పర్వేష్ భైన్స్వాల్
| Personal information | |||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| Nationality | భారతీయుడు | ||||||||||||||
| Born | 1997 ఏప్రిల్ 12 | ||||||||||||||
| Sport | |||||||||||||||
| Country | India | ||||||||||||||
| Sport | కబడ్డీ | ||||||||||||||
| League | ప్రో కబడ్డీ లీగ్ | ||||||||||||||
| Team | జైపూర్ పింక్ పాంథర్స్(2016) గుజరాత్ జయంట్స్(2017-2021) తెలుగు టైటాన్స్(2022-2023) యు ముంబా(2024- ప్రస్తుతం) | ||||||||||||||
Medal record
| |||||||||||||||
పర్వేష్ భైన్స్వాల్ (జననం 12 ఏప్రిల్ 1997) ఒక భారతీయ ప్రొఫెషనల్ కబడ్డీ ఆటగాడు. ఇతడు డిఫెండింగ్ పొజిషన్‌లో ఆడతాడు. ప్రస్తుతం ఇతడు ప్రో కబడ్డీ లీగ్‌లో యు ముంబా తరఫున ఆడుతున్నాడు. 2022 ఆసియా క్రీడలలో భారత జట్టు తరఫున ఆడి స్వర్ణపతకం గెలిచాడు.
ప్రారంభ జీవితం
[మార్చు]పర్వేష్ హర్యానా రాష్ట్రం సోనిపత్ జిల్లాలోని భైన్స్వాల్ గ్రామానికి చెందినవాడు. ఈ గ్రామం చాలా మంది క్రీడాకారులను తయారు చేసింది. ఇతడు దేశీయ టోర్నమెంట్లలో ఆదాయపు పన్ను, రైల్వే జట్ల కోసం ఆడాడు.[1] తన సోదరుల నుండి ప్రేరణ పొందిన పర్వేష్ 11 సంవత్సరాల వయస్సులో ఈ ఆటను ప్రారంభించాడు.
కెరీర్
[మార్చు]పర్వేష్ అండర్-14 స్కూల్ గేమ్స్‌లో ఆడాడు. తరువాత యూనివర్శిటీ టోర్నమెంట్లలో పాల్గొన్నాడు. ఇతడిని కోచ్ జైవీర్ శర్మ గుర్తించి శిక్షణనిచ్చాడు. ఆ తర్వాత ఇతడు గాంధీనగర్లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో చేరాడు. 2023లో ఆసియా క్రీడల ఫైనల్స్లో ఇరాన్‌పై 33-29 స్కోరుతో స్వర్ణం సాధించిన భారత జట్టులో ఇతడు భాగంగా ఉన్నాడు.[2][3] 2022లో, ఇతడు ప్రో కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ తరఫున ఆడాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Parvesh Bhainswal Bio & Stats | Gujarat Fortunegiants | Pro Kabaddi League". Kabaddi Adda. Retrieved 2023-10-07.[permanent dead link]
- ↑ "Asian Games 2023, Day 14 Live Updates: India win men's kabaddi Gold after controversial finish". India Today. Retrieved 2023-10-07.
- ↑ "India win men's kabaddi gold after controversial final against Iran involving one hour stoppage". ESPN. 2023-10-07. Retrieved 2023-10-07.