న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్
![]() | ఈ వ్యాసం పూర్తిగానో, పాక్షికంగానో గూగుల్ అనువాద వ్యాసాల ప్రాజెక్టు (2009-2011) ద్వారా గూగుల్ అనువాదఉపకరణాల నాణ్యతను పెంచడంలో భాగంగా కొన్నిపరిమితులతో ఆంగ్ల వికీవ్యాసంనుండి మానవ అనువాదకులు అనువదించారు. అందుచేత ఇందులోని వాక్య నిర్మాణాలు, పదాల ఎంపిక కాస్త కృత్రిమంగా ఉండే అవకాశం ఉంది. అనువాదాన్ని వీలైనంతగా సహజంగా తీర్చిదిద్ది, ఈ మూసను తొలగించి చర్చా పేజీలో {{వికీప్రాజెక్టు_గూగుల్_అనువాదవ్యాసాలు-మెరుగుపరచిన}} చేర్చండి. |
న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూపు (అణు ఇంధన సరఫరాదారుల సంఘం) (NSG ) అనేది ఒక అంతర్జాతీయ సంస్థ, అణ్వాయుధ అభివృద్ధికి అనువైన పదార్థాల ఎగుమతిని మరియు తిరిగి బదిలీ చేయడాన్ని నియంత్రించడం ద్వారా మరియు ఇప్పటికే ఉన్న పదార్థాలకు భద్రతా ప్రమాణాలు మరియు రక్షణను మెరుగుపరచడం ద్వారా అణ్వాయుధ వృద్ధిని తగ్గించేందుకు ఈ సంస్థ కృషి చేస్తుంది.
చరిత్ర[మార్చు]
ఈ సంస్థను 1974లో ఏర్పాటు చేశారు, ఇదే ఏడాది భారతదేశం అణు పరీక్ష నిర్వహించినందుకు ప్రతిస్పందనగా దీనిని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక రకమైన ఆయుధేతర ప్రత్యేక అణు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆయుధాల అభివృద్ధికి ఉపయోగించడం ద్వారా ఈ పరీక్షను నిర్వహించారు. దీనితో అప్పటికే అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (న్యూక్లియర్ నాన్-ప్రొలిఫిరేషన్ ట్రీటీ (NPT) పై సంతకం చేసిన దేశాలు అణు పరికరాలు, పదార్థాలు లేదా సాంకేతిక పరిజ్ఞానం ఎగుమతిపై మరింత పరిమితి విధించాల్సిన అవసరాన్ని గుర్తించాయి. NPT-యేతర మరియు జాంగెర్ కమిటీ యేతర దేశాలు, ముఖ్యంగా ఫ్రాన్స్‌ను, దీని పరిధిలోకి తీసుకురావాలని భావించారు.
1975 నుంచి 1978 వరకు లండన్‌లో జరిగిన వరుస సమావేశాల్లో ఎగుమతి కోసం మార్గదర్శకాలపై ఒప్పందాలు ఖరారు చేశారు, ఈ మార్గదర్శకాలను INFCIRC/254గా వెల్లడించడం జరిగింది (ముఖ్యంగా అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ) చేత జాంగెర్ "ట్రిగ్గర్ లిస్ట్"). అంతర్జాతీయ అణుశక్తి సంస్థ భద్రతా ప్రమాణాలకు అంగీకరించినట్లయితే లేదా భద్రతాపరమైన హామీలు ఉన్నట్లయితే కొన్ని అసాధారణ పరిస్థితుల్లో, జాబితాలో పేర్కొన్న వస్తువులను అణ్వస్త్రరహిత దేశాలకు మాత్రమే ఎగుమతి చేయాలని నిర్ణయించారు.
లండన్‌లో వరుసగా సమావేశాలు జరిగిన కారణంగా "లండన్ క్లబ్" అనే పేరు వాడుకలోకి వచ్చింది. దీనిని లండన్ గ్రూపు లేదా లండన్ సప్లయర్స్ గ్రూపుగా కూడా సూచించడం జరుగుతుంది.
1991 వరకు NSG తిరిగి సమావేశం కాలేదు. 1991 వరకు "ట్రిగ్గర్ లిస్ట్" యథాతథంగా ఉంది, అయితే జాంగెర్ జాబితాలో మాత్రం ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ వచ్చారు. మొదటి గల్ఫ్ యుద్ధం తరువాత ఇరాక్ ఆయుధ కార్యక్రమంపై వెల్లడైన వివరాలు ఫలితంగా ద్వంద్వ-ఉపయోగ పరికరాల ఎగుమతిని కూడా కట్టుదిట్టం చేశారు. మార్చి 1991లో హాగ్‌లో 1978 తరువాత జరిగిన మొదటి సమావేశంలో ఇరవై-ఆరు సభ్యదేశాలు మార్పులపై ఏకాభిప్రాయానికి వచ్చాయి, 1992నాటి "ద్వంద్వ-ఉపయోగ జాబితా"గా తాజా సవరణలను వెల్లడించారు, తాజా జాంగెర్ జాబితాకు అనుగుణంగా అసలు జాబితాను విస్తరించడానికి కూడా ఈ సమావేశంలో అంగీకరించడం జరిగింది. రెండు కీలక జాబితాలను ఎప్పటికప్పుడు తాజాపరచడానికి నియతకాలిక సర్వసభ్య సమావేశాలను ఏర్పాటు చేయడం జరిగింది.
సభ్యదేశాలు[మార్చు]
NSGలో మొదట ఏడు సభ్యదేశాలు ఉన్నాయి, అవి కెనడా, పశ్చిమ జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, USSR, యునైటెడ్ కింగ్‌డమ్ మరియు అమెరికా సంయుక్త రాష్ట్రాలు. 1976-77లో, సభ్యదేశాల సంఖ్య 15కు పెరిగింది, కొత్తగా బెల్జియం, చెకోస్లోవేకియా, తూర్పు జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, పోలాండ్, స్వీడన్ మరియు స్విట్జర్లాండ్ దేశాలు దీనిలో చేరాయి. 1990లో జర్మనీ పునరేకీకరణ జరగడం, 1993లో చెక్ రిపబ్లిక్ మరియు స్లొవేకియా దేశాలుగా చెకోస్లోవేకియా విభజన జరిగింది. 1990 వరకు మరో పన్నెండు దేశాలు కూడా దీనిలో చేరాయి. సోవియట్ యూనియన్ పతనం తరువాత, మాజీ రిపబ్లిక్‌లుగా ఉన్న పలు దేశాలకు భవిష్యత్‌లో సభ్యత్వం కల్పించే దిశగా ఒక పరిశీలక హోదాను ఇవ్వడం జరిగింది. 2004లో చైనా దీనిలో సభ్యదేశమైంది. యూరోపియన్ కమిషన్ భాగస్వామ్య దేశాలు పరిశీలక హోదా కలిగివున్నాయి. 2009/2010 NSG ఛైర్‌గా హంగేరీ ఉంది.[1]
As of 2009[update] NSGలోని 46 సభ్యదేశాలు:[2]
- అర్జెంటీనా
- ఆస్ట్రేలియా
- ఆస్ట్రియా
- బెలారస్
- బెల్జియం
- బ్రెజిల్
- బల్గేరియా
- కెనడా
- చైనా
- క్రొయేషియా
- సైప్రస్
- చెక్ రిపబ్లిక్
- డెన్మార్క్
- ఎస్టోనియా
- ఫిన్లాండ్
- ఫ్రాన్స్
- జర్మనీ
- గ్రీస్
- హంగేరీ
- ఐస్‌ల్యాండ్
- ఐర్లాండ్
- ఇటలీ
- జపాన్
- కజఖ్‌స్థాన్
- లాట్వియా
- లిత్వేనియా
- లగ్జమ్‌బర్గ్
- మాల్టా
- నెదర్లాండ్స్
- న్యూజీలాండ్
- నార్వే
- పోలాండ్
- పోర్చుగల్
- రొమేనియా
- రష్యా
- స్లొవేకియా
- స్లొవేనియా
- దక్షిణాఫ్రికా
- దక్షిణ కొరియా
- స్పెయిన్
- స్వీడన్
- స్విట్జర్లాండ్
- టర్కీ
- ఉక్రేయిన్
- యునైటెడ్ కింగ్‌డమ్
- యునైటెడ్ స్టేట్స్
ఇటీవల, US అధికారులు NSGలో భారతదేశ భాగస్వామ్యంపై చర్చలు జరుగుతున్నట్లు వెల్లడించారు.[3]
భారతదేశం-US అణు ఒప్పందంలో పాత్ర[మార్చు]
జులై 2006లో, అమెరికా సంయుక్త రాష్ట్రాల కాంగ్రెస్ భారతదేశంతో పౌర అణు వాణిజ్యం నిర్వహించేందుకు US చట్టాల్లో సవరణలు చేయడానికి అనుమతించింది. NSG సభ్యదేశాలతో ఆగస్టు 21-22, 2008 తేదీల్లో జరిగిన ఒక సమావేశంలో మార్గదర్శకాల నుంచి భారతదేశానికి-ప్రత్యేక మినహాయింపు ఇవ్వడం[4] పై ఏకాభిప్రాయం సాధ్యపడలేదు. ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, నార్వే, ఐర్లాండ్ మరియు న్యూజీలాండ్ సహా, అనేక సభ్యదేశాలు ప్రతిపాదిత మినహాయింపులో షరతులు లేకపోవడం గురించి అభ్యంతరాలు వ్యక్తం చేశాయి.[5] 2008 సెప్టెంబరు 6న జరిగిన మరో సమావేశంలో, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (NPT) పై సంతకం చేయని దేశంతో అణు వాణిజ్యాన్ని నిషేధించిన తమ ప్రస్తుత నిబంధనల నుంచి భారతదేశానికి "సంపూర్ణ మినహాయింపు" కల్పించేందుకు NSG సభ్యదేశాలు అంగీకరించాయి. మూడు రోజులపాటు తీవ్రస్థాయిలో సాగిన US దౌత్య చర్యలు ఫలితంగా NSG ఈ నిర్ణయం తీసుకుంది.[6] ఈ అనుమతి పొందేందుకు సున్నితమైన అణు సాంకేతిక పరిజ్ఞానాన్ని లేదా పదార్థాలను ఇతర దేశాలతో పంచుకోమని మరియు తమ స్వచ్ఛంద అణ్వాయుధ పరీక్షల విరామాన్ని కొనసాగిస్తామని భారతదేశం అధికారిక హామీలు కూడా ఇచ్చింది NSG సమావేశంలో భారతదేశం తమ దేశపు నిరాయుధీకరణ మరియు అణ్వస్త్రవ్యాప్తి నిరోధక విధానాలు గురించి చేసిన ఒక కీలక ప్రకటనలో ఈ హామీలు ఉన్నాయి.[7]
సూచనలు[మార్చు]
- ↑ http://www.nuclearsuppliersgroup.org/Leng/03-member.htm
- ↑ న్యూక్లియర్ ఎక్స్‌పోర్ట్స్ న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్
- ↑ [1] ఇండియాస్ పార్టిసిపేషన్ ఇన్ ది NSG.
- ↑ టెక్స్ట్ ఆఫ్ U.S. NSG ప్రపోజల్ ఆన్ ఇండియా
- ↑ న్యూక్లియర్ సప్లయర్స్ ప్రపోజ్ టెర్మ్స్ ఫర్ U.S.-ఇండియా డీల్
- ↑ NSG వీవర్ ఎనేబుల్స్ మెంబర్ స్టేట్స్ టు ప్రొవైట్ ఇండియా ఫుల్ సివిల్ న్యూక్లియర్ కోఆపరేషన్
- ↑ థర్టీ వర్డ్స్ దట్ సేవ్డ్ ది డే