Jump to content

పంచరథాలు

Coordinates: 12°36′31.7″N 80°11′22.6″E / 12.608806°N 80.189611°E / 12.608806; 80.189611
వికీపీడియా నుండి
పంచరథాలు
ప్రపంచ వారసత్వ ప్రదేశం
మహాబలి పురం లోని ఐదు రథాలు, సా.శ. 630–668
స్థానంమహాబలిపురం, చెంగల్పట్టు జిల్లా, తమిళనాడు
CriteriaCultural: (i), (ii), (iii), (vi)
సూచనలు249-001
శాసనం1984 (8th సెషన్ )
భౌగోళిక నిర్దేశకాలు 12°36′31.7″N 80°11′22.6″E / 12.608806°N 80.189611°E / 12.608806; 80.189611
పంచరథాలు is located in Tamil Nadu
పంచరథాలు
Location of పంచరథాలు in Tamil Nadu.
ధర్మరాజ రథం
భీమ రథం
అర్జున రథం
నకుల సహదేవ రథం, పక్క నుండి
ద్రౌపది రథం

పంచ రథాలు తమిళనాడు రాష్ట్రం, చెంగల్పట్టు జిల్లాలో, మహాబలిపురం వద్ద, బంగాళాఖాతం తీరంలో ఉన్న ఒక స్మారక సముదాయం. పంచ రథాలు ఏకశిలా భారతీయ రాతి నిర్మాణ శైలికి ఒక ఉదాహరణ. ఈ సముదాయాన్ని మొదట్లో రాజు మొదటి నరసింహవర్మ (630–668 CE) పాలనలో చెక్కబడిందని భావించారు. అయితే, కొత్త శాసనాల ఆవిష్కరణతో, నాగస్వామి వంటి చరిత్రకారులు మహాబలిపురంలోని స్మారక చిహ్నాలన్నీ రెండవ నరసింహవర్మ (సా.శ. 690–725)కి ఆపాదించారు.[1] ఈ సముదాయం భారత పురావస్తు సర్వే (ASI) ఆధ్వర్యంలో ఉంది. 1984లో యునెస్కో దీన్ని, మహాబలిపురంలోని స్మారక చిహ్నాల సమూహంగా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా చేర్చుకుంది.[2]

పంచ రథాల సముదాయంలోని ఐదు స్మారక చిహ్నాలన్నీ రథాన్ని పోలి ఉంటాయి. ఇవన్నీ ఒకే రాతిపై చెక్కిన ఏకశిలా శిల్పాలు. ఈ శిలలు ఉత్తర-దక్షిణ దిశలో స్వల్పంగా వాలుగా ఉంటాయి.[3][4] కొన్నిసార్లు వీటిని దేవాలయాలు అని అనడం కూడా కద్దు. అయితే మొదటి నరసింహవర్మ మరణం కారణంగా అవి పూర్తి కానే లేదు. అంచేత వాటిలో విగ్రహ ప్రతిష్ఠ జరగలేదు.[3][4][5] ఈ నిర్మాణాలకు మహాభారతం లోని పంచపాండవులు, వారి భార్య ద్రౌపదిల పేర్లు పెట్టారు.[2][4][6] వాటి పరిమాణం ప్రకారం, వాటిలో ధర్మరాజ రథం, భీమ రథం, అర్జున రథం, నకుల సహదేవ రథం, ద్రౌపది రథం ఉన్నాయి.

శబ్దవ్యుత్పత్తి

[మార్చు]

ఈ ఏకశిలా విగ్రహాలకు అర్జునుడు, భీముడు, యుధిష్ఠిరుడు ("ధర్మరాజు"), నకులుడు, సహదేవుడు, ద్రౌపది ల పేర్లు పెట్టారు. ఈ నిర్మాణాలకు వారికీ సంబంధమేమీ లేనందున ఈ పేర్లు వీటికి అతకవని భావిస్తారు. వాటికి మతపరమైన ప్రాముఖ్యత కూడా లేదు, ఎందుకంటే అవి అసంపూర్ణంగా ఉన్నాయి; రథాల అడుగుభాగం, పైభాగంలో ఇంకా చెక్కని రాతి భాగాలు ఇప్పటికీ కనిపిస్తాయి. నిర్మాణాల అసంపూర్ణ స్వభావాన్ని ASI ధృవీకరించింది. వాటిని విమానాలు అనాలని చెప్పింది. అయితే, పాండవుల పేర్లు శాశ్వతంగా నిలిచిపోయాయి.[3][7][8][9]

చరిత్ర

[మార్చు]

ASI ఆ ప్రదేశంలో ప్రదర్శించిన ఒక ఫలకం ప్రకారం, పల్లవ రాజవంశీకులు చెక్కతో నిర్మించిన పురాతన రథాల నమూనాల ఆధారంగా రాతి రథాల నిర్మాణాలను ప్లాన్ చేసింది.[9] పంచ రథాలను రాజు మొదటి మహేంద్రవర్మ, అతని కుమారుడు మొదటి నరసింహవర్మ పాలనాకాలాల్లో చెక్కారు. సా.శ. 668 లో నరసింహవర్మన మరణం తరువాత ఈ ఐదు రథాలపై పని నిలిచిపోయింది.[5] [10] నిర్మాణాలు పూర్తి కానందున వాటిని ఎందుకు ఉద్దేశించారో తెలియలేదు. మహాబలిపురంలోని స్మారక చిహ్నాల సమూహంలోని సేకరణలో భాగంగా, వాటిని 1984లో UNESCO ప్రపంచ వారసత్వ ప్రదేశంగా చేర్చారు.[2]

భౌగోళిక శాస్త్రం

[మార్చు]

ఈ ప్రదేశం కాంచీపురం జిల్లా, బంగాళాఖాతం తీరంలో మహాబలిపురం (గతంలో మామళ్ళపురం అనేవారు) వద్ద ఉంది. ఇది దాదాపు రాజధాని నగరం చెన్నై (గతంలో మద్రాస్ అని పిలువబడేది) కి దక్షిణంగా 56 కి.మీ. దూరం లోను,[7] చెంగల్పట్టు నుండి దాదాపు 32 కి.మీ. దూరంలోనూ ఉంది.[11] ఈ నిర్మాణాలు ఇక్కడ కనిపించే తొమ్మిది ఏకశిలా నిర్మాణాలలో భాగం. [12]

శిల్పకళాశైలి

[మార్చు]

లేఅవుట్

[మార్చు]

ఈ ఐదు రథాలు అన్నీ, భూమీ లోంచి పైకి చొచ్చుకొచ్చిన (ఔట్‌క్రాప్) గులాబీ గ్రానైట్‌లో చెక్కిన ఏకశిలా శిల్పాలు. అవి ఉత్తర-దక్షిణ దిశలో కొద్దిగా వాలుతో ఉంటాయి. ఒక్కొక్కటీ ఒక్కొక్క ఆకారపు లేఔట్‌లో ఉంటుంది - చతురస్రం, దీర్ఘచతురస్రం, వగైరా. వీటిలో అతిపెద్దది 13 మీ x 11 మీ ఉండగా, అన్నిటి కంటే ఎత్తైనది 12 మీ. ఎత్తు ఉంటుంది.[13]

ప్రాతినిధ్యాలు

[మార్చు]

పంచ రథాలు ఆ కాలపు ద్రావిడ నిర్మాణ శైలిలో వైవిధ్యాన్ని సూచిస్తాయి. వాటి ఒరిజినల్ రూపం, చెక్కతో చేసిన ఆలయ రథాలను పోలి ఉంటుంది. తమిళనాడులో ఆ తరువాత నిర్మించిన చాలా పెద్ద దేవాలయాలకు ఇవి నమూనాలు కావచ్చు.[6][14] చాలా రథాలను బౌద్ధ విహారాలు, చైత్యాల నమూనాలో రూపొందించబడినట్లు చెబుతారు.[10][13]

రూపకల్పన

[మార్చు]

ఈ రథాలకు ఒకటి లేదా మూడు అంతస్థుల గోపురాలు ఉన్నాయి. ఇవి ద్రావిడ వాస్తుశిల్పశైలిలో ఉన్నాయి. గోడల నుండి చొచ్చుకొచ్చిన ప్రొజెక్షన్లు, రీసెస్‌లు చిన్నపాటి పిలాస్టర్ల (గోడల నుండి పొడుచుకొచ్చిన స్థంభాల్లాంటివి) లాగా ఉంటాయి. గోడలలో చేసిన గూళ్లు, దీర్ఘచతురస్రాకార ఆకారంలో ఉండి, దేవతలు, రాజుల శిల్పాలు చెక్కి ఉంటాయి. చిత్రాల చుట్టూ ఉన్న స్కర్టింగ్ "ఆకుల తోకలు, తెరిచిన దవడలూ" కలిగిన జలచరాలు ఉంటాయి.[15]

సంరక్షణ

[మార్చు]

ఈ రథాలు, వాటిని చెక్కిన గ్రానైట్ దృఢత్వం కారణంగా, బంగాళాఖాతం నుండి నిరంతరం వీచే ఉప్పటి గాలులు, 13వ శతాబ్దం లోను, 2004 లోనూ వచ్చిన వినాశకరమైన సునామీల బారిన పడినప్పటికీ చక్కగా సురక్షితంగా ఉన్నాయి.[2][4][9]

గుర్తించదగిన ల్యాండ్‌మార్కులు

[మార్చు]

ధర్మరాజ రథం పిరమిడ్ ఆకారంలో, మూడు అంతస్థులతో ఉంటుంది. ఇది చదరపు లేఅవుట్‌లో ఉంటుంది. దీని కూర్పు హిందూ దేవుళ్ళు హరిహర, బ్రహ్మ, స్కంద, అర్ధనారీశ్వర, రాజు మొదటి నరసింహవర్మల శిల్పాలతో అలంకరించబడి ఉంది. రథం తూర్పు ముఖంపై కనిపించే విలక్షణమైన శిల్పాలలో ఒకటి ఇంద్రుడు. అతడు ఐరావతంపై కూర్చుని ఉంటాడు. ఈ రథాన్ని ఆనుకుని విడిగా ఉన్న ప్రదేశంలో నంది ఏకశిలా శిల్పం ఉంది. ఆ తరువాత అర్జున రథం ఉంది, ఇది సొగసైన ముఖభాగంతో బాగా అలంకరించబడి, ధర్మరాజ రథాన్ని పోలి ఉంటుంది. తరువాత భీమ రథం దీర్ఘచతురస్రాకార స్థలంలో నిర్మించబడి, రెండు పొడవు భుజాల వైపున సింహాలు అమర్చబడిన స్తంభాల (నాలుగు స్తంభాలు) గ్యాలరీలతో ఉంటుంది.

నకుల సహదేవ రథం ఆ వరుసలో తరువాతిది. దీనిని సరళమైన ప్రణాళిక ప్రకారం నిర్మించారు. దాని సంతస్థులలో అలంకార శిల్పాలేమీ లేవు. ఈ రథం పక్కన, బహిరంగ ప్రదేశంలో ఏనుగు ఏకశిలా శిల్పం ఉంది. ఈ వరుసలో చివరిగా ఉన్న ద్రౌపది రథం, ఒక చదరపు స్థలంలో ఉన్ననిర్మాణం. ఇది గడ్డి పైకప్పుతో కూడిన గుడిసె లాగా ఉంటుంది. ఈ మందిరం లోపల దుర్గామాత చిత్రం (ఫ్రెస్కో) ఉంటుంది.[12][16]

మూలాలు

[మార్చు]
  1. M. T. Saju (May 17, 2015). "Rediscovery of ancient transcript says Mamalla monuments were built by Rajasimha | Chennai News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-11-28.
  2. 2.0 2.1 2.2 2.3 "Group of Monuments at Mahabalipuram". UNESCO World Heritage Convention. United Nations Educational Scientific and Cultural Organization. Retrieved 2007-02-08."Group of Monuments at Mahabalipuram". UNESCO World Heritage Convention. United Nations Educational Scientific and Cultural Organization. Retrieved 8 February 2007.
  3. 3.0 3.1 3.2 Five Rathas, Plaque at the site, Archaeological Survey of India, Chennai Circle
  4. 4.0 4.1 4.2 4.3 "Pancha Rathas, Mamallapuram". Archaeological Survey of India. Retrieved 23 October 2012."Pancha Rathas, Mamallapuram". Archaeological Survey of India. Retrieved 23 October 2012.
  5. 5.0 5.1 "Mahabalipuram". UCLA Education, South Asia. Archived from the original on 10 ఏప్రిల్ 2013. Retrieved 30 December 2012.. UCLA Education, South Asia. Archived from the original on 10 April 2013. Retrieved 30 December 2012.
  6. 6.0 6.1 "The Rathas, monolithic [Mamallapuram]". Online Gallery of the British Library. Retrieved 19 February 2013."The Rathas, monolithic [Mamallapuram]". Online Gallery of the British Library. Retrieved 19 February 2013.
  7. 7.0 7.1 Gunther, Michael D. "Pancha Rathas, Mamallapuram". art-and-archaeology.com. Retrieved 23 October 2012.
  8. Ring, Trudy; Watson, Noelle; Schellinger, Paul (12 November 2012). Asia and Oceania: International Dictionary of Historic Places. Taylor & Francis. pp. 554–555, 912–. ISBN 978-1-884964-04-6. Retrieved 3 January 2013.
  9. 9.0 9.1 9.2 "World Heritage Sites – Mahabalipuram: Group of Monuments Mahabalipuram (1984), Tamil Nadu". Archaeological Survey of India by National Informatics Centre. Retrieved 30 December 2012."World Heritage Sites – Mahabalipuram: Group of Monuments Mahabalipuram (1984), Tamil Nadu". Archaeological Survey of India by National Informatics Centre. Retrieved 30 December 2012.
  10. 10.0 10.1 "Rock Cut Architecture". culturalindia.net. Archived from the original on 10 ఫిబ్రవరి 2006. Retrieved 30 December 2012.. culturalindia.net. Archived from the original Archived 2006-02-10 at the Wayback Machine on 10 February 2006. Retrieved 30 December 2012.
  11. Ayyar, P. V. Jagadisa (1982). South Indian Shrines: Illustrated. Asian Educational Services. pp. 157–. ISBN 978-81-206-0151-2. Retrieved 7 February 2013.
  12. 12.0 12.1 "A monumental effort". Front Line India's National Magazine from the publishers of The Hindu. 8 November 2003. Archived from the original on 10 ఏప్రిల్ 2013. Retrieved 30 December 2012.. Front Line India's National Magazine from the publishers of The Hindu. 8 November 2003. Archived from the original on 10 April 2013. Retrieved 30 December 2012.
  13. 13.0 13.1 Sharma, Dr. K.K.; Jain, Dr. Amit Rai (2019). Cave temples of India. New Delhi: Kitabwale. p. 82. ISBN 978-93-85754-64-7.Sharma, Dr. K.K.; Jain, Dr. Amit Rai (2019). Cave temples of India. New Delhi: Kitabwale. p. 82. ISBN 978-93-85754-64-7.
  14. M. T. Saju (May 17, 2015). "Rediscovery of ancient transcript says Mamalla monuments were built by Rajasimha | Chennai News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-11-28.
  15. Michell 1977, p. 132.
  16. Schreitmüller, Karen; Dhamotharan, Mohan; Szerelmy, Beate (2012). Baedeker India. Baedeker. pp. 589–. ISBN 978-3-8297-6622-7.
"https://te.wikipedia.org/w/index.php?title=పంచరథాలు&oldid=4742594" నుండి వెలికితీశారు