పరమ వీర చక్ర (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పరమ వీర చక్ర
దర్శకత్వందాసరి నారాయణ రావు
నిర్మాతసి కళ్యాణ్
నటులునందమూరి బాలకృష్ణ
అమీషా పటేల్
షీల
సంగీతంమణిశర్మ
ఛాయాగ్రహణంరమన రాజు
కూర్పుగౌతం రాజు
విడుదల
12 జనవరి 2011
దేశం భారతదేశం
భాషతెలుగు

పరమ వీర చక్ర 2011 లో విడుదలైన తెలుగు చిత్రం. తేజ సినిమా బ్యానర్‌పై సి.కళ్యాణ్ నిర్మించాడు. దర్శకుడిగా దాసరి నారాయణరావుకు ఇది 150 వ చిత్రం.[1][2] నందమూరి బాలకృష్ణ, అమీషా పటేల్, షీలా, నేహా ధూపియా, జయసుధ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి మణి శర్మ సంగీతం అందించాడు.[3]

ఈ చిత్రం 2011 సంక్రాంతి వారాంతంలో విడుదలైంది. పేళవమైన సమీక్షలు వచ్చాయి [4] అయితే, ఇది 2010 నంది అవార్డులలో నేషనల్ ఇంటిగ్రేషన్ చిత్రం కోసం సరోజిని దేవి అవార్డును గెలుచుకుంది .[5]

కథ[మార్చు]

చక్రధర్ ( నందమూరి బాలకృష్ణ ) ఒక ప్రసిద్ధ సినీ నటుడు, అయితే అతని తల్లి (జయసుధ) అతని ప్రముఖుడి హోదాను ఇష్టపడదు. ఆమె తన కొడుకును ఆర్మీలో మేజర్‌గా, బొబ్బిలి పులి ( ఎన్‌టి రామారావు ) లాగా, చూడాలని ఆరాటపడుతుంది. చక్రధర్ వివిధ పాత్రలు చేస్తున్నప్పుడు, ఆర్మీ కల్నల్ జితేంద్ర ( మురళి మోహన్ ) తన వద్ద ఒక కథ ఉందని, అందులో చక్రధర్ నటించాలనీ కోరుకుంటాడు. కల్నల్ అతనికి ఆర్మీ మేజర్ - మేజర్ జయ సింహా (ఇతడూ బాలకృష్ణే) కథను వివరించాడు. అయితే, ఒక క్యాచ్ ఉంది. మేజర్ జయ సింహా కల్పిత పాత్ర కాదు, కానీ చక్రధర్ లాగా కనిపించే నిజమైన సైనికాధికారి. భయంకరమైన ఉగ్రవాది - అబ్దుల్ ఘనీని ధైర్యంగా పట్టుకున్నాడు. విషాదమేంటంటే జయసింహా ఇప్పుడు ఇక మాంసపు ముద్దలా మంచంపై (యాంత్రిక వెంటిలేషన్ మీద) పడి ఉన్నాడు. రాజకీయ నాయకులు, కొద్దిమంది ఆర్మీ అధికారులు, ఉగ్రవాదులూ కలిసి పన్నిన కుట్ర ఫలితం అది. దేశ భద్రతా ప్రణాళికలు రాజీపడకుండా చూసేందుకు కల్నల్ జీతేంద్ర చక్రధర్‌ను మేజర్ లాగా వ్యవహరించమని అడుగుతాడు. చక్రధర్ ఉగ్రవాదులపై ఎలా దాడి చేస్తాడు, మేజర్ గౌరవాన్ని తిరిగి ఎలా తీసుకువస్తాడు అనేది మిగిలిన కథ.[6]

నటీ నటులు[మార్చు]

పాటలు[మార్చు]

పాటల జాబితా
సంఖ్య. పాటగాయనీ గాయకులు నిడివి
1. "లోకాన చీకటిని"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, వందేమాతరం శ్రీనివాస్, శ్రీకృష్ణ 7:23
2. "మిత్రా మిత్రా 1"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, సునీత 4:15
3. "అర్జున ఫల్గుణ"  హేమచంద్ర, మాళవిక 4:47
4. "మై క్యా కరూ"  హేమచంద్ర, మాళవిక 4:25
5. "ఎక్కా ఎక్కా"  మనో, మాలతి 3:51
6. "తల్లి కడుపులో"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం 5:59
7. "రాముడైనా"  మనో 1:08
8. "మిత్రా మిత్రా 2"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, సునీత 4:13
మొత్తం నిడివి:
36:00

మూలాలు[మార్చు]

  1. ‘Parama Veera Chakra’ Launched – Telugu Movie News. IndiaGlitz (10 June 2010). Retrieved on 2015-07-08.
  2. Dasari on a signing spree Archived 2013-06-16 at Archive.today. Articles.timesofindia.indiatimes.com (27 April 2013). Retrieved on 2015-07-08.
  3. Parama Veera Chakra Archived 6 మార్చి 2013 at the Wayback Machine. Music.ovi.com. Retrieved on 8 July 2015.
  4. Flop Of The Year, 2011
  5. Nandi awards 2010 announced. Indiaglitz.com (6 August 2011). Retrieved on 2015-07-08.
  6. Parama Veera Chakra story. 123Telugu.com.