పట్టభద్ర నిర్వహణ ప్రవేశ పరీక్ష(గ్రాడ్యుయేట్ మానేజ్మెంట్ ఎడ్మిషన్ టెస్ట్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
GMAT, ఇక్కడకు తిరిగి సూచిస్తుంది, మిగతా ఉపయోగాలకు చూడండి GMAT (అస్పష్టత లేకపోవటం)

పట్టభద్ర నిర్వహణ ప్రవేశ పరీక్ష (GMAT, ఉచ్చరించటం G-మాట్ అని,[dʒiː.mæt])అనునది కంప్యూటర్‌కు అనుసంధానమై, పట్టభద్ర వ్యాపార అధ్యయనంలో విద్యాసంబంధంగా రాణించుటకు అవసరమైన గణితశాస్త్రం మరియు ఆంగ్లభాష వద్ద ఉండే యోగ్యతను కొలుచుటకు ప్రామాణికమైన పరీక్ష. వ్యాపార విద్యాలయములు, ముఖ్యంగా అమెరికాలో మరియు ఇతర ఆంగ్లం-మాట్లాడే దేశాలలో కూడా సాధారణంగా వ్యాపార పరిపాలన కార్యక్రమముల(ఉదా:MBA,మాస్టర్ ఆఫ్ అక్కౌంటెన్సీ మరి ఇతర)పట్టభద్ర ప్రవేశానికి అనేకమైన ఎంపిక విధానాలలో ఈ పరీక్షను ఒకటిగా ఉపయోగిస్తారు. ఇది కంప్యూటర్ ద్వారా ప్రపంచంలోని వేరు వేరు స్థలాలకు రవాణా చేయబడుతుంది. విస్తారమైన కంప్యూటర్ నెట్వర్క్ ఇంకనూ స్థాపించనటువంటి అంతర్జాతీయ ప్రదేశాలలో, GMAT తాత్కాలిక కంప్యూటర్ పైన ఆధారపడినటువంటి పరీక్షా కేంద్రాలలో పరిమితమైన సూచికగా కానీ లేక కాగితము-పైన రాసే పరీక్షగా కానీ(సంవత్సరానికి ఒకటి లేక రెండుసార్లు)నిర్వహించటం జరుగుతంది. అంతర్జాతీయంగా, ఆగస్టు 2009 నాటికి,ఈ పరీక్ష రాయడానికి కట్టవలసిన రుసుము 250 US$.[0]

== పరీక్ష ==

పరీక్ష రాసేవారు తమ విద్యాభ్యాస సమయమునందు మరియు కార్యనిర్వాహణయందు పెంపొందించుకున్నటువంటి మౌఖికమైన,గణితముగా మరియు విశ్లేషణపరమైన వ్రాత నైపుణ్యతకు ఈ పరీక్ష కొలమానము. పరీక్ష రాసేవారు పరీక్షింపబడినటువంటి మూడు వేరువేరు పరిధులలోని ప్రశ్నలకు సమాధానములను రాస్తారు.ఇందులో రెండు ఎంపిక చేసుకున్నటువంటి విభాగములు ఉంటాయి;[1] సాధారణంగా, ఈ పరీక్ష పూర్తిచేయడానికి సుమారు నాలుగుగంటలు పడుతుంది.

పరీక్షలో తెచ్చుకున్న గుణములు అయిదు సంవత్సరముల వరకు సాధికారమై ఉంటాయి(చాలా సంస్థల్లో);అనగా పరీక్షితుడు పరీక్షకు కూర్చున్న రోజు నుండి కళాశాల చదువుకు అర్హత పొందే తేదీ వరకు(అనగా అంగీకారమయ్యేవరకు,దరఖాస్తు పెట్టే తేదీ వరకుకాదు ).

పరీక్షలో సాధించగలిగే అత్యుత్తమ గుణము 800. అక్టోబరు 2009 చివరకు ముగిసే 3 ఏళ్ళల్లో,మధ్యంతర గుణము 538.5.[2]

విశ్లేషణాత్మక వ్రాత నిర్ధారణ విభాగము(AWA)జవాబు వ్రాయవలసిన మొదట విభాగము. తరువాత లెక్కల విభాగము మరియు మౌఖికమైన నైపుణ్య విభాగము ఒకదాని వెంట మరొకటి అనుసరిస్తాయి.

విశ్లేషణాత్మకమైన వ్రాత నిర్ధారణ[మార్చు]

పరీక్షలోని విశ్లేషణాత్మకమైన వ్రాత నిర్ధారణ(AWA)విభాగము రెండు వ్యాసాలు కలిగిఉంటుంది. మొదటి దానిలో విద్యార్థి ఒక వాదనను విశ్లేషించాలి;మరి రెండో దానిలో విద్యార్థి సారాంశాన్ని విశ్లేషించాలి. ఒక్కో వ్యాసము 30 నిముషాలలో వ్రాయబడాలి;మరి దాని గుణమును0-6కొలమానములో కొలవటం జరుగుతుంది. ఈ వ్యాసము ఇద్దరు పఠితలచే చదవబడుతుంది.ఇద్దరూ వ్యాసాన్ని 0-6 వర్గీకరణములో 0.5 అంశములలో వృద్ది చేస్తూ 4.1 మధ్యంతర గుణముతో గుర్తించబడటం జరుగుతుంది. ఈ రెండు గుణములు ఒక దాని అందుబాటులో మరొకటి ఉంటే,అప్పుడు వాటి సగటు కట్టబడుతుంది. ఒక విశేషం కన్నా ఎక్కువ తేడాలుంటే,వ్యాసాలు మూడో పఠితచే చదవబడతాయి.[3]

మొదటి పఠిత ఇన్టెల్లీమెట్రిక్ అనే వాన్టేజ్ లర్నింగ్ వారిచే పెంపొందించబడిన ఒక కచ్చితమైన కంప్యూటర్ కార్యక్రమము. అది 50 భాషాపరమైన మరియు నిర్మాణత్వ రూపురేఖలు గల సృజనాత్మకమైన వ్రాత మరియు వాక్యలక్షణ శబ్దక్రమమును విశ్లేషిస్తుంది.[4] రెండు,మూడు పఠితలు మనుషులు. వారు పరీక్షితుని ఆలోచనల శ్రేష్ఠతను మరియు పరీక్షితుని ఆలోచనలను నిర్దేశించటంలో,పెంపొందించటంలో,మరి అనుకూలమైన ఆధారంతో వాటిని బయల్పరిచే వారి నైపుణ్యమును వారు విలువకడతారు. వ్రాతపూర్వకమైన ఆంగ్లభాష యొక్క సంప్రదాయాల పై నిపుణత్వం,గుణసేకరణలో సహాయపడుతుంది.సూక్ష్మమైన తప్పులు ఉంటాయని తెలిసనప్పటికీ,మాతృభాష ఆంగ్లము కాని పరీక్షితులయెడ,విలువ కట్టేవారు కొంత సూక్ష్మ గ్రాహియై ఉండునట్లు తర్ఫీదు ఇవ్వబడుతుంది.[3]

పరీక్షలోని విశ్లేషణాత్మకమైన వ్రాత విభాగంలో రెండు వ్యాసాలలోని ప్రతి ఒక్క వ్యాసము వర్గీకరణ కొలమానంలో 0 (కనిష్ఠ)-6 (గరిష్ఠ) వరకు కొలవబడుతుంది:

 • 0 ఇచ్చినటు వంటి విషయము పై కాక వేరే విషయము పై వ్రాసినటువంటి వ్యాసము లేదా పూర్తిగా అర్ధంకానటువంటి వ్యాసము.
 • 1 ప్రాథమికంగా లోపమున్నటువంటి వ్యాసము.
 • 2 తీవ్రమైన లోపాలున్నటువంటి వ్యాసము.
 • 3 ఉపేక్షింపరాని పరిమితులున్న వ్యాసము.
 • 4 బొటాబొటీగా సరిపోయే వ్యాసము.
 • 5 మిక్కిలి పటిష్ఠమైన వ్యాసము.
 • 6 అత్యద్భుతంగా ఉన్నటువంటి వ్యాసము.

సంఖ్యాకారపు విభాగము[మార్చు]

సంఖ్యాకారపు విభాగములో 37 బహుళ ఎంపిక ప్రశ్నలు ఉంటాయి;అవి 75 నిముషములలో జాబులువ్రాయాలి. ఇక్కడ రెండు రకాల ప్రశ్నలు ఉంటాయి:సమస్య పరిష్కారం మరియు అంశమముల సంవృధ్ధి. సంఖ్యాకారక విభాగంలో 0 నుండి 60 వరకు గుణములు సేకరించటం జరుగుతుంది. అక్టోబరు 2009 చివరకు మూడేళ్ళ వ్యవధిలో మధ్యంతర గుణము 35.8/60;50 పైన 7 లోపు గుణములు అరుదుగా ఉంటాయి.[2][5]

సమస్య పరిష్కారం[మార్చు]

పరీక్షితుని పరిమాణపు తర్కించు నేర్పరితనమును ఈ పరీక్ష పరీక్షిస్తుంది. అంకగణితము,మౌలికమైన బీజగణితము మరియు ప్రాథమిక రేఖాగణితములోని బహుళ-ఎంపిక సమస్యలను సమస్య-పరిష్కారం ప్రశ్నలు ఎదుటపెడతాయి. కర్తవ్యం ఏమంటే సమస్యలను పరిష్కరించి సరియైన సమాధానమును అయిదు ప్రత్యుత్తరాల నుండి ఎంపిక చేయవలసిఉంది. కొన్ని సమస్యలు సాదాసీదా గణిత గణనలు;మిగతావి,గణితపరమైన పరిష్కారాలు అవసరమైన నిజజీవితపు పదాల సమస్యలుగా ఎదుట పడతాయి.

అంకెలు:ఉపయోగించే అంకెలన్నీయదార్ధ అంకెలు (రియల్ నంబర్స్)
ఆకృతులు:ఈ ప్రశ్నలను వెంబడించే చిత్రములు మరియు ఆకృతులు ప్రశ్నలకు ఉపయోగకరమైన సమాచారాన్ని అందించేందుకు పనికివస్తాయి. ఒక విశేషమైన ఆకృతి కొలమానానికి సరిగా గీయబదలేదని వివరించబడితే తప్పించి మామూలుగా చిత్రములు మరియు ఆకృతులు సాధ్యమైనంత నిర్దుష్టంగా గీయబడతాయి. అన్యధా చెప్పబడితే తప్పించి అన్ని ఆకృతులు సమతలములో ఉంటాయి.

అంశముల సంవృద్ది[మార్చు]

అసాధారణమైన కొన్ని నిర్ణీత సూచనలను ఉపయోగించి పరిమాణపు తర్కించు నేర్పరితనమును ఇది పరీక్షిస్తుంది. పరీక్షితునికి,రెండు వివరణలు ఉన్నటువంటి ఒక ప్రశ్న ఇవ్వబడుతుంది.ఆ వివరణలు ఇచ్చే సమాచారం ఈ ప్రశ్నకు ప్రత్యుత్తరం ఇచ్చేందుకు ఉపయోగకారి. అప్పుడు పరీక్షితుడు వాటిలో ఏ ఒక్క వివరణ ప్రశ్నకు ప్రత్యుత్తరంగా సరిపోతుంది అన్న విషయం;రెండు వివరణలు ప్రశ్న ప్రత్యుత్తరానికి అవసరమా అన్న విషయం లేక ప్రశ్నకు ప్రత్యుత్తరానికి రెండింటిలోని సమాచారం సరిపోయినంతగా ఉన్నదా లేదా అన్నది నిర్ణయించుకోవాలి.

అంశముల సంవృధ్ధి,ప్రత్యేకించి GMAT కొరకు సృష్టించబడిన ఒక విలక్షణమైన గణితశాస్త్ర ప్రశ్నారకము. ఇందులో ప్రతి అంశమునందు ప్రశ్నతో పాటు రెండు లెక్కించబడిన వివరణలు ఇవ్వబడతాయి.

(A)కేవలం మొదటి వివరణ ప్రశ్న ప్రత్యుత్తరానికి సరిపోతుంది కానీ కేవలం రెండవ వివరణ సరిపోదు.
(B)కేవలం రెండవ వివరణ మాత్రమీ ప్రశ్న ప్రత్యుత్తరానికి సరిపోతుంది కానీ మొదటి వివరణ మాత్రం కాదు.
(C)రెండు వివరణలు ప్రశ్న ప్రత్యుత్తరానికి అవసరం కానీ ఏ ఒక్క వివరణ ప్రత్యేకించి సరిపోదు.
(D)రెండింటిలో ఏ ఒక్క వివరణ అయినా దానికదే ప్రశ్న ప్రత్యుత్తరానికి సరిపోతుంది.
(E)ప్రశ్న ప్రత్యుత్తరానికి సరిపోను వివరములు ఇవ్వబడలేదు.

ఈ ప్రశ్నల ఉద్దేశమును పూర్తిగా లోపాయకారంగా చేయాలంటే మిక్కిలి తేలికైన పద్ధతి బహుశా "ఇజ్" అనే పదం యొక్క స్థానంలో "మస్ట్ బి" అనే పదాలు వాడటం - ప్రత్యుత్తరం సాధ్యమా అని ప్రశ్నలు అడిగే కంటే,అది "అయ్యుండవచ్చా"అని అడగాలి.

మౌఖిక విభాగము[మార్చు]

మౌఖిక విభాగములో 41 బహుళ-ఎంపిక ప్రశ్నలు ఉంటాయి;వాటికి 75 నిముషములలో సమాధానములు వ్రాయాలి. మూడు రకములైన ప్రశ్నలు ఉంటాయి:వాక్య సవరణ,గుణదోష వివేచకమైన యుక్తి,మరియు పఠన గ్రహణము. మౌఖిక విభాగము గుణమును 0 నుండి 60 వరకు కొలవవచ్చు. అక్టోబరు 2009 చివరకు మూడేళ్ళ వ్యవధిలో మధ్యంతర గుణము 28.0/60;44 పైన,9లోపు గుణములు అరుదుగా ఉంటాయి.[2][5]

వాక్య సవరణ[మార్చు]

వాక్య సవరణ విభాగము పరీక్షితుని యొక్క అమెరికన్ ఆంగ్ల వ్యాకరణము,వాడకం మరియు శైలి యెడల ఉన్నటువంటి జ్ఞానమును పరీక్షిస్తుంది.

వాక్య సవరణ అంశములలో వాక్యం మొత్తంగానీ లేక కొంత భాగం కానీ కింద గీత గీయబడి ఉన్నటువంటిది, అయిదు సంబంధమున్న ప్రత్యుత్తర ఎంపికలు కలది వాక్యం కింద పేర్కొనబడి ఉంటుంది. మొదటి ప్రత్యుత్తర ఎంపిక కింద గీతగీసినటువంటి వాక్యభాగములానే ఉంటుంది. మిగిలిన నాలుగు ప్రత్యుత్తర ఎంపికలు కింద గీతగీయబడిన వాక్యభాగమును వేరువేరు పదబంధాలతో చెబుతాయి. మొదటి ప్రత్యుత్తర ఎంపికలో వాక్యపదబంధాలలో ఏ మాత్రం తప్పిదం లేనట్లయితే పరీక్షితునకు దానినే ఎంపిక చేయమని ఉత్తరువు ఇవ్వటం జరుగుతుంది. ఒకవేళ మొదటి వాక్యంలో పదబంధములో ఏదేని తప్పిదం ఉన్నయెడల మిగిలినటువంటి నాలుగు ప్రత్యుత్తర ఎంపికలలో ఉత్తమమైన దానిని ఎంపిక చేసుకోవచ్చునని పరీక్షితునకు ఉత్తరువు ఇవ్వబడుతుంది.[6]

వాక్య సవరణ ప్రశ్నలు పరీక్షితుని నైపుణ్యాన్ని మూడు విషయభాగాలలో కొలిచే విధంగా రచించబడి ఉంటాయి:అవి తప్పులులేని వ్యక్తీకరణము,ఉపయుక్తమైన వ్యక్తీకరణము మరియు యోగ్యమయిన వాక్సరణి లేక పద ప్రయోగము.[6]తప్పులులేని వ్యక్తీకరణము అంటే వ్యాకరణము మరియు వాక్య నిర్మాణమును సూచిస్తుంది. ఉపయుక్తమైన వ్యక్తీకరణము అంటే ఆలోచనను వ్యక్తీకరించే విధానంలో ఉండవలసిన స్పష్టత మరియు సంక్షేపమును సూచిస్తుంది. యోగ్యమయిన వాక్సరణి అంటే ఎంపిక చేసుకున్నటువంటి పదాల యొక్క నిఘంటువులోని అర్ధము,వాటిని వాడేటటువంటి సందర్భ ప్రయోగానికిగల అనుగుణత్వము మరియు నిర్దుష్టత సూచిస్తుంది.[6]

గుణదోష వివేచకమైన యుక్తి[మార్చు]

ఇది తార్కికమైన ఆలోచనను పరీక్షిస్తుంది. గుణదోష వివేచకమైన ఆలోచనా విషయాలు,పరీక్షితుడు విశ్లేషించవలసిన వాదనను ముందుంచుతాయి. ప్రశ్నలు,పరీక్షితుని ముగింపు వ్రాయమనో,ఊహలను గుర్తించమనో,లేక బలాలను, బలహీనతలను గుర్తించమని అడగవచ్చు. ఇది సంక్షిప్తమైన వివరణలు లేక వాదనలు ముందుంచి,వాటియొక్క సారాన్ని లేక ఆకృతిని విలువకట్టమని అడుగుతుంది. ఈ రకమైన ప్రశ్నలు,పరీక్షితుని వాదనను చిన్నవయినటువంటి పరిచ్ఛేదము(ప్యారాగ్రాఫ్)లు లేక పాసేజిస్ లలో విశ్లేషించి మరి విలువ కట్టమని అడుగుతాయి. కొన్ని ప్రశ్నలకు,అన్ని ప్రత్యుత్తర ఎంపికలు అడిగిన ప్రశ్నలకు ఊహ్యమైన జాబులు కావచ్చు. పరీక్షితుడు ప్రశ్నకు ఉత్తమమైన జాబుగా,ఇంగిత జ్ఞానప్రమాణాలను ఉల్లంఘించు నమ్మశక్యం కాని;అధికమైన, అసంబంధమైన లేక విరుద్ధమైన ఊహల అవసరంలేనటువంటి జాబును ఎంచుకోవాలి.

పఠన గ్రహణము[మార్చు]

ఇది గుణదోష వివేచకముగా చదవగలిగే నైపుణ్యాన్ని పరీక్షిస్తుంది. పఠన గ్రహణ ప్రశ్నలు పరీక్షితునకు చదివేందుకు ఇచ్చినటువంటి పాసేజితో సంబంధం కలిగి ఉంటాయి. ఈ పాసేజీ అనునది దేని గురించి అయినా ఉండవచ్చు మరియు దాని గురించిన ప్రశ్నలు పరీక్షితుడు పాసేజీని అందులోని సమాచారాన్ని ఏమాత్రం గ్రహించాడు అని పరీక్షిస్తాయి. నామము సూచించినట్లు అది వ్రాసిన దాని యొక్క సారమును మరియు తార్కిక రూపాన్ని పరీక్షితుడు ఏమాత్రం నేర్పరితనంతో అర్ధం చేసుకున్నాడో పరీక్షిస్తుంది. GMAT,200 నుండి 350 పదాలు కల పాసేజీలను చదివేందుకు ఉపయోగిస్తుంది.ఇవి,సాంఘిక శాస్త్రము,జీవశాస్త్రము,భౌతిక శాస్త్రము మరియు వ్యాపారములను గురించిన ప్రకరణములు కలిగి ఉంటుంది. ప్రతి పాసేజీలో దాని సారాంశము పై ఆధారపడి రెండు లేక మూడు ప్రశ్నలు ఉండవచ్చు. ప్రశ్నలు,పాసేజీ యొక్క ప్రాథమిక విషయాన్ని గురించి అడగవచ్చు,రచయితా ప్రత్యేకించి చెప్పినదాని గురించి అడగవచ్చు,పాసేజీ నుండి తార్కికంగా రావలసిన ముగింపు గురించి అడగవచ్చు మరియు రచయిత యొక్క దృక్పధము లేక ధోరణి గురించి అడగవచ్చు.

మొత్తం గుణములు[మార్చు]

సాంఖ్యపరమైన మరి మౌఖికమైన విభాగాములతో నిర్మించబడిన మొత్తం గుణములు,విశ్లేషనాత్మకమైన వ్రాత నిర్ధారణకు(AWA)ప్రత్యేకం మరియు అది 200 నుండి 800 వరకు క్రమముగా ఉంటుంది. పరీక్షితులలో మూడింట రెండువంతుల మంది గుణించేది సుమారు 400,600 మధ్య ఉంటుంది. గుణముల విభజన 100 పాయింట్ల ప్రామాణికమైన విక్షేపము ఉన్నటువంటి ఒక గంట ఆకారపు వక్రరేఖను పోలి ఉంటుంది.అంటే,పరీక్ష 68% పరీక్ష వ్రాసేవారు,400 నుండి 600 వరకు గడించేటట్లు తయారు చేయబడింది.మధ్యంతర గుణము అస్సలు 500 దగ్గరగా ఉండునట్లు తయారు చేయబడింది. 2005/2006 యొక్క మధ్యంతర గుణము 533.[7]

సంఖ్యాపరమైన మరియు మౌఖిక విభాగములు ఒక కంప్యూటర్-అనుసంధానమైన పరీక్ష కలిగి ఉంటాయి. మొదటి ప్రశ్న కష్టంగా ఉండే అవకాశం ఉంది. ప్రతి విభాగంలో తరువాతి కొద్ది ప్రశ్నలు 500 స్థాయి దగ్గరగా ఉండవచ్చు. పరీక్షితుడు తప్పు లేకుండా జవాబులు ఇస్తే తరువాతి ప్రశ్నలు కష్టంగా ఉంటాయి. పరీక్షితుడు తప్పుగా జవాబులిస్తే,తరువాతి ప్రశ్నలు తేలికగా ఉంటాయి. ఒక పెద్ద ప్రశ్నల కూటమి నుండి ప్రశ్నలు తీసి విద్యార్థి సాధిస్తూ ఉన్న గుణములను ఆధారము చేసుకుని ఇవ్వబడుతూ ఉంటాయి. జ్ఞాపకం ఉంచుకునేందుకు ప్రశ్నలు వ్రాసి పెట్టుకునే విద్యార్థులు రాజీ పడకుండా తప్పించేందుకు ఈ ప్రశ్నలు ఎప్పటికప్పుడు కొత్తవి చేరుస్తూ ఉంటారు.

అంతిమమైన గుణము కేవలం పరీక్షితుడు జవాబు ఇచ్చిన ఆఖరి ప్రశ్న పై ఆధారపడి ఉండదు(అనగా-ప్రశ్నల యొక్క కష్ట స్థాయి కంప్యూటర్-అనుసంధానమైన ప్రశ్నలు ఇవ్వటంలో ఉండదు). గుణమును నిర్మించేందుకు వాడే ఆల్గోరిధం దానికన్నా మిక్కిలి క్లిష్టమైనది. పరీక్షితుడు ఒక బుద్ధిహీనమైన తప్పుచేసి తప్పుగా జవాబు వ్రాయవచ్చు;అప్పుడు కంప్యూటర్ ఆ విషయాన్ని ఒక అసంగతం(అనామలి)అని గుర్తిస్తుంది. పరీక్షితుడు కనక మొదటి ప్రశ్నలో విఫలమయితే అతని సాధించిన గుణము తప్పనిసరిగా వర్గీకరణలో అట్టడుగు అర్ధభాగంలోకి పడిపోవలసిన అగత్యం లేదు.

కానీ తప్పుగా జవాబు వ్రాసిన ప్రశ్నల కన్నా శూన్యంగా వదిలి వేసిన ప్రశ్నలు(అనగా అందుకోలేనివి)పరీక్షితుని ఎక్కువగా నష్టపరుస్తాయి. తప్పు-జవాబుకు దండన విధించే SATపరీక్షకు ఇది ప్రధానమైన వ్యత్యాసము. ప్రతి పరీక్షా విభాగము పెక్కు ప్రయోగాత్మకమైన ప్రశ్నలు కలిగి ఉంటుంది.అవి పరీక్షితుని గుణములకు లెక్కించవు కానీ ముందు ముందు భవిష్యత్ పాలనల సముచితత్వముపై తీర్పుచెప్పేందుకు దానిలోకి చేర్చబడతాయి.

మౌఖిక మరియు సంఖ్యా విభాగము గుణములు 0 నుండి 60 వరకు ఉంటాయి. విశ్లేషాత్మకమైన వ్రాత నిర్ధారణ గుణములు 0 నుండి 6 వరకు ఉంటాయి మరియు అవి రెండు GMAT వ్యాసాల సరాసరి అంచనాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. మౌఖిక మరి సంఖ్యా విభాగాల వ్యాసాలలో వేరేవిధంగా గుణములు సంపాదించటం జరుగుతుంది.ఇవి మొత్తం గుణములలో చేర్చబడవు.

గడచిన 5 సంవత్సరములలో గుణములు మరియు రద్దు చేయబడినవి విద్యార్థి గుణముల నివేదికలో ఇప్పడు ఉంటాయి.గడచిన మూడు సంవత్సరములలో సంపాదించిన గుణములు మరియు రద్దు చేయబడినవి,గుణముల నివేదికలో ఉంచేటటువంటి మునుపటి విధానానికి ఇది పూర్తి మార్పు.[ఆధారం చూపాలి]

అవసరమున్నటువంటి గుణములు[మార్చు]

దరఖాస్తుదారులు సంపాదించిన గుణముల వివరించు సంఖ్యలను కానీ, అంగీకార యోగ్యమైన కనీస గుణములను కానీ చాలా విద్యా సంస్థలు ప్రచురించవు. కాకపొతే,విద్యాసంస్థలు సాధారణంగా వారు చివరిగా తీసుకున్నటువంటి విద్యార్థుల సరాసరి మరి మధ్యంతర గుణములను,మార్గదర్శకంగా ఉపయోగించుకునేందుకు ప్రచురిస్తాయి.

జనాదరణ పొందిన పత్రికలలోని జాబితా ప్రకారం,దాదాపుగా అన్ని పై స్థాయి వ్యాపార విద్యాసంస్థల్లోని సరాసరి గుణము 600 పై చిలుకుగానీ 700 లోపుగానీ ఉంది.

ప్రభావితమైన నిజప్రపంచపు సాఫల్యతలు మంచి పట్టభద్ర నిర్వాహణ,బ్రహ్మాండమైన నిర్దేశకములు మరియు/లేక సంబంధములు,ప్రత్యేకించి బలమైన దరఖాస్తు వ్యాసములు,లేక నిర్దేశకత్వం లోపించిన సమూహము నుండి రావటం వంటి వాటి వలన తక్కువైనటువంటి పరీక్షా గుణమును అధిగమించటం సాధ్యమవ్వచ్చు.

== పట్టభద్ర నిర్వహణ ప్రవేశపరీక్ష యొక్క చరిత్ర

==

1953 లో పట్టభద్ర నిర్వహణ ప్రవేశసభ(కౌన్సిల్)అని ప్రస్తుతం పిలవబడే సంస్థ,మొదట తొమ్మిది వ్యాపార విద్యాసంస్థల కూటమిగా మొదలయ్యింది.యోగ్యమైన దరఖాస్తుదారులను వ్యాపార విద్యా సంస్థలకు ఎంపిక చేసేందుకు తోడ్పడే అవసరమైన ప్రామాణికమైన పరీక్షను పెంపొందించటం వారి గమ్యం. దానిని మొదలుపెట్టిన సంవత్సరం ఈ నిర్ధారణ(ఇప్పుడు పట్టభద్ర నిర్వహణ ప్రవేశపరీక్షగా తెలిసి ఉన్నది) కేవలం 2,000 పై చిలుకు తీసుకోబడింది.ప్రస్తుత కాలంలో అది సంవత్సరానికి 200,000 పై చిలుకు తీసుకోబడుతోంది. ప్రాథమికంగా 54 విద్యాసంస్థలలో ప్రవేశానికి ఉపయోగపడిన ఈ పరీక్ష,ఇప్పుడు 1,500 పైచిలుకు విద్యాసంస్థలకు మరి ప్రపంచవ్యాప్తంగా 1,800 కార్యక్రమాలకు ఉపయోగపడుతోంది.

2005 తరువాత,GMAC ఈ పరీక్షను నిర్దేశిస్తోంది. 2006 జనవరి 1 తేదీన GMAC విక్రయించువారిని ACT Inc అనే సమ్మేళనానికి మార్చింది.అది పరీక్షా ప్రశ్నలను మరి CAT సాఫ్ట్వేర్ ను పెంపొందిస్తుంది.ఇంకా పియర్సన్ వ్యూ ప్రపంచవ్యాప్తంగా పరీక్షను,పరీక్షాకేంద్రాలలో జరుపుతుంది.

2008 జూన్ 23న ఒక మోసం చేసిన అపనింద(చీటింగ్ స్కాన్దిల్)జరిగినట్లు GMAC ఒప్పుకుంది. అందులో సుమారు 6,000 మంది పరీక్షను వ్రాసేవారు స్కోర్ టాప్.కాం(ScoreTop.com)అనే వెబ్ సైట్ కి చందాదారులుగా చేరి నిత్యం GMAT వాడేటటువంటి "లైవ్" ప్రశ్నలను చూసి ఉండవచ్చు. చందాదారుల గుణములను పనికిరానివిగా చేయటం, వారు సంపాదించిన గుణములను స్వీకరించిన విద్యాసంస్థలకు ఈ విషయం తెలియపరచటం మరియు వారిని భవిష్యత్తులో జరుగు పరీక్షల నుండి బహిష్కరించటం వంటి చాలా కఠినమైన నిర్ణయాలు GMAC తీసుకుంది. జూన్ 27న GMAC స్కోర్ టాప్ యొక్క వెబ్ సైట్ ను ఉపయోగించి మోసగించిన వారిపై మాత్రమే ఈ నిర్ణయం ప్రభావం చూపుతుందని దరఖాస్తుదారులకు భరోసాఇచ్చారు.[8] ఈ అపనింద(స్కాన్దిల్) వలన 84 మంది గుణములను రద్దుచేయటం జరిగిందని ది వాల్ స్ట్రీట్ జర్నల్ తరువాత తెలియపరచింది.[9]

అంతేకాక "ప్రాక్సీ" లేక "రింగర్" అనే పద్ధతుల ద్వారా వేరే వారికి డబ్బు చెల్లించి వారి తరఫున పరీక్ష-తీసుకునే వారికి ప్రతిచర్యగా,GMAC ఇప్పుడు

పరీక్షా కేంద్రాల దగ్గర ఈ సంవత్సరం ఫ్యూజిట్సూపాల్మ్ సెక్యూర్ (అరచేతిలోని సిరను సూక్ష్మంగా శోధించే విద్యుత్పరికర యాంత్రిక జ్ఞానం)ను పరిచయం చేయబోతూఉంది. కొరియా మరియు భారతదేశాలలోని కేంద్రాలకు ఈ అరచేతిని శోధించే విద్యుత్పరికరాలు ముందుగా అందజేయబడతాయి. తరువాత 2008 శిశిరం సమయానికి యునైటెడ్ స్టేట్స్ కు పంపబడతాయి. అన్నిపరీక్షా కేంద్రాలకు 2009 మే నాటికి వీటిని చేర్చాలని GMAC యొక్క ఆలోచన.[10]

2013 నాటికి ప్రారంభించనున్న మరుసటి తరం GMAT(నెక్స్ట్ జెనరేషన్ GMAT)అనేదాని కోసం GMAC కొన్నిప్రణాలికలు ప్రకటించింది. అంతర్జాతీయ తేడాలను మరింత నిర్దుష్టంగా దృష్టిలోనికి తీసుకోవటం జరుగుతుంది.[11]

నమోదు చేయుట మరియు సన్నాహము[మార్చు]

 • GMAT పరీక్ష వ్రాయగోరు వారు,వారి పేరును ఆన్-లైన్ లో కానీ లేక ఒక పరీక్షా స్థలమునకు ఫోన్ చేసి కానీ నమోదు చేసుకోవాలి. ఒక పరీక్షను నిర్ణయించి జాబితాలో చేర్చాలంటే పేర్కొనబడిన పరీక్షా స్థలాలో ముందుగా తెలియజేయవలసి ఉంటుంది.
 • మూడవ-పక్ష అధ్యయన సన్నాహ పరికరాలు దొరుకుతాయి:GMAT పుస్తకాలు ఉపయోగించి సొంతంగా-చదివేదానికి తరగతిలో దొరికే GMAT అధ్యయన సన్నాహ కోర్సులు(ప్రత్యక్షంగా లేక ఆన్-లైన్)లేదా వ్యక్తిగత శిక్షణ.

ఇతర వివరాలు[మార్చు]

 • కాల్క్యులేటర్లు GMAT పరీక్ష సమయమందు ఒప్పుకోబడవు.లెక్కించటం స్వయంగా చేయాలి.
 • పరీక్షా సమయములో పరీక్ష వ్రాసేవారు ధరించే డిజిటల్ గడియారములుస్వాధీనం చేసుకోబడవచ్చు.
 • GMAT అభ్యాస పరీక్షలు బహుళ వ్యాప్తంగా దొరకును.

ఇవి కూడా చూడండి[మార్చు]

సూచనలు[మార్చు]

 1. http://www.gmac.com/NR/exeres/7B5FBE35-23F3-48E4-8E6F-D3D3C9B2347D,frameless.htm?SSLSwitch=1
 2. 2.0 2.1 2.2 "What Your Percentile Ranking Means". Retrieved 2009-11-09. Cite web requires |website= (help)
 3. 3.0 3.1 GMAC.com. విశ్లేషనాత్మకమైన వ్రాత నిర్ధారణ గుణమును అర్ధం చేసుకుని మరి ఉపయోగించుకునే వెబ్ సైట్ సమాచారం పొందినది జులై 12,2007.
 4. GMAC.com ఆన్ ఇవాల్యుయేషణ్ ఆఫ్ ఇన్టెల్లిమెట్రిక్ ఎస్సే స్కోరింగ్ సిస్టం యూజింగ్ రెస్ఫోన్సిస్ టు GMAT AWA ప్రామ్ప్త్స్ సమాచారం పొందింది జులై 12,2007.
 5. 5.0 5.1 http://www.mba.com/mba/takethegmat/theessentials/gmatscoresandreports/understandingyourgmatscores.htm
 6. 6.0 6.1 6.2 పట్టభద్ర నిర్వహణ ప్రవేశ సభ(కౌన్సిల్),(2005). "ది ఒఫ్ఫీషియల్ గైడ్ ఫర్ GMAT,రివ్యూ 11వ ముద్రణ",పుట 637. బ్లాక్వెల్ ప్రచురణ సంస్థ(పబ్లిషింగ్ Ltd.)
 7. GMAC.(2006)పట్టభద్ర నిర్వహణ ప్రవేశపరీక్ష అభ్యర్ధుల సంక్షిప్త జీవన వివరణ:అయిదు సంవత్సరముల సంక్షేపము. సమాచారం పొందింది జులై 10,2007.
 8. GMAT చీటింగ్ స్కాన్దిల్:ఆన్సర్స్ ఫ్రం GMAC బిజినెస్ వీక్ జూన్ 30,2008.
 9. GMAT గుణములను విద్యా సంస్థలు రద్దు చేయుట
 10. "Business Schools Try Palm Scans to Finger Cheats". The Wall Street Journal. Retrieved 2008-07-25. Cite news requires |newspaper= (help)
 11. http://www.gmac.com/gmac/TheGMAT/The+Next+Generation+GMAT/

వెలుపటి వలయము[మార్చు]