Coordinates: 17°31′29″N 82°54′38″E / 17.524710°N 82.910654°E / 17.524710; 82.910654

పంచదార్ల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంచదార్ల
—  రెవిన్యూ గ్రామం  —
పంచదార్ల ధారలింగేశ్వరస్వామి ఆలయం వద్ద రాతిలో చెక్కిన గణపతి విగ్రహం
పంచదార్ల ధారలింగేశ్వరస్వామి ఆలయం వద్ద రాతిలో చెక్కిన గణపతి విగ్రహం
పంచదార్ల ధారలింగేశ్వరస్వామి ఆలయం వద్ద రాతిలో చెక్కిన గణపతి విగ్రహం
పంచదార్ల is located in Andhra Pradesh
పంచదార్ల
పంచదార్ల
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 17°31′29″N 82°54′38″E / 17.524710°N 82.910654°E / 17.524710; 82.910654
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా అనకాపల్లి
మండలం రాంబిల్లి
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 3,213
 - పురుషులు 1,580
 - స్త్రీలు 1,633
 - గృహాల సంఖ్య 795
పిన్ కోడ్ 531061
ఎస్.టి.డి కోడ్

పంచదార్ల, అనకాపల్లి జిల్లా, రాంబిల్లి మండలానికి చెందిన గ్రామం. పంచదార్ల చారిత్రిక విశిష్టత కల గ్రామం. ఇది మండల కేంద్రమైన రాంబిల్లి నుండి 15 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన అనకాపల్లి నుండి 25 కి. మీ. దూరంలోనూ, ఎలమంచిలికి 10 కి.మీ. దూరంలో ఎలమంచిలి - విశాఖపట్నం (స్టీల్ ప్లాంట్, గాజువాక మీదుగా) రహదారి పై ఉంది. ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 795 ఇళ్లతో, 3213 జనాభాతో 783 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1580, ఆడవారి సంఖ్య 1633. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 201 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 3. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 586502.[1]

2022 లో చేసిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం విశాఖపట్నం జిల్లాలో, ఇదే మండలంలో ఉండేది. [2]

గ్రామ చరిత్ర[మార్చు]

పంచదార్ల గ్రామంలో చారిత్రిక విశిష్టత కల అతి ప్రాచీన శైవక్షేత్రం ఉమా ధర్మలింగేశ్వరాలయం ఉంది. ఇక్కడ ఎల్లవేళలా భూగర్భం నుంచి పైకి వచ్చే ఐదు నీటి ధారలు (పంచ ధారలు) భక్తులకు కనువిందు కలిగిస్తాయి. ఇక్కడ స్వయం భూయుక్తమైన లింగం ఉండేదని కాల గతిలో అది మరుగున పడగా నారదుని సూచన మేరకు యమధర్మరాజు తన కుష్టువ్యాధి నివారణ నిమిత్తం మరొక వర్ధమాన లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించేడని యమధర్మరాజు చేపునఃప్రతిస్టించ బడిన లింగం కనుక ధర్మలింగేశ్వర ఆలయంఅని పేరు వచ్చినట్టు స్థల పురాణం. ఇక్కడ పురాతన శివలింగాన్ని సముద్రగుప్తుని కాలంలో దేవరాష్ట్రాన్ని పాలించే కుబేరుడు ప్రతిష్ఠించాడని చరిత్రకారుల భావన. ఈ క్షేత్రంలో ముందుగా బయట మనకు కనిపించేది ’రాధామాధవ స్వామి’ నిలయం, ఒక మండపం. ఈ మండపాన్ని హరినరేంద్రుడు సా.శ.1538 లో నిర్మించాడు. ఆలయానికి దక్షిణ దిశలో తటాకం ఉంది. నీటి ధారలన్నీ దీనిలో కలుస్తాయి. ఈ తటాకాన్ని, తూర్పుదిశలో నున్న ఆస్థాన మండపాన్ని చాళుక్య నృసింహదేవుని భార్య వీరాంబికచే నిర్మితమయ్యాయి. ఇక్కడ ఆలయ సమూహంలో విశ్వేశ్వరస్వామి ఆలయం, అనేక లింగాకృతులు, దేవతామూర్తుల విగ్రహాలు, నందీశ్వర విగ్రహాలు, శిథిల శిల్పాలు కనిపిస్తాయి. ఇక్కడ ప్రధానమైన ధర్మలింగేశ్వరాలయం, అన్ని ఆలయాల కన్న ఎత్తులో నున్నది. గర్భగుడి లోపల నున్న మండపం సా.శ.1432 లో కుమార ఎర్రమనాయకునిచే నిర్మించ బడినదని, దేవుని కళ్యాణ ఉత్సవాల కై నిర్మించబడ్డ మండపం 1407 లో యలమంచిలి విశ్వేశ్వర దేవుని చే నిర్మిచబడినదని చెపుతారు. ఆలయాన్ని పురాతన రక్షిత కట్టడంగా గుర్తిస్తూ పురావస్తు శాఖ వారు పెట్టిన బోర్డు ఇక్కడ ఉంది.

విశేషాలు[మార్చు]

గ్రామీణ భారతం స్వయంపోషకత్వంతో స్వయంపాలన సాధించడమే స్వరాజ్ లక్ష్యంగా గాంధీజీ పేర్కొన్నారు . అటువంటి ఆశయం తో, దేశంలో గత 40 సం.లుగా గ్రామీణ వికాశానికై పాటుపడుతున్న స్వచ్ఛంద సంస్థలలో ప్రముఖ సంస్థగా గుర్తింపు పొందిన భాగవతుల ఛారిటబుల్ ట్రస్ట్ ( బి.సి.టి ) యలమంచిలి దగ్గరలో నున్న హరిపురం గ్రామంలో నున్నది. దిమిలి గ్రామానికి చెందిన శ్రీ భాగవతుల వెంకట పరమేశ్వర రావు అమెరికా లోని పెన్సిల్వేనియా యూనివెర్సిటీ నుండి అణుభౌతిక శాస్త్రంలో పి.హెచ్.డి. డిగ్రీ పొందిన తర్వాత తన గ్రామానికొచ్చి అక్కడ గ్రామీణ పేదరికాన్ని, అవిద్యను చూసి కలత చెందారు. టాటా ఇన్స్టిట్యూట్ అఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ సంస్థ తమ సంస్థలో అణు శాస్ర్తవేత్తగా చేరమని ఆహ్వానించినా చేరకుండా గ్రామీణాభివృద్దికి అంకితమయ్యారు.

దిమిలి గ్రామంలో ఉన్నత పాఠశాల ఏర్పాటు చేయడంలో సఫలమైన పరమేశ్వరరావు, అదే ప్రేరణతో 1973 లో భాగవతుల ఛారిటబుల్ ట్రస్ట్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు .వ్యవసాయం, స్త్రీల స్వావలంభన, కుటీరపరిశ్రమలు, విద్య, ఆరోగ్యం, వికలాంగుల పునరావాసము మొదలగు ఆశయాలతో ట్రస్ట్ కార్యాచరణకు దిగింది. బి.సి.టి వారి దృష్టిలో ఉపయోగించని భూమేకాని ఉపయోగపడని భూమంటూ ఉండదు.ఆ విషయం నిరూపించడానికి 'పంచదార్ల' గ్రామం లోని ఎటువంటి చెట్టూ చేమా లేని, రాతి మయమయిన 50 ఎకరాల కొండ వాలును లీజుకు తీసుకొని 3 సం.లలో 100 రకాల వృక్ష జాతులను పెంచి చక్కటి బొటానికల్ గార్డెన్గా తీర్చి దిద్దారు. దానిని స్ఫూర్తిగా తీసుకొని, వీరి సహకారం తో, దగ్గర గ్రామాల రైతులు వృదాగా వదిలేసిన ఐదు వేల ఎకరాల బంజరుభూములను సస్యశ్యామలంగా తీర్చి దిద్దుకొన్నారు.

1995 లో ఇండియన్ కౌన్సిసిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్ సంస్థ తమ 'కృషి విజ్ఞ్యాన కేంద్రాన్ని 'ఇక్కడ ఏర్పాటు చేసి రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులలో శిక్షణ, సలహాలు, పరిశోధనలు చేస్తున్నారు. గ్రామీణ నిరుపేద స్త్రీల సంఖ్య ఇంటిపనులకే పరిమితమవడాన్ని గమనించి వారి స్వావలంబన కై అనేక పధకాలు ప్రవేశపెట్టారు.కోళ్ళపెంపకం, పాడిపశువులుపెంపకం, విస్తరాకులు కుట్టడం, అప్పడాలు, పచ్చళ్ళు తయారుచెయ్యడం, కొయ్యబొమ్మలు చేయడం వంటి పనులలో తర్ఫీదునిచ్చి వారికి స్వయం ఉపాధి పధకాలను కల్పిస్తున్నారు. అందుకు కావాల్సిన స్వల్ప పెట్టుబడిని అప్పుగాఇచ్చి, తిరిగి వాయదాల పద్ధతిలో అప్పుతీర్చుతూ, సంపాదించిన దానిలో కొంత పొదుపు చేయించే’ పొదుపు పధకం’ ద్వారా తమపెట్టుబడిని తామే సమకూర్చుకో గలిగే స్వయం సహాయక బృందాలుగా వారిని తీర్చి దిద్దేరు.

ఈ పొదుపుపధకం ప్రపంచ బ్యాంక్ ను కూడా ఆకర్షించినది .డ్వాక్రా వంటిపధకాలు ఇటువంటి పధకాల నుండి రూపుదిద్దుకోన్నవే. విద్యారంగంలో వెనుకబాటుతనాన్ని తొలగించడానికి గ్రామీణ ప్రాంతాలలో వందకు పైగా ఆయనిత విద్యాకేంద్రాలుప్రారభించేరు.ఆయనితవిద్యారంగంలో వీరి కృషిని గమనించి కేంద్రప్రభుత్వపు జాతీయ సాక్షరతా మిషన్, విశాఖజిల్లాలో ఏడు వందల రాత్రిబడులు నిర్వహించే బాధ్యత బి.సి.టి. కిఅప్పగించారు.

వీరు 72 ప్రయోగాత్మక పాఠశాలలు నడుపుతున్నారు. సాధారణ విద్యతో పాటు వృత్తివిద్య ఆవశ్యకత ఎంతైనా ఉందని, వీరు వృత్తివిద్యా శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసారు. పంచదార్లలో మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్వహిస్తున్నారు.ఆరోగ్యరంగంలో నాటు మంత్రసానులకు శిక్షణ నిచ్చి ప్రసూతిమరణాలను అరికట్టగలిగారు..యలమంచిలి, హరిపురం, దిమిలి గ్రామాలలో ఆసుపత్రులను నడుపుతున్నారు. వికలాంగుల పునరావాసానికి కూడా కృషి చేస్తున్నారు.వీరు నడిపే వికలాంగుల పునరావాస శిక్షణా కేంద్రంలో వ్యవసాయం, టైలరింగ్, కాగితపు సంచులు చేయుట తదితర వృత్తులలో శిక్షణనిచ్చి వారికి వైకల్యాన్ని జయంచడమెలాగో నేర్పుతున్నారు. గ్రామీణవికాశానికై వీరు చేస్తున్న ప్రయోగాలను పరిశీలించేందుకు, దేశ, విదేశాల నుండి అనేకమంది ఔత్యాహికులు బి.సి.టి.ని సందర్శిస్తారు.

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప బాలబడి రాంబిల్లిలో ఉంది.సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల అచ్యుతాపురంలోను, ఇంజనీరింగ్ కళాశాల అనకాపల్లిలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్ విశాఖపట్నంలో ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల అచ్యుతాపురంలోను, అనియత విద్యా కేంద్రం అనకాపల్లిలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల విశాఖపట్నం లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

పంచదార్లలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక డాక్టరు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. పశు వైద్యశాల, సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది. కాలువ/వాగు/నది ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం[మార్చు]

గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని శుద్ధి ప్లాంట్‌లోకి పంపిస్తున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

పంచదార్లలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. జాతీయ రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో వాణిజ్య బ్యాంకు ఉంది. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, సహకార బ్యాంకు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 7 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

పంచదార్లలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 145 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 206 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 272 హెక్టార్లు
  • బంజరు భూమి: 160 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 160 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 272 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

పంచదార్లలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 272 హెక్టార్లు

ఉత్పత్తి[మార్చు]

పంచదార్లలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు[మార్చు]

వరి, చెరకు

దర్శనీయ ప్రదేశాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  2. "ఆంధ్రప్రదేశ్ రాజపత్రము" (PDF). ahd.aptonline.in. Archived from the original (PDF) on 2022-09-06. Retrieved 2022-09-06.
"https://te.wikipedia.org/w/index.php?title=పంచదార్ల&oldid=3891313" నుండి వెలికితీశారు