Jump to content

పరస్థాన క్లోమము

వికీపీడియా నుండి

శరీరంలో క్లోమగ్రంథితో ఏ సంబంధం లేకుండా ఇతర స్థానాలలో చిక్కుకున్న  క్లోమగ్రంథి కణజాలాన్ని పరస్థాన క్లోమం, లేక స్థానభ్రష్ట క్లోమంగా (ఎక్టోపిక్ పాంక్రియాస్) పరిగణిస్తారు. గర్భస్థ పిండంలో జీర్ణమండలం వృద్ధి చెందుతున్నప్పుడు క్లోమకణజాలం అరుదుగా యితర ప్రాంతాలలో అవశేషంగా చిక్కుకోవడంవలన స్థానభ్రష్ట క్లోమం ఏర్పడుతుంది. ఇది పుట్టుకతో చాలా అరుదుగా వచ్చే వైకల్యం[1].

కడుపు అంతిమకుహరంలో స్థానభ్రష్ట క్లోమము

లక్షణాలు

[మార్చు]

పరస్థాన క్లోమం వలన చాలామందిలో ఏ లక్షణాలు కనిపించవు. కొందఱిలో దీనివలన కడుపునొప్పి, కడుపులో ఉబ్బు కలుగవచ్చు. ఇతర కారణాలకై అంతర్దర్శన పరీక్షలు (ఎండోస్కొపీ) చేసేటప్పుడు, లేక ప్రతిబింబ చిత్రీకరణ పరీక్షలలోను యాదృచ్ఛికంగా పరస్థాన క్లోమాలు కనుగొనబడుతాయి[1].

తొంబైశాతపు పరస్థాన క్లోమములు కడుపులో అంతిమకుహరంలో (గాస్ట్రిక్ ఏంట్రమ్), చిన్నప్రేగులో ప్రధమాంత్రంలోను (డుయొడీనమ్), మధ్యాంత్రంలోను (జెజునమ్) కలుగుతాయి. ఇవి బురుజు ఆకారంలో నున్నటి కణితులు లాగ, లేక బొడ్డున్న బొడిపలు లాగ కనిపిస్తాయి.

అరుదుగా కొన్ని శేషాంత్రంలోను (ఇలియమ్), పెద్దప్రేగులలోను, కొన్ని ప్లీహంలోను, కొన్ని కాలేయంలోను కనిపిస్తాయి. ఇవి ఉదరకుహరంలో ఎక్కడైనా కనిపించవచ్చు.

కణజాలపరీక్షలో కడుపు శ్లేష్మపు పొరకింద క్లోమ కణజాలం

ఉపద్రవాలు

[మార్చు]

పరస్థాన క్లోమములలోని కణజాలం క్రియాశీలకమైతే క్లోమగ్రంథిలో కలిగే తాపము (పాంక్రియాటైటిస్), కొత్త పెరుగుదలలు (నియోప్లాజమ్స్/ట్యూమర్స్) వంటి ఉపద్రవాలు వీటిలోను కలిగే అవకాశాలు ఉన్నాయి.

నిర్ధారణ

[మార్చు]

చాలా సందర్భాల్లో అనుభవజ్ఞులైన వైద్యులు అంతర్దర్శన పరీక్షల్లోను (ఎండోస్కొపీ), గణనయంత్ర త్రిమితీయ చిత్రీకరణల్లోను (కంప్యూటరైజడ్ ఏక్సియల్ టోమోగ్రఫీ)[2][3] చూసి పరస్థాన క్లోమములను నిర్ధారించగలరు. అంతర్దర్శిని ద్వారా శ్రవణాతీత ధ్వని చిత్రీకరణ (ఎండోస్కోపిక్ అల్ట్రాసోనోగ్రఫీ-EUS)[4] చేసి కూడ వీటిని నిర్ధారణ చేయవచ్చు. కణపరీక్షలతో వీటిని ధ్రువీకరించవచ్చు.

చికిత్స

[మార్చు]

ఏ లక్షణాలు కాని, ఏ ఉపద్రవాలు కాని లేనప్పుడు స్థానభ్రష్ట క్లోమములకు చికిత్స అవసరం లేదు. ఏవైనా లక్షణాలు ఉన్నా, ఉపద్రవాలు కలిగినా వీటిని వివిధ ప్రక్రియలతో శస్త్రచికిత్స చేసి తొలగించవచ్చు[5].  

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "You are being redirected..." www.pathologyoutlines.com. Retrieved 2025-02-24.
  2. Liu, Chang; Yang, Fang; Zhang, Wenming; Ao, Weiqun; An, Yongyu; Zhang, Cui; Dai, Bailing; Pu, Cailing; Wang, Jian (2021-02-04). "CT differentiation of gastric ectopic pancreas from gastric stromal tumor". BMC Gastroenterology. 21 (1): 52. doi:10.1186/s12876-021-01617-8. ISSN 1471-230X. PMC 7860050. PMID 33541287.{{cite journal}}: CS1 maint: PMC format (link) CS1 maint: unflagged free DOI (link)
  3. Kim, GH (2013-06-01). "EUS Findings of Gastric Ectopic Pancreas". Video Journal and Encyclopedia of GI Endoscopy. Special Issue: Expert Encyclopedia – Upper GI Tract. 1 (1): 160–161. doi:10.1016/S2212-0971(13)70065-7. ISSN 2212-0971.
  4. Attwell, Augustin (2015). "Diagnosis of ectopic pancreas by endoscopic ultrasound with fine-needle aspiration". World Journal of Gastroenterology (in ఇంగ్లీష్). 21 (8): 2367. doi:10.3748/wjg.v21.i8.2367. ISSN 1007-9327.{{cite journal}}: CS1 maint: unflagged free DOI (link)
  5. Covantsev, Serghei (2024-04-27). "New frontiers in ectopic pancreatic tissue management". World Journal of Gastrointestinal Surgery (in ఇంగ్లీష్). 16 (4): 1215–1217. doi:10.4240/wjgs.v16.i4.1215.{{cite journal}}: CS1 maint: unflagged free DOI (link)