Jump to content

పది ఆజ్ఞలు

వికీపీడియా నుండి


1768 లో యెకుథీల్ సోఫర్ తోలు మీద చిత్రించిన 10 ఆజ్ఞలు (612x502 మి.మీ). ఇది ఆంస్టర్‌డాం ఎస్నోగా సినగాగ్ లోని 1675 10 ఆజ్ఞలను అనుకరిస్తున్నది.

పరిశుద్ధ బైబిలులో చెప్పబడిన పది ఆజ్ఞలు

పది ఆజ్ఞలు క్రైస్తవ విశ్వాసానికి ప్రధానమైన సూత్రాల సమితి, నైతికత, నైతికత యొక్క పునాదిగా పరిగణించబడతాయి. ఈ ఆజ్ఞలు దేవుడు సీనాయి పర్వతంపై మోషేకు ఇచ్చాడు, పవిత్ర బైబిల్‌లోని నిర్గమకాండము పుస్తకంలో నమోదు చేయబడ్డాయి. మానవులు ధర్మబద్ధమైన జీవితాన్ని ఎలా జీవించాలో, దేవునితో ఎలా సంపూర్ణమైన సంబంధాన్ని కలిగి ఉండాలో మార్గదర్శకాన్ని అందిస్తాయి.

బైబిల్ లోని నిర్గమ కాండము 20:2-17, ద్వితీయోపదేశ కాండము 5:6--21 లలో దేవుడు మోషేకు రాతి పలకలపై ఈ పది ఆజ్ఞలను చెక్కి ఇచ్చాడని ఉంది.ఈ ఆజ్ఞల గురించి “నీ దేవుడనైన యెహోవాయను నేను రోషముగల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీద రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని వెయ్యితరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను” అని తెలియ జేశాడు..

  1. "నీ దేవుడైన యెహోవాను నేనే. నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు"
  2. " పైన ఆకాశమందేగాని క్రింది భూమియందేగాని భూమిక్రింద నీళ్ళయందేగాని యుండు దేని రూపమునయినను విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు."
  3. "నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింప కూడదు."
  4. "విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము."
  5. "నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము"
  6. "నీవు చంపకూడదు " (చాలామంది క్రైస్తవులు తప్పుగా ఈ పదాన్ని మార్చేశారు నర హత్య చెయ్యకూడదు అని తప్పుగా తెలుగు బైబిల్ లో మార్చేశారు.) ఎక్కడ అర్ధం దేనినైనా అని .
  7. "వ్యభిచారం చేయకూడదు ( పెళ్ళిచేసుకొన్న వారితొ కాక మరొకరితొ రతిలొ పాల్గొనకూడదు )"
  8. "దొంగతనం చేయకూడదు"
  9. "నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలుక కూడదు"
  10. "నీ పొరుగువాని ఇల్లు ఆశింప కూడదు. నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింప కూడదు."