పడోసన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Padosan
దస్త్రం:Padosan film poster.jpg
Film poster
దర్శకత్వము Jyoti Swaroop
నిర్మాత Mehmood, N. C. Sippy
రచన Rajendra Krishan
తారాగణం Sunil Dutt, Saira Banu, Kishore Kumar, Mehmood
సంగీతం Rahul Dev Burman
సినిమెటోగ్రఫీ K.H.Kapadia
కూర్పు D.N.Pai
డిస్ట్రిబ్యూటరు Kailash Dossani Investments Pvt. Ltd., Mehmood Productions
విడుదలైన తేదీలు 1968
నిడివి 157 min.
దేశము India
భాష Hindi

పడోసన్ (హిందీ: पड़ोसन, ఉర్దూ: پڑوسن) ఒక 1968 నాటి భారతీయ హిందీ చిత్రం. ఉస్మాన్ ఆలీ చే నిర్మించబడి, మరియు రాజేంద్ర క్రిషన్ చే వ్రాయబడి, జ్యోతి స్వరూప్ చే దర్శకత్వం వహించబడింది. సంగీతం ఆర్.డీ బర్మన్ చేశారు.

ఇండియా టైమ్స్ మూవీస్ ఈ చిత్రాన్ని తప్పనిసరిగా చూడవలసిన తొలి 25 బాలీవుడ్ చిత్రాలలో ఒకటిగా ర్యాంకు ఇచ్చింది.[1]

ఇది సరదాగా సాగే ఒక హాస్యచిత్రం మరియు సామాన్యు డైన భోలా (సునీల్ దత్) మరియు అతని పొరుగింటిలోని బిందు (సైరా బానూ) గురించి తెలిపే ఒక కథ. దత్ తన పొరుగింటి అమ్మాయితో ప్రేమలో పడి, ఆమెను తన స్నేహితుల (కిషోర్ కుమార్, ముక్రి, రాజ్ కిషోర్ మరియు కేష్టో ముకర్జీ) సహాయంతో ప్రేమలో పడేలా చేయటానికి ప్రయత్నిస్తాడు. మెహమూద్ ఒక దక్షిణభారత సంగీతకారుడిగా మరియు సునీల్ దత్ కు పోటీగా ఉండడం ఈ చిత్రం యొక్క ముఖ్య అంశాలు.

ఈ చిత్రం అరుణ్ చౌధరి రచించిన "పశేర్ బారి" [1] అనే ఒక బెంగాలి కథ పై ఆధారపడినది. దీనిని ముందుగా 1952లో బెంగాలిలో అనుసరించారు.[2] ఈ చిత్రం తెలుగులో అంజలి దేవి, రేలంగి, మరియు గాయకుడు ఎ.ఎం.రాజా తారాగణంతో పక్కింటి అమ్మాయి (1953)[3] అనే పేరుతోనూ కన్నడలో రాఘవేంద్ర రాజ్‌కుమార్ మరియు అనంత్ నాగ్ తారాగణంతో 'పక్కదమనే హుడుగి' (2003) అనే పేరుతోనూ తమిళంలో అడుత వీట్టు పెణ్ (1960) అనే పేరుతోనూ తీయబడింది. ఇదే చిత్రం మళ్ళ తెలుగులో పక్కింటి అమ్మాయి (1981) అనే పేరుతో జయసుధ, కే. చక్రవర్తి మరియు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం తారాగణంతో తీయబడింది.

సారాంశం[మార్చు]

భోలా (సునీల్ దత్ ) అనే ఒక సామాన్యుడు బిందు (సైరా బాను) అనే పక్కింటి అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆమెని పాట పాడి మెప్పించాలని అనుకుంటాడు. కాని అతను ఒక మంచి గాయకుడు కాదు అందువలన గురు విద్యాపతి (కిషోర్ కుమార్) అనే తన మిత్రుడి సహాయం తీసుకుంటాడు. ప్రసిద్ధ గాయకుడైన గురు తన మిత్రుడికి సహాయం చేయడానికి ఒప్పుకుంటాడు.. బిందుని మెప్పించడం కొరకు గురు నేపథ్యంలో పాడితే, భోలా ఆ మాటలని పలికినట్లుగా నటిస్తాడు. భోలానే పాడుతున్నాడని అనుకోని బిందు బాగా ఆకర్షించబడుతుంది. వారిద్దరూ స్నేహితులుగా అవుతారు తరువాత ప్రేమలో పడతారు. బిందుకు సంగీతం నేర్పించే మాస్టర్ పిళ్లై/మాస్టర్జి (మెహమూద్) అనే సంగీత మాస్టారు కూడా ఆమెతో ప్రేమలో పడి, ఆమెను పెళ్ళి చేసుకుంటానని చెపుతూ ఉంటాడు. బిందు భోలాను ప్రేమించడంతో మాస్టర్జిని తిరస్కరిస్తుంది.

ఒక రోజు భోలా యొక్క మోసం గురించి బిందు తెలుసుకుంటుంది. ఆమె చాలా నిరాశ చెంది భోలాను కలవడానికి నిరాకరిస్తుంది. కోపంలో, ఆమె మాస్టర్జిని పెళ్ళి చేసుకోవాలని నిర్ణయిస్తుంది. ఇద్దరూ వివాహానికి సన్నాహాలు చేస్తారు, భోలా మాత్రం బిందుని ఎలా తిరిగి పొందాలా అని ఆలోచిస్తాడు.

పెళ్లి రోజున గురు ఒక ఉపాయం చెపుతాడు. భోలా ఆత్మహత్య చేసుకున్నట్లుగా నటించమని చెపుతాడు. ఒక అబద్ధపు ఆత్మహత్య కాగితాన్ని భోలా పక్కన పెడతాడు. భోలా మెడ చుట్టూ ఒక ఉచ్చు ఉండి అతని పక్కన ఒక కుర్చీ ఉంటుంది. గురు వెళ్లి బిందుకు విషయం చెపుతాడు. ఆమె బిత్తరపోతుంది. వివాహ వేదికను వదిలి భోలా దగ్గరకు పరుగులు తీస్తుంది. కాగితం చదివి తన పనికి పశ్చాత్తాపపడుతుంది. భోలాను లేపడానికి బిందు ప్రయత్నిస్తుంది. భోలా లేస్తాడు, బిందు సంతోషపడుతుంది. భోలాను పెళ్ళి చేసుకుంటానని ఆమె మాస్టర్జికి చెపుతే, అతను ఒప్పుకుంటాడు. భోలా, బిందు ఇద్దరికీ వివాహం అవుతుంది.

సంగీతం[మార్చు]

ఈ చిత్రానికి సంగీతాన్ని రాహుల్ దేవ్ బుర్మన్ సమకూర్చగా పాటలను రాజేంద్ర క్రిషన్ రచించారు.

ఈ చిత్రంలో ఈ క్రింద పాటలు ఉన్నాయి:

 • మేరె సామ్నే వాలి ఖిడ్కి మెయిన్ (కిషోర్ కుమార్)
 • భాయి భాతుర్ (లతా మంగేష్కర్)
 • ఏక చతుర్ నార్ కర్కె శ్రింగార్ (కిషోర్ కుమార్, మన్న దే )
 • కెహన హై (కిషోర్ కుమార్)
 • మెయిన్ చాలి మెయిన్ చాలి (లతా మంగేష్కర్)
 • మేరె భోలే బలం (కిషోర్ కుమార్)
 • శర్మ్ ఆతి హై మగర్ (లతా మంగేష్కర్)
 • సావరియా సావరియా (మన్నా డే)

'ఏక్ చతుర్ నార్' (కిషోర్ కుమార్, మన్నా డే పాడిన ఒక డ్యూయట్ పాట) అనే పాటను రికార్డ్ చేస్తున్న సమయములో, కిషోర్ కుమార్ ఈ పాటకు కొంత వరకు అక్కడక్కడే మార్పులు చేసారు. కిషోర్ కుమార్ కంటే తాను బాగా పాడగలని చూపించడం కొరకు మన్నా దే, ఆ పాట యొక్క భావాన్ని అద్భుతంగా వ్యక్తపరిచి 'ఏక్ చతుర్ నార్' ను శాశ్వతంగా గుర్తుండేలా చేసారు. ఆ పాట చిత్రీకరణ సమయములో ఇద్దరు హీరోల (దత్ మరియు మెహమూద్) మధ్య జరిగే పాటల పోటీలో దత్ గెలిచినట్లుగా చూపించడాన్ని మన్నా దే భరించలేక పోయారు. దత్ కు నేపథ్య గాయకుడు కిషోర్. సాంప్రదాయబద్దంగా సంగీతం నేర్చుకున్న తన లాంటి ఒక గాయకుడు, ఏ శిక్షణ-లేని ఒక గాయకుడు (కిషోర్) దగ్గర ఓడిపోవడం డేకు నచ్చలేదు, అది తెర పైన మాత్రమే అయినా. పాటలో, కొన్ని సార్లు, మెహమూద్ "సుర్ గడ్బడ్ జీ" అని సునీల్ దత్ కు ఎదురుగా, కిషోర్ పాడుతున్నప్పుడు చెప్పవలసి వచ్చింది. అందువలన డే ఆ మాటలను చెప్పడానికి నిరాకరించడంతో, మెహమూద్ వాటికి తన సొంత స్వరాన్ని అందించాడు.

ఆ చిత్రంలో కిషోర్ కుమార్ పాత్ర అతని మామ అయిన ధనంజయ్ బెనర్జీ (ఒక సాంప్రదాయక గాయకుడు),[4] మరియు సంగీత దర్శకుడు కేమ్చాండ్ ప్రకాష్ వ్యక్తిత్వాల పై ఆధారపడి ఉంది.

తారాగణం[మార్చు]

 • సునీల్ దత్ .... భోలాగా
 • సైరా బాను .... బిందూగా
 • మెహమూద్ .... మాస్టర్ పిళ్లై / మాస్టర్జిగా
 • కిషోర్ కుమార్ .... విద్యాపతిగా (భోలా మిత్రుడు)
 • ముక్రి .... బనర్సి గా
 • కేశ్తో ముకర్జీ .... కొల్కతియ గా
 • రాజ్ కిషోర్ .... లాహోరి గా
 • ఓం ప్రకాష్ .... కున్వర్ ప్రతాప్ సింగ్ గా (భోలా మామ)
 • దులారి .... భోలా అత్తగా
 • ఆగా .... బిందూ తండ్రిగా
 • సుందర్ .... పండిట్ జానకి ప్రసాద్ గా

సూచనలు[మార్చు]

బాహ్య లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=పడోసన్&oldid=2213035" నుండి వెలికితీశారు