Coordinates: 17°25′53″N 79°13′11″E / 17.431416°N 79.219738°E / 17.431416; 79.219738

పనకబండ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పనకబండ, తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా, మోతుకూరు మండలంలోని గ్రామం.[1]

పనకబండ
—  రెవిన్యూ గ్రామం  —
పనకబండ గ్రామ సచివాలయం
పనకబండ గ్రామ సచివాలయం
పనకబండ గ్రామ సచివాలయం
పనకబండ is located in తెలంగాణ
పనకబండ
పనకబండ
అక్షాంశరేఖాంశాలు: 17°25′53″N 79°13′11″E / 17.431416°N 79.219738°E / 17.431416; 79.219738
రాష్ట్రం తెలంగాణ
జిల్లా యాదాద్రి
మండలం మోత్కూర్
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 1,228
 - పురుషుల సంఖ్య 603
 - స్త్రీల సంఖ్య 625
 - గృహాల సంఖ్య 305
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

ఇది మండల కేంద్రమైన మోత్కూరు నుండి 4 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన నల్గొండ నుండి 45 కి. మీ. దూరంలోనూ ఉంది.

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో[మార్చు]

2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత నల్గొండ జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[2]

గ్రామ జనాభా[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 305 ఇళ్లతో, 1228 జనాభాతో 824 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 603, ఆడవారి సంఖ్య 625. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 383 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 5. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 576692[3].పిన్ కోడ్: 508277.

గ్రామ చరిత్ర[మార్చు]

ప్రస్తుతం ఆరోతరం నడుస్తున్న ఈ గ్రామం ఇదివరకు పనకపట్నంగా పిలవబడేదని పెద్దలు చెబుతారు.ఈ ఊరి గ్రామ పంచాయితీ పరిధిలోనే రాగిబావి అనే మరో గ్రామం ఉంటుంది.

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఒకటి ఉంది.బాలబడి, ప్రాథమికోన్నత పాఠశాల, మాధ్యమిక పాఠశాల‌లు మోత్కూరులో ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల మోత్కూరులోను, ఇంజనీరింగ్ కళాశాల నల్గొండలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల నార్కట్ పల్లిలోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు నల్గొండలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల నల్గొండలో ఉన్నాయి.

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

ఒక సంచార వైద్య శాలలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. పశు వైద్యశాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలోఒక ప్రైవేటు వైద్య సౌకర్యం ఉంది. డిగ్రీ లేని డాక్టరు ఒకరు ఉన్నారు.

తాగు నీరు[మార్చు]

భూగర్బ జలాలు సైతం ఎక్కువగా లేకపోవడంతో ఎప్పుడు నీటికి కొరతే ఉంటుంది. ఊరికి సరిపడ మంచినీటిని అందించేందుకు 200000 లీటర్ల సామర్థ్యంగల వాటర్ ట్యాంక్, ఓ బావి ఉన్నాయి. వేసవిలో నీటి ఎద్దడిని తీర్చేందుకు బోర్లు వేసినా అవికూడా అంతంత మాత్రంగానే పోస్తుంటాయి. గ్రామంలో కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు సరఫరా అవుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.

పారిశుధ్యం[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని శుద్ధి ప్లాంట్‌లోకి పంపిస్తున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

పోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. మొబైల్ ఫోన్ ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి.

తారురోడ్డు కావడంతో కొద్దికాలం నుండి హైదరాబాద్కు ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. శాసనసభ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సమీకృత బాలల అభివృద్ధి పథకం, ఆటల మైదానం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. సినిమా హాలు, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 కి.మీ.లోపు దూరంలో ఉన్నాయి. గ్రంథాలయం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

పనకబండలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 10 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 5 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 67 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 12 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 16 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 12 హెక్టార్లు
  • బంజరు భూమి: 111 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 588 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 651 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 60 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

పనకబండలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • బావులు/బోరు బావులు: 60 హెక్టార్లు

ఉత్పత్తి[మార్చు]

పనకబండలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.ఇక్కడ భూములు వరి పంట, అముదాలు, పత్తి పంటలకు అనుకూలమైనవి.

ప్రధాన పంటలు[మార్చు]

వరి, ప్రత్తి, కంది

ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. కొంత మంది కూలీలు జంగల్ కటింగ్ తో జీవిస్తున్నారు.

విశేషాలు[మార్చు]

  • మరో విషయం ఎంటంటే ఈ గ్రామంలో ఉన్న ఏకశిలా గోపురం గ్రామానికి ఆనుకుని ఉన్న రామాలయంలో 20 నుంచి 30 అడుగుల మేర ఉన్న ఈ ఎకశిల గోపురంపై ప్రతి శ్రీరామ నవమికి పెద్ద దీపం పెట్టేవారని ప్రతీతి.
  • లోగడ ఇక్కడి రామాలయంలోని పంచలోహవిగ్రహాలు చోరీకి గురైయ్యాయి, అవి ఇప్పటివరకు ఎక్కడున్నాయే తెలియలేదు.
  • ఇక గుర్రాల బండ దగ్గర ఉన్న నెరికలోని నీరు ఇప్పటివరకు ఎండిపోవడం జరగలేదు. ఈ సొరంగం ఈ గ్రామానికి ఐదుకిలోమీటర్ల దూరం ఉన్న ముశిపట్ల లోని బుగ్గరామన్నస్వామి గుట్ట వరకు ఉందని చెబుతుంటారు.
  • గత కొద్ది సంవత్సరాల నుంచే మళ్లీ శ్రీరామనవమి ఉత్సవాలు చేస్తున్నారు.
  • ఆరెళ్లక్రీతం దుర్గమ్మ గుడి కట్టి మూడేళ్లపాటు ఉత్సవాలు నిర్వహించి ప్రస్తుతం ఆపివేశారు. ఈ సంవత్సరం ఐదవ సంవత్సర పండగ చేయనున్నారు.
  • ఈ గ్రామంలో బీసీలతో సమానంగా ఎస్సీ జనాభాా ఉంది. గ్రామం మొత్తంలో ఒక్క ఓసీకూడా లేకపోవడం గమనార్హం.
  • ఎస్సీ జనాభా ఎక్కువకావడంతో చదువులోను కొంచెం వెనుకబాటుతనం కనిపిస్తుంది. గవర్నమెంట్ జాబ్ చేస్తున్నవారు సైతం చాల కొద్దిమంది మాత్రమే. డిగ్రీ వరకు చదివిన వారు 20 నుంచి 30 మంది వరకు ఉండవచ్చు. ఇంకా ఎక్కువగా కల్లుగీతకార్మికులు ఉండటం వల్ల గీతకార్మికులు ఎక్కువ. ఈ మధ్య కాలంలో చాల మంది తమ కుల వృత్తిని వీడటంతో అదికూడ తగ్గింది. మూడవ తరంలో ఎవరూ కులవృత్తులు ఎంచుకోవడం లేదు.
  • దసరా, శ్రీరామనవమి, సంక్రాతి ఉత్సవాలు ప్రతిఏటా ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి సంక్రాతికి యువతకు క్రీడా పోటిలు నిర్వహిస్తారు.
  • త్వరలోనే ఊరికి బునాదిగాని కాలువ వస్తుండటంతో రైతులు దానిపై భారీగా ఆశలుపెట్టుకున్నారు.. రియల్ బూమ్ లో కొంతమంది భూములను అమ్ముకున్నా చాల మంది రైతులు తమ భూములను అమ్ముకునేందుకు నిరాకరించారు.
  • ఈ ఊరి మరో విశిష్టత ముస్లీం పండగైన మొహర్రంను కులమతాలకతీతంగా ఘనంగా నిర్వహిస్తారు. ఈ మధ్య కాలంలో కొంచెం వైభవం తగ్గినా మళ్లీ పునర్వైభోగం కోసం యువత ప్రయత్నిస్తుంది.

గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)[మార్చు]

స‌త్యం గౌడ్ సూద‌గాని (సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్‌) న‌మ‌స్తే తెలంగాణ‌లో ప‌త్రిక‌లో ఎడ్యుకేష‌న్ విభాగంలో ప‌నిచేస్తారు. సుదీర్ఘ అనుభ‌వం అత‌ని సొంతం. దాదాపుగా 14 సంవ‌త్స‌రాల పాటు ఎల‌క్ట్రానిక్‌, ప్రింట్ మీడియా రంగంలో ప‌నిచేస్తున్నారు.

పాండరి కారుపోతుల (ఫేమస్ జర్నలిస్ట్) ఉత్తమ క్రీడా పాత్రికేయ అవార్డ్ గ్రహీత (2013)

2013 లో గెలుపొందిన గ్రామ పంచాయితి సభ్యులు[మార్చు]

  1. సర్పంచ్. పొన్నబొయిన రేణుక టి. డి. పి.)
  2. 1వ వార్డ్ మెంబర్. లోతుకుంట మంజుల (కాంగ్రెస్)
  3. 2వ వార్డ్ మెంబర్. ముక్కాముల లలీత (టీ.డీ.పీ)
  4. 3వ వార్డ్ మెంబర్. బత్తిని శ్రీను (కాంగ్రెస్)
  5. 4వ వార్డ్ మెంబర్. కారుపోతుల ముత్యాలు (టి.డి.పి)
  6. 5వ వార్డ్ మెంబర్. రాంపాక ఎల్లమ్మ (కాంగ్రెస్)
  7. 6వ వార్డ్ మెంబర్. రాంపాక శ్రీను (సీ.పి.ఎం) (ఉపసర్పంచ్)
  8. 7వ వార్డ్ మెంబర్. నారబోయిన పాపయ్య (కాంగ్రెస్)
  9. 8వ వార్డ్ మెంబర్. నారాబోయిన సుజాత (కాంగ్రెస్)

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 247  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "యాదాద్రి భువనగిరి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  3. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=పనకబండ&oldid=3634373" నుండి వెలికితీశారు