పరిపాలనా కేంద్రం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పరిపాలనా కేంద్రం అనేది, ప్రాంతీయ పరిపాలన లేదా స్థానిక ప్రభుత్వం, జిల్లా పరిపాలన,రాష్ట పరిపాలన, దేశపరిపాలన ఎక్కడనుండైతే నిర్వహిస్తారో, లేదా సాగిస్తారో ఆ ప్రదేశాన్ని పరిపాలనా కేంద్రం అని అంటారు.ఇది ఒక్క ప్రభుత్వాల విషయంలోనే కాదు,అన్ని రకాలప్రభుత్వరంగ,ప్రవేటురంగ సంస్థల అన్నిటికి వర్తిస్తుంది. సహజంగా ప్రభుత్వాల విషయంలో స్థానిక ప్రభుత్వ పరిపాలనకు అనగా గ్రామ పంచాయితీ, మండల పరిషత్తులకు గ్రామాలు, లేదా ఒకరకమైన పట్టణాలు పరిపాలనా కేంద్రాలుగా ఉంటాయి.జిల్లా పరిపాలన నిర్వహించే జిల్లా కలెక్టరు, ఇతర జిల్లా కార్యాలయాలు పట్టణాలు, నగరాలు పరిపాలనా కేంద్రాలుగా ఉంటాయి. రాష్టాలకు నగరపాలక సంస్థ, మహా నగరపాలక సంస్థ హోదాతోఉన్న పెద్ద నగరాలు పరిపాలనా కేంద్రాలుగా ఉంటాయి. క్లుప్తంగా దీనికి నిర్వచనం చెప్పాలంటే, పరిపాలనకు సంబందించిన అన్ని శాఖల కార్యాలయాలు ఉన్న ప్రదేశాన్నిపరిపాలనా కేంద్రం అని నిర్వచిస్తారు.వీటిని ముఖ్య పట్టణం అని వ్యవహరిస్తారు.దేశపరిపాలన సాగించే ప్రదేశాన్ని రాజధాని అని అంటారు.వీటికి చట్టంలో వెసులుబాటు ఉంటుంది.

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]