పల్లవ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


పల్లవ రాజవంశం
Pallava territories.png
నరసింహవర్మ-1 కాలంలో పల్లవులు c.645 CE
అధికార భాషలు తమిళం
రాజధాని కాంచీపురం
ప్రభుత్వం రాజరికం
గణం
మునుపటి రాజ్యం శాతవాహన, కాలభ్రాలు
తదనంతర రాజ్యాలు చోళులు, తూర్పు చాళుక్యులు

పల్లవ రాజవంశం దక్షిణ భారతదేశంకి చెందిన ఒక తమిళ రాజవంశం, ఇది కాంచీపురం రాజధానిగా ఉత్తర తమిళనాడు ప్రాతం మరియు దక్షిణ ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతాన్ని పాలించింది. సంస్కృతంలో పల్లవ అంటే శాఖ అని అర్థం. వీళ్లు మూలంలో ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు ప్రాంతానికి చెందినవారు[ఉల్లేఖన అవసరం]. ఈ ప్రాంతాన్ని ఇప్పటికీ పల్నాడు లేక పల్లవనాడు అని పిలుస్తుంటారు. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన శాతవాహనులు పతనమై, తమిళనాడులో చోళుల ప్రాభవం అంతరించిన తర్వాత పల్లవులు ప్రాధాన్యత సాధించారు. పల్లవులు తమిళం మరియు సంస్కృత భాషలను ఆదరించారు. భారవి, దండి వంటి సుప్రసిద్ధ సంస్కృత కవులు, మహాబలిపురం వంటి సముద్రతీరంలో రాతితో నిర్మించిన ఆలయాలు పల్లవుల కాలానికి చెందినవి.


ప్రారంభ చరిత్ర[మార్చు]

పల్లవులు మహేంద్రవర్మ-1 (571 – 630 CE) మరియు నరసింహవర్మ-1 (630 – 668 CE) హయాంలో అధికారంలోకి వచ్చారు మరియు 9వ శతాబ్ది చివరివరకు దాదాపు ఆరు దశాబ్దాల పాటుతెలుగు తమిళ ప్రాంత ఉత్తర భూభాగాలపై ఆధిపత్యం చెలాయించారు.

తమ మొత్తం పాలనా కాలంలో వీరు ఉత్తరాదిన బాదామిచాళుక్యులు మరియు దక్షిణాదిలో చోళ మరియు పాండ్య తమిళ రాజ వంశీయులతో క్రీస్తుశకం 8వ శతాబ్దంలో తీవ్రమైన సంఘర్షణలతో గడిపారు.

వాస్తుశిల్పశాస్త్రాన్ని ఆదరించే విషయంలో పల్లవులు మారుపేరుగా నిలిచారు, వీరి తోడ్పాటును ఈనాటికీ మహాబలిపురంలో చూడవచ్చు. అద్భుతమైన శిల్పనిర్మాణాలను, దేవాలయాలను వదిలివెళ్లిన పల్లవులు మధ్యయుగ దక్షిణభారత శిల్పనిర్మాణ శాస్త్రానికి పునాదులు వేశారు. చైనా యాత్రికుడు హుయాన్‌త్సాంగ్ పల్లవుల పాలనాకాలంలో కాంచీపురం సందర్శించి వారి తొలి పాలనా కాలాన్ని అక్షరబద్దం చేశాడు.

తదనంతర కాలంలో జపాన్‌లో జెన్ బుద్దిజంగా పేరొందిన చెన్ బుద్ధిజం సంస్థాపకుడు బోధిధర్మ ను పల్లవ రాజవంశ రాజుగా చాలామంది వర్ణిస్తున్నారు. ఇతడు స్కంధవర్మ IV మరియు నందివర్మ I, [1] సమకాలికుడు మరియు సింహవర్మ-2 పుత్రుడు. కాని ఇది చర్చనీయాంశంగా ఉంది.

పదచరిత్ర[మార్చు]

సంస్కృతంలో పల్లవ అంటే శాఖ అని అర్థం, సంగం తమిళ నిఘంటువులో చోళ అంటే కొత్త దేశం అని అర్థం, పాండ్య అంటే పాత దేశం అని అర్థం, చేర అంటే కొండదేశం అని అర్థం పల్లవులు, చోళుల తదుపరి సహజ వారసులుగా గుర్తించబడుతున్నారు, వీరు కాంచీపురాన్ని తమ రాజధానిగా చేసుకుని ఉత్తర తమిళనాడు మరియు దక్షిణ ఆంధ్రప్రదేశ్ (ఈనాటికీ ఉత్తర సర్కారుప్రాంతాలు) లను పాలించారు. వీరు దక్షిణ కర్నాటకను కూడా జయించారు.

పల్లవుల కాలక్రమణిక[మార్చు]

పల్లవరాజుల పాలన క్రీస్తుశకం 275 నుంచే ప్రారంభించినట్లు కనబడుతుంది కాని, వారి వైభవోజ్వల శకం మాత్రం 7 మరియు 8 శతాబ్దాలలో మాత్రమే సాధ్యపడింది.[2]

తొలి పల్లవులు[మార్చు]

తొలి పల్లవుల చరిత్ర సంతృప్తికరమైన రీతిలో ఇంకా పరిష్కరించబడలేదు. పల్లవులపై తొలి ప్రమాణపత్రరచన మూడు రాగి ఫలకాలపై రచించిన శాసనాలు, [3] ఇవి స్కందవర్మ-1 ప్రాకృతభాషలో రచించినవి.[4] స్కంధవర్మ వారసులుగా కనిపిస్తున్న ఇతర తొలి పల్లవులకు సంబంధించిన ప్రస్తావనలు ఉన్నప్పటికీ, స్కంధవర్మ తొలి పల్లవుల కాలంలో మొట్టమొదటి గొప్ప పాలకుడిగా కనిపిస్తున్నారు.[5]

స్కంధవర్మ తన సామ్రాజ్యాన్ని ఉత్తరాన కృష్ణ నుంచి దక్షిణాన పెన్నార్ వరకు మరియు పశ్చిమాన బళ్ళారి వరకు విస్తరింపజేశాడు. అతడు అశ్వమేధ యజ్ఞాన్ని ఇతర వేద కర్మకాండలను నిర్వహించి ధర్మానికి కట్టుబడిన రారాజు బిరుదు పొందాడు.[4]

క్రీశ. 436లో గద్దెనెక్కిన సింహవర్మ IV పాలనా కాలంలో, గతంలో కోల్పోయిన పల్లవుల ప్రతిష్ఠ పునరుద్ధరించబడింది. ఉత్తరాన కృష్ణా నది ముఖద్వారం వరకు పల్లవులు విష్ణుకుండినులకు కోల్పోయిన భూభాగాలను ఇతడు తిరిగి కైవసం చేసుకున్నాడు. ఈ కాలం నుంచి మొదలుకుని తొలి పల్లవుల చరిత్ర గురించి డజనుకు పైగా తామ్ర పత్రాలలో సంస్కృతంలో లిఖించబడింది. ఇవన్నీ రాజుల వంశవృక్ష చరిత్రలలో నమోదు చేయబడినాయి.[6]

నందివర్మ-1 (480–500 CE) గద్దెనెక్కడంతో, తొలి పల్లవ రాజకుటుంబ పతనం మొదలయింది కర్నాటకలోని కదంబ భూభాగాలను పల్లవులు ఆక్రమించి ప్రతిఘటనా చర్యలకు పాల్పడటంతో పల్లవుల రాజధానిపై కూడా కదంబులు ప్రతిదాడులు మొదలుపెట్టారు కోస్తా ఆంధ్రలో విష్ణుకుండినులు తమ రాజ్యాన్ని స్థాపించారు. పల్లవుల అధికారం తొండమండలానికి పరిమితమైంది.

మహేంద్రవర్మ-1 తండ్రి సింహవిష్ణుడు గద్దెనెక్కడంతో, c. 575 CE, దక్షిణాదిన పల్లవుల పునర్వైభవం ప్రారంభమైంది.

మలి పల్లవులు[మార్చు]

మామల్లాపురం దగ్గర నరసింహవర్మ-1 హయాంలో కట్టబడిన రాతి శిలలతో మందిరం
ఏక శిలతో చెక్కబడిన ఏనుగు

కాలభ్రుల దాడి మరియు తమిళ దేశంలో గందరగోళం అనేవి పాండ్య కడుంగాన్ మరియు పల్లవ సింహవిష్ణుల ద్వారా తిప్పికొట్టబడ్డాయి.[7][8] దక్షిణ భారత ద్వీపకల్పంపై పల్లవ రాజవంశం ప్రభావం, భౌగోళిక వ్యాప్తి ప్రారంభమైంది మరియు 6వ శతాబ్ది చివరినాటికి ఇది ప్రాంతీయ శక్తిగా అవతరించింది.[9] పల్లవులు తమ దక్షణ ప్రాంత పొరుగు రాజులైన చోళులు మరియు పాండ్యులపై ఆధిపత్యం చలాయించారు. కాని వీరి చరిత్ర బాదామి చాళక్యులపై నిరంతరం ఘర్షణలతో గుర్తించబడింది.[9]

నరసింహవర్మ-1 మరియు పరమేశ్వరవర్మ Iలు సైనికంగా మరియు శిల్పనిర్మాణశాస్త్రపరంగా అద్భుత విజయాలు సాధించారు. నందివర్మ-2 తీరప్రాంత దేవాలయం నిర్మించాడు.

కడవ రాజ్యం[మార్చు]

క్రీశ పదమూడు మరియు పద్నాలుగు శతాబ్దాలలో, ఒక చిన్నదైన కడవ రాజవంశం స్వల్పకాలం ఉనికిలోకి వచ్చింది ఈ పాలకులు తాము పల్లవ రాజుల వారసులమని చెప్పుకున్నారు. ఈ రాజవంశంలో ప్రముఖ రాజులు కొప్పెరుంచింగ-1 (c.1216 – 1242 సి కాలంలో పాలించారు), మరియు ఇతడి కుమారుడు కొప్పెరుంచింగ-2 (c.1243 – 1279 CE). వీరిద్దరూ తమ రాజరికాన్ని మరింతగా విస్తరించారు, చోళ రాజవంశం అంతిమంగా పతనం కావడంలో వీరు కీలకపాత్ర వహించారు.

మతం[మార్చు]

పల్లవులు హిందూమతాన్ని అనుసరించారు, దేవతలు మరియు బ్రాహ్మణులకు భూదానాలు చేశారు. పూర్వ సంప్రదాయాలను అనుసరించి, వీరిలో కొందరు పాలకులు అశ్వమేథం మరియు ఇతర వైదిక కర్మకాండలు నిర్వహించారు.[6] అయితే వీరు ఇతర మత విశ్వాసాల పట్ల సహనభావంతో వ్యవహరించారు. నరసింహవర్మ-1 హయాంలో కాంచీపురం సందర్శించిన చైనా సన్యాసి జువాన్‌జాంగ్, కాంచీపురంలో 100 మంది బౌద్ధ సన్యాసులు మరియు 80 ఆలయాలు ఉన్నాయని నివేదించాడు.[10]

మహేంద్రవర్మ-1 మొదట్లో ఒక జైన మత పోషకుడిగా ఉండేవాడు. దక్షిణ భారతదేశంలో భక్తి ఉద్యమ కాలంలో హిందూమతం పునరుద్ధరణతో ఇతడు ఒక శైవమతాచార్యుడు అప్పార్ ప్రభావంతో హిందూమతంలోకి వచ్చాడు.[11]

పల్లవ వాస్తు నిర్మాణం[మార్చు]

మహాబలిపురం దగ్గర నరసింహవర్మన్-2 చే కట్టబడిన సముద్ర తీర మందిరం

రాళ్లను పేర్చి నిర్మాణాలు చేయడం నుంచి శిలాలయాలను నిర్మించడానికి మారడంలో పల్లవులు ముఖ్యపాత్ర వహించారు పల్లవుల నిర్మాణాలకు తొలి ఉదాహరణలు రాతితో కట్టిన ఆలయాలు ఇవి 610–690 CE మధ్య కాలానికి సంబంధించినవి 690–900 CE మధ్యన వ్యవస్థీకృత ఆలయాలను నిర్మించారు. గుహలలో రాళ్లు తొలగించి నిర్మించిన పలు ఆలయాలు పల్లవ రాజు మహేంద్రవర్మ-1 మరియు అతడి వారసుల శాసనాలను కలిగి ఉన్నాయి.[12]

పల్లవ వాస్తు నిర్మాణం సాధించిన అతి గొప్పవిజయాల్లో మహాబలిపురం వద్ద శిలలతో నిర్మించిన ఆలయాలు. మహాబలిపురంలో రథాలు అని పిలువబడే రాతిని తొలచి చేసిన భారీ నిర్మాణాలు ఉన్నాయి తొలి పల్లవ ఆలయాలు చాలావరకు శివుడికి అంకితం చేయబడ్డాయి. నరసింహవర్మ-2 కాంచీపురంలో నిర్మించిన కైలాసనాథ ఆలయం, తీరప్రాంత ఆలయం పల్లవ ఆలయరీతికి అతి చక్కటి తార్కాణాలు.[13] శ్రీలంకలోని క్యాండీలో ఉన్న నలంద గెడిగె ఆలయం మరొక సుప్రసిద్ధ ఆలయం. తెనవరైలోని సుప్రసిద్ధ తొండేశ్వరం ఆలయం మరియు ట్రింకోమలీలోని మరొక ప్రాచీన కోనేశ్వరం ఆలయం 7వ శతాబ్దంలో పల్లవులు నిర్మించి పోషించిన ఆలయాలే.

వీటిని కూడా చూడండి[మార్చు]

గమనికలు[మార్చు]

 1. కమిల్ V. జ్వేలేబిల్ (1987). "ది సౌండ్ అఫ్ ది వన్ హ్యాండ్", జోర్నాల్ అఫ్ ది అమెరికన్ ఓరియాన్టల్ సొసైటి , సం. 107, No. 1, పే. 125-126.
 2. అవారి, పే186
 3. ఇప్పుడు సూచన ప్రకారం మాయిడవోలు , హిరహడగాల్లి మరియు బ్రిటిష్ మ్యుసియం ప్లేట్స్ – దుర్గ ప్రసాద్ (1988)
 4. 4.0 4.1 నీలకంట శాస్త్రి, ఏ హిస్టరీ అఫ్ సౌత్ ఇండియా , పే91
 5. నీలకంట శాస్త్రి, ఏ హిస్టరీ అఫ్ సౌత్ ఇండియా , పేజీలు 91–92
 6. 6.0 6.1 నీలకంట శాస్త్రి, ఏ హిస్టరీ అఫ్ సౌత్ ఇండియా , పే92
 7. కుల్కే మరియు రోతేర్ముండ్, పే105
 8. కుల్కే మరియు రోతేర్ముండ్, పే120
 9. 9.0 9.1 కుల్కే మరియు రోతేర్ముండ్, పే111
 10. కుల్కే మరియు రోతేర్ముండ్, పేజీలు121–122
 11. అప్పర్
 12. నీలకంఠ శాస్త్రి, పేజీలు412–413
 13. నీలకంఠ శాస్త్రి, p139

సూచికలు[మార్చు]

 • Avari, Burjor (2007). India: The Ancient Past. New York: Routledge.
 • Dubreuil, G. Jouveau (1995). The Pallavas. India: Asian Educational Services. ISBN 8120605748. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help)
 • Hermann, Kulke (2001) [2000]. A History of India. Routledge. ISBN 0-415-32920-5. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help)
 • Minakshi, Cadambi (1938). Administration and Social Life Under the Pallavas. Madras: University of Madras.
 • Nilakanta Sastri, K.A (2002) [1955]. A History of South India. New Delhi: OUP.
 • Prasad, Durga (1988). History of the Andhras up to 1565 A.D. Guntur, India: P.G. Publishers.
 • "South Indian Inscriptions". Archaeological Survey of India. What Is India Publishers (P) Ltd. Retrieved 2008-05-30.

బాహ్య లింకులు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
"https://te.wikipedia.org/w/index.php?title=పల్లవ&oldid=2759173" నుండి వెలికితీశారు