Jump to content

పవన్ సాదినేని

వికీపీడియా నుండి
పవన్ సాదినేని
జననం
పవన్ కుమార్ సాదినేని

విజయవాడ, ఆంధ్రప్రదేశ్
చదువుఎంఎస్, కంప్యూటర్ సైన్స్
వృత్తిదర్శకుడు, రచయిత
క్రియాశీలక సంవత్సరాలు2013 - ప్రస్తుతం

పవన్ సాదినేని తెలుగు సినిమా దర్శకుడు, స్క్రీన్ రైటర్. ఆయన ప్రేమ ఇష్క్ కాదల్ (2013), సావిత్రి (2016) & సేనాపతి (2021) సినిమాలకు, పిల్ల (2017), ఈ ఆఫీస్ లో (2018), కమిట్‌మెంటల్ (2020) & దయా (2023) వెబ్ సిరీస్‌లకు దర్శకత్వం వహించాడు.[1]

కెరీర్

[మార్చు]

పవన్ సాదినేని కెరీర్ తొలినాళ్లలో ఇంటర్వ్యూ , లవ్ ఫార్ములా 31 , బేవర్స్ వంటి అనేక లఘు చిత్రాలకు దర్శకత్వం వహించాడు, ఆయన మొత్తం పది లఘు చిత్రాలకు దర్శకత్వం వహించారు, అతని తొలి లఘు సినిమా తూర్పు పడమర.

ఆయన 2013లో తొలిసారిగా రొమాంటిక్ కామెడీ 'ప్రేమ ఇష్క్ కాదల్' సినిమాకి దర్శకత్వం వహించాడు. హర్షవర్ధన్ రాణే, హరీష్ వర్మ, శ్రీ విష్ణు, రీతు వర్మ, వితికా శేరు, శ్రీముఖి ప్రధాన పాత్రలు పోషించారు. 2014లో నందిత, నారా రోహిత్ నటించిన సావిత్రికి దర్శకత్వం వహించాడు.[2] ఆయన 2017లో ధన్య బాలకృష్ణన్ నటించిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 'పిల్లా' మినీ వెబ్ సిరీస్‌కి దర్శకత్వం వహించాడు.[3]

పవన్ సాదినేని 2018లో చైతన్య కృష్ణ, రాకేందు మౌళి ప్రధాన పాత్రల్లో నటించిన నూతన యుగ నాటకం ఈ ఆఫీస్ లో సినిమాకి దర్శకత్వం వహించాడు.[4]

ఆయన 2020లో రొమాంటిక్ కామెడీ సినిమా 'కమిట్‌మెంటల్' దర్శకత్వం వహించాడు, ఇది హిందీ వెబ్ సిరీస్ పర్మనెంట్ రూమ్‌మేట్స్ రీమేక్.[5]

2021 డిసెంబర్ 31న ఆయన దర్శకత్వం వహించిన సేనాపతి ఆహాలో విడుదలైంది. ఇది తమిళ చిత్రం 8 తొట్టక్కల్ కి రీమేక్.[6]

2023లో తఖ్‌దీర్‌కి రీమేక్‌ అయిన దయా సినిమాకి దర్శకత్వం వహించాడు.[7]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]

దర్శకుడిగా

[మార్చు]
సినిమాలు
సంవత్సరం పేరు
2013 ప్రేమ ఇష్క్ కాదల్
2016 సావిత్రి
2021 సేనాపతి
2026 ఆకాశంలో ఒక తార †[8]
వెబ్-సిరీస్
సంవత్సరం పేరు
2017 పిల్లా
2018 ఈ ఆఫీస్ లో
2020 కమిట్‌మెంటల్
2023 దయా

రచయితగా

[మార్చు]
వెబ్-సిరీస్
సంవత్సరం పేరు
2024 పరువు

అవార్డులు

[మార్చు]

ఉత్తమ దర్శకుడికి

[మార్చు]
సంవత్సరం సినిమా అవార్డు
2023 దయా OTT ప్లే అవార్డులు

అవార్డులు

[మార్చు]

దయా చిత్రానికి గాను పవన్ కు 2023 OTT ప్లే అవార్డ్స్ ద్వారా ఉత్తమ దర్శకుడిగా అవార్డు లభించింది.[9]

మూలాలు

[మార్చు]
  1. "Pavan Sadineni Movies". The Times of India. ISSN 0971-8257. Retrieved 2023-11-21.
  2. "Savitri review: A pedestrian show". The Hindu (in Indian English). 2016-04-01. ISSN 0971-751X. Retrieved 2023-11-21.
  3. "The Intense, Suspense Thriller 'Pilla' - Filmy Focus". Filmy Focus (in ఇంగ్లీష్). 2017-05-14. Retrieved 2023-11-21.
  4. Dundoo, Sangeetha Devi (2018-10-20). "Director Pavan Sadineni's web series 'Ee Office Lo' tracks entrepreneurial spirits and challenges". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2023-11-21.
  5. Kumar, Hemanth (2020-11-14). "CommitMental review: Permanent Roommates' Telugu remake is too tedious to engage viewers". Firstpost (in ఇంగ్లీష్). Retrieved 2023-11-21.
  6. The Hindu (23 December 2021). "Pavan Sadineni: Casting Rajendra Prasad changed everything for us" (in Indian English). Archived from the original on 27 December 2021. Retrieved 27 December 2021.
  7. "Dayaa Review: JD Chekravarthy is the star of this thriller that's stretched in parts". India Today (in ఇంగ్లీష్). 4 August 2023. Retrieved 2023-11-21.
  8. "Dulquer Salmaan's next Telugu film to be announced soon. Director Pavan Sadineni hints on social media". The Times of India. 2024-07-24. ISSN 0971-8257. Retrieved 2024-10-17.
  9. "OTTplay Awards 2023 full list of winners: Rajkummar Rao wins big, Darlings is Best Film, Ayali Best Web Series". Hindustan Times (in ఇంగ్లీష్). 2023-10-30. Retrieved 2023-11-20.

బయటి లింకులు

[మార్చు]