పంపన

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంపన లేదా పంప కవి తెలుగు సాహిత్యానికి ఆదికవి. సా.శ. 10వ శతాబ్దంలో తెలుగు సాహితీ సృజన చేసినవాడు. పద్మకవిగా పిలువబడే పంపన బోధన్, వేములవాడలను రాజధానులుగా చేసుకొని పరిపాలించిన చాళుక్యుల కాలానికి చెందినవాడు. చాళుక్య రాజుల్లో రెండవ అరికేసరి ఆస్థానంలో ఉన్నవాడు. కన్నడ సాహితీ సృజనలోనూ ఆ యనే ఆదికవి. పంప కవి సా.శ. 902 నుంచి సా.శ. 975 వరకు జీవించినట్లు తెలుస్తున్నది. సా.శ. 931నాటికే ఆయన కన్నడ భాషలో ఆదిపురాణం రాశారు.[1]

కమ్మనాటి వంగిపర్రు వాస్తవ్యులైన పంపని పూర్వీకులు యజ్ఞయాగాదులు నిర్వహించిన సోమయాజులు, తండ్రి భీమన, వైదికం విడిచి జైనమతం అవలంబించి, కొంతకాలం వనవాసంలో వుండి తర్వాత వేములవాడ రాజాస్థానంలో స్థిరపడినట్టు తెలుస్తోంది. మత ధర్మమే కావ్యధర్మంగా ఆదిపురాణం, విక్రమార్జున విజయాలను పంపన రాసారు. ఆదిపురాణం జైన తీర్థంకరులలో ప్రథముడైన వృషభనాధుని చరిత్ర. 16 ఆశ్వాసాల ఈ గ్రంథాన్ని పంపన మూడునెలల్లో రాసారు.వేటూరి ప్రభాకరశాస్ర్తీ ప్రబంధ రత్నావళిలో పంపన, కన్నడం, సంస్కృత భాషలలోనేకాక తెలుగులో, జినేంద్ర పురాణం రాసారని స్పష్టం చేస్తోంది. అదే విధంగా పద్మకవిగా పంపన సా.శ.941లో, నిజామాబాద్ జిల్లా బోధన్ రాజాశ్రయంలో కన్నడ కావ్యం విక్రమార్జున విజయం, తెలుగు కావ్యం జినేంద్రపురాణం రాసినట్లు, తెలుగు అకాడమీ ప్రచురణ తెలంగాణ ప్రాచీన సాహిత్య చరిత్ర ముంగిలిలో స్పష్టంగా పేర్కొనబడింది[2]

మూలాలు[మార్చు]

  1. lokseva (2017-12-13). "text/html; charset=UTF-8". World Telugu Conference 2017, Telangana State (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2019-11-16. Retrieved 2019-11-16.
  2. "కన్నడ ఆదికవి పంపన | Andhrabhoomi – Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi". andhrabhoomi.net. Retrieved 2019-11-16.
"https://te.wikipedia.org/w/index.php?title=పంపన&oldid=4174915" నుండి వెలికితీశారు