న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
This article is about the stock exchange. For its parent company, see NYSE Euronext.

మూస:Infobox Exchange

న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (New York Stock Exchange (NYSE) అనేది ఒక స్టాక్ ఎక్స్ఛేంజ్, ఇది 11 వాల్ స్ట్రీట్, దిగువ మాన్‌హట్టన్, న్యూయార్క్ నగరం, USA చిరునామాలో ఉంది. నమోదిత కంపెనీల విఫణి వ్యాపార విలువ (మార్కెట్ క్యాపిటలైజేషన్) పరంగా ఇది ప్రపంచంలో అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్‌గా గుర్తించబడుతుంది, ఇక్కడ నమోదైన కంపెనీ మొత్తం వ్యాపార విలువ డిసెంబరు 2010నాటికి US$13.39 ట్రిలియన్‌ల వద్ద ఉంది.[1] రోజువారీ వ్యాపార లావాదేవీల సగటు విలువ 2008లో సుమారుగా US$153 బిలియన్ల వద్ద ఉంది.

NYSEని NYSE యూరోనెక్స్ట్ నిర్వహిస్తుంది, పూర్తిస్థాయి ఎలక్ట్రానిక్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌గా గుర్తింపు పొందిన యూరోనెక్స్ట్‌తో 2007లో NYSE యొక్క విలీనం ద్వారా NYSE యూరోనెక్స్ట్ ఏర్పడింది. NYSE వ్యాపార లావాదేవీల (ట్రేడింగ్) అంతస్తు 11 వాల్ స్ట్రీట్ వద్ద ఉంది, ఈ అంతస్తులో వ్యాపార లావాదేవీల కోసం నాలుగు గదులు ఉన్నాయి. 30 బ్రాడ్ స్ట్రీట్‌లో ఉన్న ఐదో ట్రేడింగ్ గదిని ఫిబ్రవరి 2007లో మూసివేశారు. వాల్ స్ట్రీట్ మరియు ఎక్స్ఛేంజ్ ప్లేస్ మూలల మధ్య 18 బ్రాడ్ స్ట్రీట్ వద్ద ఉన్న ప్రధాన భవనాన్ని 1978లో జాతీయ చారిత్రక ప్రదేశంగా ప్రకటించారు, [2] దీనితోపాటు 11 వాల్ స్ట్రీట్ భవనాన్ని కూడా జాతీయ చారిత్రక ప్రదేశంగా గుర్తించడం జరిగింది.[3][4][5]

చరిత్ర[మార్చు]

ఇవి కూడా చూడండి: List of presidents of the New York Stock Exchange
1882లో 10-12 బ్రాడ్ స్ట్రీట్ వద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్

మే 17, 1792న NYSE ఏర్పాటుకు బీజాలు పడ్డాయి, ఈ రోజు బటన్‌వుడ్ ఒప్పందంపై 24 మంది స్టాక్ బ్రోకర్‌లు సంతకం చేశారు, న్యూయార్క్‌లోని 68 వాల్ స్ట్రీట్ వెలుపల ఒక బటన్‌వుడ్ చెట్టు కింద స్టాక్ వ్యాపారులు ఈ ఒప్పందంపై సంతకం చేయడం వలన దీనికి బటన్‌వుడ్ ఒప్పందం అనే పేరు వచ్చింది. మార్చి 8, 1817న ఒక రాజ్యాంగాన్ని రూపొందించడంతోపాటు, తమ సంస్థకు స్టాక్ బ్రోకర్‌లు న్యూయార్క్ స్టాక్ & ఎక్స్ఛేంజ్ బోర్డు అనే పేరు పెట్టుకున్నారు. ఆంథోనీ స్టాక్‌హోమ్ ఎక్స్ఛేంజ్ మొదటి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

ఎక్స్ఛేంజ్ యొక్క మొదటి కేంద్ర ప్రదేశం ఒక గదిలో ఏర్పాటయింది, ఈ గదిని 1792లో నెలకు $200లతో అద్దెకు తీసుకున్నారు, ఈ గది 40 వాల్ స్ట్రీట్‌లో ఉంది. 1835నాటి న్యూయార్క్ అగ్ని ప్రమాదంలో ఈ ప్రదేశం నాశనం కావడంతో, ఎక్స్ఛేంజ్‌ను తాత్కాలిక ప్రధాన కార్యాలయానికి తరలించారు. 1863లో న్యూయార్క్ స్టాక్ & ఎక్స్ఛేంజ్ బోర్డు తన పేరును న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌గా మార్చుకుంది. 1865లో ఎక్స్ఛేంజ్‌ను 10-12 బ్రాడ్ స్ట్రీట్‌కు తరలించారు.

1896 మరియు 1901 మధ్య సంవత్సరాల్లో వ్యాపార లావాదేవీల్లో పాలుపంచుకున్న వాటాల పరిమాణం ఆరు రెట్లు పెరిగింది, వ్యాపారం వృద్ధి చెందుతుండటంతో పెరుగుతున్న అవసరాలను తీర్చేందుకు మరింత పెద్ద ప్రదేశం అవసరమైంది.[6] ఒక కొత్త భవనం కోసం నమూనా తయారు చేసే పోటీ కోసం ఎనిమిది మంది న్యూయార్క్ నగర వాస్తుశిల్పులను ఆహ్వానించారు; చివరకు, వాస్తుశిల్పి జార్జి బి. పోస్ట్ సమర్పించిన నవీన సాంప్రదాయిక నమూనాను ఎంపిక చేశారు. 10 బ్రాడ్ స్ట్రీట్ వద్ద ఉన్న ఎక్స్ఛేంజ్ భవనం మరియు పొరుగునున్న భవనాల కూల్చివేత పనులు మే 10, 1901న ప్రారంభమయ్యాయి.

18 బ్రాడ్ స్ట్రీట్ వద్ద ఉన్న కొత్త భవనం నిర్మాణానికి $4 మిలియన్ల వ్యయమైంది, దీనిని ఏప్రిల్ 22, 1903న ప్రారంభించారు. వ్యాపార లావాదేవీలు జరిగే అంతస్తు 109 × 140 అడుగులు (33 × 42.5 మీ) విస్తీర్ణంలో ఉంటుంది, ఆ సమయంలో నగరంలో అతిపెద్ద ప్రదేశం ఉన్న భవనాల్లో ఇది కూడా ఒకటి, 72-foot (22 m)-ఎత్తులో ఉన్న పైకప్పుకు ఒక స్కైలైట్ లెట్ ఉంటుంది. భవనం యొక్క ప్రధాన ముఖద్వారం ఆరు ఎత్తైన కారిన్‌థియాన్ క్యాపిటల్‌లు (అలంకారిక బురుజులు) ఉంటాయి, వీటిపైన ఒక పాలరాతితో అందంగా కట్టిన గూడు వంటి భాగంలో జాన్ క్విన్సీ ఆడమ్స్ వార్డ్ చెక్కిన నాజూకైన శిల్పాలు ఉంటాయి, ఈ శిల్పాలు చెక్కడం కోసం పాల్ వేల్యాండ్ బార్టెలెట్ కూడా సాయం అందించారు, పిసిరిల్లీ సోదరులు పనితనాన్ని వీటిలో చూడవచ్చు, ఈ శిల్పాలు మనిషి యొక్క పనులను రక్షించే న్యాయవర్తనకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఈ భవనాన్ని ఒక జాతీయ చారిత్రక ప్రదేశంగా గుర్తించారు, జూన్ 2, 1978న నేషనల్ రిజిస్టర్ ఆఫ్ హిస్టారిక్ ప్లేసెస్‌లో దీనిని చేర్చారు.[7]

1922లో కార్యాలయాల కోసం ఒక భవనాన్ని ట్రౌబ్రిడ్జ్ & లివింగ్‌స్టన్ రూపొందించారు, దీనిని 11 బ్రాడ్ స్ట్రీట్ వద్ద జోడించారు, దీనిలోనే గారేజ్ అని పిలిచే ఒక కొత్త ట్రేడింగ్ అంతస్తు ఉంది. 1969లో అదనపు ట్రేడింగ్ అంతస్తును జోడించారు, దీని పేరు బ్లూ రూమ్ మరియు 1988లో EBR లేదా ఎక్స్‌టెండెడ్ బ్లూ రూమ్ లను సమాచార ప్రదర్శన మరియు సమాచార ప్రసారం కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వీటిని ఏర్పాటు చేశారు. 2000లో బాండ్ రూమ్ పేరుతో 30 బ్రాడ్ స్ట్రీట్ వద్ద మరో ట్రేడింగ్ ప్రదేశాన్ని ప్రారంభించారు. NYSE తన యొక్క హైబ్రిడ్ మార్కెట్‌కు పరిచయం కావడంతో ఎక్కువ భాగం వ్యాపార లావేదేవీలు ఎలక్ట్రానిక్ మార్గంలో జరగడం మొదలైంది, ట్రేడింగ్ ప్రదేశం యొక్క అవసరం దీని ద్వారా తగ్గిపోవడంతో NYSE 30 బ్రాడ్ స్ట్రీట్ ట్రేడింగ్ ప్రదేశాన్ని 2006 ప్రారంభంలో మూసివేయాలని నిర్ణయించింది. ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ స్వీకరణ కొనసాగే కొద్ది వ్యాపారులు మరియు ఉద్యోగుల సంఖ్య లావాదేవీలు జరిగే ప్రదేశంలో బాగా తగ్గిపోయింది, దీంతో 2007 చివరిలో NYSE 1969 మరియు 1988 విస్తరణల్లో ప్రారంభించిన గదులను కూడా మూసివేసింది.

స్టాక్ ఎక్స్ఛేంజ్ లంచెయాన్ క్లబ్ 1898 నుంచి 2006లో మూసివేసే వరకు ఏడో అంతస్తులో ఉంది.[8]

1908లో న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫ్లోర్

NYSE ఏప్రిల్ 21, 2005న ఆర్కిపెలాగోతో విలీనమయ్యే ప్రణాళికలను ప్రకటించింది, NYSE ఒక ప్రజా వ్యాపార లావాదేవీల సంస్థగా గుర్తింపు పొందే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. NYSE పాలనా బోర్డు డిసెంబరు 6, 2005న ప్రత్యర్థి ఆర్కిపెలాగోతో విలీనమయ్యే ప్రతిపాదనకు అనుకూలంగా ఓటు వేసింది, తద్వారా లాభాలకు ఉద్దేశించిన ప్రభుత్వ కంపెనీగా అవతరించింది. మార్చి 8, 2006న NYSE గ్రూపు పేరుతో వ్యాపార లావేదేవీలు ప్రారంభించింది. ఒక సంవత్సరం తరువాత ఏప్రిల్ 4, 2007న NYSE గ్రూపు ఐరోపా ఉమ్మడి స్టాక్ మార్కెట్‌గా గుర్తింపు పొందిన యూరోనెక్స్ట్‌తో తమ విలీనాన్ని పూర్తి చేసింది, తద్వారా NYSE యూరోనెక్స్ట్ అనే మొట్టమొదటి ట్రాన్స్‌అట్లాంటిక్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఏర్పడింది.

ప్రస్తుతం మార్ష్ కార్టర్ న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఛైర్మన్‌గా విధులు నిర్వహిస్తున్నారు, ఆయనకు ముందు జాన్ ఎస్. రీడ్ ఈ బాధ్యతలు నిర్వహించారు, ప్రస్తుత సిఈఓగా డుంకన్ నీడెరౌయెర్ పనిచేస్తున్నారు, నీడెరౌయెర్‌కు ముందు జాన్ థాయిన్ ఈ బాధ్యతల్లో పనిచేశారు.

గమనార్హమైన సంఘటనలు[మార్చు]

మొదటి ప్రపంచ యుద్ధం (జులై 31, 1914) ప్రారంభమైన తరువాత కొద్దికాలంపాటు ఎక్స్ఛేంజ్‌‍ను మూసివేశారు, అయితే నవంబరు 28న పాక్షికంగా కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి, బాండ్‌లతో వ్యాపార లావాదేవీలు సాగించడం ద్వారా యుద్ధ సన్నాహాలకు సాయం చేసేందుకు దీనిని తిరిగి ప్రారంభించారు, డిసెంబరు మధ్యకాలంలో పూర్తిగా కార్యకలాపాలు ప్రారంభించారు.

సెప్టెంబరు 16, 1920న NYSE భవనం వెలుపల వాల్ స్ట్రీట్‌లో బాంబు పేలుడు సంభవించింది, ఈ బాంబు పేలుడులో 33 మంది మరణించగా, 400 మందికిపైగా గాయపడ్డారు. ఈ బాంబు దాడి కుట్రదారులను గుర్తించలేకపోయారు. NYSE భవనం మరియు జేపీ మోర్గాన్ భవనం వంటి సమీపంలో మరికొన్ని భవనాల ముఖద్వారాలపై ఈ బాంబు దాడి వలన జరిగిన నష్టం యొక్క ఆనవాళ్లు ఇప్పటికీ కనిపిస్తున్నాయి.

అక్టోబరు 24, 1929న బ్లాక్ థర్స్‌డే రోజు ఎక్స్ఛేంజ్‌లో వాటాల విలువ ఒక్కసారిగా కుప్పకూలింది, బ్లాక్ ట్యూస్‌డే, అక్టోబరు 29న భయంతో తీవ్రస్థాయిలో అమ్మకాలు జరిగాయి, 1929నాటి మహా మాంద్యం స్టాక్ మార్కెట్ కుప్పకూలడానికి ప్రధాన కారణంగా పరిగణిస్తున్నారు. పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని తిరిగి నింపే చర్యల్లో భాగంగా ఎక్స్ఛేంజ్ ఒక పదిహేను-పాయింట్ల కార్యక్రమాన్ని ప్రారంభించింది, అక్టోబరు 31, 1938న పెట్టుబడిదారులకు భద్రతను పెంచేందుకు ఈ చర్యను చేపట్టారు.

అక్టోబరు 1, 1934న ఈ ఎక్స్ఛేంజ్ US సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్‌లో ఒక జాతీయ సెక్యూరిటీల ఎక్స్ఛేంజ్‌గా నమోదయింది, దీనికి ఒక అధ్యక్షుడు మరియు 33 మంది సభ్యుల బోర్డు ఏర్పాటయింది. ఫిబ్రవరి 18, 1971న లాభాపేక్ష రహిత సంస్థ ఏర్పడింది, బోర్డు సభ్యుల సంఖ్యను 25కు తగ్గించారు.

అబ్బీ హాఫ్‌మ్యాన్ యొక్క ప్రసిద్ధ ప్రచార కార్యక్రమాలు 1967లో ప్రారంభమయ్యాయి, ఎక్స్ఛేంజ్ గ్యాలరీకి యిప్పీ ఉద్యమం యొక్క సభ్యులకు ఆయన ఈ కార్యక్రమాల్లో నేతృత్వం వహించారు. కొద్దిమొత్తంలో US నగదును మరియు నకిలీ నగదు కాగితాలను చుట్టి నిరసనకారులు వ్యాపార కార్యకలాపాలు జరిగే ప్రదేశంలోకి విసిరేశారు. కొందరు వ్యాపారులు అసంతృప్తి వ్యక్తపరిచారు, కొందరు అసలు నగదు నోట్లను సేకరించారు.[ఆధారం కోరబడింది] ప్రసార మాధ్యమాలు కూడా వేగంగా స్పందించాయి, ఈ సంఘటన జరిగిన తరువాత సాయంత్రానికి ప్రపంచవ్యాప్తంగా వార్తలు వ్యాపించాయి.[ఆధారం కోరబడింది] (స్టాక్ ఎక్స్ఛేంజ్ తరువాత $20,000 వెచ్చించి బుల్లెట్‌ఫ్రూఫ్ అద్దాలను గ్యాలరీ చుట్టూ ఏర్పాటు చేసింది.)[ఆధారం కోరబడింది] హాఫ్‌మ్యాన్ ఒక దశాబ్దం తరువాత దీనిపై స్పందిస్తూ, మేము ప్రసార సాధనాలను పిలవలేదని రాశారు; తాము ప్రసార సాధనాల దృష్టిని ఆకర్షించేందుకు తాము ఆ పని చేయలేదని పేర్కొన్నారు.[9]

ఎలక్ట్రానిక్ ప్రదర్శన తెరలు మరియు కంప్యూటర్ తెరలు ప్రవేశపెట్టడానికి ముందు NYSE యొక్క స్టాక్ ఎక్స్ఛేంజ్ వ్యాపారులు లావాదేవీలు నిర్వహించే ప్రదేశం.

అక్టోబరు 19, 1987న, డౌ జోన్స్ ఇండస్ట్రియల్ ఏవరేజ్ (DJIA) 508 పాయింట్లు క్షీణించింది, ఒక్క రోజులోనే 22.6% నష్టపోయింది, ఎక్స్ఛేంజ్‌లో చోటుచేసుకున్న రెండో అతిపెద్ద పతనంగా ఇది గుర్తింపు పొందింది, దీని ఫలితంగా ఎక్స్ఛేంజ్‌లో అధికారులు అన్ని వ్యాపార లావాదేవీలను నిలిపివేసేందుకు సర్క్యూట్ బ్రేకర్ నిబంధనను మొట్టమొదటిసారి ఉపయోగించారు. ఇది బాగా వివాదాస్పద నిర్ణయంగా మారింది, దీని ఫలితంగా నిబంధనలో త్వరిత మార్పులు చోటుచేసుకున్నాయి; ప్రస్తుతం DJIA 10, 20 లేదా 30 శాతం పతనమైనప్పుడు వరుసగా గంట, రెండు గంటలు లేదా మిగిలిన రోజు మొత్తం వ్యాపార లావేదేవీలు నిలిపివేస్తారు. మధ్యాహ్నం సమయంలో 10% మరియు 20% క్షీణతలు సంభవించినట్లయితే కొద్ది సమయంపాటు ట్రేడింగ్‌ను నిలిపివేస్తారు, అయితే 30% పతనమైనప్పుడు మాత్రం మిగిలిన రోజు మొత్తం వ్యాపార కార్యకలాపాలు నిలిపివేయడం జరుగుతుంది. పెట్టుబడిదారుల స్థిమితంగా ఆలోచించేందుకు మరియు వారి వైఖరులను తిరిగి పరిశీలించుకునేందుకు అవకాశం ఇవ్వడం వ్యాపార లావేదేవీలు నిలిపివేయడం వెనుక ప్రధాన కారణాలుగా ఉన్నాయి. బ్లాక్ మండే తరువాత టెరిబుల్ ట్యూస్‌డే ఏర్పడింది, ఈ రోజు ఎక్స్ఛేంజ్ వ్యవస్థలు సరిగా పని చేయలేదు, కొందరు వ్యక్తులు తమ వ్యాపార లావాదేవీలు పూర్తి చేసేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

పర్యవసానంగా,[vague] డౌ జోన్స్ సూచీలో అక్టోబరు 13, 1989న మరో ప్రధాన పతనం సంభవించింది; దీనిని మినీ-క్రాష్ ఆఫ్ 1989గా గుర్తిస్తున్నారు. విఫలమైన యునైటెడ్ ఎయిర్‌లైన్స్ మాతృ సంస్థ UAL కార్పొరేషన్‌కు సంబంధించి $6.75 బిలియన్ల పరపతి నియంత్రణ ఒప్పందంపై వెలువడిన ఒక వార్తా కథనం కారణంగా ఈ క్షీణత సంభవించింది. UAL ఒప్పందం విఫలమైన వార్త ఇది జంక్ బాండ్ మార్కెట్ పడిపోవడాన్ని ప్రేరేపించింది, తద్వారా డౌ జోన్స్ 190.58 పాయింట్లు లేదా 6.91 శాతం మేర పతనమైంది.

అదే విధంగా, ఆసియా ఆర్థిక సంక్షోభం కారణంగా 1997లో కూడా ఆర్థిక ప్రపంచంలో ఒక భయం ఏర్పడింది. అనేక విదేశీ మార్కెట్‌లు పతనమైన విధంగానే, డౌ జోన్స్ విలువ కూడా అక్టోబరు 27, 1997న 7.18% క్షీణించింది (554.26 పాయింట్లు), దీనిని తరువాత 1997 మినీ-క్రాష్‌గా గుర్తించారు, అయితే దీని నుంచి DJIA త్వరగా కోలుకుంది.

జనవరి 26, 2000న స్లీప్ నౌ ఇన్ ది ఫైర్ కోసం మ్యూజిక్ వీడియో యొక్క చిత్రీకరణ సందర్భంగా ఒక ఘర్షణ జరిగింది, ఈ మ్యూజిక్ వీడియోకు మైకెల్ మూర్ దర్శకత్వం వహించారు. దీని ఫలితంగా కూడా ఎక్స్ఛేంజ్ యొక్క తలుపులు మూసివేశారు, రేజ్ ఎగైనెస్ట్ ది మెషిన్ బృందాన్ని సంఘటనా స్థలం నుంచి భద్రతా సిబ్బంది ఖాళీ చేయించారు, [10] బృంద సభ్యులు ఎక్స్ఛేంజ్‌‍లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు.[11] అయితే ఈ సంఘటన జరిగినప్పుడు లావాదేవీలు మాత్రమే నిరంతరాయంగా కొనసాగాయి.[12]

అక్టోబరు 19, 1987 తరువాత మే 6, 2010న డౌ జోన్స్ ఇండస్ట్రియల్ ఏవరేజ్ అతిపెద్ద ఇంట్రాడే పతనాన్ని చవిచూసింది, ఈ రోజు సూచీ 998 పాయింట్లు నష్టపోయింది, దీనిని తరువాత ఫ్లాష్ క్రాష్‌గా పిలుస్తున్నారు (తిరిగి పుంజుకోవడానికి కొన్ని నిమిషాల ముందు ఈ పతనం సంభవించింది). SEC మరియు CFTC ఈ సంఘటనపై ఒక నివేదికను ప్రచురించాయి, అయితే ఇది పతనానికి కారణంపై ఒక నిర్ధారణను సూచించలేకపోయింది. తప్పుడు ఆదేశాలు కారణంగా ఈ పతనం సంభవించిందనేందుకు నియంత్రణాధికారులు కూడా ఎటువంటి ఆధారాన్ని గుర్తించలేదు.[13]

ట్రేడింగ్[మార్చు]

ఏప్రిల్ 23, 2003న NYSE వద్ద ప్రారంభ గంటను మోగిస్తున్న U.S. వాణిజ్య శాఖ కార్యదర్శి డొనాల్డ్ ఎల్. ఎవాన్స్. మాజీ ఛైర్మన్ జాక్ వోమాక్ కూడా ఈ చిత్రంలో ఉన్నారు.
NASA వ్యోమగాములు స్కాట్ అల్ట్‌మ్యాన్ మరియు మైక్ మాసిమినో ముగింపు గంటను మోగిస్తున్న దృశ్యం.
ఆగస్టు 2008లో NYSE ట్రేడింగ్ ఫ్లోర్.

న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (కొన్నిసార్లు బిగ్ బోర్డ్‌గా కూడా దీనిని సూచిస్తారు) ప్రజలను వ్యాపార భాగస్వాములను చేయడం కోసం నమోదు చేసుకున్న కంపెనీల్లోని వాటా యొక్క షేర్‌లను ట్రేడ్ చేసేందుకు కొనుగోలుదారులకు మరియు విక్రేతలకు వీలు కల్పిస్తుంది. NYSE సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 4:00 ET గంటల వరకు వ్యాపార లావాదేవీలు సాగిస్తుంది, ఎక్స్ఛేంజ్ ముందుగా ప్రకటించిన సెలవుదినాల్లో మాత్రం వ్యాపార కార్యకలాపాలు జరగవు.

ట్రేడింగ్ జరిగే అంతస్తులో NYSE నిరంతర వేలం పద్ధతిలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తుంది, దీనిలో వ్యాపారులు పెట్టుబడిదారుల తరపున వాటా లావాదేవీలు నిర్వహిస్తారు. ఒక NYSE సభ్య సంస్థ ద్వారా నియమించబడే ఒక ప్రత్యేక బ్రోకర్ (అంటే అతను లేదా ఆమె న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్ యొక్క ఉద్యోగి కాదు) ఉండే తగిన పోస్ట్ చుట్టూ వ్యాపారులు గుంపుగా చేరతారు, ప్రత్యేక బ్రోకర్ బహిరంగ అరుపుతో నిర్వహించే వేలం మార్కెట్ వాతావరణంలో వేలం నిర్వహించే వ్యక్తిగా వ్యవహరిస్తాడు, అతను పెద్దగా అరిచి కొనుగోలుదారులు మరియు విక్రేతలులను ఒక చోట ఉంచి, వాస్తవ వేలాన్ని నిర్వహిస్తాడు. వారు కొంత సమయం (సుమారుగా 10% సమయం) లో తమ సొంత మూలధనాన్ని హామీగా పెట్టడం ద్వారా వ్యాపార లావాదేవీలను నిర్వహిస్తారు, తద్వారా సమాచారాన్ని గుంపులోకి తీసుకెళతారు, ఇది కొనుగోలుదారులు మరియు విక్రేతలను ఒకచోటకు తీసుకొచ్చేందుకు సాయపడుతుంది. 1995లో వేలం ప్రక్రియ స్వయంచాలకంగా మారింది, దీనికి చేతిలో తీసుకెళ్లగల కంప్యూటర్‌లు (HHC) ఉపయోగిస్తున్నారు. ఈ వ్యవస్థలో వ్యాపారులు ఆదేశాలను వైర్‌లెస్ బదిలీ ద్వారా ఎలక్ట్రానిక్ మార్గంలో ఆదేశాలను పొందడం మరియు నిర్వహించడం చేస్తారు. ఈ వ్యవస్థను రూపొందించిన మరియు అభివృద్ధి చేసిన NYSE సభ్యుడు మైకెల్ ఈనెర్సెన్ సెప్టెంబరు 25, 1995న ఈ HHC ద్వారా IBM యొక్క 1000 షేర్‌లను నిర్వహించారు, దీంతో 203 ఏళ్లపాటు కాగితపు లావాదేవీలకు తెరపడింది. స్వయంచాలక ట్రేడింగ్ పద్ధతి ఇక్కడి నుంచి మొదలైంది.

జనవరి 24, 2007నాటికి అన్ని NYSE వాటాల లావాదేవీలను ఎలక్ట్రానిక్ హైబ్రిడ్ మార్కెట్ ద్వారా నిర్వహించే వీలు ఏర్పడింది (బాగా అధిక-ధర ఉన్న అతికొద్ది వాటాలు మినహా). తక్షణ ఎలక్ట్రానిక్ నిర్వహణ కోసం వినియోగదారులు తమ ఆదేశాలను ఇప్పుడు పంపవచ్చు లేదా వేలం మార్కెట్‌లో వ్యాపారం కోసం ఆధేశాలను ఒక మార్గంలో పెట్టవచ్చు. 2007లో మొదటి మూడు నెలలపాటు, మొత్తం ఆదేశాల్లో 82% ఎలక్ట్రానిక్ మార్గంలో అందాయి.[14]

ఎక్స్ఛేంజ్‌లో ప్రత్యక్షంగా వాటాల లావాదేవీలు నిర్వహించే హక్కును 1366 "సీట్‌"ల యజమానులకు కల్పిస్తారు. 1870వ దశకం వరకు NYSE సభ్యులు కుర్చీల్లో కూర్చొని తమ వ్యాపార లావాదేవీలు నిర్వహించడం నుంచి ఈ పదం వచ్చింది. 1868లో స్థిరంగా అమర్చబడిన సీట్ల సంఖ్య 533 వద్ద ఉంది, తరువాతి సంవత్సరాల్లో ఈ సంఖ్య అనేక రెట్లు పెరుగుతూ వచ్చింది. 1953లో ఎక్స్ఛేంజ్‌లో సీట్ల సంఖ్య 1366కు పెరిగింది. NYSEలో నేరుగా వాటాల వ్యాపార లావాదేవీలు నిర్వహించే వారి కోసం ఈ సీట్లను కేటాయించడం జరిగింది. సీట్ల ధరలు కాలక్రమంలో విస్తృతంగా మార్పు చెందుతూ వచ్చాయి, సాధారణంగా మాంద్యం సమయాల్లో సీట్ల ధరలు తగ్గుముఖం పట్టడం మరియు ఆర్థిక విస్తరణ సమయాల్లో పెరగడం జరుగుతుంది. అత్యధిక ధర $625,000, 1929లో ఒక సీటను ఈ ధరకు విక్రయించడం జరిగింది, ప్రస్తుత నగదు విలువలో దీని విలువ ఆరు మిలియన్ డాలర్లు కావడం గమనార్హం. ఇటీవలి సంవత్సరాల్లో కూడా సీట్లు ఎక్కువ ధరకు విక్రయించబడ్డాయి, 1990వ దశకం చివరి కాలంలో సీటు $4 మిలియన్‌లకు, 2001లో $1కు విక్రయించబడింది. 2005లో సీటు ధరలు తిరిగి పెరిగాయి, ఈసారి ధర $3.25 మిలియన్‌లకు చేరుకుంది, ఆర్కిపెలాగోతో విలీనం సందర్భంగా మరియు లాభాపేక్ష ఉద్దేశం గల బహిరంగ వ్యాపార లావాదేవీల కంపెనీగా మారిన తరువాత ఈ పెరుగుదల కనిపించింది. సీటు యజమానులు ప్రతి సీటుకు $500,000 నగదు మరియు కొత్తగా ఏర్పడిన సంస్థలో 77,000 వాటాలు పొందారు. NYSE ఇప్పుడు ఎక్స్ఛేంజ్‌లో నేరుగా వ్యాపార కార్యకలాపాలు సాగించేందుకు ఒక ఏడాది లైసెన్స్‌లు విక్రయిస్తుంది.

NYSE మిశ్రమ సూచీ[మార్చు]

1960వ దశకం మధ్యకాలంలో, NYSE మిశ్రమ సూచీ (మూస:Nyse2) సృష్టించబడింది, 1965 సంవత్సర ముగింపుకు సమానమైన 50 పాయింట్ల ప్రాథమిక విలువతో దీనిని స్థాపించారు. ఎక్స్ఛేంజ్‌లో ట్రేడ్‌లో ఉన్న అన్ని వాటాల విలువను ప్రతిబింబించేందుకు దీనిని సృష్టించడం జరిగింది, డౌ జోన్స్ ఇండస్ట్రియల్ ఏవరేజ్‌లో కేవలం 30 వాటాలకు బదులుగా దీనిని ఏర్పాటు చేశారు. మిశ్రమ సూచీకి ప్రాచుర్యం కల్పించేందుకు 2003లో NYSE 20002 సంవత్సరాంతపు ముగింపుకు సమానంగా 5,000 పాయింట్ల కొత్త ప్రాథమిక విలువను నిర్ణయించింది.

కాలక్రమం[మార్చు]

క్రిస్మస్ సమయంలో NYSE (డిసెంబరు 2008)

1792లో NYSE ట్రేడ్ అయిన మొదటి సెక్యూరిటీలను పొందింది.[15][16] 1817లో న్యూయార్క్ స్టాక్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డు యొక్క రాజ్యాంగాన్ని స్వీకరించడం జరిగింది.[17] 1867లో, మొట్టమొదటి స్టాక్ టికెర్.[18] 1896లో, డౌ జోన్స్ ఇండస్ట్రియల్ ఏవరేజ్ మొట్టమొదటిసారి ది వాల్ స్ట్రీట్ జర్నల్‌లో ప్రచురించబడింది.[18] 1903లో NYSE 18 బ్రాడ్ స్ట్రీట్ వద్ద కొత్త భవనంలోకి మారింది. 1906లో జనవరి 12న డౌ జోన్స్ సూచీ 100 పాయింట్లను అధిగమించింది. 1907లో, ప్యానిక్ ఆఫ్ 1907. 1914లో, మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా ఎక్స్ఛేంజ్ అత్యధిక కాలం మూతబడింది: నాలుగు నెలలు, రెండు వారాలు; డిసెంబరు 12న తిరిగి ప్రారంభమైంది, అయితే అదే రోజు ఒక్క రోజులోనే DJIA (24.4%) అతిపెద్ద పతనాన్ని చవిచూసింది. 1915లో మార్కెట్ ధరను డాలర్లలో ఇచ్చారు. 1929లో సెంట్రల్ కోట్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు; బ్లాక్ థర్స్‌డే, అక్టోబరు 24 మరియు బ్లాక్ ట్యూస్‌డే, అక్టోబరు 29 రోజులు రోరింగ్ ట్వంటీస్ బుల్ మార్కెట్‌కు సంకేతాన్ని ఇచ్చాయి. 1943లో ట్రేడింగ్ ప్రదేశంలోకి మహిళలను అనుమతించారు.[19] 1949లో అతిపెద్ద (ఎనిమిదేళ్లు) బుల్ మార్కెట్ ప్రారంభమైంది.[20]

1954లో డౌ తన యొక్క 1929నాటి గరిష్ఠ స్థాయిని ఇన్‌ఫ్లేషన్-అడ్జెస్టెడ్ డాలర్లలో అధిగమించింది. 1956లో మార్చి 12న డౌ జోన్స్ సూచీ మొట్టమొదటిసారి 500 పాయింట్ల పైస్థాయిలో ముగిసింది. 1966లో NYSE అన్ని నమోదిత ఉమ్మడి వాటాలతో ఒక మిశ్రమ సూచీని ప్రారంభించింది. ఇది ఉమ్మడి వాటా సూచీగా సూచించబడింది, ఇది రోజూ ప్రసారమైంది. సూచీ యొక్క ప్రారంభ స్థాయిని 50గా నిర్ణయించారు. తరువాత దీనికి NYSE మిశ్రమ సూచీగా పేరు మార్చారు.[21] 1967లో అబ్బీ హాఫ్‌మ్యాన్ నేతృత్వంలో నిరసనకారులు ఎక్కువగా నకిలీ డాలర్ బిల్లులను గ్యాలరీలోని వ్యాపారులపై విసిరారు, ఈ సంఘటన తరువాత బుల్లెట్-ఫ్రూఫ్ అద్దాలను గ్యాలరీకి ఏర్పాటు చేశారు. 1970లో సెక్యూరిటీస్ ఇన్వెస్టర్ ప్రొటక్షన్ కార్పొరేషన్ స్థాపించబడింది. 1971లో NYSE లాభాపేక్ష లేని సంస్థగా గుర్తింపు పొందింది.[21] 1972లో నవంబరు 14న డౌ జోన్స్ సూచీ మొట్టమొదటిసారి 1000 పాయింట్లకు ఎగువన ముగిసింది. 1977లో విదేశీ బ్రోకర్‍లు NYSEలో అడుగుపెట్టారు. 1980లో న్యూయార్క్ ఫ్యూచర్స్ ఎక్స్ఛేంజ్ స్థాపించబడింది. 1982లో DJIA చరిత్రలో అతిపెద్ద బుల్ మార్కెట్ ప్రారంభమైంది. 1987లో బ్లాక్ మండే అక్టోబరు 19న, చరిత్రలో రెండో అతిపెద్ద ఒకరోజు పతనాన్ని DJIA చవిచూసింది (22.6%). 1991లో డౌ జోన్స్ 3,000 పాయింట్లను అధిగమించింది. 1995లో డౌ జోన్స్ సూచీ 5000 పాయింట్లను అధిగమించింది. 1996లో నిజ-సమయ టికెర్‌ను పరిచయం చేశారు.[22] 1999లో మార్చి 29న డౌ జోన్స్ సూచీ 10,000 పాయింట్లను అధిగమించింది. 2000లో జనవరి 14న డౌ జోన్స్ సూచీ గరిష్ఠంగా 11,722.98 పాయింట్లకు చేరుకుంది; టికెర్ NYIID పరిధిలో మొట్టమొదటి NYSE గ్లోబల్ ఇండెక్స్‌ను ప్రారంభించారు.

సెప్టెంబరు 11 దాడుల తరువాత భద్రత

2001లో భిన్నాల్లో వ్యాపార లావాదేవీలకు (n/16) ముగింపు పలికారు, దీని స్థానంలో దశాంశాల్లో ($.01 క్రమాలు, డెసిమలైజేషన్‌ను చూడండి) లావాదేవీలు ప్రారంభించారు; సెప్టెంబరు 11, 2001 దాడులు జరిగాయి, నాలుగు సెషన్‌లపాటు NYSEని మూసివేశారు. 2003లో NYSE కాంపోజిట్ ఇండెక్స్ తిరిగి ప్రారంభమైంది, దీని విలువను 5,000 పాయింట్లుగా నిర్ణయించారు. 2006లో NYSE మరియు ఆర్కాఈఎక్స్ విలీనంతో, NYSE ఆర్కా ఏర్పడింది, ప్రభుత్వ యాజమాన్యంలోని లాభాలకు ఉద్దేశించిన NYSE గ్రూప్, ఇంక్ స్థాపించబడింది; ఆపై NYSE గ్రూపు యూరోనెక్స్ట్‌తో విలీనమైంది, తద్వారా మొదటి ట్రాన్స్-అట్లాంటిక్ స్టాక్ ఎక్స్ఛేంజ్ గ్రూపు ఏర్పడింది; అక్టోబరు 19న DJIA 12,000 పాయింట్లను అధిగమించింది. 2007లో US అధ్యక్షుడు జార్జి డబ్ల్యూ. బుష్ జనవరి 31న ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ వడ్డీ-రేటు నిర్ణయం వెలువడటానికి గంటన్నర ముందు ఎక్స్ఛేంజ్‌లో అప్రకటిత సందర్శన జరిపారు.[23] NYSE అమెరికన్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌తో విలీనాన్ని ప్రకటించింది; NYSE మిశ్రమ సూచీ జూన్ 1న 10,000 పాయింట్ల ఎగువన నిలిచింది; DJIA జూలై 19న 14,000 పాయింట్లను అధిగమించింది, అక్టోబరు 9న 14,164.53 పాయింట్ల గరిష్ఠ స్థాయికి చేరుకొని రికార్డు సృష్టించింది. 2008-2009లో పతనానికి ముందు ఈ గరిష్ఠ స్థాయిని తాకింది.

2008లో సెప్టెంబరు 15న DJIA బ్యాంకుల వైఫల్యాల భయంతో 500 పాయింట్లకుపైగా కోల్పోయింది, దీంతో శాశ్వితంగా నేక్డ్ షార్ట్ సెల్లింగ్‌ను నిషేధించారు, ఆర్థిక సంస్థల వాటాల షార్ట్ సెల్లింగ్ (విక్రేత తనవికాని వాటాలను విక్రయించడం) పై మూడు-వారాల తాత్కాలిక నిషేధం; ఈ చర్యలు చేపట్టినప్పటికీ రికార్డు స్థాయిలో పతనం తరువాతి రెండు నెలలపాటు కొనసాగింది, తత్ఫలితంగా స్టాక్ మార్కెట్ 5½-ఏళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. 2009లో డౌ జోన్స్ సూచీ మార్చి 9న 6547.05 పాయింట్లకు పడిపోయి, పన్నెండేళ్ల కనిష్ఠ స్థాయిని తాకింది. అక్టోబరు 14న తిరిగి 10,015.86 పాయింట్లకు చేరుకుంది.

వీటిని కూడా చూడండి[మార్చు]

Lua error in package.lua at line 80: module 'Module:Portal/images/n' not found. మూస:NYSE listed stocks

 • న్యూయార్క్ నగర ఆర్థిక వ్యవస్థ
 • అమెరికా స్టాక్ ఎక్స్ఛేంజ్‌ల జాబితా
 • న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అధ్యక్షుల జాబితా
 • U.S. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్

గమనికలు[మార్చు]

 1. World-exchanges.org
 2. నేషనల్ పార్క్ సర్వీస్, నేషనల్ హిస్టారిక్ ల్యాండ్‌మార్క్స్ సర్వే, న్యూయార్క్, సేకరణ తేదీ మే 31, 2007.
 3. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; nhlsum అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
 4. George R. Adams (March 1977). "New York Stock Exchange National Register of Historic Places Inventory-Nomination (1MB PDF)" (PDF). National Park Service. Retrieved 2008-01-30. 
 5. "National Register of Historic Places Inventory-Nomination (1MB PDF)" (PDF). National Park Service. 1983. 
 6. ది బిల్డింగ్ NYSE గ్రూపు చరిత్ర
 7. నేషనల్ రిజిస్టర్ నెంబర్: 78001877 నేషనల్ హిస్టారిక్ ల్యాండ్‌మార్క్
 8. Edmonston, Peter (2006-04-28). "Where Wall Street Meets to Eat, the Last Lunch". New York Times. Retrieved 2009-01-29. 
 9. అబ్బీ హాఫ్‌మ్యాన్, సూన్ టు బి ఎ మేజర్ మోషన్ పిక్చర్ , పేజి. 100, పుట్‌నామ్, 1980.
 10. "Rage against Wall Street". Green Left Weekly #397. March 15, 2000. Archived from the original on 2012-08-02. Retrieved 2007-10-11. 
 11. Basham, David (January 28, 2000). "Rage Against the Machine Shoots New Video With Michael Moore". MTV News. Retrieved 2007-02-17. 
 12. "New York Stock Exchange Special Closings, 1885-date" (PDF). NYSE Group. Retrieved 2007-04-07. 
 13. SEC.gov
 14. Shell, Adam (2007-07-12). "Technology squeezes out real, live traders". USA Today. 
 15. "NYSE, New York Stock Exchange > About Us > History > Firsts & Records". Nyse.com. Retrieved 2010-06-10. 
 16. "NYSE, New York Stock Exchange - About Us - History - Timeline - Timeline 2008 Specialists are Transformed into Designated Market Makers (DMMs)". Nyse.com. 1991-01-01. Retrieved 2010-06-10. 
 17. "NYSE, New York Stock Exchange - About Us - History - Timeline - Timeline". Nyse.com. Retrieved 2010-06-10. 
 18. 18.0 18.1 "NYSE, New York Stock Exchange - About Us - History - Timeline - Timeline". Nyse.com. Retrieved 2010-06-10. 
 19. NYSE: టైమ్‌లైన్"
 20. "NYSE, New York Stock Exchange - About Us - History - Timeline - Timeline". Nyse.com. Retrieved 2010-06-10. 
 21. 21.0 21.1 "NYSE, New York Stock Exchange - About Us - History - Timeline - Timeline". Nyse.com. 1967-12-20. Retrieved 2010-06-10. 
 22. "NYSE, New York Stock Exchange - About Us - History - Timeline 1995 Video: Trading Posts Upgrade". Nyse.com. 1991-01-01. Retrieved 2010-06-10. 
 23. Katy Byron (2007-01-31). "President Bush makes surprise visit to NYSE". CNN Money. Cable News Network. Retrieved 2007-02-20. 

సూచికలు[మార్చు]

 • Buck, James E. (1992). The New York Stock Exchange: The First 200 Years. Greenwich Pub. Group. ISBN 0944641024. 
 • Geisst, Charles R. (2004). Wall Street: A History - From its Beginnings to the Fall of Enron. Oxford University Press. ISBN 0195170601. 
 • Kent, Zachary (1990). The Story of the New York Stock Exchange. Scholastic Library Pub. ISBN 0516047485. 
 • Sloane, Leonard (1980). The Anatomy of the Floor. Doubleday. ISBN 0385122497. 
 • Sobel, Robert (1975). N.Y.S.E.: A History of the New York Stock Exchange, 1935–1975. Weybright and Talley. ISBN 0679401245. 

బాహ్య లింకులు[మార్చు]

మూస:Stock market మూస:National Register of Historic Places in New York