పరిగెత్తు పరిగెత్తు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పరిగెత్తు పరిగెత్తు
దర్శకత్వంరామకృష్ణ తోట
నిర్మాతయామిని కృష్ణ అక్కరాజు
తారాగణంసూర్య శ్రీనివాస్‌ , అమృత ఆచార్య, రామకృష్ణ తోట , యోగి
ఛాయాగ్రహణంకల్యాణ్‌ సమి
సంగీతంసునీల్‌ కశ్యప్‌
నిర్మాణ
సంస్థ
ఎన్ ఎస్ సినీ ఫ్లిక్స్
విడుదల తేదీ
30 జులై 2021
సినిమా నిడివి
130 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

పరిగెత్తు పరిగెత్తు 2021లో విడుదలైన సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమా. ఎన్ ఎస్ సినీ ఫ్లిక్స్ బ్యానర్ పై ఏ యామిని కృష్ణ అక్కరాజు నిర్మించిన ఈ సినిమాకు రామకృష్ణ తోట దర్శకత్వం వహించాడు. సూర్య శ్రీనివాస్‌ , అమృత ఆచార్య హీరో హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా 30 జులై 2021న విడుదలైంది.[1]

చిత్ర నిర్మాణం[మార్చు]

పరిగెత్తు పరిగెత్తు ఫస్ట్ లుక్ 29 సెప్టెంబర్ 2020న ,[2] ట్రైలర్ ను 13 డిసెంబర్ 2020న విడుదల చేసి,[3] సినిమాను 30 జులై 2021న విడుదల చేశారు.

కథ[మార్చు]

అజయ్ (సూర్య శ్రీనివాస్) మధ్యతరగతి అబ్బాయి, బాగా చదువుకుని, మంచి బిజినెస్ లో సెటిల్ అయ్యి తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉండాలనేది అతని లక్ష్యం. రెడ్ క్రాస్ సొసైటీలో వర్క్ చేస్తున్న ప్రియ (అమృత) తో అజయ్ కి పరిచయం ఏర్పడి వారి అభిరుచులు , అభిప్రాయాలు కలవడంతో ఇద్దరూ ప్రేమలో పడతారు. అజయ్ ఓ వ్యక్తి దగ్గర తీసుకున్న 10లక్షలు కారణంగా, ప్రియ ఆ వ్యక్తి దగ్గర బంధీ అవుతుంది. తన అప్పు చెల్లిస్తేనే ప్రియను వదిలిపెడతానని ఆ వ్యక్తి అజయ్ కి షరతు పెడతాడు. ఈ నేపథ్యంలో అజయ్ అప్పును ఎలా చెల్లిస్తాడు, తను ప్రేమించిన ప్రియను ఆ వ్యక్తి దగ్గర్నుంచి ఎలా కాపాడుకుంటాడు అనేదే మిగతా సినిమా కథ.

నటీనటులు[మార్చు]

  • సూర్య శ్రీనివాస్‌ [4]
  • అమృత ఆచార్య
  • రామకృష్ణ తోట
  • యోగి
  • దినేష్
  • జయ చంద్ర
  • జయభారత్ రెడ్డి
  • ప్రకాష్
  • లక్ష్మణ్
  • రాజశేఖర్

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: ఎన్ ఎస్ సినీ ఫ్లిక్స్
  • నిర్మాత: యామిని కృష్ణ అక్కరాజు
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రామకృష్ణ తోట
  • సంగీతం: సునీల్‌ కశ్యప్‌
  • సినిమాటోగ్రఫీ: కల్యాణ్‌ సమి
  • ఎడిటింగ్ : వెంకట ప్రభు
  • ఆర్ట్‌: రాజ్‌కుమార్‌
  • ఫైట్స్: శంకర్‌

మూలాలు[మార్చు]

  1. NTV (23 July 2021). "జులై 30న థియేటర్లలో 'పరిగెత్తు పరిగెత్తు'". Archived from the original on 1 ఆగస్టు 2021. Retrieved 1 August 2021.
  2. Eenadu (29 September 2020). "ఎక్కడికి.. ఈ పరుగు?". Archived from the original on 1 ఆగస్టు 2021. Retrieved 1 August 2021.
  3. The Times of India (13 December 2020). "Parigettu Parigettu - Official Trailer | Telugu Movie News - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 1 ఆగస్టు 2021. Retrieved 1 August 2021.
  4. Sakshi (1 August 2021). "పరిగెత్తు పరిగెత్తు'కి మంచి టాక్‌ రావడం సంతోషం: హీరో". Archived from the original on 1 ఆగస్టు 2021. Retrieved 1 August 2021.

బయటి లింకులు[మార్చు]