పతంగ్
| పతంగ్ | |
|---|---|
| దర్శకత్వం | ప్రణీత్ ప్రత్తిపాటి[1] |
| స్క్రీన్ ప్లే | ప్రణీత్ ప్రత్తిపాటి |
| కథ | ప్రణీత్ ప్రత్తిపాటి |
| నిర్మాత |
|
| క్రియేటివ్ నిర్మాత | నాని బండ్రెడ్డి |
| తారాగణం |
|
| ఛాయాగ్రహణం | శక్తి అరవింద్ |
| కూర్పు | శక్తి అరవింద్ |
| సంగీతం | జోస్ జిమ్మీ |
నిర్మాణ సంస్థలు |
|
విడుదల తేదీ | 2025 డిసెంబరు 25 |
| దేశం | భారతదేశం |
| భాష | తెలుగు |
పతంగ్ 2026లో విడుదలైన రొమాంటిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా సినిమా. దగ్గుబాటి సురేష్ బాబు సమర్పణలో[2] సినిమాటిక్ ఎలిమెంట్స్, రిషాన్ సినిమాస్ బ్యానర్‌పై విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మక, సురేష్ కొత్తింటి నిర్మించిన ఈ సినిమాకు ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకత్వం వహించాడు. ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్, ప్రీతి పగడాల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2024 మే 2న,[3] ట్రైలర్‌ను 2025 డిసెంబర్ 15న విడుదల చేసి,[4] సినిమాను డిసెంబర్ 25న విడుదల చేశారు.[5]
పతంగ్ సినిమా నుండి సన్‌నెక్స్‌ట్ ఓటీటీ & అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో 2026 జనవరి 30 నుండి స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[6]
కథ
[మార్చు]అరుణ్ (ప్రణవ్ కౌశిక్) ఒక డబ్బున్న కుటుంబంలో అమ్మా, నాన్నలతో పెద్దగా బాండింగ్ లేకుండా పెరుగుతాడు. విస్కీ (వంశీ పుజిత్) మధ్యతరగతి బస్తీ కుర్రాడు. వీరిద్దరిని ఒక పతంగి కలుపుతుంది. అలా వీరిద్దరు ప్రాణ స్నేహితులుగా పెరిగి పెద్దవుతారు. అరుణ్ అమెరికా వెళ్ళడానికి సిద్ధం అవుతాడు, విస్కీ పానీపూరి బండి పెట్టుకుంటాడు. ఈ క్రమంలో ఐశ్వర్య(ప్రీతి పగడాల) విస్కీ దగ్గరికి పానీపూరి తినడానికి వచ్చి ఇద్దరికీ పరిచయం ఏర్పడి ప్రేమించుకుంటారు. విస్కీ ఐశ్వర్యని తన మిత్రులకి పరిచయం చేశాక ఐశ్వర్య అరుణ్ ని ఇష్టపడుతుంది. ఐశ్వర్య రాకతో అరుణ్, విస్కీ మధ్య గొడవ జరుగుతుంది ? వీళ్ళ మధ్యలోకి గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఎందుకు వచ్చాడు? ఆ తర్వాత ఏం జరిగింది? అనేదే మిగతా సినిమా కథ.[7][8]
నటీనటులు
[మార్చు]- అరుణ్ గా ప్రణవ్ కౌశిక్
- ఐశ్వర్యగా ప్రీతి పగడాల
- విస్కీగా వంశీ పూజిత్
- ఎస్. పి. చరణ్
- అను హాసన్
- గౌతమ్ వాసుదేవ్ మీనన్
- వడ్లమాని శ్రీనివాస్
- విష్ణు ఓయి
- ఎస్.ఎస్. కాంచి
- అదితిగా పాము విజ్ఞాని
పాటలు
[మార్చు]ఈ సినిమాకి నేపథ్య సంగీతం, పాటలను జోస్ జిమ్మీ స్వరపరిచాడు.
| సం. | పాట | పాట రచయిత | గాయకుడు(లు) | పాట నిడివి |
|---|---|---|---|---|
| 1. | "హే హలో నమస్తే[9]" | శ్రీమణి | శంకర్ మహదేవన్ | 4:43 |
| 2. | "అందాల తారకాసి[10]" | శ్రీమణి | జెస్సీ గిఫ్ట్, ఎం.ఎం. మానసి | 4:03 |
| 3. | "హవా హవా" | జోస్ జిమ్మీ | జోస్ జిమ్మీ | 3:30 |
| 4. | "ఎమోషనల్ డ్రామా[11]" | శ్రీమణి | ఆంథోని దాసన్ , సాహితీ చాగంటి | 4:15 |
| 5. | "ఓ రంగ" | ప్రణీత్ ప్రత్తిపాటి | ఆంథోని దాసన్ , సాహితీ చాగంటి | 4:14 |
| 6. | "తాయ్ తై తాయ్" | శ్రీమణి | శక్తిశ్రీ గోపాలన్ | 4:28 |
| 7. | "మాంఝా - వైబ్ ఆఫ్ పతంగ్" | – | మాంఝా - వైబ్ ఆఫ్ పతంగ్ | 1:53 |
| 8. | "అథారా బుథారా" | జోస్ జిమ్మీ | తరుణి పొట్నురు | 1:24 |
| 9. | "రామ రామ" | జోస్ జిమ్మీ | యశ్వంత్ నాగ్ | 2:17 |
మూలాలు
[మార్చు]- ↑ "పతంగ్‌ను థియేటర్‌లో చూసి అందరూ ఎంజాయ్ చేస్తున్నారు : దర్శకుడు ప్రణీత్ పత్తిపాటి". NT News. 29 December 2025. Archived from the original on 3 February 2026. Retrieved 3 February 2026.
- ↑ "సురేశ్ బాబు సహకారంతో ఎగరబోతున్న 'పతంగ్'". Chitrajyothy. 29 November 2025. Archived from the original on 3 February 2026. Retrieved 3 February 2026.
- ↑ "యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా 'పతంగ్'.. టీజర్ చూశారా.!". NT News. 3 May 2024. Archived from the original on 3 February 2026. Retrieved 3 February 2026.
- ↑ "ఫ్రెండ్‌షిప్, లవ్ ఎంటర్‌టైనర్ 'పతంగ్' ట్రైలర్..!". NTV Telugu. 15 December 2025. Archived from the original on 3 February 2026. Retrieved 3 February 2026.
- ↑ "డిసెంబరు 25న ప్రపంచవ్యాప్తంగా పతంగ్ సినిమా విడుదల". NT News. 24 November 2025. Archived from the original on 3 February 2026. Retrieved 3 February 2026.
- ↑ "ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ 'పతంగ్' - ఆ ప్లాట్ ఫాంలో స్ట్రీమింగ్". ABP Desam. 29 January 2026. Archived from the original on 3 February 2026. Retrieved 3 February 2026.
- ↑ "'పతంగ్' మూవీ రివ్యూ!". Telugu Prabha Telugu Daily. 26 December 2025. Archived from the original on 3 February 2026. Retrieved 3 February 2026.
- ↑ "'పతంగ్' మూవీ రివ్యూ.. గాలిపటాల పోటీ కాన్సెప్ట్ ఎలా ఉందంటే?". News18 Telugu. 26 December 2025. Archived from the original on 3 February 2026. Retrieved 3 February 2026.
- ↑ "పాతబస్తీలో 'పతంగ్' పాట వదిలారు." Chitrajyothy. 10 March 2024. Archived from the original on 3 February 2026. Retrieved 3 February 2026.
- ↑ "జెస్సీ గిఫ్ట్ స్వరం మళ్లీ వినిపిస్తోంది.. 'అందాల తారకాసి' అంటూ మెస్మరైజ్ చేస్తున్న జెస్సీ". NT News. 8 August 2024. Archived from the original on 3 February 2026. Retrieved 3 February 2026.
- ↑ "'Emosanal Drama' from Patang released by producer Suresh Babu" (in ఇంగ్లీష్). Cinema Express. 28 November 2025. Archived from the original on 3 February 2026. Retrieved 3 February 2026.