Jump to content

పరమాత్మ

వికీపీడియా నుండి
విష్ణు

గురువు. ఉపదేశం .అజ్ఞానాంధకారాన్ని తొలగించే జ్ఞానం దర్శనమయ్యింది

అజ్ఞానంతో అంధకారంలో పడి కొట్టు మిట్టాడే వారికి. అహంకారం అనే చక్రంలో పడి గిర గిరా తిరిగే వారికి. "అతితీర్శతామ్ తమోంధమ్" గాఢమైన చీకటిలో ఆత్మేమిటో పరమాత్మేమిటో ఎందుకు మనం ఇక్కడికి వచ్చామో కూడా తెలుసుకోకుండా ఇందులోనే పడి కొట్టుకునే వారిని కూడా తరింపజేయటానికి వచ్చినటువంటి గురువు. ఉపదేశం గ్రంథం ఇది. రుచి ఉండి శ్రద్ధ ఉండి, జ్ఞానులని ఆశ్రయించి ప్రార్థన చేస్తే పెద్దలు చేసే ఉపదేశం తప్పకుండా తరింపజేస్తుంది. అందులో సందేహం లేదు అజ్ఞానులని కూడా జ్ఞానులుగా, భగవంతుని పరికరాలుగా తీర్చి దిద్దే మహోపదేశాన్ని గురువు. మనకి ఉపదేశించారు. గురువును మించిన దైవం మరొక్కటి లేదని, ... ఈ మోక్షాన్ని కలిగించే మార్గాన్ని అనుసరించమని చేసిన ఉపదేశం ఆత్మ విషయంలో కానీ పరమాత్మ విషయంలో కానీ మనం చీకటిలో ఉన్నాం. చీకటిలో ఉండటం అంటే ఏమిటంటే కన్ను ఉంటుంది, వస్తువు ఉంటుంది కానీ ఆకాన్ను వస్తువుని చూసే శక్తి చాలదు. మధ్యలో ఆవరించి ఉన్న చీకటిని తొలగించి కంటికి ఆ వస్తువుని కన్పింపజేసేట్టుగా మధ్యలో వెలుతురు కావాలి. వెలుతురునిచ్చే దీపం కావాలి. అనాదిగా అంటి పెట్టుకున్న కర్మ వాసనల దొంతరలు లెక్క లేనన్ని పేరుకొని ఉన్నాయి. మనలో జ్ఞానం సహజంగానే ఉంది కానీ, ఆ జ్ఞానాన్ని పైకి తెచ్చుకోవడానికి గురువులు తమ జ్ఞానాన్ని తోడుగా ఇచ్చి పైకి తెస్తారు. ఇదివరకు మనల్ని అడ్డే పొరలని దాటి వచ్చే శక్తిని గురువులు ఉపదేశం ద్వారా ఇస్తారు. వారి ఉపదేశం లోనికి వెళ్ళి క్రమేమి కర్మ వాసనలు తొలగుతాయి. "అధ్యాత్మ దీపమ్", దీపం కొత్తగా వస్తువులని తెచ్చి చూపదు. వస్తువు అక్కడే ఉంటుంది కానీ దీపాన్ని వెలిగించి పెట్టుకుని ఉన్నంత వరకు ఆవస్తువుని కనిపించేట్టు చేస్తుంది. ఆత్మ స్వరూపాన్ని పరమాత్మ స్వరూప స్వభావాల్ని స్పష్ట పరిచే దీపాన్ని మహర్షి వెలిగించి పెట్టాడు,

వేదముల సారాంశం. అది ఎంత గొప్పదైనా వేదాన్ని అనుసరించేదే కావాలి, అప్పుడే ప్రమాణయోగ్యం. అట్లాంటి దాన్నే ఉపదేశం చేసాడు. వేదం రెండు భాగాలు. పూర్వ భాగం మనం చేసే కర్మలని ప్రతిపాదిస్తుంటుంది. రెండవది మనకి ఆనందాన్ని కలిగించే బ్రహ్మ తత్వాన్ని తెలుపుతుంది. ఇవి రెండు ఒకటే శాస్త్రం. బ్రహ్మ అనేది తెలియాల్సిన తత్వం, అది తెలిసిన తర్వాత ఆ తత్వన్ని ఎట్లా పొందాలో తెలుపుతుంది రెండూ ఒకటే. కనుక ఆరాధన స్వరూపాన్ని ఒకటి ఆరాధ్య స్వరూపాన్ని ఒకటి తెలుపుతుంది. రెండు కలిపి అది వేదం.

ఇవి కూడా చూడండి

[మార్చు]

అద్వైతం లౌకికజీవితానికి అధ్యాత్మికతను జోడిస్తుంది . ఇహపరాలను రెంటినీ ఒక్కటి చేస్తుంది . ఇది కేవలం లౌకికవాదులైన వారికి, లేదా కేవలం ఆధ్యాత్మికవాదులైనవారికి రుచించదు . కానీ అద్వైతమే సత్యం . ఇజాలకు అందని ఈ నిజం, సిరివెన్నల గారి పాట "జగమంతకుటుంబం"లో ఎలా వ్యక్తమైందో ఈ క్రింది link లో ఉన్న అద్వైతంలో చూడవచ్చు

అద్వైతం

సూచనలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=పరమాత్మ&oldid=4010825" నుండి వెలికితీశారు