పంతుల జోగారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంతుల జోగారావు
పంతుల జోగారావు
జననంపంతుల జోగారావు
అక్టోబరు 12, 1949
విజయనగరం జిల్లా పార్వతీపురం
నివాస ప్రాంతంవసంత్ విహార్, పద్మావతి నగర్, విజయ నగరం
ఇతర పేర్లుచిట్టి బాబు
వృత్తిసాలూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సీనియర్ తెలుగు పండిట్ గా పని చేసి 2007 అక్టోబరు నెలలో పదవీ విరమణ చేసారు.
ప్రసిద్ధితెలుగు కథకులు,
మతంహిందూ
పిల్లలుశైలజ, ఆశా కిరణ్
వెబ్‌సైటు
http://kathamanjari.blogspot.com

పంతుల జోగారావు తెలుగు కథకుడు. ఈయన అక్టోబరు 12, 1949లో విజయనగరం జిల్లా పార్వతీపురంలో జన్మించాడు.సాలూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సీనియర్ తెలుగు పండిట్ గా పనిచేసి, 2007 అక్టోబరు 31 వ తేదీన పదవీ విరమణ చేసారు.. వీరి కథనశైలి సూటిగా, సరళంగా, స్వీయానుభవంలో వాస్తవానికి దగ్గరగా ఉంటుంది.

జోగారావు మొదటి కథ 'బహుమతి' 1966 లో ఆంధ్రప్రభలో ప్రచురించబడింది. వీరి అనేక కథలకు బహుమతులు లభించాయి. ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన 'గోవుమాలచ్చిమికి కోటి దండాలు', ఆంధ్రపత్రికలో ప్రచురించిన 'మసి మరకలు', ఆంధ్రభూమిలో ప్రచురించిన 'ఊరికి నిప్పంటుకుంది', 'బొమ్మ', 'చింతలుతీరని చీకట్లు', 'శిక్ష', 'అభ్యంతరం లేదు' మొదలైన కథలకు బహుమతులు లభించి, మంచి గుర్తింపు తీసుకొని వచ్చాయి.

వీరు నవ్య వార పత్రికలో తెలుగు పద్యం వెలుగు జిలుగులు, పాల బువ్వ అనే ధారావాహిక శీర్షికలు నిర్వహించారు. అలాగే, ఆంధ్ర భూమి మాస పత్రికలో వీరి ధారావాహిక శీర్షిక : తేనె లొలికే తెలుగు పద్యం. నవ్య వార పత్రికలో దాదాపు 100 పైగా పుస్తక సమీక్షలు చేసారు.

మంచి కథ (రంజని ప్రచురణ), నేటి కథ ( కా.రా. మాస్టారి ప్రచురణ), కథా పార్వతీపురం, ఉత్తరాంధ్ర కథలు, ( విశాలాంధ్ర వారి ప్రచురణ ), తెలుగు కథా పారిజాతాలు, ( రమ్య సాహితి ప్రచురణ) కథా వాహిని 2005, ( వాహిని బుక్ ట్రస్టు వార ప్రచురణ ) తెలుగు కథ 1997 ( తెలుగు విశ్వ విద్యాలయం వారి ప్రచురక్ష్) నూరేళ్ళు, నూరుగురు కథకులు, నూరు కథలు ( జయంతి పాపా రావు ప్రచురణ ), బహుమతి ( సి.పి బ్రౌన్ ప్రచురణ ), కథా నగరం ( కొడవంటి కాశీపతి రావు ప్రచురణ ), పతంజలి తలపులు (శ్రీ.శ్రీ ప్రచురణలు ) యువ కవిత (అ.ర.సం. ప్రచురణ) .. లలో వీరి కథలు, ఇతర రచనలు చోటు చేసుకున్నాయి.

జోగారావు చతురలో ప్రచురించిన 'విషగుళిక', 'అపురూపం' నవలలు గుర్తించబడ్డాయి. వీరి కథ నరమేధం జరుగుతుందిని కె.వి.ఎల్.నరసింహారావు హిందీ లోకి అనువదించి, 'నరమేధ్' పేరుతో సారిక పత్రికలో ప్రచురించారు. వీరి కథల సంపుటి 'అపురూపం' 1998 లో డా.సి.నారాయణరెడ్డి గారిచే ఆవిష్కరించబడింది.

కథలు:[మార్చు]

  • అపురూపం
  • గోవు మా లచ్చిమికి కోటి దండాలు
  • వేడుక
  • నిలబడు
  • శరణు శరణు. మొ. 300 పైగా కథలు. పది కథలకు బహుమతులు.

వెలువడిన కథా సంపుటాలు[మార్చు]

  • అపురూపం ( 30 కథలతో ) ( ప్రచురణ : నామాల విశ్వేశ్వర రావు.)
  • గుండె తడి ( 24 ) కథలతో ( విశాలాంధ్ర వారి ప్రచురణ.)

మూలాలు[మార్చు]

  • కథా కిరణాలు : మన తెలుగు కథకులు, పైడిమర్రి రామకృష్ణ, పైడిమర్రి కమ్యూనికేషన్స్, ఖమ్మం, 2002.