Jump to content

పరిమళ నాగప్ప

వికీపీడియా నుండి
పరిమళ నాగప్ప

పదవీ కాలం
2004 – 2008
ముందు జి. రాజు గౌడ
తరువాత ఆర్. నరేంద్ర
నియోజకవర్గం హనూర్

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయురాలు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు జనతాదళ్ (సెక్యులర్)[4]
బహుజన్ సమాజ్ పార్టీ
కర్ణాటక జనతా పార్టీ
జీవిత భాగస్వామి హెచ్. నాగప్ప
సంతానం ప్రీతన్ నాగప్ప[1], పవన్[2]
ప్రియాంక[3]
వృత్తి రాజకీయ నాయకురాలు

పరిమళ నాగప్ప కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2004 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో హనూర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.

రాజకీయ జీవితం

[మార్చు]

పరిమళ నాగప్ప తన భర్త హెచ్. నాగప్ప మరణాంతరం రాజకీయాల్లోకి వచ్చి 2004 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో హనూర్ శాసనసభ నియోజకవర్గం నుండి జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి ఆర్. నరేంద్రపై 13,013 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[5] ఆమెకు 2008 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో జేడీఎస్ టికెట్ దక్కకపోవడంతో బీఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి ఆర్. నరేంద్ర చేతిలో 23,140 ఓట్ల తేడాతో ఓడిపోయింది.

పరిమళ నాగప్ప ఆ తరువాత తిరిగి జనతాదళ్ (సెక్యులర్) పార్టీలో చేరి 2013 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో హనూర్ శాసనసభ నియోజకవర్గం నుండి జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి ఆర్. నరేంద్ర చేతిలో 11549 ఓట్ల తేడాతో ఓడిపోయింది. ఆమె 2017లో భారతీయ జనతా పార్టీలో చేరింది.[6]

మూలాలు

[మార్చు]
  1. "Parimala Nagappa, son file nomination" (in ఇంగ్లీష్). Deccan Herald. 21 April 2018. Archived from the original on 13 May 2025. Retrieved 13 May 2025.
  2. "Nagappa's wife, children meet PM". The Times of India. 12 November 2002. Archived from the original on 13 May 2025. Retrieved 13 May 2025.
  3. "A 'cruel animal' has gone: Parimala Nagappa". Rediff. 19 October 2004. Archived from the original on 13 May 2025. Retrieved 13 May 2025.
  4. "Ex-minister's wife to join JD(S) soon" (in ఇంగ్లీష్). The New Indian Express. 30 March 2013. Retrieved 13 May 2025.
  5. "Old Mysuru region has seen only few women leaders elected". The Times of India. 28 March 2023. Archived from the original on 13 May 2025. Retrieved 13 May 2025.
  6. "Former MLA Parimala Nagappa joins BJP" (in Indian English). The Hindu. 16 March 2017. Archived from the original on 13 May 2025. Retrieved 13 May 2025.