయన సహజ వేదాంత తత్వాన్ని ప్రతిపాదించిన వారిలో అత్యంత ప్రాచీనులు. రోమన్ కాథలిక్ చర్చికు ఎంతోకాలం పాటు ప్రధాన తత్వ విధానముగా ఉన్నటువంటి థామిస్టిక్ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీకు ఈయనే పితామహులు. సుమ్మ థియోలాజిక అనేది ఈయన రచనలలో ప్రధానమైనదిగా చెప్పుకోవచ్చు. మొత్తం 33 మంది చర్చి వేదాంతిలలో ఒకరైన ఈయన చర్చి యొక్క అత్యుత్తమ వేదాంతిగా అనేక మందిచే పరిగణించబడ్డారు. తదనంతరం, ఎన్నో విద్యా సంస్థలకు ఆయన పేరు పెట్టడం కూడా జరిగింది.

అక్వినాస్ నాలుగు రకాలుగా న్యాయాలను వర్గీకరించారు. అవి శాశ్వత, సహజ, మానవ మరియు దైవ సంబంధమైన న్యాయాలు. శాశ్వత న్యాయం అనేది అన్ని జీవరాసులను నియంత్రించే దైవాజ్ఞ. సహజ న్యాయం అనేది ఈ శాశ్వత న్యాయంలో మనుషులు భాగస్వాములై హేతువు చేత గుర్తించే న్యాయం.[22] సహజ న్యాయం "తొలి సిద్ధాంతాలపై" ఆధారపడి ఉంటుంది:

...మంచి చేయడం, దానిని ప్రోత్సహించడం మరియు చెడును దూరంగా ఉంచడం అనేది న్యాయం యొక్క మొదటి సూత్రము. సహజ న్యాయము యొక్క ఇతర అన్ని సూత్రాలు ఈ సూత్రం పైననే ఆధారపది ఉంటాయి... [23]

అక్వినాస్ దృష్టిలో జీవించాలనే మరియు ఉత్పత్తి చేయాలనే ఆకాంక్షలే అన్ని ఇతర మానవ విలువలు ఆధారపడి ఉన్న కనీస మానవ (సహజ) విలువలు. మానవ న్యాయం అనేది వాస్తవిక న్యాయం: సహజ న్యాయం అనేది ప్రభుత్వాలచే సమాజాలలోకి తీసుకురాబడుతుంది. ధర్మ దూతల బోధనలలో, పవిత్ర గ్రంధాలలో చెప్పబడిన ధర్మాలే దైవ న్యాయం.

థామస్ హాబ్స్[మార్చు]

థామస్ హాబ్స్ ఇంగ్లీష్ యెన్లైటేన్మెంట్ స్కాలర్.

లేవిఅతాన్,(1651) అనే తన సిద్ధాంత గ్రంధంలో, హాబ్స్ సహజ న్యాయం అనేది హేతువు చే కనుగొనబడే ధర్మ సూత్రం లేక సాధారణ నియమముగా వివరిస్తారు. ఈ సహజ న్యాయము వలన మనిషి జీవితాన్ని నాశనం చేసే చర్యలు చేయకుండా, ఆ జీవితాన్ని సంరక్షించే మార్గాలను ధ్వంసం చేయకుండా నియంత్రించబడతాడు. హాబ్స్ ఒక సోషల్ కాంట్రాక్ట్ ఏరియన్[24]. ఈ న్యాయం ప్రజల మనసులలో సమ్మతిని పొందిందని ఈయన భావించారు. మానవాళి మధ్యన పొంచి ఉన్న యుద్ద పరిస్థితి నుండి ప్రజలను రక్షించడానికి ఏర్పడిన ప్రాకృతిక పరిస్థితే సమాజం అని ఆయన నమ్మకం. క్రమబద్ధమైన సమాజం లేకపోతె జీవితం "ఒంటరితనం, బలహీనం, మూర్ఖత్వం, గజిబిజి మరియు స్వల్పం". మానవ నైజం గురించి హాబ్స్ యొక్క భావాలు అప్పటి కాలమాన పరిస్థితులచే ప్రభావితం చేయబడినదని కొంతమంది వ్యాఖ్యానిస్తారు. ఇంగ్లీష్ సివిల్ వార్ మరియు క్రోంవెల్ నియంతృత్వ పాలనా సంభవించిన ఆ సమయంలో, పూర్తి అధికారం ఒక నియంత చేతిలో ఉంది అతని పాలనలోని వారంతా చట్టాల యొక్క అధీనంలో ఉండడం నాగరిక సమాజ లక్షణంగా ఆయన భావిస్తారు.

లోన్ ఫుల్లెర్[మార్చు]

రెండవ ప్రపంచ యుద్ధం తరువాత రచనలు చేసిన లోన్ ఎల్. ఫుల్లెర్ న్యాయం అనేది కొన్ని ప్రధాన ప్రమాణాలను (నిష్పాక్షికంగా ఉండడం మరియు అందరికి అర్ధమయ్యేలా ఉండడం వంటివి) పాటించాల్సి ఉంటుందని బలంగా తెలియ చేసారు. సామాజిక నియంత్రణా వ్యవస్థలలో ఈ ప్రమాణాలు కొంతమేరకు లోపిస్తాయని, దానితో వాటిని న్యాయ వ్యవస్థలుగా గుర్తించలేక తగినంత గౌరవం ఇవ్వమని ఫుల్లెర్ వాదిస్తారు. కాబట్టి, ఏ సామాజిక నియమాలను అనుసరించి చట్టాలు రూపొందిస్తారో దానికి మించిన అంతర్గత విలువలు న్యాయానికి ఉంటాయి. ఫుల్లెర్ మరియు పండిత హెచ్.ఎల్.ఏ.హార్ట్ ఇద్దరు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో సహోద్యోగులు. నాజి చట్టం అంత చెడ్డ దయితే అది అసలు చట్టంగా పరిగణించనేకూడదు అనేది వాస్తవికవాది అయిన హార్ట్ కు, సహజ వాది అయిన ఫుల్లెర్ కు ఉన్న ప్రధాన అభిప్రాయబెధం.

జాన్ ఫిన్నిస్[మార్చు]

పైన చెప్పుకున్న వర్ణనలు సూచిస్తున్నట్లు లౌక్యంతో కూడిన వాస్తవికవాద మరియు సహజ న్యాయ సిద్ధాంతాలు కొన్నిసార్లు ఒకే విధంగా కనిపించినప్పటికీ అవతలి వాదంలోని కొన్ని విషయాలతో పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు కనపడదు. ఒక వ్యక్తి వాస్తవిక వాదా లేక సహజ వాదా అని గుర్తించడం ఏ అంశాలకు వారు ఏ స్థాయిలో ప్రాధాన్యతను ఇస్తున్నారు అనేదాని పైన మరియు ఆ వ్యక్తి పని పైన ఎవరి ప్రభావాలు ఉన్నాయి అనేదాని పైన ఆధారపది ఉంటుంది. ప్రత్యేకంగా, అక్వినాస్ మరియు జాన్ లాక్ వంటి వారు సహజ మరియు తర్కబద్ధమైన న్యాయ మీమాంసకు ఏ విధమైన భేదము చూపించలేదు. కానీ ఆధునిక సహజ వాదులైన జాన్ ఫిన్ వంటి వారు తాము వాస్తవికవాదులమని చెపుతూనే న్యాయం అనేది నైతిక విలువలనుండి ఉద్భవించినదని వాదించారు.

విశ్లేషణాత్మక న్యాయ మీమాంస[మార్చు]

హ్యుం ఇది అవును-ఇది కావచ్చు అనే వ్యత్యాసాన్ని చూపించిన వారిలో ప్రముఖులు.

విశ్లేషణనాత్మక న్యాయ మీమాంస అనేది న్యాయ వ్యవస్థలకు సంబంధించిన అంశాలను పరిశీలించేటప్పుడు ఒక తటస్థ దృక్పథంగా మరియు వివరణగా వాడబడుతుంది. ఇది చట్టం అంటే ఏమిటి అనేదానికి మరియు అది ఎలా ఉండాలి అనే దానిని మిళితం చేసిన సహజ న్యాయాన్ని తిరస్కరించే ఒక తాత్విక సిద్ధాంతం.[25] ఏ ట్రియటిజ్ ఆఫ్ హ్యూమన్ నేచర్ [26] అనే పుస్తకంలో ప్రజలు ప్రపంచం అనేది ఒక వ్యక్తపరిచే మార్గంగా వర్ణించి తప్పనిసరిగా ఏదో ఒక ప్రత్యేక మార్గాన్ని ఎంచుకునే పద్ధతిలో పడిపోతారు అని డేవిడ్ హ్యుం ప్రముఖంగా వాదించారు. అయితే హేతుబద్ధంగా ఆలోచిస్తే మాత్రం, ఏదో ఒకటి జరిగినంత మాత్రాన మరేదో చెయ్యక తప్పదని ఒక నిర్ధారణకు రావడం ఏమంత సమంజసము కాదనిపిస్తుంది.

కాబట్టి ప్రపంచం ఏ విధంగా ఉందో విశ్లేషించడం, అర్ధం చేసుకోవడం అనేదానిని సహజమైన మరియు పరిశీలనాత్మకమైన తప్పనిసరిగా చేయడానికి సంబంధించిన ప్రశ్నలకు భిన్నమైనదిగా చూడవలసి ఉంటుంది.

విశ్లేషణాత్మక న్యాయ మీమాంసకు సంబంధించిన కొన్ని కీలకమైన ప్రశ్నలు "చట్టాలంటే ఏమిటి?" ; " చట్టం ఏమిటి?"; "చట్టానికీ మరియు అధికారానికీ ఉన్న సంబంధం ఏమిటి?"; మరియు, "చట్టానికి మరియు నైతికతకు ఉన్న సంబంధం ఏమిటి?" ఎవరి ఆలోచనా దృక్పధాన్ని బట్టి వారు విశ్లేషిస్తూ విమర్శలు చేయడం పెరుగుతున్నప్పటికీ న్యాయ వాస్తవికత అనేది చాలా ఆధిపత్య సిద్ధాంతంగా ఉంది.

న్యాయ రూడివాదులు[మార్చు]

రూడివాదం అంటే బలంగా పాతుకుపోయిన న్యాయము అని అర్ధం: సామాజికంగా అంగీకరించబడిన సూత్రాలకు అనుగుణంగా చట్టాలు రూపొందించబడతాయి. న్యాయం యొక్క ఈ దృక్పధం స్థూలంగా రెండు సూత్రాలను పాటిస్తుంది. మొదటిది, చట్టాలు న్యాయాన్ని, నైతిక విలువలను కాపాడేవిగా ఉన్నప్పటికీ, ఆ విధంగా చెయ్యడంలో అవి విజయవంతమౌతున్నాయా లేదా అనేదానిని బట్టి అవి సరైనవా కావా అనే నిర్ణయం చేయలేము. వేరే ప్రమాణాల ఆధారంగా చూస్తే అవి న్యాయమైనవి అయినా, కాకపోయినా ఆ సమాజం యొక్క నియమాలకనుగుణంగా చట్టాలు క్రమపద్ధతిలో రూపొందించబడినట్లయితే అవి సరైన చట్టాలుగానే పరిగణించాలి. సమాజంలో ఒక కట్టుబాటు, క్రమపద్ధతి ఏర్పరిచేటందుకు ఏర్పాటుచేసుకున్న నియమనిబంధనలే తప్ప చట్టం అంటే వేరేదీ కాదు అనేది రెండవ అంశం అందువల్లనే ఏ న్యాయ రూడివాదీ కూడా అది ఎటువంటిది అయినప్పటికీ చట్టానికి లొంగి ఉండమని వాదించరు. దీనిని పూర్తిగా వేరే ప్రశ్నగా అర్ధం చేసుకోవలసి ఉంది.

 • చట్టమంటే ఏమిటి అనేది సామాజిక వాస్తవాలపై (లేక "మూలాలు") ఆధారపడి ఉంటుంది.
 • చట్టానికి ఎంతవరకు నిబద్ధత ఉంటుంది అనేది నైతిక అంశాల మీద ఆధారపడి ఉంటుంది.

బెంథం మరియు ఆస్టిన్[మార్చు]

బెంథం ఉపయోగితావాద సిద్ధాంతాలు 20 వ శతాబ్దం వరకు ప్రధానంగా గుర్తించబడుతూనే ఉన్నాయి.

జెరేమి బెంథం తొలిదశ న్యాయ రూడివాదులలో ఒకరు. చట్టాలు అనేవి ఉపయోగకరంగా ఉండాలనే వాదనను బలంగా సమర్ధించిన తొలితరం వారిలో (హ్యుమ్తో పాటుగా) బెంథం ఒకరు. ఇంతేకాక ఈయన జైళ్ళ సంస్కరణాభిలాషి, ప్రజాస్యామ్య వాడి మరియు బలమైన నాస్తిక వాది. ఆయన శిష్యుడు అయినటువంటి జాన్ ఆస్టిన్ ద్వారా బెంథానికి చట్టము, న్యాయ మీమాంస పట్ల గల ఆలోచనలు వెలుగులోనికి వచ్చాయి. ఆస్టిన్ యూనివర్సిటీ ఆఫ్ లండన్లో న్యాయ విభాగానికి 1829 నుండి మొదటి అధ్యక్షుడుగా వ్యవహరించారు. "చట్టం అంటే ఏమిటి?" అనేదానికి ఆస్టిన్ ఉపయోగితావాద సమాధానం ఏమిటంటే "చట్టాలు అనేవి ఒక ప్రభుత్వం ప్రజలను భయపెట్టడం ద్వారా వాటికి లొంగి ఉండేలా చేసే ఆదేశాలు".[27] సమకాలీన న్యాయ రూడివాదులు ముఖ్యంగా హెచ్. ఎల్. ఏ. హార్ట్ వంటి వారు చట్టాన్ని మరీ సాధారణమైనదిగా చేసిన ఈ దృక్పథాన్ని విమర్శిస్తూ దీనిని కొట్టిపారేశారు.

హాన్స్ కెల్సెన్[మార్చు]

హాన్స్ కెల్సెన్ 20 వ శతాబ్దంలో, ఉమ్మడి చట్టాలు ఉండే దేశాలలో కొంత తక్కువ గాను, ఐరోపా మరియు లాటిన్ అమెరికా లలో ఎంతగానో పేరుగాంచిన న్యాయవేత్త. కట్టుబాట్ల యొక్క మంచిచెడ్డలు విశ్లేషించడాన్ని తిరస్కరిస్తూనే ఆ కట్టుబాట్ల కనుగుణంగా ఏర్పడినదే చట్టం అని ఇతని శుద్ధ న్యాయ సిద్ధాంతము విశదీకరిస్తుంది. అంటే, 'న్యాయ శాస్త్రాన్ని', 'న్యాయ రాజకీయాల' నుండి వేరుగా చూడాలి అని అర్ధం. రాజ్యాంగ చట్టంతో ప్రారంభించి, ఒక న్యాయవేత్తచే స్వీకరించబడిన ఒక కనీస కట్టుబాటు నుండి అన్ని క్రింది స్థాయి కట్టుబాట్లు ఒక నిచ్చెనలా ఏర్పడే న్యాయ వ్యవస్థలో అవి ఒకరకమైన అధికారాన్ని పొంది అన్నీ దానికి కట్టుబదేలా చేసుకుంటాయి అనే దృక్పథం ఈ శుద్ధ న్యాయ సూత్రానికి కేంద్రం. ఈ విధంగా, న్యాయ కట్టుబాట్లను, వాటి 'న్యాయ' లక్షణాలను ఏ దేవునికో, ప్రకృతికో, రాజ్యానికో ఆపాదించకూడదనేది కెల్సెన్ వాదన.

హెచ్.ఎల్.ఏ. హార్ట్[మార్చు]

ఇంగ్లీష్ సామ్రాజ్యంలో చట్టాలను సామాజిక నియమాల వ్యవస్థలుగా అర్ధం చేసుకోవాలని వాదించిన వారిలో ప్రముఖులు హెచ్.ఎల్.ఏ.హార్ట్. చట్టాలకు శిక్షలు అవసరమనే కెల్సెన్ అభిప్రాయాన్నిహార్ట్ వ్యతిరేకిస్తూ, చట్టం లాంటి సహజ సామాజిక ప్రక్రియకు అసహజ సామాజిక వాస్తవాలు ఆధారంకాకూడదనే అభిప్రాయాన్ని తెలియచేసారు. ది కాన్సెప్ట్ ఆఫ్ లా అనే తన పుస్తకం ద్వారా 20 వ శతాబ్దంలో విశ్లేషనాత్మక న్యాయ మీమాంస పై ఒక సైద్ధాంతిక చర్చకు తెర తీసారు.[28] ఆక్సఫర్డ్ యూనివర్సిటీలో న్యాయ మీమాంస విభాగ అధ్యక్షులుగా పనిచేసిన హార్ట్ చట్టం అనేది 'నియమాల వ్యవస్థ' అని వాదించారు.

హార్ట్ అభిప్రాయంలో నియమాలను ప్రాథమిక నియమాలు (శీలానికి సంబంధించినవి) మరియు సెకండరీ నియమాలు (ప్రాథమిక నియమాలను అమలు జరిపేందుకు అధికారులకు ఇవ్వబడిన నియమాలు). సెకండరీ నియమాలను న్యాయబద్ధమైన నియమాలు (న్యాయ వివాదాలను పరిష్కరించేటందుకు, మార్పుకు సంబంధించిన నియమాలు (చట్టాలలో మార్పుకు అనుమతి నిచ్చేవి) మరియు గుర్తింపుకు సంబంధించిన నియమాలుగా (చట్టాల యొక్క ప్రామాణికతను పరీక్షించేందుకు అవకాశం ఇచ్చేవి) వర్గీకరించడం జరిగింది. గుర్తింపు నియమము అనేది సహజంగా అధికారులతో (ముఖ్యంగా న్యాయ మూర్తులతో) అమలు చేయబడుతూ కొన్ని చర్యలు మరియు నిర్ణయాలు చట్టాలకు మూలాలుగా గుర్తిస్తుంది. నీల్ మక్కోర్మిక్[29] 1981 లో హార్ట్ పై వ్రాసిన పుస్తకం ఆయన సిద్ధాంతాలను విమర్శించడమే కాక మక్కోర్మిక్ తనదైన సొంత సిద్ధాంతాన్ని ప్రతిపాదించేందుకు దోహదపడింది. (ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ లా,2007 అనే ఈయన ఇటీవలి పుస్తకమే ఇందుకు ఉదాహరణ). రోనాల్డ్ ద్వార్కిన్, జాన్ ఫిన్స్ మరియు జోసెఫ్ రాజ్ ఇతర విమర్శకులలో ముఖ్యులు.

ఇటీవలి కాలంలో, న్యాయం యొక్క స్వభావంపై అంతటా చర్చలు విస్త్రుతమవుతున్నాయి. వాటిలో న్యాయ రూడివాదానికి సంబంధించిందే ఒక ముఖ్యమైన చర్చ. ప్రత్యేక న్యాయ రూడివాదం అనేది ఒక వర్గం కాగా ఒక కట్టుబాటు యొక్క న్యాయ ప్రామాణికత దాని నైతిక అంగీకారం మీద ఆధారపడి ఉండకూడదనేది ఈ వర్గం వాదన. అంతర్గ్రాహ్యక న్యాయ రూడివాదం అనే రెండవ వర్గాన్ని ప్రధానంగా విల్ వాల్చౌ సమర్ధించారు. దీని ప్రకారం నైతిక అంశాలు ఒక కట్టుబాటు యొక్క ప్రామాణికతను నిర్ధారించవచ్చు . కానీ కచ్చితంగా నిర్ధారించాలని లేదు.

జోసెఫ్ రాజ్[మార్చు]

రూడివాద సిద్ధాంతంలో చట్టానికి మరియు నైతికతకు సంబంధం ఉండవలసిన అవసరం లేదని కొంతమంది తత్వవేత్తలు వాదించేవారు. అయితే జోసెఫ్ రాజ్, లెస్లీ గ్రీన్ మరియు జాన్ గార్డనర్ వంటి ప్రభావవంతమైన సమకాలీన రూడివాదులు ఈ దృక్పధాన్ని వ్యతిరేకించారు. న్యాయ వ్యవస్థలో ఎటువంటి పాపాలకు చోటు ఉండకూడదనేది ఒక అవసరమైన వాస్తవం (ఉదాహరణకు ఇది ఒక మానభంగాన్నో హత్యనో చేయలేదు) అనేది రాజ్ దృక్పధం.

ది అథారిటీ ఆఫ్ లా అనే పుస్తకంలో జోసెఫ్ రాజ్ రూడివాద దృక్పధాన్ని సమర్దిస్తూనే హార్ట్ యొక్క "సాఫ్ట్ సోషల్ థీసిస్"ను విమర్శించారు.[30] నైతికతకు సంబంధించిన తర్కాన్ని పరిశీలించకపోయినప్పటికీ పూర్తిగా సామాజిక మూలాల ద్వారా గుర్తించదగిన అధికారమే చట్టమని రాజ్ వాదిస్తారు. అధికారానికి సంబంధించినవి కాక వేరే ఎటువంటి నియమాలనైనా న్యాయ మీమాంసకు సంబంధించినవిగా కాక సామాజిక శాస్త్రానికి సంబంధించినవిగా చూడవలసి ఉంటుంది.[31]

రోనాల్డ్ ద్వోర్కిన్[మార్చు]

ప్రజాస్వామ్యయుతంగా రూపొందించబడిన చట్టాలను కూడా కొట్టివేసే న్యాయమూర్తి సామర్ధ్యాల గురించి చర్చించే న్యాయ సిద్ధాంతాన్ని రోనాల్డ్ డ్వోర్కిన్ ప్రతిపాదించారు.

న్యాయాన్ని నైతికతకు సంబంధించిన అంశంగా చూడడానికి నిరాకరించినందుకుగాను హార్ట్ మరియు ఇతర రూడివాదులను తన లాస్ ఎంపైర్ [32] అనే పుస్తకంలో డ్వోర్కిన్ విమర్శించారు. చట్టం అనేది వివరణ అవసరమైన అంశంగా వాదించే డ్వోర్కిన్ ఒక న్యాయ వివాదానికి రాజ్యాంగ సంప్రదాయానికి లోబడే కచ్చితమైన మరియు న్యాయమైన పరిష్కారాన్ని ఇవ్వాలంటే న్యాయ మూర్తులు అవసరమవుతారు అని వాదిస్తారు. చట్టమనేది పూర్తిగా సామాజిక వాస్తవాల మీదే ఆధారపడి ఉండదు అని నమ్మే డ్వోర్కిన్ ఇది సంస్థాగత వాస్తవాలకు సంబంధించిన నైతికంగా కచ్చితమైన పరిష్కారాలను మరియు మనం అంతరాత్మల్లో న్యాయం అనుకునే పద్ధతులనే కలిగి ఉంటుందని భావిస్తారు. ఒక సమాజంలో ఎటువంటి పద్ధతులు ఉన్నాయో వాటికి ఆధారంగా ఉన్న నైతిక విలువలను తెలుసుకునే వరకు ఆ సమాజంలో న్యాయ వ్యవస్థ ఉందొ లేదో అర్ధం చేసుకోవడం కష్టం అనేది డ్వోర్కిన్ వాదన వెనుక ఉన్న అర్ధం. న్యాయ రూడి వాదులు మరియు వాస్తవిక వాదుల అభిప్రాయాలకు భిన్నంగా సమాజంలోని *ఏ ఒక్క వ్యక్తి*కూడా ఆ సమాజం యొక్క న్యాయాలు ఏమిటి అనేది అర్ధం చేసుకోలేరనేది (ఎందుకంటె ఆ సమాజం యొక్క పద్ధతుల వెనుక ఉన్న తర్కాన్ని అర్ధం చేసుకోలేరు కాబట్టి) అనేది డ్వోర్కిన్ యొక్క అభిప్రాయం.

డ్వోర్కిన్ దృక్పధంలో చట్టాన్ని ఒక నైతిక సిద్ధాంతంగా అర్ధం చేసుకునే దానికి రెండు కోణాలు ఉన్నాయి. ఒక న్యాయ వ్యాఖ్యానంగా చెప్పబడాలంటే, ఒక విషయం చదివితే దాని ఔచిత్యం తెలియాలి. అయితే ఔచిత్యం ఉన్న వ్యాఖ్యానాలలోను, ఆ సమాజం యొక్క రాజకీయ విధానాలను ప్రస్పుటంగా బయట పెట్టగలిగేవి లేదా వాటిని వీలైనంత ఉత్తమమైనవిగా మార్చగలిగేవి సరైన వ్యాఖ్యానాలని డ్వోర్కిన్ అభిప్రాయం. అయితే ఎటువంటి సమాజంలోనైనా ఉన్న సంక్లిష్టమైన పద్ధతులకు ఏకైక, ఉత్తమ సమర్ధింపు దొరుకుతుందా అనే సందేహం చాలా మంది రచయితలు వెలిబుచ్చారు. మరికొందరు ఒక వేల ఏమైనా ఉన్న వాటిని ఆ సమాజం యొక్క న్యాయంలో భాగంగా భావించాలని అభిప్రాయపడ్డారు.

న్యాయ వాస్తవికత[మార్చు]

ఒలివర్ వెండెల్ హోమ్స్ ఒక స్వయం-నిర్వచిత న్యాయ వాస్తవికవాది.

స్కాండినేవియన్ మరియు అమెరికన్ రచయితల వలన న్యాయ వాస్తవిక సిద్ధాంతం ప్రాచుర్యం పొందింది. సిద్ధాంత గ్రంధాలలోను మరియు శాసనాలలోనూ తెలుపబడిన నియమ నిబంధనలకన్నా పోలీసు స్టేషన్లు, లా ఆఫీసులు, కోర్టులలో వాస్తవంగా ఏదైతే జరుగుతుందో దానినే చట్టంగా పరిగణించాలని ఈ దృక్పధం చెపుతుంది. చట్టం యొక్క సామాజిక దృక్పధంతో దీనికి సంబంధం ఉన్నట్లు కనిపిస్తుంది. అన్ని రకాల చట్టాలు కూడా మానవులచే రూపొందించబడతాయి కాబట్టి మానవులకుండే భయాలు, బలహీనతలు మరియు లోపాలు అన్ని వీటిలో ప్రతిఫలిస్తాయనేది ఈ వాస్తవిక ద్రుక్పధంలోని ప్రధాన అంశం.

ఒలివెర్ వెండెల్ హోమ్స్ జూనియర్ ను అమెరికన్ న్యాయ వాస్తవికవాదానికి మూలపురుషులుగా అనుకోవడం సహజమైనప్పటికీ (రోస్కో పౌండ్, కార్ల్ లేవెలెన్ మరియు జస్టిస్ బెంజమిన్ కర్దోజో ఇతరులలో ముఖ్యులు) యు.ఎస్ న్యాయ వాస్తవికవాద ఉద్యమానికి మరొక సూత్రధారి అయినటువంటి కార్ల్ లేవెలెన్ కూడా ఒక కేసు యొక్క ఫలితాన్ని ఒక న్యాయ మూర్తి యొక్క వ్యక్తిగత విచక్షణ మీద ఆధారపడినదిగా కన్నా మించినదిగా బలంగా నమ్మారు.[33] ఆక్సెల్ హాగెర్ స్తార్మ్ యొక్క రచనలే స్కానిడినేవియన్ న్యాయ వాస్తవిక వాదానికి స్ఫూర్తిగా చాలామంది భావిస్తారు. దీని ప్రాచుర్యం కొద్దిగా తగ్గుతూ వస్తున్నప్పటికీ క్రిటికల్ లీగల్ స్టడీస్ (డంకన్ కెనెడి మరియు రాబెర్తో ఉంగేర్) మరియు ఫెమినిస్ట్ లీగల్ థీరి, క్రిటికల్ రేస్ థీరి, లా అండ్ ఎకనామిక్స్ మరియు లా అండ్ సొసైటీ వంటి ఎన్నో న్యాయ మీమాంస దృక్పధాలను ప్రభావితం చేసారు.

చారిత్రాత్మక ఆలోచనా విధానము[మార్చు]

జర్మన్ చట్టాన్ని క్రోడీకరించే ప్రస్తావన వచ్చిన సమయంలో వచ్చిన జర్మన్ చర్చతో ఈ చారిత్రక న్యాయ మీమాంస ప్రాచుర్యంలోకి వచ్చింది. జర్మన్ ప్రజల ఆచార వ్యవహారాలూ మరియు నమ్మకాలను క్రోడీకరించడం సాధ్యం కాదు కాబట్టి జర్మనీ క్రోడీకరించబడిన న్యాయ పరిభాషను కలిగి ఉండలేదు అని [34]ఫ్రెడరిక్ కార్ల్ వాన్ సావిగ్ని తన ఆన్ ది వొకేషన్ ఆఫ్ అవర్ ఏజ్ ఫర్ లెజిస్లేషన్ అండ్ జ్యురిస్ప్రుడేన్స్ అనే పుస్తకంలో వాదించారు. చట్టం సమాజంతో పాటు ఉద్భవిస్తుందని చారిత్రక వాదుల నమ్మకం.

క్రమబద్ద న్యాయ మీమాంస[మార్చు]

చట్టం అంటే ఏమిటి అనే ప్రశ్నతో పాటు న్యాయ తత్వము చట్టం యొక్క క్రమబద్ద మరియు మూల్యాంకన సిద్ధాంతాలతో కూడా సంబంధం కలిగి ఉంటుంది. చట్టం యొక్క ఉద్దేశం మరియు లక్ష్యం ఏమిటి? ఏ నైతిక లేక రాజకీయ సిద్ధాంతాలు చట్టానికి ఆధారంగా ఉన్నాయి? చట్టం యొక్క అసలు కర్తవ్యం ఏమిటి? ఎటువంటి పనులకు శిక్షలు ఉండాలి మరియు ఎటువంటి శిక్షలు ఉండాలి? న్యాయమంటే ఏమిటి? మనకు ఏమి హక్కులు ఉన్నాయి? చట్టానికి లోబడి ఉండాల్సిన బాధ్యత ఉందా? ఎటువంటి విలువకు చట్ట నియమాలు ఉన్నాయి? వివిధరకాల ఆలోచనా విధానాలు మరియు ప్రముఖ మేధావులు ఇలా ఉన్నారు

ధర్మ న్యాయ మీమాంస[మార్చు]

ప్లేటో (ఎడమ) మరియు అరిస్టాటిల్ (కుడి), స్కూల్ ఆఫ్ ఎథెన్స్ వివరాలు.

వర్చ్యూ ఎథిక్స్ వంటి సమకాలీన ఎరేటాక్ నైతిక సిద్ధాంతాలు నైతికతలో శీలానికి ఉండే పాత్ర గురించి బలంగా చెప్పాయి. చట్టాలు పౌరులలో నైతిక విలువలను ధర్మ ప్రవర్తనను పెంపొందించాలని ఈ ధర్మ న్యాయ మీమాంస చెబుతుంది. చారిత్రాత్మకంగా చూస్తే మొదట అరిస్టాటిల్ తర్వాత థామస్ అక్వినాస్ వంటి వారు ఈ విధానంతో సంబంధం కలిగి ఉన్నట్లు కనిపిస్తుంది. ధర్మ విలువలపై పై జరిగిన వేదాంత పరిశోధనల నుండి సమకాలీన ధర్మ న్యాయ మీమాంస స్ఫూర్తి పొందింది.

డియోన్టాలజీ[మార్చు]

కాంట్ ఒక ప్రముఖ యెన్లైటేన్మేంట్ థింకర్

[35] "ఒక విద్యుక్త ధర్మం లేక నైతిక బాధ్యతకు సంబంధించిన సిద్ధాంతాన్నే[35] డియోన్టాలజీ అంటారు. ఇమ్మనియాల్ కాంట్ అనే తత్వవేత్త ఒక ప్రభావవంతమైన డియోన్టాలజీ న్యాయ సిద్ధాంతాన్ని రూపొందించారు. మనం పాటించే ఏ నియమానికైన విశ్వజనీనత ఉండాలని ఈయన వాదిస్తారు. ప్రతి ఒక్కరు ఆ నియమాన్ని పాటించాలనే కోరికను కలిగి ఉండేందుకు సిద్ధంగా ఉండాలని అంటారు. రోనాల్డ్ డ్వోర్కిన్ అనే న్యాయ తత్వవేత్త రచనలలోను ఈ విధమైన సమకాలీన డియోన్టాలజీ విధానము కనిపిస్తుంది.

ఉపయోగితావాదము[మార్చు]

న్యాయం ఆనందాన్ని సృష్టించాలని మిల్ నమ్మేవారు.

వీలైనంత ఎక్కువ మంది ప్రజలకు సాధ్యమైనంత మంచి జరిగే విధంగా చట్టాల రూపకల్పన జరగాలనేది ఉపయోగితావాద దృక్పధం. చారిత్రాత్మకంగా చూస్తే, జేరేమి బెంథం అనే గొప్ప తత్వవేత్త ఈ ఉపయోగితావాద సిద్దాంతముతో అనుబంధం కలిగి ఉన్నట్లు తెలుస్తుంది. జాన్ స్టువర్ట్ మిల్ అనే బెంథం యొక్క శిష్యుడు 19 వ శతాబ్దంలో ఈ ఉపయోగితావాద సిద్ధాంతాన్ని విస్తృతంగా ప్రాచుర్యంలోనికి తెచ్చారు.[36] సమకాలీన న్యాయ సిద్ధాంతాలలో, చట్టము మరియు ఆర్ధిక శాస్త్రము అనే సంప్రదాయంలో పనిచేసేవారిది ఎప్పుడూ ఉపయోగితావాదుల కన్నా పైచేయిగా ఉండేది. లియాండర్ స్పూనర్ను కూడా చూడుము.

జాన్ రాల్స్[మార్చు]

జాన్ రాల్స్ హార్వర్డ్ యూనివర్సిటీలో రాజకీయ తత్వశాస్త్ర అధ్యాపకులుగా పనిచేసిన ప్రముఖ అమెరికన్ తత్వవేత్త. ఈయన ఎ థీరీ ఆఫ్ జస్టిస్ (1971 ), పొలిటికల్ లిబరలిజం Justice as Fairness: A Restatement మరియు ది లా ఆఫ్ పీపుల్స్ అనే ఎన్నో ప్రముఖ గ్రంధాలను రచించారు. 20 వ శతాబ్దంలో ఎంతో ముఖ్యమైన ఇంగ్లీష్ భాషా రాజకీయ తత్వవేత్తలలో ఒకరుగా ఈయన గుర్తింపు పొందారు. ఈయన న్యాయ సిద్ధాంతం వాస్తవ స్థానం అనే ఒక పరికరం ద్వారా మనం అజ్ఞానపు తెరవెనుక ఉన్నామనుకుంటే మన సమాజ వ్యవస్థలను నియంత్రించేందుకు మనం ఏ విధమైన న్యాయ సూత్రాలను ఎంపిక చేసుకుంటామో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. మన జాతి, లింగము, ఆర్ధిక హోదా, వర్గము, ఇంకా ఏ విధమైన గుర్తించదగిన లక్షణాలు లేక మనమేవరిమో మనకు తెలియదని ఊహించుకుంటే మన వైపు మనం పక్షపాతంతో ఆలోచించలేము. ఈ విధమైన వాస్తవ స్థానం నుండే మనం ప్రతి ఒక్కరికీ మాట్లాడే హక్కు, వోటు హక్కు వంటి కచ్చితంగా ఒకే విధమైన రాజకీయ స్వేఛ్చను ఇవ్వగలుగుతామని రాల్స్ వాదిస్తారు. ఇంతేకాక, మనం కేవలం అసమానతలే ఉన్న ఒక వ్యవస్థను కూడా ఎంపిక చేసుకుంటాము. ఎందుకంటే, ఇటువంటి వ్యవస్థ సమాజం యొక్క ముఖ్యంగా నిరుపేదల యొక్క ఆర్ధిక సంక్షేమానికి తగిన ప్రోత్సాహకాలను ఉత్పత్తి చేస్తుంది. ఇదే రాల్స్ యొక్క ప్రఖ్యాతి గాంచిన 'వైరుధ్య సిద్ధాంతము' న్యాయం అంటే నిష్పాక్షికత. ఎంపికల యొక్క వాస్తవ స్థానాలలో ఉండే నిష్పాక్షికత ఆ స్థానాలలో ఎంపిక చేసుకున్న సూత్రాలలోని నిష్పాక్షికతకు హామీ ఇస్తుంది.

న్యాయ వేదాంతంలో క్రిటికల్ లీగల్ స్టడీస్ మరియు లిబరటేరియన్ థీరీస్ ఆఫ్ లా వంటి మరెన్నో క్రమబద్ద న్యాయ విధానాలు ఉన్నాయి.

ఇది కూడా చూడండి[మార్చు]

సాధారణ[మార్చు]

తత్వవేత్తలు[మార్చు]

సూచనలు[మార్చు]

 1. "జ్యురిస్ప్రుడేన్స్" బ్లాకు యొక్క లా నిఘంటువు
 2. 2.0 2.1 2.2 సైనర్ "ఫిలాసఫీ ఆఫ్ లా", కేంబ్రిడ్జ్ డిక్షనరీ ఆఫ్ ఫిలాసఫీ
 3. సోపర్, "లీగల్ పాసిటివిజం", కేంబ్రిడ్జ్ డిక్షనరీ ఆఫ్ ఫిలాసఫీ
 4. మురె, "క్రిటికల్ లీగల్ స్టడీస్", కేంబ్రిడ్జ్ డిక్షనరీ ఆఫ్ ఫిలాసఫీ
 5. బ్రూక్స్, "రివ్యు ఆఫ్ డ్వోర్కిన్ అండ్ హిస్ క్రిటిక్స్ విత్ రిప్లైస్ బై డ్వోర్కిన్", మోడరన్ లా రివ్యు , vol 69 నెం 6
 6. ఆక్సఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ, 2 వ ఎడిషన్ 1989
 7. షెల్లేన్స్, "అరిస్తారిల్ ఆన్ నాచురల్ లా"
 8. జఫ్ఫా, థామిజం మరియు అరిస్టాటిల్ఇజం
 9. హెచ్. రాకం, ట్రాన్స్., నికోమచియన్ ఎథిక్స్ , లోఎబ్ క్లాసికల్ లైబ్రరీ; జే.ఏ.కే.థామస్,ట్రాన్స్. (హ్యు టేదేనిక్ చే రివైజ్ చేయబడినది), నికోమచియన్ ఎథిక్స్ , పెంగ్విన్ క్లాసిక్స్.
 10. జో సాక్స్, ట్రాన్., నికోమచియన్ ఎథిక్స్ , ఫోకస్ పబ్లిషింగ్
 11. "నికోమచియన్ ఎథిక్స్"bk 2 వ అధ్యాయము 6
 12. టెరంస్ ఇర్విన్, ట్రాన్స్ నికోమచియాన్ ఎథిక్స్, 2 వ ఎడిషన్. , హాకేట్ పబ్లిషింగ్
 13. నికోమచియం ఎథిక్స్ , Bk. V.ch. 3
 14. "నికోమచియాన్ ఎథిక్స్" Bk. V, ch. 1
 15. నికమచియన్ ఎథిక్స్ , Bk. V, ch. 3
 16. నికోమచియాన్ ఎథిక్స్ , Bk. V, ch. 7.
 17. Rhetoric 1373b2-8
 18. షెలెన్ యొక్క, "అరిస్టాటిల్ ఆన్ నాచురల్ లా," 75-81
 19. "నాచురల్ లా," ఇంటర్నేషనల్ ఎన్సిక్లోపీడియ ఆఫ్ ది సోషల్ సైన్సెస్ .
 20. ఆన్ ది సోర్సెస్ ఆఫ్ ఇస్లామిక్ లా ప్రాక్టీసెస్, ద జర్నల్ ఆఫ్ లా అండ్ రెలిజియన్ (0748-0814) Souaiaia yr: 2005 vol: 20 iss: 1 pg: 123
 21. [16] ^ వాల్ [16] ^ వెల్ బి . హల్లాక్ (1993), Ibn తెమియ్య ఎగనెస్ట్ గ్రీక్ లాజిసియన్స్, పేజి. 48. ఆక్సఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్,ISBN 0-19-824043-0.
 22. లూయిస్ పోజ్మన్, ఎథిక్స్ బెల్మాంట్, CA : వర్డ్స్వర్త్ పబ్లిషింగ్ కంపెనీ, 1995).
 23. సుమ్మ ,Q94a2.
 24. సాధారణ అర్ధం: సామాజిక క్రమబద్ధతను సాధించడంకోసం ఒక సమాజం లోని ప్రజలు ప్రభుత్వానికి కొన్ని హక్కులను వదిలివేయడం.
 25. చూడుము హెచ్.ఎల్.ఏ. హార్ట్, 'పాసిటివిజం అండ్ ది సెపరేషన్ ఆఫ్ లా అండ్ మోరల్స్' (1958) 71 Harv. L. Rev. 593
 26. డేవిడ్ హ్యుం, ఏ ట్రియాటైజ్ ఆఫ్ హ్యూమన్ నేచుర్ (1739) Etext
 27. జాన్ ఆస్టిన్, ది ప్రావిడెన్స్ ఆఫ్ జ్యురిస్ప్రుడేన్స్ డిటర్మైండ్ (1831)
 28. హెచ్.ఎల్.ఏ. హార్ట్, ది కాన్సెప్ట్ ఆఫ్ లా (1961 ) ఆక్సఫర్డ్ ప్రెస్, ISBN 0-19-876122-8
 29. "ది యూనివర్సిటీ ఆఫ్ ఎడింబర్గ్". మూలం నుండి 2006-06-01 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-07-23. Cite web requires |website= (help)
 30. జోసెఫ్ రాజ్, ది అథారిటీ ఆఫ్ లా , (1979 ) ఆక్సఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్.
 31. ch. 2, జోసెఫ్ రాజ్, ది అథారిటీ ఆఫ్ లా (1979)
 32. రోనాల్డ్ ద్వోర్కిన్, లాస్ ఎంపైర్ (1986)హార్వర్డ్ యూనివర్సిటీ ప్రెస్
 33. "న్యాయ మీమాంస". వెస్ట్ యొక్క ఎన్సైక్లోపీడియ ఆఫ్ అమెరికన్ లా. ఎడిషన్, జెఫ్రీ లీమన్, షిరేల్లె ఫిలిప్స్. డెట్రాయిట్: థామస్: గాలే, 2005.
 34. ఫ్రెడరిక్ కార్ల్ వాన్ సావిగ్ని, ఆన్ ది వొకేషన్ ఆఫ్ అవర్ ఏజ్ ఫర్ లెజిస్లేషన్ అండ్ జ్యురిస్ ప్రుడేన్స్ (అబ్రహాం ఏ. హేయార్డ్ ట్రాన్స్., 1831)
 35. 35.0 35.1 వెబ్స్టర్స్ న్యూ వరల్డ్ డిక్షనరీ ఆఫ్ ద అమెరికన్ లాంగ్వేజ్, p. 378 (2d Coll. Ed. 1978).
 36. ఉపయోగితావాదం Archived 2007-05-05 at the Wayback Machine. గురించి మెటాలిబ్రి డిజిటల్ లైబ్రరీలో చూడుము.

అధిక సమాచారం[మార్చు]

 • Austin, John (1831). The Province of Jurisprudence Determined.
 • ఫ్రీ మాన్, ఏం.డి.ఎ.( 2001). 7th ed. లాయిడ్స్ ఇంట్రడక్షన్ టుజురిస్ ప్రుడేన్స్ . 7 వ ఎడిషన్. లండన్:స్వీట్ అండ్ మాక్స్ వెల్.
 • Hart, H.L.A. (1961). The Concept of Law. Oxford University Press.
 • హార్ట్లర్ హెచ్.రిచర్డ్ (1976) జస్టిస్, లీగల్ సిస్టమ్స్ అండ్ సోషల్ స్త్రక్తర్ పోర్ట్ వాషింగ్టన్, న్యూయార్క్: కేన్నికాట్ ప్రెస్.
 • హత్చింసన్, అలన్ సి., ఎడిషన్ (1989). క్రిటికల్ లీగల్ స్టడీస్ . టోటోవ, యెన్.జే: రోమన్ & లిటిల్ ఫీల్డ్.
 • కేమ్పిన్, జూనియర్ ఫ్రెడరిక్ జి.(1963). 0}లీగల్ హిస్టరీ: లా అండ్ సోషల్ చేంజ్. ఎంగల్వుడ్ క్లిఫ్స్, యెన్.జే: ప్రేన్తిస్-హాల్.
 • లే వేల్విన్, కార్ల్ యెన్.(1986). కార్ల్ యెన్. లే వేల్విన్ ఆన్ లీగల్ రియలిజం . బర్మింఘం, ఎ.ఎల్: లీగల్ క్లాసిక్స్ లైబ్రరి. (ఇందులో సహజ న్యాయాలపై "ది బ్రామ్బాల్ బుష్" అనే క్లాసిక్ పుస్తకం ఉన్నది).
 • ముర్ఫి,కోర్నేలుయిస్ ఎఫ్. ( 1977). ఇంట్రడక్షన్ టు లా, లీగల్ ప్రాసెస్, అండ్ ప్రొసీజర్ . సెయింట్ పాల్, ఏం.యెన్:వెస్ట్ పబ్లిషింగ్
 • రాల్స్, జాన్ (1999). ఎ థీరి ఆఫ్ జస్టిస్, రివైజెడ్ ఎడిషన్. Cambridge: Harvard University Press.కేంబ్రిడ్జ్: హార్వర్డ్ యూనివర్సిటీ ప్రెస్. (ఫిలసాఫికల్ ట్రీట్మెంట్ ఆఫ్ జస్టిస్).
 • జిన్న్, హోవార్డ్ (1990). డిక్ల రేషన్ స్ ఆఫ్ ఇండిపెండెన్స్: క్రాస్-ఎగ్జామినింగ్ అమేరికన్ ఐడియాలజి. న్యూ యార్క్: హార్పర్ కోలిన్స్ పబ్లిషర్స్.

వెలుపలి లింకులు[మార్చు]

మూస:Social and political philosophy మూస:Jurisprudence