Jump to content

పరసా వెంకట రత్నం

వికీపీడియా నుండి
పరసా వెంకట రత్నం

సాంకేతిక విద్యా శాఖ మంత్రి

పదవీ కాలం
2009  2014
ముందు నెలవల సుబ్రహ్మణ్యం
తరువాత కిలివేటి సంజీవయ్య
పదవీ కాలం
1994  2004
ముందు పసల పెంచలయ్య
తరువాత నెలవల సుబ్రహ్మణ్యం
నియోజకవర్గం సూళ్ళూరుపేట

వ్యక్తిగత వివరాలు

జననం (1958-08-13) 1958 ఆగస్టు 13 (వయసు: 67)
సూళ్ళూరుపేట, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
నివాసం నెల్లూరు
వృత్తి రాజకీయ నాయకుడు

డాక్టర్ పరసా వెంకట రత్నం (జననం 13 ఆగస్టు 1958) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నెల్లూరులోని సూళ్లూరుపేట నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై సాంకేతిక విద్యా శాఖ మంత్రిగా పని చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

పరసా వెంకట రత్నం తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1994 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో సూళ్ళూరుపేట శాసనసభ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి పసల పెంచలయ్యపై 21001 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1] ఆయన 1999 శాసనసభ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి పసల పెంచలయ్యపై 9995 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

పరసా వెంకట రత్నం 2004 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో సూళ్ళూరుపేట శాసనసభ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి నెలవల సుబ్రహ్మణ్యం చేతిలో 8,815 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2009 శాసనసభ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి విన్నమల సరస్వతిపై 5,367 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

పరసా వెంకట రత్నం 2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో సూళ్ళూరుపేట శాసనసభ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి కిలివేటి సంజీవయ్య చేతిలో 3,726 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2019 శాసనసభ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైసీపీ కిలివేటి సంజీవయ్య చేతిలో 61,292 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[2]

పరసా వెంకట రత్నం 2024లో ఏపీ మార్క్‌ఫెడ్ డైరెక్టర్‌గా నియమితుడయ్యాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. "సంజీవయ్య సూపర్ విక్టరీ". Sakshi. 24 May 2019. the original నుండి 30 June 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 30 June 2025.
  2. "Sullurpeta (SC) (Andhra Pradesh) Assembly Constituency Elections". Elections. 30 June 2025. the original నుండి 30 June 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 30 June 2025.
  3. "పంట ఉత్పత్తులకు మద్దతు ధర కల్పిస్తాం". Andhrajyothy. 6 October 2024. the original నుండి 30 June 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 30 June 2025.