Jump to content

పద కవితా సాహిత్యము

వికీపీడియా నుండి

పదకవితా సాహిత్యాన్ని సంకీర్తనా సాహిత్యమని కూడా అంటారు.ఈ సాహిత్యం మధుర కవితా శాఖకు చెందుతుంది.[మూలం అవసరం][1]

పదసాహిత్యానికి ఆధారమైనది సంగీత శాస్త్రము.

సంగీత శాస్త్రములో ప్రధానులు

[మార్చు]
  1. భరతుడు
  2. నారదుడు
  3. మతంగుడు
  4. మమ్మటుడు
  5. పార్శ్వదేవుడు
  6. అహవమల్ల సోమేశ్వరుడు
  7. సోమనార్యుడు
  8. జాయప సేనాని
  9. సారంగదేవుడు
  10. సర్వజ్ఞసింగభూపాలుడు
  11. గోపాలనాయకుడు
  12. విద్యారణ్యుడు
  13. కుమారగిరి రెడ్డి
  14. పెదకోమటి వేమారెడ్డి
  15. చతుర కల్లినాథుడు
  16. తాళ్లపాక అన్నమాచార్యుడు
  17. పురంధర దాసు
  18. భండారు లక్ష్మీనారాయణ
  19. రామామాత్యుడు
  20. అహోబల పండితుడు
  21. గోవింద దీక్షితుడు
  22. వేంకటమఖి

పదసాహిత్యానికి ముందుగా సంగీతం అందించిన మహానుభావులు.

పద సాహిత్యం

[మార్చు]

ఈ సాహిత్యం దేవతా స్తుతిలో సాగుతుంది.కీర్తనలతోనే ఈ సాహిత్యం వృద్ధి చెందింది.ఇందులో పదము,దరువు,జావళీలు,హెచ్చరిక,అర్థచంద్రికలు,అర్థపద్యములు,తిల్లానా రూపంలో సృజన చేశారు.

విభాగాలు

[మార్చు]

ఈ సాహిత్యానికి దిశనిర్ధేశ్యాన్ని నియమాలతో కవులు శాసించారు.అందులో ప్రధానంగా

1.జయదేవుడు తన అష్టపదులలో పల్లవి రెండు పాదాలుగా,అనుపల్లవి రెండు పాదాలుగా,చరణం రెండు పాదాలతో మొత్తం ఎనిమిది చరణాలతో కీర్తనని మలిచారు.

2.తాళ్ళపాక వారు పల్లవిని రెండు పాదాలుగా,చరణం నాలుగు పాదాలుగా మూడు చరణాలో సాగించారు.

3.నారాయణ తీర్థులు వారు అష్టపదుల్లానే తరంగాలలో పల్లవి ముందుకు వచ్చి ఒక పాదంగా తర్వాత రెండు పాదాలతో అనుపల్లవిగా మార్చి తాళ్ళపాక వారిని అనుసరిస్తూ నాలుగు పాదాలు చరణాలతో తరంగాలను రూపోదించారు.

పదసాహిత్య సారథులు

[మార్చు]
వాగ్గేయకారులు ముద్రలు
జయదేవుడు జయదేవ
తాళ్లపాక అన్నమయ్య వేంకట
తాళ్లపాక పెదతిరుమలయ్య వేంకట
తాళ్లపాక చినతిరుమలయ్య వేంకట
పురంధర దాసు పురంధర విఠ్ఠల
కనకదాసు కగినేలె ఆదికేశవ
నారాయణతీర్థులు నారాయణతీర్థ
క్షేత్రయ్య మువ్వగోపాల
రామదాసు రామదాసు
మునిపల్లె సుబ్రహ్మణ్యకవి శ్రీ శేషగిరి
త్యాగరాజు త్యాగరాజ
శ్యామశాస్త్రి శ్యామకృష్ణ
ముత్తుస్వామి దీక్షీతులు గురుగుహ
సదాశివ బ్రహ్మేంద్రస్వామి పరమహంస
స్వామి తిరుణాళ్ పద్మనాభ
పాపనాశం శివన్ రామదాసన్
మైసురు వాసుదేవాాచార్య వాసుదేవ
బాలమురళీకృష్ణ హరి /మురళి


పద కవితలు వ్రాసిన వారిలో అన్నమయ్య క్షేత్రయ్య, త్యాగరాజు, భద్రాచల రామదాసులు అగ్రగణ్యులు.వీరి అందరి కంటే ముందు తెలుగులో వచనాలు రాసి పద సాహిత్యానికి ఊపిరి పోసినది కృష్ణమాచార్యులు(సింహగిరి నరహరి వచనాలు).[మూలం అవసరం][2]

ఆధునిక కాలంలో

  1. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ
ఆధ్యాత్మిక పదకవితలు భజనల రూపంలో వ్రాసి ప్రచారం చేసినవారు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ[మూలం అవసరం][3]

మూలాలు

[మార్చు]

1.[1]

2.Tirumala Tirupati Devasthanams (Official Website)

https://ia601409.us.archive.org/23/items/in.ernet.dli.2015.390782/2015.390782.Telugulo-Pada_text.pdf

  1. తెలుగులో పద కవిత. గుంటూరు. ఆగస్టు1983. {{cite book}}: |first= missing |last= (help); Check date values in: |year= (help)CS1 maint: year (link)
  2. "సింహగిరి వచనములు - వికీసోర్స్". te.wikisource.org. Retrieved 2025-12-09.
  3. "శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తెలుగు కీర్తనలు - వికీసోర్స్". te.wikisource.org. Retrieved 2025-12-09.