పరిమిత బాధ్యత భాగస్వామ్యం(Limited liability partnership)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పరిమిత బాధ్యత భాగస్వామ్యం (LLP ) అంటే, కొందరు లేదా భాగస్వాములందరూ (అధికార పరిధిపై ఆధారపడి)పరిమిత బాధ్యత మాత్రమే కలిగిన ఒక భాగస్వామ్య రూపం. అయినప్పటికీ ఇది భాగస్వామ్యాలు, సంస్థలుకు సంబంధించిన అంశాలన్నింటినీ ప్రదర్శిస్తుంది.[1] ఒక LLPలో భాగమైన ఒక భాగస్వామికి సంబంధించిన చెడు ప్రవర్తనకు లేదా నిర్లక్ష్యానికి అందులోని మరొక భాగస్వామి ప్రతిస్పందించడం లేదా బాధ్యత వహించడం జరగదు. పరిమిత భాగస్వామ్యంతో పోల్చినపుడు ఇదొక ముఖ్యమైన తేడా. ఒక సంస్థకు సంబంధించిన వాటాదారుల మాదిరిగానే, LLPలోని కొంతమంది భాగస్వాములు పరిమిత బాధ్యత మాత్రమే కలిగినవారుగా ఉంటారు.[2] అయితే కొన్ని దేశాల్లో మాత్రం LLP అనేది తప్పకుండా అపరిమిత బాధ్యత కలిగిన కనీసం ఒక్క "సాధారణ భాగస్వామి"ని కూడా కలిగి ఉంటుంది. సంస్థకు సంబంధించిన వాటాదారుల్లా కాకుండా, LLPలోని భాగస్వాములు వ్యాపారాన్ని నేరుగా నిర్వహించే హక్కును కలిగి ఉంటారు. అయితే సంస్థలోని వాటాదారుల విషయంలో, వివిధ రకాల ప్రభుత్వ నిబంధనలను అనుసరించి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో ఒకరిగా ఎన్నికయ్యే అవకాశముంది. ఈ బోర్డు అనేది సొంతంగా (వివిధ రకాల ప్రభుత్వ నిబంధనలను అనుసరించి కూడా)నిర్వహణ సాగించడంతో పాటు, సంస్థ కోసం అధికారులను నియమిస్తుంది. అటుపై ఈ అధికారులే "సంస్థ" వ్యక్తులనే హోదాలో సంస్థకు సంబంధించిన అభిరుచుల మేరకు సంస్థను నిర్వహించే విషయంలో చట్టబద్ధమైన బాధ్యతతో వ్యవహరిస్తారు.

పరిమిత బాధ్యత భాగస్వామ్యం అనేది, కొన్ని దేశాల్లో అమలులో ఉన్న పరిమిత భాగస్వామ్యం అనే విధానం నుంచి విభేదాన్ని కనబరుస్తుంది. పరిమిత భాగస్వామ్యం అనేది LLPలోని భాగస్వాములందరినీ పరిమిత బాధ్యత మాత్రమే కలిగిన వారుగా ఉండేందుకు అనుమతించవచ్చు. అయితే, పరిమిత భాగస్వామ్య విధానంలో మాత్రం అపరిమిత బాధ్యత కలిగిన కనీసం ఒక భాగస్వామి అవసరం కావచ్చు. దీంతోపాటు మిగిలినవారు సంస్థ వ్యవహారాల్లో కలుగజేసుకోకుండా, పరిమిత బాధ్యత కలిగిన పెట్టుబడిదారుగానే మిగిలిపోయేలా చేయవచ్చు. దీని ఫలితంగానే, ఆయా దేశాల్లో నిర్వహణ వ్యవహారాల్లోనూ చురుకైన పాత్ర పోషించాలనుకునే పెట్టుబడిదారులను కలిగిన వ్యాపారాలన్నింటికి LLP అనేది చక్కగా సరిపోయింది.

అమెరికాలో ఈ విధానాన్ని ఏర్పాటు చేసినపుడు LLPల మధ్య విపరీతమైన గందరగోళం ఏర్పడింది. అలాగే, 2001లో బ్రిటన్‌లో ఈ విధానాన్ని పరిచయం చేశారు. అటుపై తక్కిన దేశాల్లోనూ ఈ విధానాన్ని అమలులోకి తెచ్చారు. - కింద చూడండి - బ్రిటన్ విషయంలో LLP అనేది దాని పేరుకు తగ్గట్టుగా కాకుండా, భాగస్వామ్యం కంటే, సంఘటిత సంస్థ రూపంగానే ప్రత్యేకంగా అముల చేయబడింది.

జాతీయ వైరుధ్యాలు[మార్చు]

దేశ విదేశాల్లో రకరకాలైన భాగస్వామ్యాలు, కంపెనీలు నమోదవుతున్నాయి. వ్యాపార అస్తిత్వానికి సంబంధించిన రకాలుచూడండి.

కెనడా[మార్చు]

క్విబెక్, అంటారియో, మనిటోబా, ఆల్బెర్టాలకు చెందిన ప్రావిన్సులు, నునావుట్ ప్రాంతంతో పాటు, ఇటీవల నోవా స్కోటియా సైతం న్యాయవాదుల కోసం LLPలను అనుమతించింది. ఇక బ్రిటీష్ కొలంబియాలో భాగస్వామ్య సవరణ చట్టం 2004 (బిల్లు 35) ప్రకారం, వ్యాపారాలతో పాటు న్యాయవాదులు, ఇతర వృత్తి నిపుణుల కోసం కూడా LLPలు అనుమతించబడ్డాయి.[3]

చైనా[మార్చు]

చైనాలో LLP అనేది ప్రత్యేకమైన సాధారణ భాగస్వామ్యం (特殊普通合伙)గా సుపరిచితం. అయితే సంస్థాగతమైన రూపం అనేది జ్ఞాన-ఆధారిత వృత్తులు, సాంకేతిక సేవల పరిశ్రమలకు మాత్రమే పరిమితం చేయబడింది. భాగస్వాముల్లో ఒకరు లేదా కొంతమంది భాగస్వాములకు సంబంధించిన దుష్ప్రవర్తనకు, అతి నిర్లక్ష్యానికి బాధ్యత వహించే అవసరం లేకుండా తక్కిన భాగస్వాములను ఈ నిర్మాణం రక్షిస్తుంది.

జర్మనీ[మార్చు]

జర్మనీకి సంబంధించిన Partnerschaftsgesellschaft లేదా PartG అనేది వాణిజ్యేతర వృత్తి నిపుణులు, కలిసి పనిచేసే వారికి సంబంధించిన ఒక అసోసియేషన్. ఏకీకృత లక్షణం లేనప్పటికీ, ఇది సొంత ఆస్తిని ఆర్జించడంతో పాటు, భాగస్వామ్యం పేరు మీద పనిచేస్తుంటుంది. అయినప్పటికీ, భాగస్వాములనేవారు భాగస్వామ్య రుణాలకు సంయుక్తంగా, పూర్తిగా బాధ్యులు. అయితే, కొంతమంది భాగస్వాముల దుష్ర్పవర్తన అనేది మిగిలివారి నష్టానికి కారణమైనప్పుడు మాత్రం వృత్తిపరమైన బాధ్యత బీమా అనేది తప్పనిసరి కావచ్చు. Partnerschaftsgesellschaft అనేది కార్పోరేట్ లేదా వ్యాపార పన్నుకు సంబంధించినది కాదు. ఇది కేవలం భాగస్వాముల ఒక్కొక్కరి ఆదాయానికి సంబంధించిన పన్ను మాత్రమే.

గ్రీస్[మార్చు]

LLP అనేది గ్రీక్ EE (Eterorythmi Etaireia)కి దాదాపు సమానంగా ఉండడంతో పాటు,పరిమిత భాగస్వామ్యం రూపాన్ని చాలావరకు పోలి ఉంటుంది.

భారతదేశం[మార్చు]

పరిమిత బాధ్యత భాగస్వామ్య చట్టం 2008 అనేది 2009 జనవరి 9న భారదేశ అధికారిక గెజిట్‌లో ప్రచురితమైంది. 2009 మార్చి 31 నుంచి ఇది అమలులోకి వస్తుందని అందులో తెలియజేయబడింది. అయినప్పటికీ, ఈ చట్టం పరిమిత సెక్షన్లతో మాత్రమే ప్రకటించబడింది.[4]. దీనికి సంబంధించిన నిబంధనలు 2009 ఏప్రిల్ 1 అధికారిక గెజిట్‌లో ప్రకటించబడింది. దీని తర్వాత మొట్టమొదటి LLP ఏప్రిల్ 2009 మొదటి వారంలో ప్రవేశపెట్టబడింది.

పన్నుల విధానానికి సంబంధించిన అన్ని ఉపయోగాల కోసం భారతదేశంలో LLP సైతం తక్కిన భాగస్వామ్య సంస్థల తరహాలోనే పరిగణించబడింది.

LLP చట్టం, 2008 లో గమనించదగిన అంశాలు కింది విధంగా ఉన్నాయి:-

1. LLP అనేది ఒక ప్రత్యామ్నాయ కార్పోరేట్ వ్యాపార వాహకం. ఇది పరిమిత బాధ్యతకు సంబంధించిన ప్రయోజనాలను అందిచడమే కాకుండా, ఒప్పందంపై ఆధారపడిన భాగస్వామ్యం రూపంలో తమ అంతర్గత నిర్మాణాన్ని నిర్వహించే అనుకూలతను కలిగి ఉండేలా దాని సభ్యులను అనుమతిస్తుంది.

2. LLP చట్టం అనేది LLP నిర్మాణానికి సంబధించిన ప్రయోజనాలను కేవలం నిర్ణీత తరగతులకు చెందిన వృత్తి నిపుణులకు మాత్రమే పరిమితం చేయదు. ఈ చట్టానికి సంబంధించిన అవసరాలను పూర్తి చేయగల ఏ వ్యవస్థ అయినా ఉపయోగించగలిగేలా ఇది అందుబాటులో ఉంటుంది.

3. LLP అనేది ప్రత్యేకమైన న్యాయ వ్యవస్థను కలిగి ఉండి, దాని ఆస్తులకు పూర్తి బాధ్యత వహిస్తున్నట్టైతే, LLPలో సమ్మతించిన మేరకే భాగస్వాముల బాధ్యత అనేది పరిమితమవుతుంది. దీంతోపాటు, ఇతర భాగస్వాములకు సంబంధించిన స్వతంత్ర లేదా అనధికారిక చర్యలకు LLPలోని ఏ ఒక్క భాగస్వామి బాధ్యుడు కాబోడు. ఈ విధంగా,మరొక భాగస్వామి సృష్టించిన తప్పుడు వ్యాపార నిర్ణయాలు లేదా దుష్ప్రవర్తనకు భాగస్వాములందరూ సంయుక్త బాధ్యత వహించే అవసరం లేకుండా ఇది కాపాడుతుంది.

4. LLP అనేది బాడీ కార్పోరేట్‌గా ఉండవచ్చు. అలాగే చట్టపరమైన పరిధి అనేది దాని భాగస్వాముల నుంచి వేరుగా ఉండవచ్చు. ఇది శాశ్వత పరంపరను కలిగి ఉండవచ్చు. భారతీయ భాగస్వామ్య చట్టం 1932 అనేది LLPలకు వర్తించదు. అలాగే, సాధారణ భాగస్వామ్య సంస్థకు సంబంధించి భాగస్వాముల సంఖ్య విషయంలో గరిష్ఠంగా 20కి మించకూడుదు. అయితే, భాగస్వాముల గరిష్ఠ సంఖ్యకు సంబంధించి LLPల విషయంలో ఇలాంటి పరిమితులేవీ లేవు. అయితే, LLP చట్టం ప్రకారం, LLPలోని కనీసం ఒక భాగస్వామి భారతీయుడై ఉండడం తప్పనిసరి.

5. విలీనాలు, సమ్మేళనాలు లాంటి కార్పోరేట్ చర్యల కోసం నిబంధనలు రూపొందించబడ్డాయి.

6. LLPలను మూసివేయడానికి, రద్దు చేయడానికి సంబంధించి ేనిబంధనలు రూపొందించబడ్డాయి. LLPలకు సంబంధించిన చట్టం కింద ఈ రకమైన నిబంధనల గురించి సవివరంగా వివరించబడి ఉంది.

7. రిజిస్ట్రర్ ఆఫ్ కంపెనీస్ (ROC)వద్ద నమోదు చేయడం ద్వారా ప్రస్తతమున్న భాగస్వామ్య సంస్థ, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, అన్‌లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ లాంటి వాటిని LLPగా మార్చేందుకు ఈ చట్టం అనుమతిస్తుంది.

8. LLPని ప్రభావితం చేయగల నిబంధనలేవీ భాగస్వామ్య చట్టం 1932లో లేవు.

9. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్(Roc)అనేది LLPలను సైతం నమోదు చేయడం నియంత్రించడం జరుగుతుంది.

10. ప్రస్తుత మినిస్ట్రీ ఆఫ్ కార్పోరేట్ అఫైర్స్ పోర్టల్‌కు సంబంధించిన విజయవంతమైన నమూనా ఆధారంగా, LLPల పాలన ఎలక్ట్రానిక్ మోడ్‌లో జరగనుంది. కొత్త LLPని నమోదు చేసేందుకు LLP పోర్టల్ను దర్శించండి.

జపాన్[మార్చు]

Limited liability partnerships (有限責任事業組合 yūgen sekinin jigyō kumiai?)2006లోజపాన్‌లో ఈ విధానాన్ని ప్రవేశపెట్టిన సమయంలో, వ్యాపార సంస్థల నియంత్రణకు ఉద్దేశించిన దేశ చట్టాల్లో భారీ ఎత్తున మార్పులు చోటుచేసుకుంది. జపనీస్ LLPలు ఏదో ఒక ప్రయోజనం కోసం ఏర్పడుతాయి (అయినప్పటికీ, సాధారణంగా వర్ణించడం కాకుండా, సదరు ప్రయోజనం గురించి భాగస్వామ్య ఒప్పంద పత్రంలో తప్పకుండా స్పష్టంగా పేర్కొనాలి). దీంతోపాటు పూర్తి పరిమిత బాధ్యత కలిగి ఉండే ఇవి పన్ను ప్రయోజనాల కోసం బదిలీ సంస్థలుగా పరిగణించబడుతాయి. అయినప్పటికీ, ఒక LLPలోని ప్రతీ భాగస్వామి వ్యాపారంలో తప్పకుండా చురుకైన పాత్ర పోషించవచ్చు. కాబట్టి ఈ రకమైన నమూనా సంయుక్త వ్యాపారాలు, చిన్న వ్యాపారాలకు అత్యంత అనుకూలమైనది. దీంతోపాటు పెట్టుబడిదారులందరూ వ్యాపారంలో చురుకైన పాత్ర పోషించాలనుకున్నప్పుడు కూడా ఇది బాగా అనుకూలమైనది.[5][6] అయితే, జపనీస్ LLPలు న్యాయవాదులు లేదా అకౌంటెంట్స్ లాంటివారికి ఉపయోగంలోకిరాలేదు . ఎందుకంటే ఈ రకమైన వృత్తులు అపరిమితమైన బాధ్యత లక్షణం ద్వారా వ్యాపారం నిర్వహించాల్సిన అవసరముంది.[7]

జపనీస్ LLP అనేది సంస్థ[8] కాకపోయినప్పటికీ, దానికి బదులుగా భాగస్వాముల మధ్య ఒప్పందబద్ధమైన సంబంధాల రూపంలో అమలులో ఉంటుంది. ఇలా ఇది అమెరికన్ LLPకి దగ్గరి పోలిక కలిగి ఉంటుంది. మరోవైపు జపాన్ సైతం, godo kaisha పేరుతో భాగస్వామ్య పద్ధతిలో అంతర్గత నిర్మాణం కలిగిన ఒక రకమైన సంస్థను కలిగి ఉంది. రూపంలో ఇది బ్రిటీష్ LLP లేదా అమెరికన్ పరిమిత బాధ్యత కంపెనీకి దగ్గరగా ఉంటుంది.

కజఖ్‌స్తాన్[మార్చు]

LLP అనేది "Жауапкершілігі шектеулі серіктестік"కు సమానమైనది

పోలాండ్[మార్చు]

spółka partnerska పేరుతో 2001లో ప్రవేశపెట్టబడిన పోలిష్ చట్టంలోని పరిమిత బాధ్యత భాగస్వామ్యాలుకు ఇది సరిసమానమైనది. ఈ రకమైన కంపెనీ కేవలం మిన్ ద్వారా మాత్రమే ఏర్పాటు కాగలదు. ఇందులో భాగంగా ఇద్దరు వ్యక్తులు వృత్తిపరమైన సేవలు నిర్వహిస్తూ ఉండాలి. అలాగే ఇతర కార్యకలాపాలు నిషేధించబడి ఉండాలి.

రొమేనియా[మార్చు]

ఇక్కడ LLP అనేది, Societate civilă profesională cu răspundere limitatăగా పేరున్న రోమేనియన్ చట్టానికి సమానం.

సింగపూర్[మార్చు]

LLPలనేవి పరిమిత బాధ్యత భాగస్వామ్యాల చట్టం 2005 కింద ఏర్పాటు చేయబడ్డాయి. US, UKలలోని LLP నమూనాల ఆధారంగా ఈ శాశనం రూపొందించబడింది. అలాగే, బాడీ కార్పోరేట్ రూపంలో ఆ తర్వాతి LLPలు స్థాపించబడినాయి. అయినప్పటికీ పన్ను ఉపయోగాల కోసం ఇవి కూడా సాధారణ భాగస్వామ్యం లాగే పరిగణించబడింది. కాబట్టి, పన్ను (పన్ను పారదర్శకత) విషయంలో భాగస్వామ్యం కంటే, భాగస్వాములే ప్రధానంగా పరిగణించబడ్డారు.

యునైటెడ్ కింగ్‌డమ్[మార్చు]

యునైటెడ్ కింగ్‌డమ్‌లో LLpలనేవి పరిమిత బాధ్యత భాగస్వామ్యాల చట్టం 2000 (ఇంగ్లాండ్, వేల్స్, స్కాట్‌లాండ్‌లలో)ద్వారా పర్వవేక్షించబడ్డాయి. అలాగే, [[పరిమిత బాధ్యత భాగస్వామ్యాల చట్టం (ఉత్తర ఐర్లండ్)2002|పరిమిత బాధ్యత భాగస్వామ్యాల చట్టం (ఉత్తర ఐర్లండ్)2002]] ద్వారా ఉత్తర ఐర్లండ్‌లోను పర్యవేక్షించబడ్డాయి. UKకి సంబంధించిన పరిమిత బాధ్యత భాగస్వామ్యం అనేది ఒక కార్పోరేట్ బాడీ -భాగస్వామ్యంతో పోల్చినప్పుడు (ఇంగ్లాండ్, వేల్స్ లో తప్పించి) దాని సభ్యత్వంపై ఆధారపడి న్యాయపరమైన ఉనికి కలిగి ఉండడం వల్ల, ఇది తన సభ్యులతో సంబంధం లేకుండా, నిరంతర న్యాయపరమైన ఉనికిని కలిగి ఉంటుంది.

UK LLPలకు సంబంధించిన సభ్యులు "LLP ఒప్పందం"లో తాము అంగీకరించిన అంశాలకు సమిష్టిగా ("ఉమ్మడి")గా బాధ్యత వహిస్తారు. అయితే, ఏ ఒక్కరూ ("అనేకమంది") ఇతరులకు సంబంధించిన చర్యలకు బాధ్యత వహించరు. మోసం లేదా తప్పుడు వ్యాపార కార్యకలాపాలు లేనట్టైతే, LLPలోని లిమిటెడ్ కంపెనీ లేదా కార్పోరేషన్ సభ్యులు తాము పెట్టుబడి పెట్టిన మొత్తం కంటే ఎక్కువ నష్టపోయే ప్రసక్తే ఉండదు.

అయినప్పటికీ, పన్ను సంబంధిత విషయాల్లో UK LLP అనేది భాగస్వామ్యాన్ని పోలి ఉంటుంది. మొత్తంమీద ఇది పన్ను పారదర్శకత కలిగి ఉంటుంది. అంటే దీని అర్థం ఇది ఎలాంటి UK పన్ను చెల్లించదు. అయితే, ఇందులోని సభ్యులకు సంబంధించిన ఆదాయం లేదా LLPల ద్వారా వారు అందుకున్న లాభాల నుంచి ఇది పన్ను చెల్లిస్తుంది.

ఉమ్మడి, వ్యక్తిగత హక్కులు, బాధ్యతలు, అనంతమైన అనుకూలత లాంటి అంశాల ద్వారా ఇది ఒక ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటుంది. నిజానికి LLP ఒప్పందం కోసం ఎలాంటి రాతపూర్వకమైన సరంజామా అవసరం లేదు. ఎందుకంటే, సాధారణ భాగస్వామ్య ఆధారిత నియంత్రణలన్నీ దీనికి వర్తిస్తాయి.

ఇది జపాన్ నమూనాకు,- పైన చూడండి - దుబాయ్, ఖతార్‌లకు సంబంధించిన ఆర్థిక కేంద్రాలకు బాగా దగ్గరగా ఉంటుంది. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని పరిమిత బాధ్యత కంపెనీకి దగ్గర పోలికలు కలిగి ఉన్నప్పటికీ, నిజానికి ఇది LLC లక్షణాల నుంచి ఇది తగినంత దూరాన్ని ప్రదర్శిస్తుంది. అదేసమయంలో దీని చట్టపరమైన ఉనికి పరిమిత సమయం వరకే ఉండడం, "కొనసాగే" అవకాశం లేకపోవడం వల్ల సభ్యుల నుంచి స్వతంత్రమైన చట్ట ఉనికిని కలిగి ఉన్నప్పటికీ ఇది సాంకేతికంగా కార్పోరేట్ బాడీ కాదు.

అధికారిక కంపెనీస్ హౌస్ వెబ్‌సైట్‌లో మరింత ఎక్కువ సమాచారం అందుబాటులో ఉంది.

అమెరికా సంయుక్త రాష్ట్రాలు[మార్చు]

అమెరికా సంయుక్త రాష్ట్రాలవిషయంలో ప్రతి, ఒక్క రాష్ట్రం తమ నిర్మాణానికి సంబంధించి స్వీయ చట్ట నియంత్రణ కలిగి ఉన్నాయి. 1990ల్లో ఇక్కడ పరిమిత బాధ్యత భాగస్వామ్యాలనేవి వెలుగులోకి వచ్చాయి: అదేసమయంలో కేవలం రెండు రాష్ట్రాలు మాత్రమే 1992లో LLPలను అనుమతించాయి. అటుపై, 1996లో LLPలనేవి యునిఫాం పార్టనర్‌షిప్‌కు జోడించే సమయానికి నలభైకి పైగా రాష్ట్రాలు LLP హోదాను సాధించాయి.[9]

1980ల్లో రియల్ ఎస్టేట్, ఇంధన ధరలు కుప్పకూలడం లాంటి పరిణామాల అనంతరం పరిమిత బాధ్యత భాగస్వామ్యం అనేది ఇక్కడ వెలుగులోకి వచ్చింది. రియల్ ఎస్టేట్, ఇంధన ధరలు కుప్పకూలడమనేది అప్పట్లో బ్యాంకు, పొదుపులు, రుణ వైఫల్యాలకు దారితీసింది. బ్యాంకుల నుంచి తిరిగి పొందగల సొమ్ము తక్కువగా ఉండడం వల్ల, న్యాయవాదులు, అకౌంటెంట్ల నుంచి ఆస్తులను తిరిగి పొందాలంటూ 1980ల్లో బ్యాంకులకు సలహా ఇవ్వబడింది. చట్ట, అకౌంటింగ్ సంస్థల్లోని భాగస్వాములు ఎక్కువ మొత్తాల్లో రుణాలు తీసుకుని మిగిలిన వారిని వ్యక్తిగతంగా దివాళా తీయించే అవకాశం ఉన్నందున, ఈ రకమైన సంస్థల్లోని అమాయక భాగస్వాములపై రుణాలను తీర్చే బాధ్యత పడకుండా రక్షించడం కోసం మొదటిసారిగా ఇక్కడ LLPలు జారీచేయబడ్డాయి.[10]

అయినప్పటికీ, చాలా రకాలైన వ్యాపార రంగాల్లో LLP బాగా విజయవంతమైంది. ప్రత్యేకించి న్యాయవాదులు, అకౌంటెంట్లు, భవన నిర్మాణవేత్తలు లాంటి వృత్తిదారులతో నిండిన సంస్థల్లో LLPకి మంచి ఆదరణ లభించింది. మరోవైపు కాలిఫోర్నియా, న్యూయార్క్, ఓరెగాన్, నెవడా లాంటి రాష్ట్రాల్లో LLPలనేవి కేవలం ఈ రకమైన వృత్తి నిపుణుల కోసమే రూపొందించబడ్డాయి.[11] LLPని ఏర్పాటు చేసేందుకు సాధారణంగా కౌంటీ, రాష్ట్ర కార్యాలయాల్లో దరఖాస్తు పత్రాలు దాఖలు చేయాల్సి ఉంటుంది. ప్రత్యేకమైన కొన్ని నిబంధనల విషయంలో రాష్ట్రానికి, రాష్ట్రానికి మధ్య తేడాలున్నప్పటికీ, రివైజ్డ్ యూనిఫాం పార్టనర్‌షిప్ యాక్ట్కు సంబంధించిన వైరుధ్యాలను అన్ని రాష్ట్రాలు ఆమోదిస్తాయి.

భాగస్వాములకు సంబంధించిన బాధ్యత అనేది రాష్ట్రానికి, రాష్ట్రానికి మధ్య వేర్వేరుగా ఉంటుంది. రివైజ్డ్ యూనిఫాం పార్టనర్‌షిప్ యాక్ట్ (1997)(RUPA)(ఎక్కువ సంఖ్యలో రాష్ట్రాలచే ఆమోదించబడిన నిర్థిష్టమైన రూపం)కు సంబంధించిన సెక్షన్ 306(c) అనేది, ఒక సంస్థ తరహాలోనే పరిమిత బాధ్యత రూపంలో ఉండేందుకు LLPలను అనుమతించింది.

భాగస్వామ్యం ఒక పరిమిత బాధ్యత భాగస్వామ్యమైనప్పుడు, ఒప్పందం, వికర్మ లేదా మరోరకమైన మార్గంలో పొందే ఒక భాగస్వామ్యానికి సంబంధించిన బాధ్యత కేవలం భాగస్వామ్య బాధ్యతగా ఉంటుంది. ఇటువంటి ఒక బాధ్యతకు ఒక భాగస్వామిగా వ్యవహరించినంత మాత్రాన, ఆ భాగస్వామి దానికి వ్యక్తిగతంగా, ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా, తన వాటా ద్వారా లేదా మరోరకంగా బాధ్యత వహించడు.[ఉల్లేఖన అవసరం]

అయితే గణనీయమైన సంఖ్యలో మైనారిటీ రాష్ట్రాలు కేవలం ఇటువంటి రక్షణను నిర్లక్ష్య హక్కులకు మాత్రమే విస్తరించాయి, అంటే ఒక LLPలో భాగస్వాములు వ్యక్తిగతంగా ఒప్పందానికి, LLPపై మోపబడిన ఉద్దేశపూర్వక వికర్మ అభియోగాలకు మాత్రమే బాధ్యత వహిస్తారు. అదేసమయంలో టెన్నెస్సీ మరియు పశ్చిమ వర్జీనియాలు దీనికి భిన్నంగా RUPAను స్వీకరించాయి, దీనిలో భాగంగా ఏకరీతి భాష నుంచి వేరుపరిచిన సెక్షన్ 306ను స్వీకరించడంతోపాటు, ఒక పాక్షిక బాధ్యత రక్షణను ఇవి అందిస్తున్నాయి.

భాగస్వామ్యం లేదా పరిమిత బాధ్యత కంపెనీ (LLC)లో ఒక LLPకి సంబంధించిన లాభాలు, పన్ను ప్రయోజనాల కోసం అందులోని భాగస్వాముల మధ్య కేటాయించబడుతుంది. సంస్థల్లో తరచూ చోటుచేసుకునే "రెండుసార్లు పన్ను విధింపు" లాంటి సమస్యను తప్పించడం కోసమే ఇలా చేయబడుతుంది.

పరిమిత బాధ్యత పరిమిత భాగస్వామ్యంలను సృష్టించడం కోసం కొన్ని US రాష్ట్రాలు LP, LLP రూపాలు రెండింటినీ కలిగి ఉంటాయి.

వీటిని కూడా చూడండి[మార్చు]

సూచనలు[మార్చు]

 1. Sullivan, arthur (2003). Economics: Principles in action. Upper Saddle River, New Jersey 07458: Pearson Prentice Hall. p. 190. ISBN 0-13-063085-3. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help)
 2. రే, జేమ్స్ సి. (న్యాయసలహాదారు). "ది మోస్ట్ వ్యాలిబుల్ బిజినెస్ ఫామ్స్ యూ విల్ ఎవర్ నీడ్" (3వ ఎడిషన్) పేజీ 13. 2001 స్పిన్క్స్ ప్రచురణ, USA.
 3. "Provincial News: Limited Liability Partnerships: A Reality at Last in BC". BarTalk. 16.3 (June 2004). మూలం నుండి 2010-05-30 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-08-16. [S]ubject to the copyright by the British Columbia Branch of the Canadian Bar Association, 2004, all rights reserved [reprint].Scholar search}}
 4. "అఫిషియల్ గెజిట్ ఆఫ్ ఇండియా" (PDF). మూలం (PDF) నుండి 2009-03-25 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-08-16. Cite web requires |website= (help)
 5. హిరోహాకి కిటావోక, Esq., 有限責任事業組合(日本版LLP)(1):中堅中小企業にも利用価値のある制度 (జపనీస్‌లో)
 6. జపనీస్ LLP చట్టం (ఇంగ్లీష్ అనువాదం)
 7. ఆర్థిక మంత్రిత్వ శాఖ, వాణిజ్యం, పరిశ్రమలు, 40 LLP ప్రశ్నలు, సమాధానాలు (జపనీస్‌లో)
 8. ఆంగ్లో-అమెరికన్ చట్టానికి సంబంధించిన అర్థంలోని భాగస్వాముల నుంచి ఒక ప్రత్యేక అధికార పరిధి
 9. అడ్డెండమ్ టు ది ప్రీఫ్యాటరీ నోట్, యూనిఫాం పార్టనర్‌షిప్ యాక్ట్ (1997) Archived 2008-07-18 at the Wayback Machine..
 10. Robert W. Hamilton (1995). "Registered Limited Liability Partnerships: Present at Birth (Nearly)". Colorado Law Review. 66: 1065, 1069.
 11. థామస్ ఇ. రుట్లెడ్జ్ అండ్ ఎలిజబెత్ జి. హెస్టెర్, ప్రాకిక్టల్ గైడ్ టు లిమిటెడ్ లయబిలిటీ పార్టనర్‌షిప్స్, సెక్షన్ 8,5 స్టేట్ లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ & పార్టనర్‌షిప్ లాస్(ఆస్పేన్ 2008) చూడండి.

బయట లింకులు[మార్చు]