పరమేశ్వర విణ్ణగరమ్
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
పరమేశ్వర విణ్ణగరమ్ | |
---|---|
భౌగోళికాంశాలు : | 12°29′N 79°26′E / 12.49°N 79.43°E |
ప్రదేశం | |
దేశం: | భారత దేశము |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | వైకుంఠ పెరుమాళ్ |
ప్రధాన దేవత: | వైకుంఠ నాయకి |
దిశ, స్థానం: | పశ్చిమ ముఖము |
పుష్కరిణి: | ఐరంమద తీర్థము |
విమానం: | ముకుంద విమానము |
కవులు: | తిరుమంగై ఆళ్వార్ |
ప్రత్యక్షం: | పల్లవరాజునకు |
పరమేశ్వర విణ్ణగరమ్ భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.
విశేషాలు
[మార్చు]ఈసన్నిధి విమానము మూడు అంతస్తులుగా నున్నది. క్రింది అంతస్తులో వీట్రిరున్ద తిరుక్కోలములో వైకుంఠ పెరుమాళ్ వేంచేసియున్నారు. మొదటి అంతస్తులో రంగనాథులు శయన భంగిమలో ఉన్నాడు. రెండవ అంతస్తులో నిలబడిన భంగిమలో (నిన్ఱ తిరుక్కోలములో) వేంచేసియున్నారు. గొప్ప శిల్ప కళా సంపద ఉన్న అత్యద్భుత క్షేత్రము. కంచి రైల్వే స్టేషన్‌కు 1 కి.మీ. దూరములో ఉంది.
సాహిత్యం
[మార్చు]శ్లో. పరమేశ్వర విణ్ణగర్ పురే రుచిరైరంమద తీర్థ సమ్యుతే|
జలనాధ దిశా ముఖాసనో పరవైకుంఠ లతా సమన్విత:||
విమానేతు ముకుందాఖ్యే శ్రీవైకుంఠ విభుస్సదా
శ్రీ మత్పల్లవ రాజాక్షి గోచర:కలిహస్తుత:||
పాశురాలు
[మార్చు]పా. శొల్లువన్ శొఱ్పొరుళ్ తానవై యాయ్
చ్చువై యూఱొలి నాత్‌తముమ్ తోత్‌తముమాయ్
నల్లరన్ నాన్‌ముగన్ నారణను క్కిడన్దాన్
తడ--ழ்న్దழగాయ కచ్చి;
పల్లవన్ విల్లవన్ నెన్ఱులగిల్ పలరాయ్
ప్పలవేన్దర్ వణజ్గు కழల్
పల్లవన్, మల్లై యర్ కోన్ పణిన్ద
పరమేచ్చుర విణ్ణగర మధువే.
తిరుమంగై ఆళ్వార్-పెరియతిరుమొழி 2-9-1
వివరాలు
[మార్చు]ప్రధాన దైవం పేరు | ప్రధాన దేవి పేరు | తీర్థం | ముఖద్వార దిశ | భంగిమ | కీర్తించిన వారు | విమానం | ప్రత్యక్షం |
---|---|---|---|---|---|---|---|
వైకుంఠ పెరుమాళ్ | వైకుంఠ నాయకి | ఐరంమద తీర్థము | పశ్చిమ ముఖము | కూర్చున్న భంగిమ | తిరుమంగై ఆళ్వార్ | ముకుంద విమానము | పల్లవరాజునకు |
మంచిమాట
[మార్చు] దు:ఖములను కలిగించునది ప్రకృతి
దు:ఖములను అనుభవించువాడు జీవుడు
మన దు:ఖములను చూచి సహించలేనిది లక్ష్మీదేవి
మన దు:ఖములను పోగొట్టువాడు సర్వేశ్వరుడు.
చేరే మార్గం
[మార్చు]కంచి రైల్వే స్టేషన్‌కు 1 కి.మీ. దూరములో నున్నది