పల్లిపట్టు నాగరాజు
పల్లిపట్టు నాగరాజు | |
---|---|
![]() | |
జననం | 1987, మే 22 |
విద్య | ఎంఏ (తెలుగు) |
విద్యాసంస్థ | శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం |
వృత్తి | ఉపాధ్యాయుడు |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | కవి, రచయిత |
తల్లిదండ్రులు |
|
నోట్సు | |
పల్లిపట్టు నాగరాజు, తెలుగు కవి, రచయిత, ఉపాధ్యాయుడు. నాగరాజు రాసిన ‘యాలై పూడ్సింది’ వచన కవితా సంపుటి కేంద్ర సాహిత్య అకాడమీ 2022 యువ పురస్కారాన్ని ప్రకటించింది.[1]
జీవిత విశేషాలు[మార్చు]
నాగరాజు 1987, మే 22న రాఘవయ్య - భూలక్ష్మి దంపతులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లా, సత్యవేడు మండలంలోని వెంకటాపురం గ్రామంలో జన్మించాడు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి ఎంఏ (తెలుగు) చదివాడు.[2]
ఉద్యోగం[మార్చు]
2016లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యాడు. శాంతిపురం మండలం, పెద్దూరులోని ప్రభుత్వ హైస్కూలులో తెలుగు ఉపాధ్యాయుడిగా 2023మే వరకు చేశారు[3].ప్రస్తుతం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, వరదయ్యపాలెం లో పనిచేస్తున్నారు.
సాహిత్య ప్రస్థానం[మార్చు]
దేశ కాలమాన పరిస్థితుల నేపథ్యంతో 52 కవితలతో 2020 డిసెంబరులో యాలై పూడ్సింది అనే పేరుతో తొలి వచన కవితా సంపుటిని వెలువరించాడు. రెక్కలు(మినీ కవితలు), మమ్మీ అమ్మ కావాలి, మనసుపొరల్లో వంటి కథలు, పలు కవితలను రాశాడు. ఇతని కవితలు కన్నడ, ఆంగ్లభాషల్లోకి కూడా అనువాదమయ్యాయి.[4]
అవార్డులు[మార్చు]
- కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం (యాలైపూడ్సింది)
- ఉమ్మడిశెట్టి సత్యాదేవి సాహితీ అవార్డు
- శ్రీమతి విమలాశాంతి స్మారక సాహిత్య యువపురస్కార2021
- శ్రీమతి పాతూరిమాణిక్యమ్మ సాహిత్యపురస్కారం2021
- స్వర్ణ వచన కవితా పురస్కారం2021
- శ్రీకొత్తపల్లి నరేంద్రబాబు స్మారక సాహిత్య పురస్కారం2021
- సర్రాజు వేణుగోపాల్రావు స్మారక పురస్కారం,
- మల్లిశెట్టి సీతారాం స్మారక సాహిత్య పురస్కారం(2021)
●రొట్టమాకు రేవు కవిత్వ అవార్డు 2022 వంటివి పొందారు.
●డా. బి.ఆర్.అంబేద్కర్ నేషనల్ అవార్డ్ 2023.
కవిగా...
- కలహంస పురస్కారం
- డాక్టర్ రాధేయ కవితా పురస్కారం
- వింజమూరి-కవిసంధ్య కవితల పోటీ పురస్కారం
- తెలుగు సాహిత్య సంస్కృతి సమితి పురస్కారం
- తెలుగు రక్షణవేదిక భాషా సేవక పురస్కారం
మూలాలు[మార్చు]
- ↑ "Sahitya Akademi Yuva Puraskar for Chittoor Telugu teacher". The New Indian Express. 2022-08-25. Archived from the original on 2022-08-25. Retrieved 2022-08-25.
- ↑ "Pathipaka Mohan: పత్తిపాక మోహన్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు". EENADU. 2022-08-25. Archived from the original on 2022-08-25. Retrieved 2022-08-25.
- ↑ Velugu, V6 (2022-08-24). "మోహన్కు బాలసాహిత్య.. నాగరాజుకు యువ సాహిత్య పురస్కారాలు". V6 Velugu. Archived from the original on 2022-08-25. Retrieved 2022-08-25.
- ↑ "Sahitya Akademi Awards: ఈ ఏడాది కేంద్ర సాహిత్య బాల... యువ సాహిత్య పురస్కార గ్రహీతలు వీరే..." www.andhrajyothy.com (in ఇంగ్లీష్). 2022-08-24. Archived from the original on 2022-08-25. Retrieved 2022-08-25.