పన్నూరు శ్రీపతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పన్నూరు శ్రీపతి : చిత్రకళారంగంలో ప్రముఖ పేరు, చిత్రకళోపాధ్యాయునిగా చిరపరిచితుడు, ప్రముఖ తంజావూరు శైలి చిత్రకారులు. మదనపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేసి రిటైర్డు అయినాడు. రెండు చేతులతో చిత్రించడం ఇతని ప్రత్యేకత, శిల్పకళాకారునిగా మంచిపేరు గలదు. పలుభాషలలో వ్రాయగల దిట్ట. హైదరాబాదు లోని తెలుగు లలిత కళాతోరణంలో సభ్యుడు కూడానూ.

సత్కారాలు[మార్చు]

  • పద్మశ్రీ : ఇతని కళా తపస్సును గుర్తించి భారత ప్రభుత్వం 2007 సంవత్సరంలో పద్మశ్రీ గౌరవంతో సత్కరించింది.
  • శిల్పగురు : భారత ప్రభుత్వం ఇతనికి 2008 శిల్పగురు అవార్డు ప్రదానం చేసింది.[1]

ఇతని శిష్యగణం కూడా కళారంగంలో రాణిస్తోంది.

మూలాలు[మార్చు]