న్యూట్రాస్యూటికల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మూస:Tocleft

వ్యాధి నివారణ మరియు చికిత్సతోపాటు, ఆరోగ్య మరియు వైద్యపరమైన ప్రయోజనాలు అందించే ఒక ఆహారం లేదా ఆహార ఉత్పత్తిని న్యూట్రాస్యూటికల్ (పోషక ఔషధం) అంటారు, దీనిలో "న్యూట్రిషన్" (పోషణ) మరియు "ఫార్మాస్యూటికల్" (ఔషధీయ) అనే పదాలు కలిసి ఉన్నాయి. వియుక్త పోషకాలు, పథ్యసంబంధమైన ఔషధాలు మరియు నిర్దిష్టమైన పోషకాహారాల నుంచి జన్యుపరంగా సంవిధానపరిచిన ఆహారాలు, మూలికా ఉత్పత్తులు మరియు తృణధాన్యాలు, పులుసులు మరియు పానీయాలు వంటి ప్రాసెస్ చేసిన ఆహారాల వరకు ఈ న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తులను చూడవచ్చు. కణ-స్థాయి న్యూట్రాస్యూటికల్స్ కారకాల్లో ఇటీవలి సాధనలతో, పరిశోధకులు మరియు వైద్య నిపుణులు పరిపూరక మరియు ప్రత్యామ్నాయ చికిత్సలను బాధ్యతాయుతమైన వైద్య పద్ధతిగా మార్చడం కోసం ఉద్దేశించిన రోగ అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారాన్ని సమగ్రపరచడం మరియు అంచనా వేసేందుకు నమూనాలు అభివృద్ధి చేస్తున్నారు.[1] న్యూజెర్సీలోని క్రాఫోర్డ్‌లో ఉన్న ఫౌండేషన్ ఆఫ్ ఇన్నోవేషన్ మెడిసిన్ (FIM) వ్యవస్థాపకుడు మరియు ఛైర్మన్ డాక్టర్ స్టీఫెన్ L. డిఫెలిస్ మొట్టమొదట న్యూట్రాస్యూటికల్ అనే పదాన్ని నిర్వచించారు.[2] డాక్టర్ డిఫెలిస్ ఈ పదాన్ని వాడుకలోకి తీసుకొచ్చిన తరువాత, దీని యొక్క అర్థంలో హెల్త్ కెనడా మార్పులు చేసింది, ఇది న్యూట్రాస్యూటికల్‌ను: ఆహారాల నుంచి వియుక్తపరిచిన లేదా శుద్ధి చేసిన ఒక ఉత్పత్తిగా నిర్వచిస్తుంది, దీర్ఘకాల వ్యాధి నుంచి రక్షణ కల్పించే లేదా మానసిక ప్రయోజనాన్ని అందించే, ఆహారంతో సంబంధం లేకుండా, సాధారణంగా ఔషధ రూపాల్లో విక్రయించే వాటిని న్యూట్రాస్యూటికల్స్‌గా సూచిస్తుంది. ఉదాహరణలు: బేటా-కారోటిన్, లైకోపిన్ [3] మెర్రియమ్-వెబ్‌స్టెర్ డిక్షనరీ తాజా సంచికలో న్యూట్రాస్యూటికల్‌కు కొత్త నిర్వచనం కనిపిస్తుంది: ఈ నిర్వచనం న్యూట్రాస్యూటికల్‌ను ఆరోగ్య ప్రయోజనాలు అందించే ఒక ఆహార పదార్థంగా (పోషకశక్తిని వృద్ధి చేసే ఆహారం లేదా ఒక పథ్యసంబంధ ఔషధం) సూచిస్తుంది.[4] ఔషధీయ మందులకు ఉపయోగించే పరీక్షలు మరియు నియంత్రణలను న్యూట్రాస్యూటికల్ ఆహారాలకు ఉపయోగించరు.[2] వినియోగదారు అవగాహనకు, ఉత్పత్తులకు మరియు తయారీదారుల కోసం పరిశ్రమ మరియు శాస్త్రీయ ప్రమాణాలకు అభివృద్ధి చేసేందుకు మరియు ఇతర వినియోగదారు భద్రతలకు సంబంధించిన పాత్రల కోసం ఫుడ్ & డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌తో అమెరికన్ న్యూట్రాస్యూటికల్ అసోసియేషన్ కలిసి పనిచేస్తుంది. ఉత్పత్తులకు సంబంధించి హెచ్చరిక లేఖలు అందుకున్న పథ్యసంబంధ మందుల తయారీ కంపెనీల జాబితాను FDA అందజేస్తుంది.[5]

విఫణి మరియు గిరాకీ[మార్చు]

అమెరికా జనాభాలో సుమారుగా మూడింట రెండు వంతుల మంది ఏదో ఒకరకమైన న్యూట్రాస్యూటికల్ ఆరోగ్య ఉత్పత్తిని ఉపయోగిస్తున్నారు. న్యూట్రాస్యూటికల్స్ దుష్ప్రభావాలను తగ్గిస్తూ, కోరుకున్న చికిత్సా ఫలితాలను సాధించేందుకు ఉపయోగపడతాయని భావిస్తున్నారు, వీటి వినియోగానికి ఇతర చికిత్సా కారకాలతో పోలిస్తే బాగా తక్కువ ఖర్చు అవుతుంది. న్యూట్రాస్యూటికల్స్ అన్వేషణ మరియు తయారీ ప్రాధాన్యతను ఔషధతయారీ మరియు బయోటెక్ కంపెనీల్లో కూడా గుర్తించవచ్చు. న్యూట్రాస్యూటికల్స్ అన్వేషణపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించిన ఔషధ తయారీ మరియు బయోటెక్ కంపెనీల్లో మోన్‌శాంటో(సెయింట్ లూయిస్, MO), అమెరికన్ హోమ్ ప్రోడక్ట్స్(మేడిసన్, NJ), డుపోంట్(విల్మింగ్టన్,DE), అబోట్ లాబోరేటరీస్(అబోట్ పార్క్, IL), వార్నెర్-లాంబెర్ట్(మోరిస్ ప్లెయిన్స్,NJ), జాన్సన్ & జాన్సన్(న్యూ బ్రున్స్‌విక్,NJ), నోవార్టీస్(బేసెల్,స్విట్జర్లాండ్),మెటాబోలెక్స్(హేవార్డ్,CA), జెన్‌జైమ్ ట్రాన్స్‌జెనిక్,PPL థెరాప్యూటిక్స్, మరియు ఇంటర్‌న్యూరాన్(లెగ్జింగ్టన్,KY) తదితరాలు ఉన్నాయి.[6] USలో న్యూట్రాస్యూటికల్ పరిశ్రమ విలువ సుమారు $86 బిలియన్లు ఉంది. యూరప్‌లో దీని పరిమాణం ఇంకా కొంచెం ఎక్కువగా ఉంది, జపాన్‌లో వార్షిక ఆహార విక్రయాల విలువ $6 బిలియన్ల వద్ద ఉండగా, దానిలో నాలుగింట ఒక వంతు భాగం న్యూట్రాస్యూటికల్స్ విక్రయాలు ఉన్నాయి- జపాన్ జనాభాలో 47% మంది న్యూట్రాస్యూటికల్స్ ఉపయోగిస్తున్నారు.[7] నిర్దిష్టమైన ఆర్థిక గణాంకాలు అందుబాటులో లేనప్పటికీ, వ్యాపార నివేదికలు విఫణిలో నిరంతర వృద్ధి ఉన్నట్లు సూచిస్తున్నాయి.

అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో న్యూట్రాస్యూటికల్స్ యొక్క వినియోగం వృద్ధి చెందడానికి బేబీ-బూమెర్ (1950వ దశకానికి చెందిన బేబీ బూమ్ తరానికి చెందిన వ్యక్తులు) జనాభా వయస్సు పెరుగుతుండటం ఒక కారణంగా చెప్పవచ్చు. పౌరుల సగటు వయస్సు పెరగడం కొనసాగుతుండటంతో, జనాభా ఆరోగ్యంపై దృష్టి పెట్టడం ఎక్కువవుతుంది. 21వ శతాబ్దం మధ్యకాలానికి, సుమారుగా 142 మంది అమెరికా పౌరులు 50 ఏళ్లుపైబడి ఉంటారు, ఆ సమయానికి మొత్తం జనాభా 400 మిలియన్లకు చేరుకుంటుందని అంచనాలు ఉన్నాయి.[8]

జన్యుపరమైన ఉత్పత్తులు విఫణిలో అందుబాటులోకి రావడం, ప్రజలు ఈ ఉత్పత్తులపై ఆధారపడటం, వాటి యొక్క లభ్యత పెరగడం వలన కొన్ని న్యూట్రాస్యూటికల్స్ యొక్క ధరలు తగ్గిపోయే అవకాశం ఉంది, అంతేకాకుండా విఫణిలో వృద్ధి రేటు కూడా స్థిరంగా కొనసాగుతుందనే భావనలు వ్యక్తమవుతున్నాయి.

ఔషధంగా ఆహారం[మార్చు]

A sculpture of the father of Western medicine, Hippocrates.Hippocrates.
పశ్చిమ వైద్యశాస్త్ర పితామహుడిగా పరిగణించబడుతున్న హిప్పోక్రాట్స్ ఆహార రోగనివారణ ప్రభావాలను ప్రతిపాదించారు.

ఈజిప్షియన్లు, చైనీయులు మరియు సుమేరియన్లు వ్యాధికి చికిత్స చేసేందుకు మరియు దానిని నివారించేందుకు ఆహార పదార్థాలను ఔషధంగా ఉపయోగించినట్లు ఆధారాలు ఉన్నాయి. ఆహారం యొక్క వైద్యపరమైన ప్రయోజనాలను సూచించే వేలాది సంవత్సరాల పూర్వ పత్రాలు గుర్తించబడ్డాయి.[8] కొందరు పశ్చిమ వైద్యశాస్త్ర పితామహుడిగా గుర్తించే హిప్పోక్రాట్స్ ప్రజలు ఆహారాన్ని వారి ఔషధంగా వినియోగించాలని చెప్పారు.

ఆధునిక న్యూట్రాస్యూటికల్ విఫణి 1980వ దశకంలో జపాన్‌లో అభివృద్ధి చెందడం ప్రారంభమైంది. ఆసియావ్యాప్తంగా అనేక శతాబ్దాలపాటు నాటు వైద్యంలో ప్రకృతిసిద్ధ మూలికలు మరియు సుగంధ ద్రవ్యాలకు విరుద్ధంగా, న్యూట్రాస్యూటికల్ పరిశ్రమ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం విస్తరణ మరియు అభివృద్ధితోపాటు వృద్ధి చెందింది.[9]

ఆహార శాస్త్రవేత్తల్లో నిర్వహించిన కొత్త పరిశోధన గత రెండు దశాబ్దాల క్రితం అర్థం చేసుకున్న దాని కంటే ఆహార విజ్ఞాన శాస్త్రంలో తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయని సూచించింది.[9] ఇటీవల వరకు, ఆహారం యొక్క విశ్లేషణ ఆహారం వాసన (సంవేదక రుచి మరియు ఆకృతి) మరియు వాటి యొక్క పోషక విలువ (పిండిపదార్థాలు, కొవ్వులు, మాంసకృత్తులు, నీరు, విటమిన్లు మరియు ఖనిజాలు మిశ్రమం)కు మాత్రమే పరిమితమై ఉండేది. అయితే, ఆహారం మరియు ఆరోగ్యం మధ్య సంబంధంలో ఆహారం యొక్క ఇతర భాగాలు ఒక సమగ్ర పాత్ర పోషిస్తాయనేందుకు ఆధారాలు బలపడుతున్నాయి.

మొక్కలు, ఆహారం మరియు సూక్ష్మజీవుల నుంచి ఈ రసాయన భాగాలు సేకరిస్తారు, ఇవి దీర్ఘకాలిక ఆరోగ్యానికి విలువైన వైద్యపరమైన ప్రయోజనాలు అందిస్తాయి. ప్రోబయోటిక్స్, యాంటీఆక్సిడాంట్స్, మరియు ఫైటోకెమికల్స్ తదితరాలను ఈ న్యూట్రాస్యూటికల్ రసాయనాలకు ఉదాహరణలుగా చెప్పవచ్చు.

అనేక సంవత్సరాలుగా న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తులు ప్రత్యామ్నాయ ఔషధంగా పరిగణించబడుతున్నాయి. న్యూట్రాస్యూటికల్స్ పథ్యానికి మరింత ప్రధాన మందులుగా మారుతున్నాయి, కట్టుదిట్టంగా సంవిధానపరిచి మరియు సరిగా మార్కెట్ చేస్తే ఆహారంలో ఉండేవాటి కంటే ఈ రసాయనాలు సమర్థవంతంగా పనిచేస్తాయని నిరూపించేందుకు పరిశోధన ప్రారంభమైంది.

న్యూట్రాస్యూటికల్స్ వర్గీకరణ[మార్చు]

న్యూట్రాస్యూటికల్స్ ఒక విస్తృత చత్రం కిందకు వస్తాయి, ఆహార పదార్థాల్లో కనిపించే ప్రాథమిక పోషక విలువతోపాటు, అదనపు ఆరోగ్య ప్రయోజనాలు అందజేసే, ఆహార వనరుల నుంచి సేకరించే ఎటువంటి ఉత్పత్తినైనా వర్ణించేందుకు దీనిని ఉపయోగిస్తారు. ఈ ఉత్పత్తులు దీర్ఘకాల వ్యాధులను నివారిస్తాయని, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని, వయస్సు మీదపడే ప్రక్రియను ఆలస్యం చేస్తాయని, జీవన కాలపు అంచనాను పెంచుతాయని ప్రకటిస్తుంటాయి.[10]

న్యూట్రాస్యూటికల్ అనే పదాన్ని ఉత్పత్తులు తమ లేబుళ్లపై ఉపయోగించుకోవడాన్ని నియంత్రించేందుకు అతితక్కువ నియంత్రణ ఉంది. దీని కారణంగా, వివిధ రకాల ఉపయోగాలు మరియు సమర్థతకు సంబంధించిన ఉత్పత్తులను విక్రయించేందుకు ఈ పదాన్ని ఉపయోగిస్తున్నారు. న్యూట్రాస్యూటికల్స్ మరియు అనుబంధ పదార్థాల నిర్వచనం తరచుగా దాని యొక్క మూలంపై ఆధారపడివుంటుంది. అందుబాటులో ఉన్న వివిధ రకాల ఉత్పత్తుల మధ్య స్పష్టమైన ప్రత్యేకతలను సూచించేందుకు, వైద్య వర్గంలోని సభ్యులు న్యూట్రాస్యూటికల్ పదానికి మరింత నిర్దిష్టమైన నిర్వచనం తయారు చేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు.[6] న్యూట్రాస్యూటికల్స్ విభాగంలోకి వచ్చే అనేక రకాల ఉత్పత్తులు ఉన్నాయి.

పథ్యసంబంధ మందులు[మార్చు]

A vitamin B supplment
పైన చూపించిన విటమిన్ B వంటి పథ్యసంబంధ మందులను ఎక్కువగా మాత్రల రూపంలో విక్రయిస్తుంటారు.

ఆహార ఉత్పత్తుల నుంచి సేకరించే పోషకాలు కలిగిన ఒక ఉత్పత్తిని పథ్యసంబంధ మందు అంటారు, ఇవి ద్రవం లేదా క్యాప్స్యూల్ రూపంలో ఉంటాయి. సాధారణంగా డయేటరీ సప్లిమెంట్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ యాక్ట్ (DSHEA), 1994 ఒక పథ్యసంబంధ మందులో ఏముంటాయనే దానిని నిర్వచిస్తుంది. పథ్యాన్ని అందించేందుకు ఉద్దేశించిన ఒక పథ్యసంబంధ భాగాన్ని కలిగివుండి, నోటితో తీసుకునే ఒక ఉత్పత్తిని పత్యసంబంధ మందుగా నిర్వచించవచ్చు. విటమిన్లు, ఖనిజాలు, మూలికలు లేదా బొటానికల్స్, అమైనో ఆమ్లాలు మరియు ఏంజైములు, అవయవ కణజాలాలు, గ్రంథులు, మెటబాలిట్స్ వంటి పదార్థాలను ఈ ఉత్పత్తుల్లోని పథ్యసంబంధ భాగాలుగా చెప్పవచ్చు. పథ్యసంబంధ మందులు కషాయాలు లేదా శుద్ధిచేసిన పదార్థాల రూపంలో కూడా పథ్యసంబంధ మందులు ఉండవచ్చు, వీటిని టాబ్లెట్‌లు, క్యాప్స్యూల్స్, సాఫ్ట్‌జెల్స్, జెల్‌కాప్స్, లిక్విడ్స్ (ద్రవాలు) లేదా పౌడర్‌లు (పొడులు) వంటి అనేక రూపాల్లో కూడా వీటిని గుర్తించవచ్చు.[11]

పథ్యసంబంధ మందులు విఫణిలో విక్రయించే ముందు U.S. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) ఆమోదం పొందాల్సిన అవసరం లేదు. ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయని ఈ మందులు ప్రకటిస్తున్నప్పటికీ, ఈ ఉత్పత్తులపై సాధారణంగా ఒక లేబుల్ ఉంటుంది: ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ చేత ఈ ప్రకటనలు ఆమోదం పొందలేదని ఈ లేబుల్‌పై సారాంశం ఉంటుంది. ఈ ఉత్పత్తి ఎటువంటి రోగాన్నైనా నిర్ధారణ, చికిత్స, నయం చేయడం లేదా నివారించేందుకు ఉద్దేశించినది కాదని తెలియజేస్తుంది.

ప్రయోజనాత్మక ఆహారాలు[మార్చు]

వినియోగదారులు తమ సహజ స్థితికి దగ్గరిలో పోషక సమృద్ధ ఆహారాలు తీసుకునేందుకు వీలు కల్పించే విధంగా ప్రయోజనాత్మక ఆహారాలు రూపొందించబడతాయి, ఇవి ద్రవం లేదా క్యాప్స్యూల్ రూపంలో తయారు చేసే పథ్యసంబంధ మందులకు భిన్నంగా వీటి యొక్క తయారీ ఉంటుంది. ప్రయోజనాత్మక ఆహారాలు తరచుగా సమృద్ధమైన లేదా పోషకశక్తి వృద్ధి చేసే విధంగా ఉంటాయి, ఈ ప్రక్రియను న్యూట్రిఫికేషన్‌గా పిలుస్తారు. ఆహారాన్ని సంవిధాన పరచకముందు స్థాయిలకు ఆహారంలోని పోషక విలువలను ఈ ప్రక్రియ పునరుద్ధరిస్తుంది. కొన్నిసార్లు, అదనపు పరిపూరక పోషకాలను జోడిస్తారు, పాలుకు విటమిన్ D జోడించడం దీనికి ఉదాహరణ.

హెల్త్ కెనడా ప్రయోజనాత్మక ఆహారాలను కేవలం పోషక పదార్థ ప్రభావానికి సంబంధించినవి కాకుండా, ఒక నిర్దిష్ట వైద్య లేదా శరీరధర్మ సంబంధమైన ప్రయోజనాన్ని అందించే భాగాలు లేదా అంశాలు జోడించిన సాధారణ ఆహారంగా నిర్వచిస్తుంది. [3] జపాన్‌లో, అన్ని ప్రయోజనాత్మక ఆహారాలు మూడు వ్యవస్థీకృత ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి; అవి ఆహారాలు (1) ఒక క్యాప్స్యూల్ లేదా టాబ్లెట్ లేదా పొడి రూపంలో కాకుండా సహజంగా దొరికే రూపంలో ఉండాలి; (2) రోజూ ఆహారంలో తీసుకునే విధంగా ఉండాలి: మరియు (3) వ్యాధిని నివారించే లేదా నియంత్రించే విశ్వాసాల్లో ఒక జీవ ప్రక్రియను నియంత్రించగలగాలి.[12]

వైద్యసంబంధ ఆహారాలు[మార్చు]

medical food
ఒక IV పోల్‌పై వైద్య ఆహారం యొక్క ఛాయాచిత్రం.

వైద్యసంబంధ ఆహారాలు వినియోగదారులకు నేరుగా (వైద్యుల సిఫార్సు లేకుండా) అందుబాటులో ఉండవు.[13] FDA వైద్యసంబంధ ఆహారాలు వైద్యుని పర్యవేక్షణలో తీసుకునేందుకు లేదా అంతర్గతంగా పంపిణీ చేసేందుకు తయారు చేయబడతాయని FDA పరిగణిస్తుంది, ప్రత్యేక పోషకాహార అవసరాలు ఉండే ఒక వ్యాధి లేదా పరిస్థితి యొక్క నిర్దిష్ట పథ్య నిర్వహణకు ఉద్దేశించి గుర్తించబడిన శాస్త్రీయ పద్ధతుల ఆధారంగా వైద్యపరమైన అంచనా చేత ఇవి తయారు చేయబడతాయి.[12]

వైద్యసంబంధ ఆహారాలను నోటిద్వారా లేదా ట్యూబు (గొట్టం) ద్వారా శరీరంలోకి తీసుకోవచ్చు. ప్రత్యేక అనారోగ్యంతో బాధపడుతున్న రోగులకు నిర్దిష్ట పోషకాహార అవసరాలను తీర్చేందుకు తరచుగా ఇటువంటి ఆహారాలను తయారు చేస్తారు. వైద్యసంబంధ ఆహారాలను వైద్యుల సమక్షంలో నిశితంగా పర్యవేక్షిస్తుంటారు.

ఫార్మాస్యూటికల్స్[మార్చు]

"అగ్రికల్చర్: ఎ గ్లోసరీ ఆఫ్ టెర్మ్స్, ప్రోగ్రామ్స్ అండ్ లాస్" పేరుతో అమెరికా సంయుక్త రాష్ట్రాల కాంగ్రెస్ కోసం తయారు చేసిన ఒక నివేదిక ప్రకారం, "(ఫార్మాస్యూటికల్స్)" అనేది ఫామ్ మరియు ఫార్మాస్యూటికల్స్ పదాల మిశ్రమం. ఆధునిక వ్యవసాయ పంటలు లేదా జంతువులు (సాధారణంగా బయోటెక్నాలజీ ద్వారా) తయారు చేసే వైద్యపరంగా విలువైన పదార్థాలను ఇది సూచిస్తుంది. సంప్రదాయ పద్ధతులతో పోలిస్తే పంటలను మరియు జంతువుల నుంచి సేకరించిన పదార్థాలను ఔషధ కర్మాగారాల్లో (అంటే, ఆవృత ఉత్పాదక కేంద్రాలు) ఉపయోగించడం వలన ఖర్చును బాగా తగ్గించవచ్చని ఈ పదార్థాల మద్దతుదారులు భావిస్తున్నారు, అంతేకాకుండా దీని ద్వారా వ్యవసాయ ఉత్పాదకులుకు అధిక ఆదాయాలు వస్తాయని వారు పేర్కొంటున్నారు…

అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఫార్మాస్యూటికల్స్ వంటి కొత్త ఆధునిక అనువర్తనాల యొక్క భద్రత విషయంలో (మానవులు, జంతువులు మరియు పంటలు మరియు పర్యావరణానికి) ప్రస్తుత బయోటెక్నాలజీ నియంత్రణ వ్యవస్థ సమర్థవంతమైనదా కాదా అనేది వివాదాస్పదంగా ఉంది… పంటలు లేదా జంతువుల నుంచి సేకరించిన పదార్థాలతో జన్యుపరంగా సంవిధానపరిచిన వైద్య అనువర్తనాలతో వ్యవసాయ వర్గాల్లో ఫార్మాస్యూటికల్స్ అనే పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. [14]

ఉదాహరణలు[మార్చు]

broccoli
క్యాన్సర్‌ను నివారించడంలో బ్రోకలీ (ఒకరకమైన ఆకుకూర) సాయపడుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
Semillas de Chía.jpg

వైద్య విలువ కలిగిన ఆహార పదార్థాల యొక్క అసంపూర్ణ జాబితా ఇక్కడ ఇవ్వబడింది:

అంతేకాకుండా, జిన్సెంగ్, వెల్లుల్లి చమురు తదితరాల వంటి అనేక వృక్షసంబంధ మరియు మూలికా సేకరణలు న్యూట్రాస్యూటికల్స్‌గా అభివృద్ధి చేయబడ్డాయి. ఆహారం మరియు ఔషధ తయారీ పరిశ్రమల్లో పోషక మిశ్రమాలు లేదా పోషక వ్యవస్థల్లో న్యూట్రాస్యూటికల్స్‌ను తరచుగా ఉపయోగిస్తున్నారు.

సమర్థత మరియు భద్రత[మార్చు]

క్రమబద్ధీకరణ[మార్చు]

ఔషధీయ మందులు మాదిరిగా కాకుండా, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో న్యూట్రాస్యూటికల్స్ ఉత్పత్తులు విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి, పథ్యసంబంధ మందులు మాదిరిగానే వీటిని కూడా సమస్థాయి నియంత్రణలతో పర్యవేక్షిస్తున్నారు. ఫెడరల్ డ్రగ్ & డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ యొక్క పరిధిలో, న్యూట్రాస్యూటికల్స్ మరియు పథ్యసంబంధ మందుల మధ్య ప్రమాణాలు, ఉపయోగం మరియు సమర్థతను వివరించే విస్తృతమైన నిర్వచనాలు అస్థిరమైన విశ్వసనీయతను సృష్టిస్తున్నాయి, అయితే కెనడా వంటి అనేక ఇతర దేశాల్లో ఇటువంటి పరిస్థితి లేదు. ఈ పేలవమైన నియంత్రణ పరిధిలో, చట్టబద్ధమైన కంపెనీలు తమ ఉత్పాదక ప్రమాణాలు, ఉత్పత్తులు, వినియోగదారు ప్రయోజనాలకు తగిన ఆధారాలు చూపించేందుకు విశ్వసనీయమైన శాస్త్రీయ పరిశోధనను అందజేస్తూ న్యూట్రాస్యూటికల్స్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి, పథ్యసంబంధమైన మందుల నుంచి తమ ఉత్పత్తులను ప్రత్యేకంగా చూపించేందుకు కూడా ఈ కంపెనీలు పరిశోధనలను ఉపయోగిస్తున్నాయి.

న్యూట్రాస్యూటికల్స్ నిర్వచనం మరియు ప్రమాణాలకు నిర్దిష్ట చట్టపరమైన మరియు శాస్త్రబద్ధమైన లక్షణాలను ఏర్పరిచేందుకు అంతర్జాతీయ స్థాయిలో పరిశ్రమ, వృత్తిపరమైన సంస్థలు, విద్యా సంస్థలు, ఆరోగ్య నియంత్రణ సంస్థల్లో ఉద్యమం మొదలైనప్పటికీ, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో న్యూట్రాస్యూటికల్స్ అనే పదం FDA నియంత్రణలో లేదు. FDA ఇప్పటికీ అన్ని పదార్థాలకు వాటి యొక్క సామర్థ్యం మరియు ఉత్పాదక ప్రక్రియ, శాస్త్రీయ పరిశోధనకు మద్దతు మరియు మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలతో సంబంధం లేకుండా న్యూట్రాస్యూటికల్స్‌కు వాటి ముసుగు పదం డయేటరీ సప్లిమెంట్‌ను ఉపయోగిస్తుంది.

2005లో, పథ్యసంబంధ మందులను అంచనా వేసేందుకు ఫెడరల్ ఫుడ్ & డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కోసం మెరుగైన కార్యాచరణ ప్రణాళిక తయారు చేసేందుకు నేషనల్ అకాడమీస్ ఇన్‌స్టిట్యూట్ ఆప్ మెడిసిన్ మరియు నేషనల్ రీసెర్చ్ కౌన్సిల్‌లు ఒక బ్లూ-రిబ్బన్ కమిటీని ఏర్పాటు చేశాయి. న్యూట్రాస్యూటికల్స్ మరియు పథ్యసంబంధ మందుల మధ్య తేడాలను స్పష్టీకరించడంలో మెరుగుపరిచిన కార్యాచరణ ప్రణాళిక కూడా విఫలమైంది. విస్తృతమైన నిర్వచనాన్ని ఉపయోగించడం కొనసాగడం మరియు విస్తృత విలక్షణత లేకపోవడం వలన అంతర్జాతీయ స్థాయిలో న్యూట్రాస్యూటికల్స్‌గా గుర్తింపు పొందిన వినియోగదారు ఉత్పత్తులతోపాటు, పథ్యసంబంధ మందుల భద్రతను అంచనా వేసేందుకు ఒక వ్యయ-సమర్థ మరియు శాస్త్రీయ ఆధారిత కార్యాచరణ ప్రణాళిక అవసరమవుతుంది.[16]

అంతర్జాతీయ మూలాలు[మార్చు]

అంతర్జాతీయ విఫణిలో కూడా గణనీయమైన స్థాయిలో ఉత్పత్తి నాణ్యతా వివాదాలు ఉన్నాయి[17] అంతర్జాతీయ విఫణి నుంచి వచ్చే న్యూట్రాస్యూటికల్స్ కర్బన లేదా విదేశీయ పదార్థాలు ఉపయోగించినట్లు ప్రకటించవచ్చు, అయితే భద్రత మరియు ఉత్పత్తుల సమర్థతకు సంబంధించిన నియంత్రణ లేకపోవడం సమస్యాత్మకంగా ఉంది. భారీస్థాయిలో లాభ మార్జిన్‌ను సృష్టించేందుకు కంపెనీలు ప్రయత్నిస్తుండటం వలన అనియంత్రిత ఉత్పత్తులు తక్కువ నాణ్యత లేదా అసమర్థ పదార్థాలతో తయారు అయ్యే అవకాశం ఉంది.

బయోఎవైలబిలిటీ[మార్చు]

సమర్థవంతమైన న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల విషయంలో గుర్తించే ప్రధాన సవాళ్లలో ఒక ఔషధం యొక్క "శోషణ రేటు"గా భావించే బయోఎవైలబిలిటీ కూడా ఒకటి. పోషక పదార్థాల యొక్క బయోఎవైలబిలిటీ (లభ్యత) సహజ స్థితిలో ఆహారాన్ని తీసుకుంటే బాగా ఎక్కువగా ఉంటుంది.[ఉల్లేఖన అవసరం] సంవిధానపరచని ఆహారాల్లో కూడా, అన్ని పదార్థాలను సులభంగా విచ్ఛిన్నమై, సమర్థవంతంగా జీర్ణం కావు. పేలవమైన శోషణ రేట్లు ఉండే న్యూట్రాస్యూటికల్స్ ఎటువంటి పోషకసంబంధ లేదా వైద్య ప్రయోజనాన్ని అందించకుండానే శరీరం నుంచి బయటకు పంపివేయబడతాయి.

ఉత్తుత్తి ఫలితంపై ప్రభావం[మార్చు]

ఫార్మాస్యూటికల్స్ మాదిరిగానే, న్యూట్రిస్యూటికల్స్ యొక్క సమర్థతలో కొంత భాగాన్ని ఉత్తుత్తి ఫలితంగా పరిగణిస్తున్నారు. న్యూట్రాస్యూటికల్స్ ఉపయోగించే వినియోగదారులు తమ శరీరం అనారోగ్యం నుంచి దానంతటదే కోలుకునేందుకు ఆస్కారం ఉన్నప్పటికీ, ఆ ఘనతను వారి యొక్క న్యూట్రాస్యూటికల్స్ ఉపయోగానికి ఆపాదిస్తుంటారు.

ఇవి కూడా చూడండి[మార్చు]

సూచనలు[మార్చు]

 1. http://www.medscape.com/viewarticle/462074
 2. 2.0 2.1 http://www.fimdefelice.org/archives/arc.fueling.html
 3. 3.0 3.1 http://www.hc-sc.gc.ca/sr-sr/biotech/about-apropos/gloss-eng.php
 4. http://www.ana-jana.org/
 5. http://fda.gov/ICECI/EnforcementActions/Warningletters/default.htm
 6. 6.0 6.1 Kalra EK (2003). "Nutraceutical--definition and introduction". AAPS pharmSci. 5 (3): E25. doi:10.1208/ps050325. PMC 2750935. PMID 14621960.
 7. http://www.clemson.edu/NNC/what_are_nutra.html
 8. 8.0 8.1 Wildman, Robert E. C., సంపాదకుడు. (2001). Handbook of Nutraceuticals and Functional Foods (1st సంపాదకులు.). CRC Series in Modern Nutrition. ISBN 0-8493-8734-5.మూస:Pn
 9. 9.0 9.1 Shibamoto, Takayuki; Kanazawa, Kazuki; Shahidi, Fereidoon; Ho, Chi-Tang, సంపాదకులు. (2008). Functional Food and Health. ACS Symposium. p. 993. ISBN 978-0-8412-6982-8.
 10. http://www.hc-sc.gc.ca/fn-an/alt_formats/hpfb-dgpsa/pdf/label-etiquet/nutra-funct_foods-nutra-fonct_aliment-eng.pdf
 11. http://www.fda.gov/Food/DietarySupplements/ConsumerInformation/ucm110417.htm
 12. 12.0 12.1 Hardy, G (2000). "Nutraceuticals and functional foods: introduction and meaning". Nutrition. 16 (7–8): 688. doi:10.1016/S0899-9007(00)00332-4. PMID 10906598.
 13. Brower, V (1998). "Nutraceuticals: Poised for a healthy slice of the healthcare market?". Nature Biotechnology. 16 (8): 728. doi:10.1038/nbt0898-728. PMID 9702769.
 14. http://ncseonline.org/nle/crsreports/05jun/97-905.pdf
 15. Weingartner, O.; Bohm, M.; Laufs, U. (2008). "Controversial role of plant sterol esters in the management of hypercholesterolaemia". European Heart Journal. 30 (4): 404. doi:10.1093/eurheartj/ehn580. PMC 2642922. PMID 19158117.
 16. Committee on the Framework for Evaluating the Safety of the Dietary Supplements (2005). "Committee Change". Dietary Supplements: A Framework for Evaluating Safety. Institute of Medicine. p. 21. ISBN 978-0-309-09110-7.
 17. Hasler, Clare M. (2005). Regulation of Functional Foods and Nutraceuticals: A Global Perspective. IFT Press and Blackwell Publishing. ISBN 0-8138-1177-5.మూస:Pn

బాహ్య లింక్‌లు[మార్చు]