పద్మా దేవేందర్ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పద్మా దేవేందర్ రెడ్డి
పద్మా దేవేందర్ రెడ్డి


తెలంగాణ రాష్ట్ర తొలి డిప్యూటి స్పీకర్
పదవీ కాలం
12 జూన్ 2014 – 16 జనవరి 2019
ముందు పదవి ప్రారంభం
తరువాత టి. పద్మారావు గౌడ్

శాసనసభ్యురాలు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2014–2023
నియోజకవర్గం మెదక్ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1969-01-06) 1969 జనవరి 6 (వయసు 55)[1]
నామాపూర్, కరీంనగర్ జిల్లా, తెలంగాణ
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు గుండారెడ్డి - విజయ
జీవిత భాగస్వామి దేవేందర్ రెడ్డి
సంతానం ఒక కుమారుడు
నివాసం హైదరాబాదు

పద్మా దేవేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు,[2] తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభ డిప్యూటి స్పీకర్.[3] తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన పద్మా దేవేందర్ రెడ్డి రామాయంపేట శాసనసభ నియోజకవర్గం నుంచి 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు.[4][5] 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.[6] టెలివిజన్ రాజకీయ చర్చల్లో తరచుగా కనిపించే పద్మా దేవేందర్ రెడ్డి మంచి వాక్పటిమ కలవారు. పద్మా దేవెందర్ రెడ్డి 2022 జనవరి 26న టిఆర్ఎస్ పార్టీ, మెదక్ జిల్లా అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.[7]

జననం[మార్చు]

పద్మ దేవేందర్ రెడ్డి 1969, జనవరి 6న గుండారెడ్డి - విజయ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లా, నామాపూర్ గ్రామంలో జన్మించారు. ఆమె కరీంనగర్ లోని శాంతినికేతన్ పాఠశాలలో స్కూల్ విద్యను చదివి, బి.ఎ. ఎల్.ఎల్.బి. చేసారు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

పద్మ దేవేందర్ రెడ్డికి దేవేందర్ రెడ్డితో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు ఉన్నాడు.

వృత్తి జీవితం[మార్చు]

రాజకీయాలలోకి ప్రవేశించక ముందు రంగారెడ్డి జిల్లా కోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 1998 నుంచి 2001 వరకు న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్న ఈవిడ 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పడిన తర్వాత రాజకీయాలలోకి ప్రవేశించారు.

రాజకీయ జీవితం[మార్చు]

పద్మ దేవేందర్ రెడ్డి 2001 ఏప్రిల్ లో రాజకీయరంగంలోకి ప్రవేశించారు. 2001లో మెదక్ జిల్లా పరిషత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో రామాయంపేట నుండి జెడ్.పి.టి.సి.గా ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఫ్లోర్ లీడర్ గా పనిచేశారు. టిఆర్ఎస్ పార్టీ ఏర్పడిన తరువాత, 12,000 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. రామాయంపేట శాసనసభ నియోజకవర్గం నుండి 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2008లో శాసనసభ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసారు. 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయారు.

2009 లో టిఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ అయ్య, 2010 లో మళ్లీ పార్టీలో చేరారు.[8] 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలైన విజయశాంతిని ఓడించి ఎమ్మెల్యేగా మళ్ళీ గెలిచారు.[9] 2018లో అదే నియోజకవర్గం నుండి గెలుపొందారు.[10][11][12]

డిప్యూటి స్పీకర్[మార్చు]

పద్మ దేవేందర్ రెడ్డి 2014, జూన్ 12 నుండి 2019, జనవరి 16 వరకు తెలంగాణ రాష్ట్ర శాసన సభ డిప్యూటీ స్పీకర్ గా పనిచేసింది.[13][14]

హోదాలు[మార్చు]

  • జెడ్.పి.టి.సి. సభ్యురాలు, రామాయంపేట, మెదక్ జిల్లా,
  • తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఫ్లోర్ లీడర్
  • ఆంధ్రప్రదేశ్ శాసనసభ మహిళా-శిశు సంక్షేమ కమిటీ సభ్యురాలు .
  • ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రివిలేజెస్ కమిటీ సభ్యురాలు
  • తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ (12.06.2014 - 06.09.2018)
  • తెలంగాణ శాసనసభ పిటిషన్ల కమిటీ చైర్మన్ (29.06.2016 - 06.09.2018)
  • తెలంగాణ శాసనసభ ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ (6. 29.06.2016 - 06.09.2018)

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-04-22. Retrieved 2017-01-20.
  2. Telangana Legislature (2018). "Member's Profile - Telangana-Legislature". Archived from the original on 13 జూలై 2021. Retrieved 13 July 2021.
  3. "First Women deputy speaker in Telangana Legislative Assembly". TelanganaNewsPaper. 2017-01-06.
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-11-10. Retrieved 2017-01-20.
  5. http://www.thehansindia.info/News/Article.asp?category=1&subCategory=2&ContentId=7195[permanent dead link]
  6. నమస్తే తెలంగాణ, తెలంగాణ వార్తలు (12 December 2018). "అసెంబ్లీకి ఎన్నికైన తొమ్మిదిమంది మహిళలు". Archived from the original on 31 March 2019. Retrieved 31 March 2019.
  7. Namasthe Telangana (26 January 2022). "టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు వీరే.. ప్రకటించిన సీఎం కేసీఆర్‌". Archived from the original on 26 జనవరి 2022. Retrieved 26 January 2022.
  8. http://indiatoday.intoday.in/story/trs-chief-resigns-telangana-bandh-for-48-hours-begins/1/143686.html
  9. Sakshi (16 May 2014). "తెలంగాణలో విజేతలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
  10. ఈనాడు, తాజా వార్తలు. "తెలంగాణ ఫలితాలు: జిల్లాల వారీగా వివరాలు ఇలా." Archived from the original on 31 March 2019. Retrieved 31 March 2019.
  11. 10టివీ (17 January 2019). "దైవ సాక్షిగా: ఆరుగురు మహిళా ఎమ్మెల్యేలు ప్రమాణం". Archived from the original on 31 March 2019. Retrieved 31 March 2019.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  12. నమస్తే తెలంగాణ, తాజా వార్తలు (17 January 2019). "ముందుగా మహిళా ఎమ్మెల్యేలు". Archived from the original on 31 March 2019. Retrieved 31 March 2019.
  13. http://www.newindianexpress.com/states/telangana/Padma-All-Set-to-be-Telangana-House-Dy-Speaker/2014/06/12/article2276543.ece[permanent dead link]
  14. Eenadu (29 October 2023). "అంచెలంచెలుగా.. అత్యున్నతంగా." Archived from the original on 29 October 2023. Retrieved 29 October 2023.