Jump to content

పప్పుకుట్టి భాగవతర్

వికీపీడియా నుండి


పప్పుకుట్టి భాగవతర్
జననంసి.ఎం. జోసెఫ్
(1913-03-29)1913 మార్చి 29
వైపిన్, కొచ్చిన్ రాజ్యం, బ్రిటిష్ రాజ్
(ప్రస్తుత ఎర్నాకుళం, కేరళ, భారతదేశం)
మరణం2020 June 22(2020-06-22) (వయసు: 107)
పల్లెరుత్తి, కొచ్చి, ఎర్నాకులం జిల్లా, కేరళ, భారతదేశం
జాతీయతభారతీయుడు
వృత్తి
  • నటుడు
  • గాయకుడు
క్రియాశీలక సంవత్సరాలు1949–2020
భార్య / భర్త
బేబీ
(m. 1947; died 2017)
పిల్లలు5 (సెల్మా జార్జ్, మోహన్ జోస్ లతో సహా)
తల్లిదండ్రులు
  • మైఖేల్
  • అన్నా
బంధువులుకె‌.జి జార్జ్ (అల్లుడు)

పప్పుకుట్టి భాగవతర్ (1913 మార్చి 29 - 2020 జూన్ 22) మలయాళ సినిమాలోని భారతీయ గాయకుడు, నటుడు.[1]

జీవితచరిత్ర

[మార్చు]

పప్పుకుట్టి భాగవతర్ 1913 మార్చి 29న మైఖేల్, అన్నా దంపతులకు జోసెఫ్ గా పూర్వపు కొచ్చిన్ రాజ్యం వైపిన్ లో జన్మించాడు. ఐదుగురు పిల్లలలో ఆయన రెండవవాడు.

ఆయనకు ఇద్దరు సోదరులు డేనియల్, వర్గీస్; ఇద్దరు సోదరీమణులు రోసీ, వల్సల ఉన్నారు. అతను వైపిన్ లోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో చదువుకున్నాడు.[2]

ఒక చిత్రం కోసం తన మొదటి పాట పాడిన అరవై సంవత్సరాల తరువాత, 2009లో విడుదలైన మేరిక్కుందోరు కుంజాడు కోసం 95 సంవత్సరాల వయస్సులో పాడాడు. దీంతో ఆయన ఒక చిత్రంలో పాట పాడిన అతి పెద్ద వయస్సు మలయాళిలా నిలిచాడు. ఈ "ఎంటడుక్కె వరుమ్" పాట విజయవంతమైంది.

అతనికి బేబీతో వివాహం జరిగింది. వారికి నటుడు మోహన్ జోస్, నేపథ్య గాయని సెల్మా జార్జ్, సాబు జోస్, షాది, జీవన్ అనే ఐదుగురు పిల్లలు ఉన్నారు. ఆయన అల్లుడు కె. జి. జార్జ్ మలయాళ చిత్ర దర్శకుడు.

2013 మార్చిలో ఆయన 100వ వసంతంలోకి అడుగుపెట్టాడు. [3][4] ఆయన భార్య బేబీ 2017లో మరణించింది. భాగవతర్ వయసు సంబంధిత అనారోగ్యం కారణంగా జూన్ 2020లో 107 సంవత్సరాల వయసులో కొచ్చిలో మరణించాడు.[5]

అవార్డులు

[మార్చు]
  • 1991: కేరళ సంగీత నాటక అకాడమీ అవార్డు (డ్రామా) [6]
  • 1997: కేరళ సంగీత నాటక అకాడమీ అవార్డు (శాస్త్రీయ సంగీతం) [7]
  • 2004: కేరళ సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ [8]

మూలాలు

[మార్చు]
  1. "A voice that still casts a spell - The Hindu". The Hindu. thehindu.com. 4 April 2012. Retrieved 2014-08-06.
  2. "Centenarian Pappukutty Bhagavathar honoured - IBNLive". ibnlive.in.com. Archived from the original on 2014-08-10. Retrieved 2014-08-06.
  3. Deepthi Sreenivasan (2016-01-10). "102, still going Sa Re Ga Ma". The Asian Age. Retrieved 2018-08-11.
  4. Staff (2017-05-07). "When 104-yr-old Pappukutty Bhagavathar sang 'Soja Rajakumari' for Mar Chrysostom". Mathrubhumi. Archived from the original on 11 August 2018. Retrieved 2018-08-11.
  5. "Veteran actor pappukutty bhagavathar dies". www.thenewsminute.com. 22 June 2020. Retrieved 2020-06-22.
  6. "Kerala Sangeetha Nataka Akademi Award: Drama". Department of Cultural Affairs, Government of Kerala. Retrieved 26 February 2023.
  7. "Kerala Sangeetha Nataka Akademi Award: Classical Music". Department of Cultural Affairs, Government of Kerala. Retrieved 26 February 2023.
  8. "Kerala Sangeetha Nataka Akademi Fellowship: Drama". Department of Cultural Affairs, Government of Kerala. Retrieved 25 February 2023.