Jump to content

పటిక

వికీపీడియా నుండి
ఎక్కువ పరిమాణంలో పొటాషియం ఆలం KAl(SO
4
)
2
·12H
2
O
.

ఇది స్పటికాకారం కలిగిన ఉప్పు ఖనిజం. పటిక అనేది గడ్డ కట్టబడిన ముడిపదార్ధము.ఇదిసహజసిద్ధంగా లభించుతుంది.

ఉపయోగాలు

[మార్చు]

పటికను ఆయుర్వేద ఔషదములలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. పటిక కలిపిన స్ఫటికాది చూర్ణం అనే ఆయుర్వేద ఔషధాన్ని చిగుళ్లనుంచి రక్తం కారడం, చిగుళ్లు, పంటినొప్పులు, నాలుకపై పుళ్లు, వ్రణాలు తగ్గడానికి ఉపయోగిస్తారు. ఏ ఔషధమైతే వ్యాధిని నిర్మూలించి సంపూర్ణ ఆరోగ్యాన్ని చేకూరుస్తుందో దానిని శ్రేష్టమైన శక్తివంతమైన ఔషధంగా ఆయుర్వేద శాస్త్రం భావిస్తుంది. ఇటువంటి ఔషధం విరివిగా, చవుకగా లభిస్తూ, అన్ని వర్గాల ప్రజలకూ అందుబా టులో ఉండి, దానిని వ్యాధి అవస్థానుసారం చూర్ణం, మాత్ర, ద్రవ రూపాలలో తీసుకోవడా నికి అనువుగా ఉంటే ఆ ఔషధాన్ని సద్విని యోగం చేసుకోవాలి. ఈ లక్షణాలు కలిగి, సర్వసాధారణంగా లభ్య మయ్యే పటిక ఔషధ గుణాలను తెలుసుకోవడం అవసరం. మనిషి తన దైనందిన జీవితంలో ఎదుర్కొనే వివిధ రకాల అనారోగ్యాలనుంచి అతి స్వల్ప ఖర్చుతో విలువైన ప్రయోజనం పొందడానికి పటిక ఎంతగానో ఉపకరిస్తుంది.

  1. కొద్దిగా పటిక చూర్ణాన్ని కలిపిన నీటితో స్నానం చేస్తుంటే అధిక చెమటలు తగ్గుతాయి. ఈ నీటిని తలకు పట్టిస్తుంటే పేల బాధ తగ్గు తుంది.
  1. వ్రణాలను, గాయాలను పటిక నీటితో కడి గితే రక్తస్రావం ఆగిపోవడమే కాకుండా, అతి త్వరగా మానుతాయి. ఇన్‌ఫెక్షన్లనుంచి రక్షణ లభిస్తుంది.
  1. పటిక నీటిని నోటిలో పోసుకుని పుక్కిలి పడితే, నోటిలోనూ, అంగిలిలోనూ, నాలుకపైన ఉన్న గుల్లలు, పుళ్లు, వ్రణాలు, టాన్సిల్స్‌ వాపు, నొప్పి మొదలైనవి తగ్గుతాయి.
  1. పరిశుభ్రమైన నీటిని 600 మిల్లీలీటర్లు తీసుకుని, దానికి 15 గ్రాముల పటిక కలిపి ఆ నీటితో యోనిభాగాన్ని శుభ్రంగా కడిగి పటిక నీటితో తడిపిన శుభ్రమైన వస్త్రాన్ని రోజూ కొంతసేపు యోనిమార్గంలో ఉంచితే స్త్రీలలో ఎదురయ్యే తెల్లబట్ట, యోని వ్రణాలు, దురద తగ్గుతాయి.
  1. పటిక కలిపిన నీటిని రెండు మూడు చుక్కలు రోజూ రెండుసార్లు కళ్లలో వేసుకుంటే కళ్ల కలక వ్యాధి త్వరగా తగ్గుతుంది.
  1. 100 మిల్లీగ్రాముల పొంగించిన పటికను చనుబాలలో కరిగించి రోజూ రెండుసార్లు చెవిలో వేస్తుంటే చెవినుంచి చీము కారడం తగ్గుతుంది.
  1. పొంగించిన పటిక చూర్ణాన్ని తగినన్ని నీళ్లలో చిక్కగా కలిపి ప్రతినిత్యం మూలవ్యాధి పిలకలను కడుగుతుంటే అవి ఎండిపోతాయి.

పావుతులం పటిక చూర్ణాన్ని ఒక లీటరు నీటిలో కలిపి ఉంచుకుని అరగంటకు ఒకసారి కొద్దికొద్దిగా తాగుతుంటే కలరా వ్యాధి త్వరగా తగ్గుతుంది.

  1. ఐదు గ్రాముల పటిక చూర్ణాన్ని 100 మిల్లీ లీటర్ల పాలలో వేసి కాచి వడగట్టి రోజూ మూడు పూటలా తాగుతుంటే నోరు, ముక్కు, మూత్ర, మలద్వారం వెంట రక్తం పడటం, రక్త విరేచ నాలు, స్త్రీలలో బహిష్టు సమస్యలు తగ్గుతాయి.
  1. 200 గ్రాముల ముల్లంగి రసంలో 10 గ్రాముల పటిక చూర్ణాన్ని కలిపి సన్నని మంటపై ముద్ద కట్టే వరకూ వండాలి. దానిని రేగిపండు పరి మాణంలో మాత్రలు చేసుకుని ఎండబెట్టి రోజూ ఉదయం ఒక మాత్రను మింగి, రెండు స్పూన్ల వెన్న సేవిస్తుంటే మూల వ్యాధిలో నొప్పి, మంట, దురద, విరే చనంలో రక్తం పడటం తగ్గి మూలవ్యాధి తగ్గుతుంది. ఇదే ఔషధం మూత్రపిండాల నొప్పికి కూడా ఉపయోగ పడుతుంది.
  1. పటిక, హారతి కర్పూరం, దానిమ్మపెచ్చులు నీటితో మెత్తగా నూరి, రాత్రి రొమ్ములకు పట్టించి, పైన బట్ట కట్టుకుని ఉదయం కడుక కుంటే రొమ్ములు దృఢత్వాన్ని సంతరించు కుంటాయి.
  1. వివిధ రకాల అనారోగ్యాల వలన దీర్ఘకాలం పడకకే పరిమితమైపోయిన వారిలో శరీరంపై, ముఖ్యంగా వెనుక భాగంలో పుళ్లు పడి (బెడ్‌సోర్స్‌) ఎంతకూ తగ్గక చాలా ఇబ్బందులు పడుతుంట, పొంగించిన పటికను కోడిగ్రుడ్డు పచ్చ సొనతో కలిపి పట్టిస్తుంటే అవి త్వరగా మానుతాయి.
  1. పొంగించిన పటిక చూర్ణానికి పదిరెట్ల పటిక బెల్లం కలిపి ఉంచుకుని రోజూ కొటి రెండుసార్లు పావు స్పూను నుంచి అరస్పూను వరకూ వేడినీటి అనుపానంతో కళ్లెదగ్గు ఉన్నవారు, వేడిపాలు అనుపానంగా పొడిదగ్గు ఉన్న వారు సేవిస్తే దీర్ఘకాలిక దగ్గులు తగ్గుతాయి.
  1. 200 గ్రాముల కొబ్బరి నూనెలో 50 గ్రాముల తేనె మైనంవేసి కరిగించి గోరు వెచ్చగా ఉన్నప్పుడు 30 గ్రాముల పటి చూర్ణాన్ని కల పాలి. దీనిని ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం గచ్చకాయ ప్రమాణంలో సేవి స్తుంటే నోటి పూత, పేగుపూత, పేగుల్లో వ్రణాలు మొదలైన వాటిలో సుగుణం కనిపిస్తుంది.
  1. పొంగించిన పటికను పూటకు 500 మిల్లీ గ్రాముల వంతున తగినంత వెన్నలో కలిపి తీసుకుంటూ ఉంటే శరీరంలో అమితవేడి తగ్గుతుంది. పురుషుల్లో శుక్రనష్టం, స్త్రీలలో తెల్లబట్ట తగ్గుతాయి. మూత్రంలో మంట, నొప్పి తగ్గుతాయి.
  1. పటిక కలిపిన స్ఫటికాది చూర్ణం అనే ఆయుర్వేద ఔషధాన్ని చిగుళ్లనుంచి రక్తం కారడం, చిగుళ్లు, పంటినొప్పులు, నాలుకపై పుళ్లు, వ్రణాలు తగ్గడానికి ఉపయోగిస్తారు.
"https://te.wikipedia.org/w/index.php?title=పటిక&oldid=3879061" నుండి వెలికితీశారు