పల్లవి జోషి
పల్లవి జోషి | |
---|---|
జననం | 1969, ఏప్రిల్ 4 |
వృత్తి |
|
జీవిత భాగస్వామి | |
పిల్లలు | 2 |
పల్లవి జోషి (జననం 4 ఏప్రిల్ 1969) మహారాష్ట్రకు చెందిన సినిమా నటి, రచయిత్రి, నిర్మాత. రెండుసార్లు జాతీయ చలనచిత్ర అవార్డులు, ఫిల్మ్‌ఫేర్ అవార్డులకు నామినేషన్ పొందింది. 69వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్‌లో కాశ్మీర్ ఫైల్స్ (2021) సినిమాలోని నటనకు జాతీయ ఉత్తమ సహాయ నటిగా జాతీయ అవార్డుకు ఎంపికయింది.[1]
జననం
[మార్చు]పల్లవి 1969 ఏప్రిల్ 4న మహారాష్ట్రలోని ముంబైలో జన్మించింది.[2]
నటనారంగం
[మార్చు]పల్లవి తల్లిదండ్రులు నాటకరంగంలో పేరుగాంచారు. దాంతో పల్లవి తన నాలుగేళ్ళ వయసులో 1973లో నాగ్ మేరే సతీ అనే హిందీ సినిమాలో చిన్న పాత్రతో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. బాలనటిగా అనేక సినిమాలు చేసిన తరువాత, స్పెషల్ జ్యూరీ అవార్డు (ఫీచర్ ఫిల్మ్) విభాగంలో జాతీయ చలనచిత్ర అవార్డులు పొందిన భుజంగయ్యన దశావతారా (1988), రిహయీ (1988), రుక్మావతి కి హవేలీ (1991), వో చోక్రి (1992) వంటి సమాంతర సినిమాలలో నటించి, విమర్శకుల ప్రశంసలు పొందింది. ఇన్సాఫ్ కి ఆవాజ్ (1986), అంధ యుద్ (1987), ముజ్రిమ్ (1989), సౌదాగర్ (1991), పనా (1992) వంటి అనేక కమర్షియల్ సినిమాలలో కూడా నటించింది. వీటిలో మొదటిది ఆమె ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు కూడా ఎంపికైంది.
టివిరంగంలోకి ప్రవేశించి తలాష్ (1992), ఆరోహన్ (1996-1997), ఆల్ప్‌విరామ్ (1998), జస్టుజూ (2002-2004) వంటి సీరియళ్ళలో నటించింది. తన భర్త వివేక్ అగ్నిహోత్రి తీసిన ది తాష్కెంట్ ఫైల్స్ (2019), ది కాశ్మీర్ ఫైల్స్ (2022) సినిమాలకు సహ-నిర్మాతగా వ్యవహరించింది.
అంధా యుద్ధ్ (1988)లో వికలాంగ బాలికగా నటించినందుకు ఫిలింఫేర్ అవార్డ్స్‌లో 'ఉత్తమ సహాయ నటి'గా ఎంపికైంది. వో చోక్రి (1992) సినిమాకు 41వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ప్రత్యేక జ్యూరీ అవార్డును గెలుచుకుంది.[3][4] నోయిడాలోని 7వ గ్లోబల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఎక్సలెన్స్ ఇన్ సినిమా అవార్డును కూడా అందుకుంది. ది తాష్కెంట్ ఫైల్స్ (2019)లో తన నటనకు 67వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ సహాయ నటి అవార్డును గెలుచుకుంది.[5]
సినిమాలు
[మార్చు]- 1973 నాగ్ మేరే సతీ
- 1976 బద్లా (మరాఠీ)
- 1976 ఖమ్మ మార వీర (గుజరాతీ)
- 1976 రక్షాబంధన్
- 1977 పింకీగా ఆద్మీ సడక్ కా (బాల నటి)
- 1977 డాకు ఔర్ మహాత్మా
- 1977 డ్రీమ్ గర్ల్ (బాల నటి)
- 1977 అంఖ్ కా తారా
- 1977 చోర్ కి దాధీ మైన్ టింకా
- 1977 దోస్త్ ఆశావ తర్ ఆసా (మరాఠీ)
- 1977 మా దిక్రి (గుజరాతీ)
- 1978 ఛోటా బాప్
- 1978 మది నా జయ (గుజరాతీ)
- 1979 దాదా (బాల నటి)
- 1979 పరాఖ్
- 1980 అల్లాఖ్ నా ఓట్లే (గుజరాతీ)
- 1980 మొహబ్బత్
- 1981 ఖూన్ కీ టక్కర్ (బాల నటి)
- 1984 హమ్ బచేయ్ హిందుస్థాన్ కే (బాల నటి)
- 1985 సుస్మాన్
- 1985 దిక్రి ఛలీ ససరియే (గుజరాతీ)
- 1985 వాంచిత్
- 1986 అమృత్
- 1986 ఇన్సాఫ్ కి ఆవాజ్
- 1987 అంధ యుద్ధ్
- 1987 తీర్థం
- 1988 ఏజెంట్ 777
- 1988 సుబహ్ హోనే తక్
- 1988 అంధ యుద్ధ్
- 1988 రిహాయీ
- 1988 త్రిషాగ్ని
- 1989 గురు దక్షిణ
- 1989 డాటా
- 1989 మిస్టర్ యోగి
- 1989 ముజ్రిమ్
- 1990 వాంచిత్
- 1990 క్రోడ్
- 1991 మృగ్నయనీ (టివి సిరీస్)
- 1991 భుజంగయ్యన దశావతార ( కన్నడ )
- 1991 ఝూతి షాన్
- 1991 రుక్మావతి కి హవేలీ
- 1991 సౌదాగర్
- 1992 మాంగ్ని
- 1992 ప్రియా
- 1992 పనా
- 1992 తహల్కా
- 1992 తలాష్
- 1993 జీ హారర్ షో జీవన్ మృత్యు
- 1993 మేరీ ప్యారీ నిమ్మో
- 1993 సూరజ్ కా సత్వన్ ఘోడా
- 1994 ఇలయుమ్ ముల్లుమ్ (మలయాళం)
- 1994 ఇన్సానియత్
- 1994 వో చోక్రి (టివి సినిమా)
- 1995 ఇంతిహాన్
- 1996 ఆరోహన్ (ది ఆరోహణ) (టివి సిరీస్)
- 1996 ది మేకింగ్ ఆఫ్ ది మహాత్మా
- 1996 యే కహాన్ ఆ గయే హమ్ (టీవీ సిరీస్)
- 1998 అల్ప్‌విరామ్
- 1999 చాక్లెట్ (టివి సినిమా)
- 2002 జస్టుజూ (టీవీ సిరీస్)
- 2004 కెహ్నా హై కుచ్ ముజ్కో (టివి సిరీస్)
- 2009 రీటా
- 2013 ప్రేమ్ మ్హంజే ప్రేమ్ మ్హంజే ప్రేమ్ ఆస్తా
- 2015-16 మేరీ ఆవాజ్ హీ పెహచాన్ హై (టివి సిరీస్)
- 2016 బుద్ధా ఇన్ ఏ ట్రాఫిక్ జామ్
- 2017 పేష్వా బాజీరావు
- 2018 గ్రహన్ ( మరాఠీ )
- 2019 తాష్కెంట్ ఫైల్స్
- 2022 కాశ్మీర్ ఫైల్స్
- 2023 ది వ్యాక్సిన్ వార్
వ్యక్తిగత జీవితం
[మార్చు]1997లో సినీ నిర్మాత వివేక్ అగ్నిహోత్రితో పల్లవి వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.[6] బాల నటుడు మాస్టర్ అలంకార్ (జోషి) సోదరి. ట్వీట్లతో సెక్సిజంపై వ్యాఖ్యలు చేసినందుకు ఆరోపించబడిన వివేక్‌కు మద్దతుగా నిలిచింది.[7]
మూలాలు
[మార్చు]- ↑ "National Awards 2023: జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల విజేతలు వీళ్లే". EENADU. 2023-08-24. Archived from the original on 2023-08-24. Retrieved 2023-08-24.
- ↑ "Vivek Agnihotri Terms Wife Pallavi Joshi 'Most Successful Female Producer' On Her Birthday". News18 (in ఇంగ్లీష్). 6 April 2022. Retrieved 2022-12-22.
- ↑ "41st National Film Awards". International Film Festival of India. Archived from the original on 13 March 2016. Retrieved 2022-12-22.
- ↑ "41st National Film Awards (PDF)" (PDF). Directorate of Film Festivals. Retrieved 3 March 2012.
- ↑ "Pallavi Joshi on National Film Award Win for Tashkent Files: This will Definitely Shut Critics Up". News18 (in ఇంగ్లీష్). 22 March 2021. Retrieved 2022-12-22.
- ↑ "'Didn't Like Him Very Much on First Meet': Pallavi Joshi on Husband Vivek Agnihotri". News18 (in ఇంగ్లీష్). 17 March 2022. Retrieved 2022-12-22.
- ↑ https://in.mashable.com/culture/17046/twitter-digs-up-vivek-agnihotris-sexist-past-after-his-inclusion-in-indian-council-for-culture-relat [bare URL]
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో పల్లవి జోషి పేజీ
- All articles with bare URLs for citations
- Articles with bare URLs for citations from December 2022
- 1969 జననాలు
- భారతీయ సినిమా నటీమణులు
- కన్నడ సినిమా నటీమణులు
- హిందీ సినిమా నటీమణులు
- జీవిస్తున్న ప్రజలు
- మరాఠీ సినిమా నటీమణులు
- మహారాష్ట్ర మహిళలు
- టెలివిజన్ నటీమణులు
- మరాఠీ రచయితలు
- హిందీ సినిమా నిర్మాతలు
- హిందీ సినిమా రచయితలు