పద్మప్రియ భళ్లముడి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
పద్మప్రియ భల్లమూడి
Padmapriya Bhallamudi.jpg
జననం (1979-08-11) 11 ఆగస్టు 1979 (వయస్సు: 38  సంవత్సరాలు)
హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
నివాసం హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
జాతీయత భారతీయురాలు
జాతి తెలుగు
వృత్తి నటి
క్రియాశీలక సంవత్సరాలు 1995 - ప్రస్తుతం
తల్లిదండ్రులు కృష్ణమూర్తి, కళ్యాణి
బంధువులు సిహెచ్. నటరాజ్ (భర్త), స్నిగ్ధ (కూతురు)

పద్మప్రియ భళ్లముడి ప్రముఖ రంగస్థల నటి, మరియు దర్శకురాలు, అధ్యాపకురాలు. 1992లో రంగస్థలంపై అడుగుపెట్టిన పద్మప్రియ, దాదాపుగా 500లకు పైగా ప్రదర్శనల్లో పాల్గొని, అనేక బహుమతులను అందుకుంది.

జననం - విద్యాభ్యాసం[మార్చు]

పద్మప్రియ 1979, ఆగష్టు 11న భళ్లముడి కృష్ణమూర్తి, కళ్యాణి దంపతులకు హైదరాబాద్ లో జన్మించింది. డిగ్రీ (బి.కాం.) పూర్తిచేసిన పద్మప్రియ, కేంద్రీయ విశ్వవిద్యాలయం లోని రంగస్థలశాఖలో ఎం.పి.ఏ. చదివారు. తెలుగు విశ్వవిద్యాలయం లో పిహెచ్.డి. చేసింది.

రమణాచారి నుండి సత్కారం అందుకుంటున్న పద్మప్రియ దంపతులు

వివాహం - ఉద్యోగ జీవితం[మార్చు]

సిహెచ్. నటరాజ్ తో పద్మప్రియ వివాహం జరిగింది. వీరికి కూతురు (స్నిగ్ధ). తెలుగు విశ్వవిద్యాలయం లోని రంగస్థల కళలశాఖలో రంగస్థల అధ్యాపకులుగా పనిచేస్తున్నది.[1] [2]

రంగస్థల ప్రస్థానం[మార్చు]

1992లో ఏడవ తరగతిలోనే మళ్లీ గిళ్లీ పుడితే అనే నాటకం ద్వారా రంగస్థలంపై అడుగుపెట్టిన పద్మప్రియ సుమారు 500 నాటిక, నాటకాల్లో నటించడమేకాకుండా, 25 నాటికలకు దర్శకత్వం వహించింది. ఈవిడ నాటకరంగ గురువు దుగ్గిరాల సోమేశ్వరరావు.

నటించినవి[మార్చు]

 1. శ్రీనాథుడు (నాటకం)[3]
 2. కాగితం పులి
 3. చరమాంకం
 4. కాకిఎంగిలి
 5. క్రాస్ రోడ్స్
 6. ఎయిర్ ఇండియా
 7. వలయం
 8. సరిహద్దు
 9. బొమ్మ
 10. ప్రతిస్పందన
 11. అనగనగా ఒకరోజు
 12. నాటకాంతం
 13. అనగనగా ఒక అమ్మాయి
 14. నాగమండలం
 15. అగ్నివర్షం
 16. అంధయుగం
 17. అరక్త్ క్షణ్
 18. అమరావతి కథలు
 19. వేమన
 20. బొబ్బలియుద్ధం
 21. కప్పలు
 22. సుందరీసుందరుడు
 23. కళ్యాణి
 24. గబ్బర్ సింగ్
 25. చీమ కుట్టిన నాటకం
 26. గాయత్రి ఢాటరాఫ్ బషీర్ అహ్మద్

దర్శకత్వం చేసినవి[మార్చు]

 1. మాయ
 2. ఆంటిగనీ
 3. పెన్‌స్ట్రోక్‌[4]
 4. కాగితం పులి
 5. కౌముదీమహోత్సవం
 6. త్యాగమయి
 7. కుందేటి కొమ్ము
 8. కలహాల కాపురం
 9. కట్టుబానిస
 10. శాంతి
 11. మనస్తత్వాలు

బహుమతులు[మార్చు]

నాలుగుసార్లు నంది బహుమతి అందుకున్న పద్మప్రియ వివిధ పోటీలలో 50కి పైగా ఉత్తమ నటి బహుమతులను అందుకుంది.

నంది బహుమతులు:

 1. ఉత్తమ నటి - (సాంఘీక నాటిక) - నంది నాటక పరిషత్తు - 2004
 2. ఉత్తమ హాస్యనటి - గబ్బర్ సింగ్ (సాంఘీక నాటిక) - నంది నాటక పరిషత్తు - 2013

ఇతర బహుమతులు:

 1. ఉత్తమ నటి - కళ్లు (నాటిక) - జాతీయ పురస్కారం
 2. జవ్వాది రంగస్థల పురస్కారం

టీవిరంగ ప్రస్థానం[మార్చు]

1995లో జె.వి. సోమయాజులు దర్శకత్వంలో లఘుచిత్రంలో నటించడం జరిగింది. దూరదర్శన్ లో వచ్చిన కన్యాశుల్కం ధారావాహిక ద్వారా టీవిరంగంలోకి ప్రవేశించింది. అటుతరవాత లేడి డిటెక్టీవ్, ఇంటింటి రామాయణం, పల్నాటి వీరభారతం, ఆలుమగలు, బంధం, ఆశ వంటి ఈటీవి, జెమినీ టీవీ ఛానల్స్ ధారావాహికల్లో నటించింది.

ఇతర వివరాలు[మార్చు]

 1. తెలుగు రాష్ట్రాలనుండి నాటకరంగంలో పిహెచ్.డి చేసిన మొదటి మహిళ
 2. తెలుగు రాష్ట్రాలనుండి రంగస్థల శాఖాధిపతి పదవిని చేపట్టిన మొదటి మహిళ
 3. తెలుగు రాష్ట్రాలనుండి రంగస్థల కళల్లో నెట్ (అర్హత పరీక్ష) పొందిన మొదటి మహిళ
 4. తెలుగు రాష్ట్రాలనుండి రంగస్థల కళల్లో బంగారు పతకం సాధించిన మొదటి మహిళ
 5. యునైటెడ్ స్టేట్స్ లో శ్రీనాథుడు నాటకాన్ని 24 ప్రదర్శనలు ఇచ్చింది.

మూలాలు[మార్చు]