పర్వతనేని వీరయ్య చౌదరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Parvataneni veeraiah.jpg

పర్వతనేని వీరయ్య చౌదరి స్వాతంత్ర్య సమర యోధుడు. సత్యాగ్రహి. కళాతపస్వి. వైణిక విద్వాంసుడు. పన్నుల సహాయ నిరాకరణ ఉద్యమ నాయకుడు పర్వ తనేని వీరయ్యచౌదరి[1].గుంటూరు జిల్లా,పెదనందిపాడు లో లక్ష్మయ్య , అంకమ్మ దంపతులకు 1886 అక్టోబరు 4న వీరయ్యచౌదరి జన్మించారు. చిన్నతనంలోనే దక్షిణాదికి వెళ్లి సంగీతంలో శిక్షణను పొంది హరికథా విద్వాంసుడిగా గుర్తింపు పొందారు. పెదనంది పాడులో మిత్రుల సహకారంతో పోస్టాఫీసు, పాఠశాల ఏర్పాటుకు కృషి చేశారు. కళాకారుడిగా హరిశ్చంద్ర వంటి నాటకాలలో నటించారు. త్రిపుర నేని రచించిన కురుక్షేత్ర సంగ్రామం నాటకంలో పర్వతనేని కృషుడి పాత్ర లు ధరించగా ప్రతీహారి పాత్రను ఆచార్య రంగా పోషించారు. తుమ్మల రాసిన పద్యాలకు బాణీలను కట్టి సభల్లో ఆలపించేవారు. గాంధీ సిద్ధాంతా లకు ఆకర్షితుడైన పర్వతనేని స్వాతంత్ర్యద్యోమ పోరాటంలోని అన్ని ఘట్టా లలో కీలకపాత్ర వహించారు. 1921లో పన్నుల సహాయ నిరాకరణ ఉద్య మాన్ని పర్వతనేని నాయకత్వంలో పెదనందిపాడు ప్రాంతంలో నిర్వహిం చడానికి జిల్లా కాంగ్రెస్ కమిటీ నిర్ణయించింది. పన్నులు వసూలు చేసే ప్రభుత్వోద్యోగులను సాంఘిక బహిష్కరణ చేయాలని పర్వతనేని పిలుపు నిచ్చారు. పెదనందిపాడు ప్రాంతంలో ఆరువేల మంది యువకులతో శాంతి సైనికులను తయారు చేశారు. భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో బ్రిటీష్ పాలకులను గడగడలాడించిన ఉద్యమాలలో ప్రధానమైనదిగా పెదనందిపాడు పన్నుల నిరాకరణోద్యమం గుర్తింపు పొందింది. పర్వతనే నిని ఆంధ్రా శివాజీ, దక్షిణ బార్టోలి నాయకుడిగా ప్రజలు కీర్తించారు. ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ సభ్యులుగా వ్యవహరించిన పర్వత నేని హైదరాబాద్ రేడియో శ్రోతల సంఘానికి అధ్యక్షుడిగా పనిచేశారు. మహాత్మాగాంధీ పెదనందిపాడును సందర్శించినప్పుడు సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు. గాంధీ విజయం నాటకంలో ప్రముఖ పాత్రను పోషిం చారు. 1970 ఫిబ్రవరి 8న హైదరాబాద్లో వీరయ్యచౌదరి కన్నుమూశారు.

మూలాలు[మార్చు]