పర్డ్యూ విశ్వవిద్యాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Purdue University
150px
రకంPublic
Flagship
Land-Grant
Sea-Grant
Space-Grant
స్థాపితంMay 6, 1869
ఎండోమెంట్$1.457 billion (systemwide)[1]
అధ్యక్షుడుFrance A. Córdova
అత్యున్నత పరిపాలనాధికారిTimothy D. Sands
విద్యాసంబంధ సిబ్బంది
6,614
విద్యార్థులు39,697 (Fall 2009)[2]
అండర్ గ్రాడ్యుయేట్లు31,145 (Fall 2009)[2]
పోస్టు గ్రాడ్యుయేట్లు8,552 (Fall 2009)[2]
స్థానంWest Lafayette, Indiana, U.S.
కాంపస్Large town: 2,474 acres (9.336 km²)
plus 15,108 acres (60.084 km²) for agricultural and industrial research[3]
Athletics18 Division I / IA NCAA teams
అథ్లెటిక్ మారుపేరుBoilermakers
అనుబంధాలుPurdue University System
Association of American Universities
Committee on Institutional Cooperation
మస్కట్Boilermaker Special
జాలగూడుwww.purdue.edu
Purdue University wordmark.svg

U.S.లోని ఇండియానాలో వెస్ట్ లఫయేట్ వద్ద ఉన్న పర్డ్యూ విశ్వవిద్యాలయం, ఆరు ప్రాంగణాలు కలిగిన పర్డ్యూ విశ్వవిద్యాలయ వ్యవస్థ యొక్క ప్రముఖ విశ్వవిద్యాలయం .[5] ఇండియానా జనరల్ అసెంబ్లీ, మొరిల్ చట్టం నుండి ప్రయోజనాన్ని పొంది, లఫయేట్‌కి చెందిన వ్యాపారవేత్త అయిన జాన్ పర్డ్యూ నుండి అతని పేరు మీద ఒక విజ్ఞానశాస్త్ర, సాంకేతిక, మరియు వ్యవసాయ కళాశాలను నెలకొల్పడానికి భూ మరియు ధన సంపదలను దానంగా స్వీకరించడంతో, 1869 మే 6న ఒక భూ-మంజూరు విశ్వవిద్యాలయంగా పర్డ్యూ స్థాపించబడింది.[6] మూడు భవనాలు, ఆరుగురు బోధనా సిబ్బంది మరియు 39 మంది విద్యార్థులతో 1874 సెప్టెంబరు 16లో తరగతులు ప్రారంభమయ్యాయి.[6] ప్రస్తుతం, పర్డ్యూ, ఇండియానాలోని రెండవ అతిపెద్ద విద్యార్థుల సమూహంతో పాటు యునైటెడ్ స్టేట్స్‌లో రెండవ అతిపెద్ద అంతర్జాతీయ విద్యార్థిజనాభాను కలిగిన ప్రభుత్వ విశ్వవిద్యాలయంగా ఉంది.[7]

పర్డ్యూ, 210 పైన అధ్యయన రంగాలలో స్నాతకపూర్వ మరియు స్నాతక కార్యక్రమాలను అందిస్తోంది. పర్డ్యూ అనేకమంది నోబెల్ ప్రైజ్ విజేతలు, ఫార్చ్యూన్ 500 కంపెనీల CEOలు, మరియు NFL సూపర్‌బౌల్ MVPలను అందించింది.[8] అమెరికా యొక్క విమానయాన చరిత్రల ఈ విశ్వవిద్యాలయం అత్యంత ప్రభావవంతంగా ఉంది, పర్డ్యూ యొక్క విమానయాన సాంకేతికత మరియు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ (విమాన నిర్మాణం) కార్యక్రమాలు ప్రపంచంలో అత్యధిక రేటింగ్ పొందినవాటిలో ఉన్నాయి మరియు అత్యంత ఫలవంతమైనవి. పర్డ్యూ, వైమానిక శిక్షణలో మొదటి కాలేజ్ క్రెడిట్ (గుర్తింపు)ను స్థాపించింది, విమానయానంలో మొదట నాలుగు-సంవత్సరాల బాచిలర్ పట్టాను, మరియు మొదటి విశ్వవిద్యాలయ విమానాశ్రయం (పర్డ్యూ విశ్వవిద్యాలయ విమానాశ్రయం)లను ప్రారంభించింది. 20వ శతాబ్ది మధ్యభాగంలో, పర్డ్యూ యొక్క విమానయాన కార్యక్రమం అభివృద్ధి చెందిన అంతరిక్షయాన సాంకేతికత పరివేష్టించడానికి విస్తరించబడి, క్రాడిల్ ఆఫ్ ఆస్ట్రోనాట్స్ (వ్యూమగాముల ఉయ్యాల) అనే పర్డ్యూ యొక్క మారుపేరుకు దారితీసింది.[9] పర్డ్యూ నుండి పట్టా పొందిన వారిలో ఇరవై రెండు మంది వ్యోమగాములు ఉన్నారు, వీరిలో గస్ గ్రిస్సోం (ప్రారంభ మెర్క్యురీ సెవెన్ వ్యోమగాములలో ఒకరు), నీల్ ఆమ్‌స్ట్రాంగ్ (చంద్రునిపై మొదటిసారి నడిచిన వ్యక్తి), మరియు యూజీన్ సెర్నాన్ (చంద్రునిపై చివరిసారి నడిచిన వ్యక్తి) ఉన్నారు.[10]

చరిత్ర[మార్చు]

స్థాపన మరియు ప్రారంభ సంవత్సరాలు[మార్చు]

జాన్ పర్డ్యూ.

1865లో, ఇండియానా జనరల్ అసెంబ్లీ మొర్రిల్ చట్టం యొక్క ప్రయోజనాన్ని పొంది, ఇంజనీరింగ్‌పై ప్రబల దృష్టితో ఒక సంస్థను స్థాపించడానికి ప్రణాళికలు ప్రారంభించింది. జాన్ పర్డ్యూను, ఒక లఫయేట్ వ్యాపార నాయకుడు మరియు పరోపకారి (పర్డ్యూలో ఖననం చేయబడ్డారు), ఇండియానాలో ఒక "భూ మంజూరు" కళాశాల ఏర్పాటుకు సహాయం కొరకు సంప్రదించారు. ఈ ప్రణాళిక కొరకు ఇండియానా రాష్ట్రం, $150,000లను జాన్ పర్డ్యూ నుండి, $50,000లను టిప్పేకానో కౌంటీ నుండి, మరియు 150 ఎకరాల (0.6 కిమీ²) భూమిని లఫయేట్ నివాసితులనుండి విరాళంగా పొందింది. 1869 మే 6న కళాశాల లఫయేట్ నగర సమీపంలో స్థాపించాలని నిర్ణయించబడింది మరియు శాసనసభ్యులు ఈ సంస్థను దాని ప్రధాన సహాయకుని పేరు మీదుగా ఈ సంస్థను పర్డ్యూ విశ్వవిద్యాలయంగా స్థాపించారు.[6]

1874 సెప్టెంబరు 16న మూడు భవనాలు, ఆరుగురు బోధనా సిబ్బంది, మరియు 39 మంది విద్యార్థులతో పర్డ్యూలో తరగతులు ప్రారంభించబడ్డాయి. పర్డ్యూ తన మొదటి పట్టాను, రసాయన శాస్త్రంలో బాచిలర్ ఆఫ్ సైన్స్‌గా 1875లో ప్రదానం చేసింది.

20వ శతాబ్దం – విమానయానం మరియు విమాననిర్మాణం(ఏవియేషన్ అండ్ ఏరోనాటిక్స్)[మార్చు]

పర్డ్యూ విశ్వవిద్యాలయం, అంతరిక్షంలో దాని విభిన్న ప్రాధాన్యతలకు ప్రసిద్ధిచెందింది. పర్డ్యూ విశ్వవిద్యాలయ విమానాశ్రయం, యునైటెడ్ స్టేట్స్‌లో ఒక విశ్వవిద్యాలయం-యాజమాన్యంలోని మొదటి విమానాశ్రయం. పర్డ్యూ, విమానయానంలో నాలుగు-సంవత్సరాల బాచిలర్ పట్టాను అందించిన ప్రపంచంలోని మొట్టమొదటి విశ్వవిద్యాలయం.[11] ఈ విద్యాలయం, దేశంలో విమానాశ్రయాల నిర్వహణకు AAAE గుర్తింపును ఇచ్చే సంస్థలలో ఒకటిగా కూడా ఉంది.[12] పర్డ్యూ యొక్క ఏవియేషన్ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్ అనేక పరిశోధనా ప్రకల్పనలలో చురుకుగా పాలుపంచుకుంటుంది మరియు నేషనల్ బిజినెస్ ఏవియేషన్ అసోసియేషన్ మరియు ఇంటర్ నేషనల్ సొసైటీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ ట్రేడింగ్‌లతో భాగస్వామిగా ఉంది.

2010లో, ప్రత్యామ్నాయ ఇంధనాలను అభివృద్ధిపరచడానికి మరియు నూతన ప్రయోజనాలకు వైమానిక ఇంజన్లను పరీక్షించడానికి పర్డ్యూ విశ్వవిద్యాలయం, యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ నుండి $1.35 మిలియన్ల విరాళాన్ని పొందింది. పర్డ్యూ, సంవత్సరానికి 60 మందిని మాత్రమే అనుమతించే తమ ప్రత్యేక విమానయాన శిక్షణా కార్యక్రమం కొరకు పదహారు సిర్రస్ SR-20 శిక్షణా విమానాలు, ఒక ఏమ్బ్రేర్ ఫేనోం 100 అతి తేలిక జెట్, మరియు ఒక బంబార్డియర్ CRJ 700 సిమ్యులేటర్‌లను కొనుగోలుచేసింది.

1908 తరగతికి చెంది, పర్డ్యూ నుండి పట్టా పొందినవారిలో మొదటి వైమానికుడైన J. క్లిఫ్ఫోర్డ్ టర్పిన్, ఒర్విల్లె రైట్ నుండి వైమానిక శిక్షణను పొందాడు.[13] 1919లో, జార్జ్ W. హస్కిన్స్ ప్రాంగణంలో విమానాన్ని దించిన మొదటి పూర్వవిద్యార్థి అయ్యాడు.

1930లో పర్డ్యూ వైమానిక శిక్షణకు కళాశాల గుర్తింపుని ఇచ్చే దేశంలోని మొదటి విశ్వవిద్యాలయంగా మారింది, తరువాత అది తన స్వంత విమానాశ్రయం, పర్డ్యూ విశ్వవిద్యాలయం విమానాశ్రయం ప్రారంభించిన మొదటి విశ్వవిద్యాలయంగా మారింది. ప్రసిద్ధిచెందిన విమానచోదకురాలు అమేలియా ఇయర్ హార్ట్ 1935లో పర్డ్యూకి వచ్చి "కౌన్సిలర్ ఆన్ కెరీర్స్ ఫర్ వుమెన్," అనే స్థానంలో 1937లో తాను అదృశ్యం అయ్యేవరకు కొనసాగారు.[14] ఇయర్ హార్ట్ యొక్క దురదృష్టకరమైన "ఫ్లయింగ్ లేబొరేటరీ" ప్రణాళికలో ఆమె ప్రపంచం చుట్టిరావడానికి ఉద్దేశించిన లాక్ హీడ్ మోడల్ 10 ఎలెక్ట్రా విమానానికి నిధులను అందించడం ద్వారా పర్డ్యూ ఒక అర్ధవంతమైన భూమికను పోషించింది. పర్డ్యూగ్రంథాలయాలు విస్తృతమైన ఇయర్ హార్ట్ సేకరణను నిర్వహిస్తున్నాయి, ఆమె అదృశ్యం గురించి రహస్యాన్ని ఛేదించాలనుకునేవారు ఇప్పటికీ వాటిని అధ్యయనం చేస్తున్నారు.[15] పర్డ్యూ తరువాతి కాలంలో ఒక నివాస గృహానికి ఆమె గౌరవార్ధం ఆమె పేరు పెట్టి, ఇయర్ హార్ట్ యొక్క చిత్రాలు మరియు వ్యాసాలను దానిలో ఉంచింది.

ఒక సమయంలో, పర్డ్యూ విశ్వవిద్యాలయం, "పర్డ్యూ ఎయిర్ లైన్స్" అనే పేరుతో FAR పార్ట్ 121 క్రింద అద్దె విమానాల స్వంతదారు మరియు నిర్వాహకురాలిగా ఉంది. ఈ సంస్థ అద్భుత విజయాన్ని పొంది, DC-9ల సముదాయాన్ని కలిగిఉండేది. హుగ్ హెఫ్నర్ యొక్క ప్రసిద్ధ ప్లేబాయ్ DC-9 విమానం, నిజానికి పర్డ్యూ నుండి అద్దెకు తీసుకోబడింది మరియు పర్డ్యూ విశ్వవిద్యాలయంలో దాని శాశ్వత సంగ్రహాలయం ఉంది.[16]

గత పది సంవత్సరాలలో, పర్డ్యూ యొక్క స్కూల్ ఆఫ్ ఏరోనాటిక్స్ మరియు ఆస్ట్రోనాటిక్స్ దేశంలోని మరే ఇతర సంస్థ కంటే ఎక్కువ ఇంజనీరింగ్ పట్టాలను ప్రదానం చేసింది, ఇవి స్నాతకపూర్వ పట్టాలలో 6% మరియు Ph.D పట్టాలలో 7% ఉన్నాయి. దీని పూర్వ విద్యార్థులు అంతరిక్ష సాంకేతికత యొక్క పరిశోధన మరియు అభివృద్ధిలలో గుర్తించదగిన ప్రగతిని సాధించి, అనేక ప్రధాన కార్పోరేషన్లు మరియు ప్రభుత్వ సంస్థలకు ఆధిపత్యం వహించారు, మరియు అంతరిక్ష అన్వేషణలో అద్భుత రికార్డును స్థాపించారు.[11]

ప్రాంగణం[మార్చు]

ఇంజనీరింగ్ మాల్‌కి ప్రవేశదృశ్యం

పర్డ్యూ యొక్క ప్రాంగణం వాబాష్ నది యొక్క పడమర ఒడ్డున వెస్ట్ లఫయేట్ యొక్క చిన్న నగరంలో ఉంది. స్టేట్ రోడ్ 26తో ఏకీభవించే స్టేట్ స్ట్రీట్, ప్రాంగణాన్ని ఉత్తర మరియు దక్షిణ భాగాలుగా విభజిస్తుంది. విద్యాసంబంధ భవనాలు ఎక్కువగా ప్రాంగణంలోని తూర్పు మరియు దక్షిణ భాగాలలో కేంద్రీకరించబడ్డాయి, నివాస భవనాలు పశ్చిమ భాగంలో, మరియు క్రీడా సౌకర్యాలు ఉత్తర భాగంలో ఉన్నాయి. గ్రేటర్ లఫయేట్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కార్పోరేషన్ (సిటీబస్) ప్రాంగణంలో ఎనిమిది పరిపథ (లూప్) బస్ మార్గాలను నడుపుతుంది, వీటిలో విద్యార్థులు, బోధనా సిబ్బంది, మరియు సిబ్బంది ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.

పర్డ్యూ మాల్[మార్చు]

మధ్య ప్రాంగణ దృశ్యం

పర్డ్యూ మాల్, పర్డ్యూ విశ్వవిద్యాలయం యొక్క మధ్యభాగంలో ఖాళీ ప్రదేశంలో ఉంది. అనేక ఇంజనీరింగ్ భవనాలకు దాని సామీప్యత కారణంగా, అది ఇంజనీరింగ్ మాల్ అని కూడా ప్రసిద్ధిచెందింది. పర్డ్యూ మాల్ యొక్క అత్యంత ముఖ్య లక్షణం 38-foot (12 m)-పొడవైన కాంక్రీట్ ఇంజనీరింగ్ ఫౌంటైన్, ఇంకా ఇది ఫ్రెడెరిక్ L. హోవ్డే హాల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌ను కలిగిఉంది, దీనిలో విశ్వవిద్యాలయ అధ్యక్షుడైన, ఫ్రాన్స్ A. కోర్డోవా కార్యాలయం ఉంది. పర్డ్యూ బెల్ టవర్, పర్డ్యూ మరియు మెమోరియల్ మాల్‌ల మధ్యలో ఉంది. ఈ బెల్ టవర్ విశ్వవిద్యాలయం యొక్క గుర్తింపు చిహ్నంగా భావించబడుతుంది మరియు అనేక పర్డ్యూ చిహ్నాలు మరియు లఫయేట్ మరియు వెస్ట్ లఫయేట్ నగరాల చిహ్నాలపై గుర్తించబడుతుంది.

పర్డ్యూ మాల్‌కి నైరుతి దిశలో ఎడ్వర్డ్ C. ఇలియట్ హాల్ ఆఫ్ మ్యూజిక్ ఉంది, ఇది ప్రపంచంలోని అతి పెద్ద రంగస్థల శాలలలో ఒకటి.[17] పర్డ్యూ యొక్క స్టూడెంట్ కన్సర్ట్ కమిటీ ప్రసిద్ధ వినోద కళాకారులను ఇక్కడికి ఆహ్వానించి విద్యార్థులు, అధ్యాపకులు, మరియు సామాన్య ప్రజానీకం కొరకు ప్రదర్శనలు ఇప్పిస్తుంది. పర్డ్యూ మాల్ సమీపంలోనే ఫెలిక్స్ హాస్ హాల్ ఉంది, ఇది 1903 అక్టోబరు 31లో రైల్‌రోడ్ ప్రమాదం పర్డ్యూ రెక్‌లో మరణించిన పర్డ్యూ విశ్వవిద్యాలయం యొక్క 17 మంది ఫుట్‌బాల్ క్రీడాకారులు, శిక్షకులు, పూర్వ విద్యార్థులు, మరియు అభిమానుల స్మృత్యర్ధం 1909లో మెమోరియల్ జిమ్నాసియంగా నిర్మించబడింది. కంప్యూటర్ సైన్స్ విభాగానికి స్థానం కల్పించడానికి ఈ భవనం 1985లో పునరుద్ధరించబడింది. 2006లో, దీనికి పదవీవిరమణ పొందిన ప్రోవోస్ట్ ఫెలిక్స్ హాస్ గౌరవార్ధం పేరుమార్చబడి, సాంఖ్యక విభాగానికి స్థావరం కల్పించబడింది.

మెమోరియల్ మాల్[మార్చు]

పర్డ్యూ మెమోరియల్ యూనియన్

పర్డ్యూ మాల్‌కి దక్షిణంగా, పర్డ్యూ మెమోరియల్ మాల్ ఉంది, ఇది ప్రాంగణం యొక్క మొదటి విభాగం. విద్యార్థులకు ఒక ప్రముఖ సమావేశ ప్రదేశంగా, పచ్చికతో కూడిన బహిరంగ మెమోరియల్ మాల్ చుట్టూ స్టీవర్ట్ స్టూడెంట్ సెంటర్, స్టాన్లీ కోల్టర్ హాల్, 1950 తరగతి యొక్క లెక్చర్ హాల్, రిసైటేషన్ బిల్డింగ్, బెవర్లీ స్టోన్ హాల్, మరియు యూనివర్సిటీ హాల్ ఉన్నాయి. మెమోరియల్ మాల్, హలో వాక్‌ను కూడా కలిగి ఉంది. మెమోరియల్ మాల్‌కి తూర్పు దిక్కున పర్డ్యూ విద్యార్థిసమాఖ్య భవనమైన పర్డ్యూ మెమోరియల్ యూనియన్, మరియు దాని ప్రక్కనే ఉన్న యూనియన్ క్లబ్ హోటల్ ఉన్నాయి.

ఆరు-భవనాలు ఉన్న మొదటి ప్రాంగణంలో యూనివర్సిటీ హాల్ ఒక్కటే మిగిలిఉంది. 1871లో దీని నిర్మాణం ప్రారంభమైంది, అప్పుడు ఈ భవనం "ప్రధాన భవనం"గా పిలువబడేది. ఈ భవనం 1877లో అంకితం చేయబడింది మరియు ఇది పూర్తవడానికి అయిన ప్రణాళికా వ్యయం $35,000. ప్రారంభంలో యూనివర్సిటీ హాల్ అధ్యక్షుడి కార్యాలయాన్ని, ఒక ప్రార్థనా మందిరం, తరగతి గదులను కలిగిఉంది, కానీ 1961లో చరిత్ర విభాగం మరియు స్కూల్ ఆఫ్ లిబరల్ ఆర్ట్స్ ఉపయోగించే తరగతిగదులు మాత్రమే ఉండే విధంగా తిరిగి రూపకల్పన చేయబడింది. జానపద కథనం ప్రకారం, జాన్ పర్డ్యూ కోరిక ప్రకారం ఆయన మెమోరియల్ మాల్‌లో ఖననం చేయబడ్డారు, ఇది యూనివర్సిటీ హాల్ ప్రధాన ప్రవేశానికి ఎదురుగా ఉంది. ఈ సమాధిస్థలం చెక్కబడని పైపలకతో గౌరవపూర్వకంగా నిర్వహించబడుతుంది, ఏదేమైనా, Mr. పర్డ్యూ, నిజానికి ఈ ప్రాంతంలో ఖననం చేయబడ్డారా అనే విషయంపై వివాదాలు ఉన్నాయి.

దక్షిణ ప్రాంగణం[మార్చు]

స్టేట్ స్ట్రీట్‌కి దక్షిణ ప్రాంతంలో పర్డ్యూ యొక్క వ్యవసాయ మరియు పశువైద్య భవనం ఉంది. ఈ ప్రాంతంలో హార్టికల్చర్ గార్డెన్స్, డిస్కవరీ పార్క్, మరియు పర్డ్యూ ఎయిర్‌పోర్ట్ ఉన్నాయి.

పశ్చిమ ప్రాంగణం[మార్చు]

ప్రాంగణం యొక్క పశ్చిమ భాగం విద్యార్థుల నివాసాలు, భోజనశాల, మరియు వినోద సౌకర్యాలను కలిగిఉంది. ఈ ప్రాంతంలోని రిక్రియేషనల్ స్పోర్ట్స్ సెంటర్, బాయిలర్‌మేకర్ అక్వాటిక్ సెంటర్, మరియు ఆవరణలోని క్రీడా ప్రాంతాలలో విద్యార్థులు సంఘ మరియు కళాశాలఅంతర్గత క్రీడలను ఆడవచ్చు. 1957లో నిర్మించబడిన పర్డ్యూ యొక్క రిక్రియేషనల్ స్పోర్ట్స్ సెంటర్, విశ్వవిద్యాలయ విద్యార్థుల వినోద అవసరాలను తీర్చడానికి నిర్మించబడిన దేశంలోని మొట్టమొదటి భవనం. స్టూడెంట్ వెల్‌నెస్ మరియు ఫిట్‌నెస్ సెంటర్‌గా మారడానికి ఇది జనవరి 2011 నుండి ఆగస్టు 2012 వరకు, LEED-గుర్తింపు పొందిన విస్తరణ మరియు పునర్నిర్మాణాన్ని పొందనుంది.[18]

స్టేడియం ప్రాంతం[మార్చు]

మాకీ అరీనా

ఉత్తర ప్రాంతంలో అధికభాగం, విశ్వవిద్యాలయం కొరకు పారిశ్రామికవేత్త డేవిడ్ E. రాస్ మరియు రచయిత & వినోదకారుడు జార్జ్ అడే కొనుగోలుచేసిన ప్రాంతంలో ఉంది. పర్డ్యూ ప్రాంగణంలో ఖననం చేయబడిన ఇద్దరు వ్యక్తులలో డేవిడ్ రాస్ ఒకరు (మరొకరు జాన్ పర్డ్యూ). రాస్–అడే స్టేడియం (అమెరికన్ ఫుట్‌బాల్), మాకీ అరీనా (బాస్కెట్‌బాల్), మరియు లాంబెర్ట్ ఫీల్డ్‌హౌస్ (ఇండోర్ ట్రాక్ & ఫీల్డ్) వంటి పర్డ్యూ యొక్క క్రీడాసౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి. దేశంలోని అతిపెద్ద పురుష నివాస సముదాయాలలో ఒకటైన స్లేటర్ సెంటర్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ మరియు కారీ క్వాడ్రాన్గిల్ ఈ ప్రాంతంలో ఉన్నాయి.[19] స్లేటర్ బ్యాండ్ షెల్ పశ్చిమ భాగంలో కొండపై ఉన్న తోటలో డేవిడ్ రాస్ సమాధి ప్రాంతం ఉంది.

విద్యా విశేషాలు[మార్చు]

ఒక్క వెస్ట్ లఫయేట్ ప్రాంగణంలోనే పర్డ్యూ, అధ్యయనం యొక్క ప్రధాన విషయాలలో 200 ఎంపికలను, మరియు అంత ప్రాముఖ్యం లేని విషయాలలో అనేక ఎంపికలను అందిస్తోంది.[20] పర్డ్యూ, ఎనిమిది కళాశాలలు మరియు పెద్ద కళాశాలలో పాఠశాలలుగా వ్యవస్థీకరించబడింది; క్రన్నెర్ట్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ మరియు స్కూల్ ఆఫ్ వెటరినరీ మెడిసిన్ దీనికి రెండు మినహాయింపులు.[21] ఈ రెండి విద్యా సమూహాలు తమ "స్కూల్" స్థాయిని 2004 మరియు 2005లలో జరిగిన విశ్వవిద్యాలయ స్థాయి పునఃనామకరణంలో నిలుపుకున్నాయి, ఇది జాతీయ వృత్తిపరమైన స్కూల్ నామకరణ సంప్రదాయానికి విభిన్నంగా ఉంది.[22] 2010 జూలై 1న కాలేజ్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సైన్సెస్ స్థాపించబడింది. అప్పటికే ఉనికిలో ఉన్న విద్యా సమూహాలను సంఘటిత పరచడం ద్వారా ఒక నూతన కళాశాల సృష్టించబడింది. ఈ సమూహాలలో స్కూల్ ఆఫ్ నర్సింగ్, స్కూల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్, కాలేజ్ ఆఫ్ కన్స్యూమర్ అండ్ ఫ్యామిలీ సైన్సెస్, మరియు కాలేజ్ ఆఫ్ లిబరల్ ఆర్ట్స్ యొక్క మానవీయశాస్త్రాలు- కాని ప్రధానాంశాలు; మనస్తత్వశాస్త్రం మరియు వినికిడి మరియు వాక్కు (స్పీచ్) వ్యాధిశాస్త్రం ఉన్నాయి.[23]

పర్డ్యూ విశ్వవిద్యాలయం యొక్క కళాశాలలు
కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్
1869
కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్
1908
కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్
1876
కాలేజ్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సైన్సెస్
1905
కాలేజ్ ఆఫ్ లిబరల్ ఆర్ట్స్
1953
కాలేజ్ ఆఫ్ ఫార్మసి
1884
కాలేజ్ ఆఫ్ సైన్స్
1907
కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ
1964

పర్డ్యూ విశ్వవిద్యాలయం యొక్క ఇంజనీరింగ్ స్కూల్స్
స్కూల్ ఆఫ్ ఏరోనాటిక్స్ అండ్ అస్ట్రోనాటిక్స్ అగ్రికల్చరల్ అండ్ బయోలాజికల్ ఇంజనీరింగ్ వెల్డన్ స్కూల్ ఆఫ్ బయోమెడికల్ ఇంజనీరింగ్ స్కూల్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్ స్కూల్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ స్కూల్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్
స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ స్కూల్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ స్కూల్ ఆఫ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ స్కూల్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ స్కూల్ ఆఫ్ న్యూక్లియర్ ఇంజనీరింగ్ డివిజన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ డివిజన్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ అండ్ ఎకలాజికల్ ఇంజనీరింగ్

పర్డ్యూ విశ్వవిద్యాలయం యొక్క ఇతర స్కూల్స్
క్రన్నెర్ట్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్* స్కూల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ స్కూల్ ఆఫ్ వెటరినరి మెడిసిన్*

* గుర్తు ఒక పెద్ద కళాశాలలో స్వతంత్ర ఉనికిగల స్కూల్‌ను సూచిస్తుంది.

బోధనాసిబ్బంది[మార్చు]

1874లో ఆరుగురితో ప్రారంభమైన బోధనాసిబ్బంది సంఖ్య, 2007 వసంత ఋతువు నాటికి పర్డ్యూ స్టేట్‌వైడ్ సిస్టంలో శాశ్వత మరియు శాశ్వతం కాబోయే సిబ్బంది మొత్తం 2,563కు చేరింది. వ్యవస్థ-పరంగా బోధన మరియు సిబ్బంది సంఖ్య 18,872.[24] ప్రస్తుత బోధనాసిబ్బందిలో శ్రీరామ్ శంకర్ అభయంకర్ – సింగ్యులారిటీ థియరీకి తన సేవకు ప్రసిద్ధిచెందారు, ఆర్డెన్ L. బెమెంట్ జూనియర్ – నేషనల్ సైన్స్ ఫౌండేషన్ డైరెక్టర్, R. గ్రాహం కుక్స్, జోసెఫ్ ఫ్రాన్సిస్కో, డగ్లస్ కమర్, బీబర్బాచ్ ఉజ్జాయింపును నిరూపించిన లూయిస్ డి బ్రన్గెస్ డి బౌర్సియా, ఐ-ఇచి నెగిషి, విక్టర్ రస్కిన్, మానవులలో సాధారణంగా ఉండే జలుబు వైరస్ ను చూపిన మైకేల్ రోస్మాన్, లే జమీసన్, మరియు H. జే మెలోష్ వంటి పండితులు ఉన్నారు.[25]

పర్డ్యూ యొక్క శాశ్వత బోధనా సిబ్బందిలో అరవై మంది అకాడెమిక్ డీన్స్, అసోసియేట్ డీన్స్, మరియు అసిస్టెంట్ డీన్స్ ఉన్నారు; 63 విద్యా విభాగాల అధిపతులు; 753 ప్రొఫెసర్లు; 547 అసోసియేట్ ప్రొఫెసర్లు మరియు 447 అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు. పర్డ్యూ తన వెస్ట్ లఫయేట్ ప్రాంగణంలో 892 మంది శాశ్వత కాబోయే సిబ్బందిని, అధ్యాపకులు, మరియు పరిశోధక పట్టా పొందినవారిని (పోస్ట్ డాక్టోరల్స్) కలిగి ఉంది. పర్డ్యూ తన రీజనల్ కాంపసెస్ మరియు స్టేట్ వైడ్ టెక్నాలజీలలో మరొక 691 శాశ్వత మరియు 1,021 మంది బోధనాసిబ్బంది, మరియు పరిశోధక పట్టా పొందినవారిని కలిగిఉంది.[24]

పర్డ్యూలో ఉండగా ఇద్దరు బోధనాసిబ్బంది నోబెల్ బహుమతులను పొందారు, పర్డ్యూ మాజీ బోధనా సభ్యుడైన నోబెల్ బహుమతి గ్రహీత హెర్బర్ట్ C. బ్రౌన్‌కు వీరు జతకలిసారు. మొత్తం మీద ఐదు నోబెల్ బహుమతులు పర్డ్యూతో సంబంధం కలిగిఉన్నాయి, వీరిలో పూర్వవిద్యార్థులు, ప్రస్తుత బోధనాసిబ్బంది మరియు పూర్వ బోధనాసిబ్బంది ఉన్నారు.

పరిశోధన[మార్చు]

దస్త్రం:MSEE.jpg
మెటీరియల్స్ సైన్స్ మరియు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ భవనం

రాష్ట్ర మరియు సమాఖ్య ప్రభుత్వాలు, పరిశ్రమ, సహాయక సంస్థలు మరియు వ్యక్తిగత దాతల నుండి వచ్చిన నిధులను ఉపయోగించి ఈ విశ్వవిద్యాలయం 2006–07లో పరిశోధనా వ్యవస్థపరంగా $472.7 మిలియన్లను ఖర్చుపెట్టింది. బోధనాసిబ్బంది మరియు 400 పైన ఉన్న పరిశోధనా ప్రయోగశాలలు పర్డ్యూ విశ్వవిద్యాలయాన్ని ప్రధాన పరిశోధనా సంస్థలలో ఒకటిగా నిలిపాయి.[26] కార్నెగీ క్లాసిఫికేషన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, పర్డ్యూ విశ్వవిద్యాలయాన్ని "అత్యధిక పరిశోధనా కార్యకలాపాలు" కలిగినదిగా పరిగణించింది.[27] నవంబరు 2007లో, ది సైంటిస్ట్ పత్రిక విడుదల చేసిన స్థానాల ప్రకారం, విద్యారంగంలో పనిచేయడానికి పర్డ్యూ దేశంలోని అత్యుత్తమ ప్రదేశాలలో నాల్గవదిగా ఉంది.[28] పర్డ్యూ యొక్క పరిశోధకులు అనేక కీలక రంగాలలో అంతర్దృష్టిని, విజ్ఞానాన్ని, సహాయాన్ని, మరియు పరిష్కారాలను అందిస్తారు. వీటిలో, వ్యవసాయం; వ్యాపారం మరియు ఆర్థికవ్యవస్థ; విద్య; ఇంజనీరింగ్; పర్యావరణం; ఆరోగ్య రక్షణ; వ్యక్తులు, సమాజం, సంస్కృతి; వస్తువుల తయారీ; విజ్ఞాన శాస్త్రం; సాంకేతికత; పశువైద్యం ఉన్నాయి కానీ వీటికి మాత్రమే పరిమితం కాదు.[29]

నేషనల్ సైన్స్ ఫౌండేషన్, నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, మరియు U.S. విభాగాలైన వ్యవసాయం, రక్షణ, శక్తి, మరియు ఆరోగ్య మరియు మానవ సేవల భాగస్వామ్యంతో 2007-08 విత్త సంవత్సరానికి పర్డ్యూ విశ్వవిద్యాలయం రికార్డు స్థాయిలో $333.4 మిలియన్లను ప్రాయోజిత పరిశోధనా నిధులుగా పొందగలిగింది.[30]

బహుళవిభాగ చర్య ద్వారా నూతన కల్పనలను తేవడానికి పర్డ్యూ విశ్వవిద్యాలయం డిస్కవరీ పార్క్‌ను స్థాపించింది.[31] డిస్కవరీ పార్క్ యొక్క పదకొండు కేంద్రాలలో, వ్యవస్థాపన నుండి శక్తి వరకు మరియు వస్తువుల తయారీలో పురోగతి వరకు ఉండే పరిశోధనా ప్రకల్పనలు భారీ ఆర్థిక ప్రభావాన్ని ప్రతిబింబిస్తాయి మరియు ప్రపంచ సమస్యలకు ఉద్దేశించినవి అయి ఉంటాయి.[32] డిస్కవరీ పార్క్‌లోని నూతన బ్రిక్ నానో టెక్నాలజీ సెంటర్ వద్ద నిర్మించబడిన పర్డ్యూ విశ్వవిద్యాలయం యొక్క నానోటెక్నాలజీ పరిశోధనా కార్యక్రమం, దేశంలోని అత్యుత్తమమైన వాటిలో స్థానం పొందింది.[33]

1961లో స్థాపించబడిన పర్డ్యూ రిసెర్చ్ పార్క్ [34], పర్డ్యూకి సహాయం కొరకు సృష్టించబడిన ఒక ప్రైవేట్ లాభాపేక్ష రహిత సంస్థ అయిన పర్డ్యూ రిసెర్చ్ ఫౌండేషన్‌చే[35] అభివృద్ధిపరచబడింది. జీవశాస్త్రాలు, స్వదేశీ రక్షణ, ఇంజనీరింగ్, పురోగతి చెందిన వస్తువుల తయారీ మరియు సమాచార సాంకేతిక రంగాలలో పనిచేసే సంస్థలపై ఈ పార్క్ దృష్టి కేంద్రీకరిస్తుంది.[36] ఇది అనుభవజ్ఞులైన పర్డ్యూ పరిశోధకులకు మరియు వ్యక్తిగత వ్యాపారస్తులకు, ఉన్నత-సాంకేతిక పరిశ్రమకు మధ్య అభిప్రాయాలను పంచుకునే పరిసరాలను కల్పిస్తుంది.[34] ఇది ప్రస్తుతం 155 సంస్థలలో 3,000 మంది వ్యక్తులను నియమించింది, వీటిలో 90 సాంకేతిక-ఆధార సంస్థలు ఉన్నాయి.[30] 2004లో అసోసియేషన్ ఆఫ్ యూనివర్సిటీ రిసెర్చ్ పార్క్స్‌చే పర్డ్యూ రిసెర్చ్ పార్క్ ప్రథమ స్థానాన్ని పొందింది.[37]

మూస:Infobox US university ranking

పరిపాలన[మార్చు]

బోర్డ్ ఆఫ్ ట్రస్స్టీస్‌చే నియమించబడే విశ్వవిద్యాలయ అధ్యక్షుడు విశ్వవిద్యాలయం యొక్క ముఖ్య పరిపాలన అధికారి (చీఫ్ ఎడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్). ప్రవేశాలు మరియు నమోదు, విద్యార్థిప్రవర్తన మరియు మార్గదర్శనం, తరగతులు మరియు స్థల నిర్వహణ మరియు నిర్ణయం, విద్యార్థుల క్రీడలు మరియు వ్యవస్థీకృత పాత్యేతర కార్యక్రమాలు,గ్రంథాలయాలు, బోధనా సిబ్బంది నియామకం మరియు వారి ఉద్యోగ పరిస్థితులు, బోధనేతర సిబ్బంది నియామకం మరియు వారి ఉద్యోగ పరిస్థితులు, విశ్వవిద్యాలయం యొక్క సాధారణ వ్యవస్థీకరణ, మరియు విశ్వవిద్యాలయ బడ్జెట్ యొక్క ప్రణాళిక మరియు పరిపాలనలను అధ్యక్షుడి కార్యాలయం పర్యవేక్షిస్తుంది.

విశ్వవిద్యాలయానికి ప్రధాన విద్యాధికారిగా వ్యవహరించే ప్రోవోస్ట్, పర్యవేక్షణ మరియు ప్రత్యేక విశ్వవిద్యాలయ కార్యకలాపాల కొరకు అనేకమంది ఉపాధ్యక్షులు, మరియు సాటిలైట్ ప్రాంగణ చాన్సలర్‌ల వంటి ఇతర ప్రధాన అధికారులను బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ నేరుగా నియమిస్తుంది.

నిలకడ సామర్థ్యం[మార్చు]

విశ్వవిద్యాలయ పరిపాలకులు మరియు ఆచార్యులతో కూడిన పర్డ్యూ సస్టైనబిలిటీ కౌన్సిల్, నెలకొకసారి సమావేశమై పర్డ్యూలోని పరిసర సమస్యలు మరియు నిలకడ ప్రోత్సాహకాలను చర్చిస్తుంది.[38] ఈ విశ్వవిద్యాలయం ప్రస్తుతం, మెకానికల్ ఇంజనీరింగ్ భవనంతో పాటు తన మొదటి LEED గుర్తింపు పొందిన భవనాన్ని నిర్మిస్తోంది, ఇది 2011 వసంతఋతువు నాటికి పూర్తికానుంది.[39] ఈ విద్యాలయం తన ప్రాంగణంలో ఒక ఆర్బోరేటం అభివృద్ధి పరచే ప్రక్రియలో కూడా ఉంది.[40] అంతేకాక, కాంపస్ యుటిలిటీ ప్లాంట్ వద్ద ప్రస్తుత శక్తి ఉత్పత్తిని వివరించే డిస్‌ప్లే వ్యవ్యస్థ ఏర్పాటు చేయబడింది.[40] ఈ విద్యాలయం ప్రతి సంవత్సరం వసంత ఋతువులో, పర్డ్యూ సమాజాన్ని పర్యావరణ సమతుల్యతకు సంబంధించిన అంశాలతో నిమగ్నం చేసే ఉద్దేశంతో "గ్రీన్ వీక్"ను నిర్వహిస్తుంది.[41]

విద్యార్థిజీవితం[మార్చు]

విద్యార్థిసమూహం[మార్చు]

దస్త్రం:PU grad.jpg
స్నాతకోత్సవం

పర్డ్యూ విద్యార్థిసమూహం ప్రాధమికంగా ఇండియానా నుండి వచ్చిన విద్యార్ధులను కలిగి ఉంది. 2006–07లో, జాబితాలోని మొత్తం 39,288 విద్యార్ధులలో 23,086 ఇండియానా నివాసితులు.[42] 2007 నాటికి, స్నాతకపూర్వ విద్యార్థిసమూహంలో జాతి వైవిధ్యత ఈ విధంగా ఉంది, 86.9% శ్వేత, 5.51% ఆసియన్, 3.53% ఆఫ్రికన్ అమెరికన్, మరియు 2.75% హిస్పానిక్ లు ఉన్నారు.[43] వీరిలో, 41.2% విద్యార్ధినులు.[44] స్నాతక విద్యార్థిసమూహ జనాభాలో దేశీయ అల్పసంఖ్యాకులు 15.4% ఉండగా[43] 38.5% స్త్రీలు ఉన్నారు.[44] అతిపెద్ద అల్పసంఖ్యాక సమాజం (పూర్తి స్థాయి విద్యార్థిసమాజంలో ఆరు శాతం)[45] 123 దేశాలకు ప్రాతినిధ్యం వహించే అంతర్జాతీయ సమాజం.[46] స్నాతక విద్యార్థిజనాభాలో, ప్రవాసులు అధిక సంఖ్యలో 78% ఉన్నారు.[47] వీరు దాదాపు అందరు స్నాతక పూర్వవిద్యార్ధులు[48] మరియు పూర్తి-స్థాయి స్నాతక విద్యార్థిజనాభాలో దాదాపు 70%.[47] ప్రవేశాల కొరకు ఈ విద్యాలయం యొక్క ఎంపిక USNWR "మరింత ఎంపికతో కూడుకొని ఉంది":దరఖాస్తుదారులలో సుమారు 70% మందికి ప్రవేశం కల్పించబడుతుంది.

నివాసం[మార్చు]

పర్డ్యూ విశ్వవిద్యాలయంలోని కారీ క్వాడ్ మరియు స్పిట్జర్ కోర్ట్

పర్డ్యూ విశ్వవిద్యాలయం స్నాతక పూర్వ మరియు స్నాతక విద్యార్థుల కొరకు పదిహేను ప్రత్యేక నివాస హాళ్ళను నడుపుతుంది, వీటిలో: కారీ క్వాడ్రాన్గిల్, ఇయర్‌హార్ట్ హాల్, ఫస్ట్ స్ట్రీట్ టవర్స్, హారిసన్ హాల్, హాకిన్స్ హాల్, హిల్లెన్ బ్రాండ్ హాల్, హిల్ టాప్ అపార్ట్మెంట్స్, మక్ కట్చియోన్ హాల్, మెరేడిత్ హాల్, ఓవెన్ హాల్, పర్డ్యూ విలేజ్, ష్రేవ్ హాల్, టార్కింగ్టన్ హాల్, విలే హాల్, మరియు విండ్సర్ హాల్ ఉన్నాయి.[49] ఈ నివాస హాళ్ళలో, కారీ మరియు టార్కింగ్టన్ మగవారికి ప్రత్యేకించినవి కాగా విండ్సర్ స్త్రీలకు మాత్రమే ప్రత్యేకించినది; మిగిలినవి సహవిద్యకు కేటాయించబడ్డాయి. జూలై 2009లో ప్రారంభించబడిన అత్యంత నూతన నివాస హాల్ అయిన, ఫస్ట్ స్ట్రీట్ టవర్స్, ఉన్నత తరగతుల పురుషులకు ప్రత్యేకించబడింది.[50]

పర్డ్యూలో 12 సహకార నివాసాలు ఉన్నాయి (5 పురుషులవి మరియు 7 స్త్రీల నివాసాలు). పురుషుల నివాసాలలో సర్కిల్ పైన్స్, ఫెయిర్‌‌వే, మార్వుడ్, చూన్‌సె, మరియు జెమిని ఉన్నాయి. స్త్రీల నివాసాలలో ఆన్ ట్వీడేల్, గ్లెన్వుడ్, ట్విన్ పైన్స్, మాక్లూర్, స్టీవర్ట్, డేవోన్ షైర్, మరియు షూమేకర్ ఉన్నాయి. వీటిలో నివసించే పర్డ్యూ విశ్వవిద్యాలయం విద్యార్థుల నాయకత్వంలో నడిచే పర్డ్యూ కోఆపరేటివ్ కౌన్సిల్ ఈ సహకార నివాసాలను నిర్వహిస్తుంది. ఇతరరకాల నివాసాల కంటే సహకార వ్యవస్థలో జీవన వ్యయం తక్కువగా ఉంటుంది,[51] శుభ్రపరచేవారిని మరియు వంటవారిని నియమించుకోవడానికి బదులుగా, సభ్యులే గృహకృత్యాలను పంచుకోవడంలో చురుకైన పాత్ర వహించడం మరియు వంట తామే చేసుకోవడంతో ఇది సాధ్యపడుతుంది.[52]

పర్డ్యూ విశ్వవిద్యాలయం దేశంలోని మూడవ అతిపెద్ద గ్రీక్ సమాజాన్ని కలిగిఉంది, సుమారు 5,000 మంది విద్యార్థులు విశ్వవిద్యాలయంలోని 46 పురుష సమాజాలు (ఫ్రేటర్నిటీస్) లేదా 29 స్త్రీల సమాజాలలో (సోరోరిటీస్) ఏదో ఒక దానిలో పాల్గొంటారు.[53] పర్డ్యూ యొక్క అత్యంత ప్రతిభావంతులైన పట్టాదారులు అనేకమంది ఫ్రేటర్నిటీస్ మరియు సోరోటిటీస్ యొక్క సభ్యులు.[52] పర్డ్యూ యొక్క గ్రీక్ వ్యవస్థ చాలా బలమైనది మరియు అనేక రంగాలలో కలసి పనిచేస్తుంది, వీటిలో ఇంటర్-ఫ్రేటర్నిటీ కౌన్సిల్, పాన్ హెలెనిక్, మరియు అనేక అత్యంత విజయవంతమైన ఉపకారాలు ఉన్నాయి. ఉదాహరణకు, 2010లో, జెటా టావు ఆల్ఫా యొక్క ఉపకారం, బిగ్ మాన్ ఆన్ కాంపస్ (BMOC) ఇతర గ్రీక్ సమాజం యొక్క సహకారంతో $125,000 పైన మొత్తాన్ని సేకరించి, రొమ్ము కాన్సర్ అవగాహన మరియు పరిశోధనకు కేటాయించడం జరిగింది. ప్రతి చాప్టర్ ఏదో ఒక ప్రత్యేక ప్రయోజనం కొరకు వారు స్వంత జాతీయ ఉపకార సంస్థలను కలిగిఉన్నాయి. ఉపకారంతో పటు, పర్డ్యూ గ్రీకులు, కాలేజ్ మెంటార్స్ ఫర్ కిడ్స్, పర్డ్యూ యూనివర్సిటీ డాన్స్ మారథాన్, బాయిలర్ గోల్డ్ రష్, పర్డ్యూ స్టూడెంట్ గవర్నమెంట్ మరియు అనేక ఇతర కార్యక్రమాలతో ప్రాంగణంలోని అన్ని కార్యకలాపాలలో పాల్గొంటున్నారు. పర్డ్యూ యొక్క గ్రీక్ వ్యవస్థ సామూహిక మద్యపాన పంపిణీ, మద్యపాన విషపానీయం, మరియు తక్కువ వయసువారిలో మద్యపానం యొక్క ప్రమాదం మరియు హానిల గురించి ముందస్తుగా పోరాడుతోంది. పర్డ్యూలో ఒక నూతన వ్యవస్థ అయిన కాలిబర్, అందరు గ్రీక్ సభ్యులు సురక్షితంగా మరియు విశ్వవిద్యాలయం, స్టూడెంట్స్ యాక్టివిటీస్ ఆఫీస్ రూపొందించిన నిబంధనలకు కట్టుబడి ఉండేలా చూడటంలో ముందంజలో ఉంది.

ప్రసార సాధనాలు[మార్చు]

పర్డ్యూ ఎక్స్పోనెంట్ అనే ఒక స్వతంత్ర విద్యార్థివార్తాపత్రిక, ఇండియానాలోని కళాశాల వార్తాపత్రికలలో అత్యధిక పంపిణీని కలిగి, స్ప్రింగ్ మరియు ఫాల్ సెమిస్టర్‌లలో 17,500 రోజువారీ పంపిణీని కలిగి ఉంది.[54]

1999లో ప్రాంగణంలోని చిన్న టెలివిజన్ స్టూడియోలో (ప్రస్తుతం ఎరిక్ మైగ్రంట్ స్టూడియోగా పిలువబడుతుంది) "మూవీ ట్రిబ్యూట్ షో విత్ ఎరిక్ మైగ్రంట్" సృష్టించబడింది.[55]

WBAA పర్డ్యూ విశ్వవిద్యాలయం యొక్క స్వంత రేడియో కేంద్రం. ఈ కేంద్రం AM ఫ్రీక్వెన్సీ 920 kHz మరియు FM ఫ్రీక్వెన్సీ 101.3 MHzతోను పనిచేస్తుంది. దీని స్టూడియోలు పర్డ్యూ ప్రాంగణంలోని ఎడ్వర్డ్ C. ఎలియట్ హాల్ ఆఫ్ మ్యూజిక్ నందు, మరియు ట్రాన్స్‌మిటర్‌లు లఫయేట్, ఇండియానాలో ఉన్నాయి. WBAA, 1922 ఏప్రిల్ 4లో అనుమతిని పొంది, ఇండియానాలో దీర్ఘకాలంగా నిరంతరం నిర్వహించబడుతున్న రేడియో కేంద్రంగా ఉంది. WBAA పగటి సమయంలో, NPR మరియు స్థానిక వార్తలు/చర్చా కార్యక్రమాలను ప్రసారం చేస్తుంది. రాత్రి సమయాలలో, AM కేంద్రం జాజ్ ను ప్రసారం చేయగా, FM కేంద్రం సాంప్రదాయ సంగీతాన్ని ప్రసారం చేస్తుంది.

ప్రాంగణంలో కూడా కొన్ని విద్యార్థిరేడియో కేంద్రాలు ఉన్నాయి. ప్రస్తుతం, మూడు నివాస హాళ్ళ నుండి నిర్వహింపబడుతూ, అంతర్జాలం ద్వారా మాత్రమే ప్రసారం చేయబడుతున్నాయి;ఇవి WCCR, కారీ క్వాడ్రాన్గిల్ నుండి (ప్రస్తుత WCCR FM లేదా ఇతర రాష్ట్రాలలోని WCCR-LP కేంద్రాల కంటే భిన్నమైనది), విలే హాల్ నుండి విలీ, మరియు హారిసన్ హాల్ నుండి WHHR. నాల్గవ విద్యార్థికేంద్రం, పర్డ్యూ స్టూడెంట్ రేడియో క్లబ్, పర్డ్యూ మెమోరియల్ యూనియన్ నుండి నిర్వహించబడుతుంది మరియు అంతర్జాలంతో పాటు తక్కువ శక్తి AMపై ప్రసారం చేయబడుతుంది.[56][57][58][59]

పర్డ్యూ విశ్వవిద్యాలయ అమెచ్యూర్ రేడియో క్లబ్ యొక్క కాల్‌సైన్ (గుర్తింపు కోడ్) W9YB. W9YB తనకు తానుగా దేశంలోని అతిపెద్ద మరియు అత్యంత చురుకైన కళాశాల అమెచ్యూర్ రేడియో కేంద్రాలలో ఒకటిగా ప్రకటించుకుంటుంది. W9YB టిప్పేకానోయ్ కౌంటీ ప్రాంతం యొక్క అత్యవసర నిర్వహణలో చురుకుగా పాల్గొంటుంది మరియు నైపుణ్యం కలిగిన సభ్యులతో సహాయం కొరకు సిద్ధంగా ఉంటుంది.[60]

క్రీడలు[మార్చు]

దస్త్రం:Tiller pu.jpg
పర్డ్యూ ఫుట్‌బాల్ మాజీ ప్రధాన శిక్షకుడు, జో టిల్లర్

పర్డ్యూ, ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, క్రాస్‌కంట్రీ, టెన్నిస్, కుస్తీ, గోల్ఫ్, వాలీ‌బాల్, మరియు ఇతరాలతో 18 డివిజన్ I/I-A NCAA జట్లకి స్థావరంగా ఉంది. పర్డ్యూ, బిగ్ టెన్ కాన్ఫరెన్స్ యొక్క స్థాపక సభ్యురాలు, మరియు దానిని సృష్టించడంలో ప్రధాన పాత్ర పోషించింది. సాంప్రదాయంగా ఉన్న ప్రత్యర్థులలో బిగ్ టెన్ సహచరులు ఇండియానా హూసియేర్స్, ఇల్లినాయిస్ ఫైటింగ్ ఇల్లిని, మరియు బిగ్ ఈస్ట్ కాన్ఫరెన్స్ నుండి నోట్రే డామే ఫైటింగ్ ఐరిష్ ఉన్నాయి (ఏదేమైనా, ఫుట్‌బాల్ కార్యక్రమం స్వతంత్రమైనది).

పర్డ్యూ, అలబామాతో కలిసి సూపర్ బౌల్ క్వార్టర్ బాక్స్ విజేతలను అనేకమందిని తయారుచేసింది. లెన్ డాసన్ (SB IV, MVP), బాబ్ గ్రీసె (SB VII and VIII), మరియు డ్రూ బ్రీస్ (SB XLIV, MVP).

బాయిలర్‌మేకర్ పురుషుల మరియు స్త్రీల బాస్కెట్‌‌బాల్ జట్లు మరే ఇతర అనుబంధ విద్యాలయాల కంటే ఎక్కువ బిగ్ టెన్ చంపియన్ షిప్ లను గెలుచుకున్నాయి, 27 అనుబంధ బానర్ క్రింద గెలుచుకోగా, పురుషుల జట్టు లీగ్ నాయకత్వం 22తో ఉంది. పర్డ్యూ పురుషుల బాస్కెట్‌బాల్ అన్ని బిగ్ టెన్ విద్యాలయాలతో ఎప్పటికీ నిలిచి ఉండే విజయాల రికార్ధుని కలిగి ఉంది.[61]

అధికారచిహ్నాలు మరియు ఆచారాలు[మార్చు]

బాయిలర్‌మేకర్స్[మార్చు]

దస్త్రం:Purdue Pete.svg
పర్డ్యూ పెటే– పర్డ్యూ విశ్వవిద్యాలయం యొక్క అత్యంత గుర్తింపు పొందిన చిహ్నాలలో ఒకటి

విశ్వవిద్యాలయం యొక్క క్రీడాజట్ల పేరు పర్డ్యూలోని అన్ని విషయాలకు ప్రసిద్ధ సూచికగా మారింది. 1891లో ఆ సంవత్సర ఫుట్‌బాల్ విజేత జట్టును వర్ణించడానికి ఒక విలేఖరి ఈ పేరును మొదట ఉపయోగించాడు మరియు వెంటనే విద్యార్థుల ఆమోదాన్ని పొందాడు.

గుర్తులు, చిహ్నాలు, మరియు రంగులు[మార్చు]

విశ్వవిద్యాలయం స్థాపించిన 130 సంవత్సరాలలో, బాయిలర్ మేకర్ క్రీడా జట్లకు ఆసరాగా అనేక గుర్తులు ఉద్భవించాయి, వీటిలో: బాయిలర్‌మేకర్ స్పెషల్, పర్డ్యూ పేటె, మరియు ఇటీవలి కాలంలోని, రౌడీ ఉన్నాయి.

1940 నుండి బాయిలర్‌మేకర్ స్పెషల్ పర్డ్యూ విశ్వవిద్యాలయం యొక్క అధికారిక గుర్తుగా ఉంది. ఒక లోకోమోటివ్ రైలు వలె కనిపించే విధంగా రూపకల్పన చేయబడిన ఈ స్పెషల్, ప్రారంభంలో పర్డ్యూ యొక్క ఇంజనీరింగ్ కార్యక్రమాలు చూపడానికి రూపొందించబడింది మరియు పర్డ్యూ రీమర్ క్లబ్ సభ్యులచే నిర్వహించబడుతుంది.

పర్డ్యూ అథ్లెటిక్స్ యొక్క అనధికారక గుర్తు అయిన, పర్డ్యూ పేటె, పర్డ్యూ విశ్వవిద్యాలయం యొక్క అత్యంత గుర్తింపును పొందిన చిహ్నాలలో ఒకటి.

ఒక 18-foot (5.5 m) "ది బాయిలర్‌మేకర్" విగ్రహం 2005లో రాస్ అడే స్టేడియానికి ప్రక్కగా నిర్మించబడింది.

1887 ఆకురాలు కాలంలో, పర్డ్యూ విశ్వవిద్యాలయం తన విద్యాలయ వర్ణాలుగా, ఓల్డ్ గోల్డ్ మరియు నలుపులను స్వీకరించింది. 1887లో పర్డ్యూ యొక్క మొదటి ఫుట్‌బాల్ జట్టు సభ్యులు తమ దళం నిర్దిష్టమైన వర్ణాలతో విభిన్నంగా ఉండాలని భావించారు, ఆ సమయంలో ప్రిన్స్‌టన్ విజయవంతమైన ఫుట్‌బాల్ జట్టుగా ఉండటంతో, దాని రంగులు కూడా పరిశీలించబడ్డాయి. వాస్తవానికి ప్రిన్స్‌టన్ దుస్తులు కాషాయం మరియు నలుపు రంగులవి అయినప్పటికీ, అవి పసుపు మరియు నలుపులుగా పరిగణించబడతాయి. పర్డ్యూ ఆటగాళ్ళు పసుపు రంగుకి బదులుగా ముదురు బంగారు వర్ణాన్ని ఎంచుకొని (ఓల్డ్ గోల్డ్), నలుపు రంగుని తీసుకొని, ఆ రంగులని ఎగరవేయడం ప్రారంభించారు, అది నేటికీ కొనసాగుతోంది.[62]

=== ముద్ర

===

1969లో విశ్వవిద్యాలయ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా పర్డ్యూ యొక్క అధికారిక ముద్ర అధికారికంగా ప్రారంభించబడింది. బోర్డ్ ఆఫ్ ట్రస్టీలచే ఆమోదించబడిన ఈ ముద్ర గతంలో పర్డ్యూలో పనిచేసిన ప్రొఫెసర్ అల్ గొవాన్‌చే రూపొందించబడింది. ఇది 73 సంవత్సరాల నుండి ఉపయోగంలో ఉన్న ముద్ర స్థానంలో వచ్చి చేరింది, కానీ ఎప్పుడూ అధికారికంగా బోర్డ్ యొక్క ఆమోదాన్ని పొందలేదు.

మధ్యయుగ ముద్రలలో వలె, 1895లో, పర్డ్యూ అధికార ముద్ర కొరకు అబ్బి p.లిట్లే శక్తికి సంకేతమైన ఒక రాబందును ఉపయోగించారు. ప్రొఫెసర్ గొవాన్ ముద్రను తిరిగి రూపకల్పన చేసినపుడు, ఆయన పాత, అనధికారిక ముద్రతో గుర్తింపుని కొనసాగించడానికి రాబందు గుర్తును అలాగే ఉంచారు. పాత ముద్రలో వలె, "పర్డ్యూ విశ్వవిద్యాలయం" అనే మాటలు టైప్‌ఫేస్ యూనికల్‌లో కూర్చబడ్డాయి. మూడు-భాగాల కవచం విశ్వవిద్యాలయం యొక్క మూడు ప్రకటిత లక్ష్యాలను సూచిస్తుంది: గతంలో ఉన్న విజ్ఞానశాస్త్రం, సాంకేతికత మరియు వ్యవసాయములను విద్య, పరిశోధన మరియు సేవ అనే పదాలు ఆక్రమించాయి.

పాట[మార్చు]

పర్డ్యూ విశ్వవిద్యాలయం యొక్క అధికారిక పోరాట గీతం, "హెయిల్ పర్డ్యూ!", 1912లో పూర్వ విద్యార్థులు ఎడ్వర్డ్ ఒటవ (సంగీతం) మరియు జేమ్స్ మారిసన్ (గీతరచన) లచే ఇది "పర్డ్యూ యుద్ధ గీతం"గా సంకలనం చేయబడింది.[63] 1913లో "హెయిల్ పర్డ్యూ" కాపీ రైట్ పొంది వర్సిటీ గ్లీ క్లబ్‌కు అంకితం చేయబడింది.

గ్రాండ్ ప్రి[మార్చు]

ఈ 50-మైళ్ళ, 160-ఆవృత గో-కార్ట్ పోటీ "కళాశాల పోటీలలో ఒక గొప్ప దృశ్యం" మరియు ప్రతి సంవత్సరం గాలా వారంతో ముగుస్తుంది. పాల్గొనే మొత్తం 33 కార్ట్‌లు విద్యార్థిజట్ల ప్రయత్నంతో తయారవుతాయి. 1958లో ఈ వేడుక ప్రారంభం అయినప్పటినుండి ఇది విద్యార్థుల ఉపకార వేతనాల కొరకు నిధులను సమకూరుస్తోంది.[64] ఇండియానా విశ్వవిద్యాలయం యొక్క లిటిల్ 500 సంపూర్ణ అనుకరణగా సృష్టించబడింది.

ఓల్డ్ వోకెన్ బకెట్[మార్చు]

దక్షిణ ఇండియానాలోని ఒక తోటలో స్థాపించబడిన ఒకెన్ బకెట్, దేశంలోని అత్యంత పురాతనమైన ఫుట్‌బాల్ ట్రోఫీలలో ఒకటి. సాంవత్సరిక పర్డ్యూ vs. ఇండియానా విశ్వవిద్యాలయ అమెరికన్ ఫుట్‌బాల్ క్రీడలో విజేత ఒక కంచు "P" లేదా "I"ని గొలుసుకి కలిపి ట్రోఫీని తరువాత పోటీ వరకు నిలుపుకోగలుగుతారు. 1925లోని మొదటి పోటీ పరిహాసంగా 0–0తో సమానమై, చెయిన్‌కి మొదటి లింకుగా "IP"ని చేర్చింది. పర్డ్యూ ప్రస్తుతం ఈ ట్రోఫీని 55-26-3తో గెలుపొంది విజేతగా ఉంది.

పూర్వ విద్యార్ధులు[మార్చు]

నీల్ ఆమ్‌స్ట్రాంగ్

పర్డ్యూ యొక్క పూర్వ విద్యార్థులు అనేక రంగాలలో, ప్రత్యేకించి విజ్ఞాన మరియు పారిశ్రామిక రంగాలలో మంచి గుర్తింపును సాధించారు.

బహుశా పర్డ్యూ వ్యోమగాములకు బహు ప్రసిద్ధి చెందింది. మొత్తమ్మీద, పర్డ్యూ, రోదసిలోకి వెళ్లి తిరిగివచ్చిన మొదటి వ్యక్తి అయిన గాస్ గ్రిస్సొం, చంద్రునిపై నడిచిన మొదటి వ్యక్తి నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, మరియు ఆవిధంగా చేసిన చివరి వ్యోమగామి యూగెనే సెర్నాన్ వంటి వారితో కలిపి 22మంది వ్యోమగాములను తయారుచేసింది.[65] NASA యొక్క మానవసహిత వ్యోమ యాత్రలలో మూడింట ఒక వంతు వాటిలో ప్రతి బృందంలో కనీసం ఒక పర్డ్యూ విద్యార్థిఅయినా సభ్యునిగా ఉన్నారు.[66] అంతరిక్ష సాంకేతికత యొక్క పరిశోధన మరియు అభివృద్ధులలో ఈ వ్యక్తులు గణనీయ పురోగతిని సాధించి రోదసి అన్వేషణలో అద్భుత రికార్డును స్థాపించారు.

విజ్ఞానరంగంలో కూడా పర్డ్యూ, భౌతిక శాస్త్రవేత్తలైన ఎడ్వర్డ్ మిల్స్ పర్సెల్, బెన్ రాయ్ మొటెల్సన్ మరియు జూలియన్ శ్వింగర్‌ల రూపంలో ముగ్గురు నోబెల్ బహుమతి విజేతలను ఉత్పత్తి చేసింది; అలాగే రసాయనశాస్త్రంలో ముగ్గురు నోబెల్ బహుమతి విజేతలు అకిరా సుజుకి, హెర్బర్ట్ సి. బ్రౌన్ మరియు ఐ-ఇచి నెగిషిలను అందించింది. విజ్ఞానశాస్త్రంలో ప్రసిద్ధి చెందిన పర్డ్యూ యొక్క పూర్వ విద్యార్థులలో రోబోటిక్స్ మరియు రిమోట్ నియంత్రణ సాంకేతికత మార్గదర్శి థామస్ B. షెరిడాన్ మరియు చైనీస్ భౌతికవేత్త డెంగ్ జియాగ్జిన్ ఉన్నారు.

వ్యాపారం మరియు ఆర్థిక శాస్త్రాలలో, పర్డ్యూ పూర్వవిద్యార్థులలో, కోటీశ్వరుడైన బెచ్‌టెల్ కార్పోరేషన్ ఆధినేత స్టీఫెన్ బెచ్‌టెల్, నోబెల్ బహుమతి విజేత అయిన ఆర్థికవేత్త వెర్నాన్ L. స్మిత్, ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ అధ్యక్షుడు జేఫ్ఫ్రీ లాకర్, పాప్‌కార్న్‌‌ను కనుగొని, తయారీలో ప్రత్యేకత పొందిన ఒర్విల్లె రెడెన్బచెర్ ఉన్నారు. స్టాండర్డ్ & పూర్ యొక్క 500 సంస్థలలో ముఖ్య కార్యనిర్వహణ అధికారులుగా పనిచేస్తున్న స్నాతకపూర్వ పూర్వ విద్యార్థులు ఎక్కువగా ఉన్న విశ్వవిద్యాలయాలో పర్డ్యూ ఒకటని 2010లో బ్లూంబర్గ్ వెల్లడించింది. వారు గ్రెగొరీ వాస్సన్, ప్రెసిడెంట్/CEO వాల్గ్రీన్ కో, రిచర్డ్ స్మిత్, ఛైర్మన్/CEO ఈక్విఫాక్స్ Inc., జెఫ్రీ గార్డ్నర్, ప్రెసిడెంట్/CEO విండ్ స్ట్రీం Corp., మార్క్ మిల్లర్, ఛైర్మన్/ప్రెసిడెంట్/CEO స్టెరిసైకిల్ Inc, చార్లెస్ డేవిడ్సన్, ఛైర్మన్/CEO నోబెల్ ఎనర్జీ Inc, రోజేర్ లింగ్విస్ట్, ఛైర్మన్/ప్రెసిడెంట్/CEO మెత్రోప్క్స్ కమ్యూని కే షన్స్ Inc, సామ్యూల్ అల్లెన్, ఛైర్మన్ /ప్రెసిడెంట్/CEO డీరే & Co., జాన్ మార్టిన్, ఛైర్మన్/CEO గిలీడ్ సైన్సెస్ Inc.[67][67]

ప్రభుత్వం మరియు సంస్కృతి రంగాలలో ఉన్న పర్డ్యూ పూర్వవిద్యార్థులలో, పులిట్జర్ బహుమతి విజేతలు బూత్ టార్కింగ్టన్ మరియు జాన్ T. మక్ కట్చెయోన్, రాండ్ కార్పోరేషన్ యొక్క CEO జేమ్స్ థాంప్సన్, C-SPAN యొక్క వ్యవస్థాపకుడు మరియు CEO బ్రయాన్ లాంబ్, ఇండియానా యొక్క మాజీ గవర్నర్ హారీ G. లెస్లీ, మిసిసిపి మాజీ గవర్నర్ కిర్క్ ఫోర్దిస్, యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్ మెంట్ ఆఫ్ అగ్రి కల్చర్ యొక్క మాజీ సెక్రటరి ఎర్ల్ L. బుట్జ్, యునైటెడ్ స్టేట్స్ మాజీ సెనేటర్ బిర్చ్ బాయ్, చైనీస్ జాతీయ జనరల్ సన్ లిరెన్ చికాగో విశ్వవిద్యాలయ అధ్యక్షుడు హుగో F. సోన్నెన్స్చెయిన్ ఉన్నారు.

క్రీడలలో, NCAA రికార్డు బద్దలు కొట్టిన బాస్కెట్‌‌బాల్ ఐతిహాసిక కోచ్ జాన్ వూడెన్, బాస్కెట్‌‌బాల్ హాల్ ఆఫ్ ఫేం గ్రహీత రిక్ మౌంట్, మరియు NBA ఆల్-స్టార్స్ గ్లెన్ రాబిన్సన్, బ్రాడ్ మిల్లర్, టెర్రీ దిస్చింగేర్ మరియు జో బర్రి కార్రోల్, పర్డ్యూ యొక్క పూర్వవిద్యార్థులు. పర్డ్యూ NFL కొరకు అనేక క్వార్టర్ బాక్‌లను తయారుచేసింది మరియ ఇతర విద్యాలయాల కంటే పర్డ్యూ క్వార్టర్ బాక్స్ ఎక్కువ గజాలు ముందుకు విసిరారు మరియు టచ్‌డౌన్‌లు పొందారు.[68] ముగ్గురు NFL సూపర్ బౌల్ MVP విజేత క్వార్టర్ బాక్‌లు, బాబ్ గ్రీస్, లెన్ డాసన్, మరియు డ్రూ బ్రీస్‌లతో పర్డ్యూ అధిగమించలేని ఘనతను కలిగిఉంది.

విశ్వవిద్యాలయం యొక్క పూర్వ విద్యార్థినీ, విద్యార్థులకు ది డుచ్ అలుమ్ని సెంటర్ ఒక ప్రదర్శనా వేదికగా పనిచేస్తుంది. ఈ 67,000-square-foot (6,200 మీ2) కేంద్రం పర్డ్యూ అలుమ్ని అసోసియేషన్ అండ్ యూనివర్సిటీ డెవలప్మెంట్‌లకు స్థావరంగా ఉంది. పర్డ్యూ అలుమ్ని అసోసియేషన్ యొక్క 68,000 సభ్యులు మరియు 325,000 పూర్వ విద్యార్థినీ, విద్యార్థులకు ఇది కేంద్రం మరియు కలయిక ప్రదేశంగా ఉంది.[69]

వీటిని కూడా చూడండి[మార్చు]

 • పర్డ్యూ విశ్వవిద్యాలయ వ్యవస్థ

సూచనలు[మార్చు]

 1. "Purdue Endowment at June 30, 2009" (PDF). Purdue Office of Investments. Purdue Office of Investments. Retrieved 2009-06-30.[permanent dead link]
 2. 2.0 2.1 2.2 "Purdue University Data Digest 2009–10". Purdue.edu. Retrieved 2010-07-10. Cite web requires |website= (help)
 3. "Data Digest West Lafayette 2006–2007 > Facilities > Land and Facilities". Purdue University. మూలం నుండి 2007-10-18 న ఆర్కైవు చేసారు. Retrieved 2007-09-22. Cite web requires |website= (help)
 4. "Purdue Identity Graphics Standards" (PDF). Purdue University. Retrieved 2008-11-28. Cite web requires |website= (help)
 5. "Purdue Points of Pride". Purdue University. మూలం నుండి 2004-05-08 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-11-02. Cite web requires |website= (help)
 6. 6.0 6.1 6.2 "About Purdue > Purdue History". Purdue University. Retrieved 2009-11-02. Cite web requires |website= (help)
 7. Sen, Soumitro (2008). "Purdue's international student population 2nd largest among U.S. public universities". Purdue University. Retrieved 2010-08-02. Cite web requires |website= (help)
 8. http://www.పర్డ్యూ.edu/newsroom/general/2010/100807FACCommence.html[permanent dead link]
 9. "Purdue Astronauts". Purdue University News Service. మూలం నుండి 2004-12-16 న ఆర్కైవు చేసారు. Retrieved 2006-06-12. Cite news requires |newspaper= (help)
 10. "History of the Purdue School of Aeronautics and Astronautics". College of Engineering web site. Purdue University.
 11. 11.0 11.1 https://engineering.పర్డ్యూ.edu/AAE/AboutUs/History[permanent dead link]
 12. "About Us : Aviation Technology : Purdue University College of Technology : West Lafayette, Indiana". Tech.purdue.edu. మూలం నుండి 2010-02-25 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-01-22. Cite web requires |website= (help)
 13. Book chronicles wings of పర్డ్యూ's flight dreams
 14. https://engineering.పర్డ్యూ.edu/EngineeringImpact/Issues/2007_1/CoE_Articles/VolumestoTell[permanent dead link]
 15. "Amelia Earhart :: Papers, Photos, Memorabilia, and Artifacts". Lib.purdue.edu. Retrieved 2010-01-22. Cite web requires |website= (help)
 16. Wings of their dreams: Purdue in flight – Google Books. Books.google.com. 1971-03-22. Retrieved 2010-01-22.
 17. "Hall of Music Productions – Venues – Purdue University". Housing.purdue.edu. 1990-09-30. Retrieved 2010-01-22. Cite web requires |website= (help)
 18. Schenke, Jim (December 4, 2009). "Purdue trustees advance recreational and grounds facilities". Purdue University News Service. Retrieved May 4, 2010. Cite news requires |newspaper= (help)
 19. "Cary Quadrangle". Purdue University Housing and Food Services. మూలం నుండి 2011-08-07 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-08-25. Cite web requires |website= (help)
 20. "Purdue University – Academics". Purdue.edu. Retrieved 2010-01-22. Cite web requires |website= (help)
 21. "Purdue University – Colleges/Schools". Purdue.edu. Retrieved 2010-01-22. Cite web requires |website= (help)
 22. పర్డ్యూ ట్రస్టీలు నాలుగు విద్యా సమూహాలు, 4 భవనాలు, 1 విభాగానికి పేరు పెట్టారు
 23. పర్డ్యూ College of Health and Human Sciences[permanent dead link]
 24. 24.0 24.1 "Purdue University Facts Online : Faculty and Staff". Purdue.edu. Retrieved 2010-01-22. Cite web requires |website= (help)
 25. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2009-01-16 న ఆర్కైవు చేసారు. Retrieved 2011-02-14. Cite web requires |website= (help)
 26. "Purdue University – Facts Online – Research". Retrieved March 9, 2010. Cite web requires |website= (help)
 27. "Carnegie Classifications". Carnegiefoundation.org. 2007-05-10. Retrieved 2010-01-22. Cite web requires |website= (help)
 28. Gawrylewski, Andrea (2007-11-01). "Purdue pushes forward :The Scientist [2007-11-01]". The-scientist.com. Retrieved 2010-01-22. Cite web requires |website= (help)
 29. "Purdue University – Research Areas". Purdue.edu. మూలం నుండి 2013-08-09 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-01-22. Cite web requires |website= (help)
 30. 30.0 30.1 "Purdue generates record $333.4 million in research funding". News.uns.purdue.edu. 2008-08-04. Retrieved 2010-01-22. Cite web requires |website= (help)
 31. "Discovery Park at Purdue University". Purdue.edu. Retrieved 2010-01-22. Cite web requires |website= (help)
 32. Buck, Charles; Sharma, Pankaj (2008). "Discovery Park at Purdue University: Engine for Academic and Commercial Growth". Retrieved 2008-08-11. Cite web requires |website= (help)CS1 maint: multiple names: authors list (link)
 33. "Purdue's nanotechnology research facilities rank 8th in U.S. survey". News.uns.purdue.edu. 2007-06-12. Retrieved 2010-01-22. Cite web requires |website= (help)
 34. 34.0 34.1 "Purdue Research Park". News.uns.purdue.edu. 2002-01-10. Retrieved 2010-01-22. Cite web requires |website= (help)
 35. "Purdue Research Foundation". Prf.org. Retrieved 2010-01-22. Cite web requires |website= (help)
 36. "Purdue Research Parks [ About the Parks ]". Purdueresearchpark.com. Retrieved 2010-01-22. Cite web requires |website= (help)
 37. "AURP Annual Award Recipients: Outstanding Research/Science Park Achievement Award". Association of University Research Parks. 2004. మూలం నుండి 2008-01-12 న ఆర్కైవు చేసారు. Retrieved 2008-08-11. Cite web requires |website= (help)
 38. "Sustainability Council". Purdue University. మూలం నుండి 2012-07-17 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-06-09. Cite web requires |website= (help)
 39. "Campus Buildings & Features". Purdue University. మూలం నుండి 2009-07-23 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-06-09. Cite web requires |website= (help)
 40. 40.0 40.1 "Purdue's Sustainability Initiatives". Purdue University. మూలం నుండి 2012-07-17 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-06-09. Cite web requires |website= (help)
 41. "GreenWeek 2008". Purdue University. Retrieved 2009-06-09. Cite web requires |website= (help)
 42. "Purdue University Data Digest 2006–07". Purdue.edu. మూలం నుండి 2011-07-20 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-01-22. Cite web requires |website= (help)
 43. 43.0 43.1 "Purdue University Data Digest 2006–07". Purdue.edu. మూలం నుండి 2012-01-19 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-01-22. Cite web requires |website= (help)
 44. 44.0 44.1 "Purdue University Data Digest 2006–07". Purdue.edu. మూలం నుండి 2012-01-19 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-01-22. Cite web requires |website= (help)
 45. "Purdue University Data Digest 2006–07". Purdue.edu. మూలం నుండి 2012-01-20 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-01-22. Cite web requires |website= (help)
 46. "Purdue University Data Digest 2006–07". Purdue.edu. మూలం నుండి 2012-01-19 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-01-22. Cite web requires |website= (help)
 47. 47.0 47.1 "Purdue University Data Digest 2006–07". Purdue.edu. మూలం నుండి 2012-01-19 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-01-22. Cite web requires |website= (help)
 48. "Purdue University Data Digest 2006–07". Purdue.edu. మూలం నుండి 2012-01-19 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-01-22. Cite web requires |website= (help)
 49. "Housing Choices". Purdue University Housing and Food Services. మూలం నుండి 2009-08-06 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-08-25. Cite web requires |website= (help)
 50. "First Street Towers". Purdue University Housing and Food Services. మూలం నుండి 2010-06-11 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-08-25. Cite web requires |website= (help)
 51. "Housing Cost Comparison". Purdue Cooperatives. మూలం నుండి 2006-11-14 న ఆర్కైవు చేసారు. Retrieved 2007-11-16. Cite web requires |website= (help)
 52. 52.0 52.1 "Purdue University Data Digest 2006–07". Purdue.edu. మూలం నుండి 2013-08-10 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-01-22. Cite web requires |website= (help)
 53. Poston, Heather (2003-06-16). "5,000 students call Greek system their home". Purdue Exponent. మూలం నుండి 2011-07-27 న ఆర్కైవు చేసారు. Retrieved 2007-11-16. Cite news requires |newspaper= (help)
 54. "The Exponent – Purdue's Student Newspaper". Purdueexponent.org. 2008-02-16. మూలం నుండి 2011-04-12 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-01-22. Cite web requires |website= (help)
 55. "Students create 'The Movie Tribute Show' for Boiler Television". Purdueexponent.org. 2001-11-28. మూలం నుండి 2011-07-27 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-01-22. Cite web requires |website= (help)
 56. "WCCR వెబ్‌సైట్"
 57. ""WILY రేడియో వెబ్‌సైట్"". మూలం నుండి 2009-04-20 న ఆర్కైవు చేసారు. Retrieved 2011-02-14. Cite web requires |website= (help)
 58. "పర్డ్యూ స్టూడెంట్ రేడియో AM1610 వెబ్‌సైట్"[permanent dead link]
 59. ""హారిసన్ హాల్ రేడియో వెబ్‌సైట్". మూలం నుండి 2009-02-12 న ఆర్కైవు చేసారు. Retrieved 2011-02-14. Cite web requires |website= (help)
 60. ""W9YB వెబ్‌సైట్"". మూలం నుండి 2008-05-17 న ఆర్కైవు చేసారు. Retrieved 2011-02-14. Cite web requires |website= (help)
 61. Old Gold Free Press "All-Time Big Ten Series Records" Check |url= value (help). OldGoldFreePress.com. Retrieved May 26, 2009. Cite web requires |website= (help)
 62. "Purdue Official Athletic Site". Purduesports.cstv.com. మూలం నుండి 2009-02-19 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-01-22. Cite web requires |website= (help)
 63. "Purdue University – Purdue Traditions". Purdue.edu. 1943-03-06. Retrieved 2010-01-22. Cite web requires |website= (help)
 64. "Purdue Grand Prix". Purdue Grand Prix. Retrieved 2010-01-22. Cite web requires |website= (help)
 65. "Purdue Astronaut Alumni". News.uns.purdue.edu. 1967-01-26. మూలం నుండి 2009-08-28 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-01-22. Cite web requires |website= (help)
 66. "Purdue Astronauts". News.uns.purdue.edu. మూలం నుండి 2009-10-06 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-01-22. Cite web requires |website= (help)
 67. 67.0 67.1 http://www.పర్డ్యూ.edu/newsroom/general/2010/100601BloombergCEO.html[permanent dead link]
 68. http://grfx.cstv.com/photos/schools/pur/sports/m-footbl/auto_pdf/08-mediaguide-section1.pdf
 69. "పర్డ్యూ విశ్వవిద్యాలయం డచ్ అలుమ్ని సెంటర్ – సెంటర్ గురించి". మూలం నుండి 2012-09-09 న ఆర్కైవు చేసారు. Retrieved 2011-02-14. Cite web requires |website= (help)

బాహ్య లింకులు[మార్చు]

మూస:PU మూస:Big Ten Conference మూస:Committee on Institutional Cooperation మూస:Public colleges and universities in Indiana మూస:Association of American Universities మూస:Universities Research Association

Coordinates: 40°25′26″N 86°55′44″W / 40.424°N 86.929°W / 40.424; -86.929