పక్షిగూడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
A blackbird's nest with two blue eggs snugly inside it.
ఇది ఒక బ్లాక్ బర్డ్ గూడు, ఈ గూడులో ఉన్న గుడ్లు పొదిగి పిల్లలై అవి పెరిగి ఈ గూడు నుంచి వెళ్లిపోయే వరకు బ్లాక్‌బర్డ్ ఈ గూడునే ఉపయోగిస్తుంది.

పక్షిగూడు అనగా పక్షులచే నిర్మించబడిన నిర్మాణం, ఈ పక్షిగూడులలో పక్షులు సందర్భోచితంగా తమకుతాము ఉంటూ గుడ్లు పెట్టి, వాటిని పొదిగి తమ సంతానాన్ని వృద్ధి చేసుకుంటాయి, పొదిగిన పిల్లలకు రెక్కలు వచ్చి ఎగిరి వాటి ఆహారాన్ని అవే సమకూర్చుకునేలా తయారేంతవరకు తల్లిపక్షి వీటికి ఈ పొదిగిన గూడులోనే ఆహారాన్ని అందిస్తూ పెంచుతుంది. సాధారణంగా పక్షిగూడును గూడు అనే వ్యవహరిస్తారు. ఈ పక్షిగూళ్ళు పుల్లలు, గడ్డి, మరియు ఆకులు వంటి సేంద్రీయ పదార్థముల యొక్క మిళితమై ఉండవచ్చు, ఇవి రకరకాల పరిమాణాలలోను, వివిధ ఆకారాలలోను ఉంటాయి. ఇంకా రాయి, చెట్టు, లేక భవనాలలోని రంధ్రాలు కూడా గూడులుగా ఉండవచ్చు. మానవ నిర్మిత పదార్థాలైన దారం, ప్లాస్టిక్, వస్త్రం, కాగితం వంటివి కూడా ఈ గూళ్ళ నిర్మాణంలో ఉపయోగిస్తుండవచ్చు. గూళ్ళలో నివాసాల యొక్క అన్ని రకాలు చూడవచ్చు. కొన్ని గూళ్ళు గుండ్రంగా ఉండగా, కొన్ని గూళ్ళు పైకప్పు లేకుండా ఉంటాయి. కొన్ని గూళ్ళు కేవలం పుల్లలలో నిర్మితమై కఠినంగా ఉంటాయి, కొన్ని చాలా మృదువుగా ఉంటాయి. హమ్మింగ్బర్డ్ వంటి చిన్న పక్షుల గూళ్ళు కేవలం అవి పట్టేంత పరిమాణంలోనే ఉండగా, పెద్ద గ్రద్దల గూళ్ళు కారు అంత పరిమాణంలో చాలా పెద్దవిగా మరియు చాలా బరువుగా ఉంటాయి.

బయటి లింకులు[మార్చు]