పత్తిపాటి రామయ్య నాయుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డా. పత్తిపాటి రామయ్య నాయుడు
Dr. Pattipati Ramaiah Naidu, ca. 1948
జననం(1904-06-03)1904 జూన్ 3
మదనపల్లె, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
మరణం1991 జూన్ 6(1991-06-06) (వయసు 87)
జాతీయతభారతీయుడు
రంగములుభౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, అణు భౌతికశాస్త్రం, రేడియాలజీ, ఎక్స్‌పెరిమెంటల్ ఫిజిక్స్
వృత్తిసంస్థలురేడియమ్‌ ఇన్‌స్టిట్యూట్, పారిస్ విశ్వవిద్యాలయం, లండన్ విశ్వవిద్యాలయం, మెమొరియల్ స్లోవన్-కెట్టరింగ్ కేన్సర్ సెంటర్, టాటా మెమొరియల్ సెంటర్, యునెస్కో
చదువుకున్న సంస్థలుబెనారస్ హిందూ విశ్వవిద్యాలయం, పారిస్ విశ్వవిద్యాలయం, లండన్ విశ్వవిద్యాలయం
ప్రసిద్ధిరేడియో ధార్మికత, రేడియం, , అణు భౌతికశాస్త్రం,

పత్తిపాటి రామయ్య నాయుడు (జూన్ 1904-జూన్ 1991) ప్రఖ్యాతిగాంచిన అణుశాస్త్రవేత్త, వైద్య వైజ్ఞానికుడు, రేడియోధార్మిక శాస్త్రజ్ఞుడు. వైద్య భౌతిక శాస్త్రము ఆవిష్కరించినవారిలో ఆద్యుడు. పారిస్ లో నోబెల్ బహుమతి గ్రహీత మేడం క్యూరీ వద్ద పరిశోధనలు చేసిన మేధావి. 1938లో భారతదేశములో మొట్టమొదటి అణుధార్మిక పరిశోధనశాల స్థాపించిన వాడు.

బాల్యము, విద్య

[మార్చు]

నాయుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము, చిత్తూరు జిల్లా, మదనపల్లిలో జూన్ 1904న జన్మించాడు.[1] చిన్న వయసులోనే ఇల్లు వదలి పుదుచ్చేరి లోని అరవిందాశ్రమములో చేరాడు. పిదప బెంగాల్ లోని శాంతినికేతన్లో గణితశాస్త్రము బోధించాడు. కాశీ విశ్వవిద్యాలయములో 1923 లో పట్టభద్రుడయ్యాడు. పారిస్ విశ్వవిద్యాలయంలో 1929లో ఎం.ఎస్.సి. డిగ్రీని, 1933లో డాక్టరేట్ పట్టాను పుచ్చుకున్నాడు.

పరిశోధనలు

[మార్చు]

ఇతడు తన డాక్టోరల్ థీసిస్ కొరకు క్యూరీ-కార్నెగీ రీసర్చ్ ఫెలోషిప్‌లో భాగంగా పారిస్ లోని రేడియమ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో మేడం క్యూరీతో కలిసి పనిచేశాడు. తరువాత ఇంగ్లాండుకు వెళ్ళి అక్కడ లండన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ పాట్రిక్ బ్లాకెట్ పర్యవేక్షణలో పరిశోధనలు చేసి 1936లో డాక్టరేట్ పట్టా సంపాదించాడు. 1936లో బొంబాయిలోని టాటా ట్రస్టు ఇతడిని కేన్సర్ వ్యాధి చికిత్స కోసం రాడాన్ ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించడానికి భారతదేశానికి ఆహ్వానించింది. 1938లో ఇతడు రేడియం సంగ్రహణ పరికరాలతో పాటు 2 గ్రాముల రేడియంతో బొంబాయిలోని టాటా మెమొరియల్ హాస్పెటల్‌కు తీసుకురాబడ్డాడు. ఇతని పర్యవేక్షణలో దేశంలోని మొట్టమొదటి రాడాన్ ప్లాంట్ నిర్మించబడి 1941 ఫిబ్రవరి 28న టాటా మెమొరియల్ ఆసుపత్రి ప్రారంభమైంది. ఈ ఆసుపత్రి 1952లో భారత ప్రభుత్వపు అణు ఇంధనశాఖకు బదిలీ అయ్యింది.

వ్యక్తిగతము

[మార్చు]

మదనపల్లె (చిత్తూరు) నకు చెందిన భౌతిక శాస్త్రవేత్త పత్తిపాటి రామయ్య నాయుడు కుమార్తె లీల హిందీ చలనచిత్ర నటి. రామయ్య పారిస్ లోని UNESCO శాస్త్ర సలహాదారుగా పనిచేయుచున్నపుడు ఫ్రెంచి వనిత మార్తాను వివాహమాడాడు. వీరికి లీల 1940 సంవత్సరములో జన్మించింది. మార్తా భారతదేశానికి సంబంధించిన విషయములలో పరిశోధకురాలు (Indologist).

మూలాలు

[మార్చు]
  1. వెబ్ మాస్టర్. "DR. RAMAIAH NAIDU". Association of Medical Physicists of India. AMPI. Archived from the original on 2 ఏప్రిల్ 2012. Retrieved 19 May 2020.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)