పల్చని ఫిల్మ్‌ రంగులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Interference colours in soap film 1.jpg

సబ్బు బుడగలు, లేదా నీటి పై తైలం వంటి పల్చని ఫిల్ముల పై కాంతి పడినట్త్లయితే, యింపైన రంగులు కనిపిస్తాయి. రంగులు కనిపించడానికి కారణం, ఫిల్ము యొక్క ఉపరితలం అడుగు భాగం నుండి పరావర్తనం చెందిన కాంతి పుంజాల వ్యతికరణం.

ద్యుతిమయ లేదా ద్యుతిరహితంగా పరావర్తనం చెందిన కాంతి కనపడడానికి μ, t, r విలువలు కారణాలుగా ఉంటాయి.ఫిల్ం పై ఒక స్ధిర బిందువు వద్ద, కంటి యొక్క స్ధిర స్ధానం వద్ద, r స్ధిరంగా ఉంటుంది. ఫిల్ం సమరీతిగా ఉండినట్త్లయితే t కూడా స్ధిరంగా ఉంటుంది. ఈ సందర్భంలో సంపోషక, వినాశక వ్యతికరణం μ మీద ఆధారపడి ఉంటుంది. 'μ' తరందైర్ఘంతో మారుతుంది. అని మనకు తెలుసు. ఫిల్ం పై తెల్లని కాంతి సోకేటట్లు చేస్తే, ఫిల్ం పై ఒక ప్రత్యేక బిందువు వద్ద కనిష్ఠ నిబంధనను పాటించే రంగులు అదృశ్యం అవుతాయి. గరిష్ఠ నిబంధనలకు పాటించే రంగులు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.

గమనిక

ప్రసార కాంతి యొక్క కనిష్ఠ, గరిష్ఠ తీవ్రతలకు సంబంధించిన పరావర్తన కాంతి విషయంలో ఉత్ర్కమణీయంగా ఉంటాయి. పరావర్తన కాంతిలో లోపించిన రంగులు, ప్రసార కాంతిలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.

ఇవి కూడా చూడండి[మార్చు]