Jump to content

పశుగ్రాసం కుంభకోణం

వికీపీడియా నుండి
మేత కుంభకోణంలో బీహార్ రాష్ట్ర ఖజానా నుండి వందల కోట్ల రూపాయల మోసపూరిత చెల్లింపులు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. అసలు లేనే లేని పశువులకు మేత, మందులు, పెంపక సామాగ్రి కొనుగోలు కోసం ఈ కుంభకోణం జరిగింది.
ఎడమ వైపున ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్, మేత కుంభకోణంలో దోషిగా తేలిన అత్యున్నత స్థాయి వ్యక్తి.

పశుగ్రాసం కుంభకోణం అనేది బీహార్ రాష్ట్రంలో జరిగిన ఒక అవినీతి కుంభకోణం. దీనిలో బీహార్ ప్రభుత్వ ఖజానా నుండి దాదాపు రూ 940 కోట్ల డబ్బును దారిమళ్ళింది. దొంగతనంలో చిక్కుకుని అరెస్టైన వారిలో అప్పటి బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, [1] మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా ఉన్నారు.[2][3] ఈ కుంభకోణం ముఖ్యమంత్రిగా లాలూ పాలనకు ముగింపు పలికింది.[4] దినేశ్వర్ ప్రసాద్ శర్మ కూడా SN సిన్హా నుండి ₹300.60 కోట్లు పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2017 డిసెంబర్ 23 న లాలూ ప్రసాద్ యాదవ్‌ను ప్రత్యేక సిబిఐ కోర్టు దోషిగా నిర్ధారించగా, జగన్నాథ్ మిశ్రా నిర్దోషిగా విడుదలయ్యారు.[5]

ఈ దొంగతనం చాలా సంవత్సరాలు సాగింది. భారత జాతీయ కాంగ్రెస్, జనతాదళ్ పార్టీల పరిపాలనలలో బీహార్ రాష్ట్రానికి చెందిన అనేక మంది ప్రజాప్రతినిధులకు, ఎన్నికైన అధికారులకూ ప్రమేయం ఉందని ఆరోపణలు ఉన్నాయి. ఈ అవినీతి పథకంలో భాగంగా, "పెద్దయెత్తున పశువుల మందలను" కల్పించారు. వీటి కోసం మేత, మందులు, పశుసంవర్ధక పరికరాలూ సేకరించారు. కుంభకోణం బయటపడింది 1996 లో అయినప్పటికీ, దొంగతనం రెండు దశాబ్దాల ముందు నుంచీ సాగుతూనే ఉంది. పైగా పరిమాణంలో పెరిగింది. దొంగతనం పరిమాణం, వ్యవధితో పాటు, పదవీకాలం ఉన్న అధికారులు, ఎన్నికైన రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల మధ్య పెనవేసుకున్న సంబంధం కారణంగా ఈ కుంభకోణానికి మీడియాలో బాగా కవరేజీ వచ్చింది. దేశంలోని అనేక ప్రభుత్వంలోని పలు ఆర్థిక రంగాలలోకి చొచ్చుకుపోయిన మాఫియా రాజ్‌కు ఇది ఉదాహరణగా నిలిచింది.

2013 మే నాటికి, మొత్తం 53 కేసులకు గాను 44 కేసులలో విచారణ పూర్తయింది.[6] 500 పైచిలుకు నిందితులను వివిధ కోర్టులు దోషులుగా నిర్ధారించి శిక్షలు విధించాయి. [7]

కుంభకోణం

[మార్చు]

ఈ కుంభకోణం బయటపడినపుడు, చాలా చిన్నస్థాయిలో మాత్రమే అవినీతి జరిగినట్లు కనిపించింది. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు తప్పుడు ఖర్చు నివేదికలను సమర్పించి డబ్బులు కాజేసిన స్థాయి అది. క్రమేణా ఇది పరిమాణంలో పెరుగుతూ, ఇందులో రాజకీయ నాయకులు, వ్యాపార సంస్థలు, వ్యాపారస్థుల ప్రమేయం ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. చివరికీ ఇది పూర్తి స్థాయి మాఫియాగా ప్రపంచానికి తెలిసింది. 1970 ల మధ్యలో బీహార్ ముఖ్యమంత్రిగా మొదటిసారి పనిచేసిన జగన్నాథ్ మిశ్రా, ఈ కుంభకోణంలో ప్రమేయం ఉందని ఆరోపణలు ఎదుర్కొన్న తొలి ముఖ్యమంత్రి.[8]

1985 ఫిబ్రవరిలో అప్పటి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (CAG) TN చతుర్వేది, బీహార్ రాష్ట్ర ట్రెజరీ, విభాగాలు నెలవారీ ఖాతా సమర్పణలలో జాప్యం చెయ్యడాన్ని గమనించి, అప్పటి బీహార్ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ సింగ్‌కు లేఖ రాశాడు. ఇది తాత్కాలిక దుర్వినియోగానికి సూచన కావచ్చని హెచ్చరించాడు.[9] దీంతో, పలు ముఖ్యమంత్రుల పదవీకాలాల్లో (పార్టీలకు అతీతంగా) బీహార్ ప్రభుత్వానికి ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరళ్ళు (PAGలు), CAGలు నిరంతరం నిశిత పరిశీలన, హెచ్చరికలు చెయ్యడం మొదలైంది. కానీ బీహార్ ప్రభుత్వంలోని అత్యంత సీనియర్ రాజకీయ నాయకులు, అధికారులూ వాటిని పట్టించుకోలేదు. అందరూ కూడబలుక్కున్నట్లు, ఒక పద్ధతి ప్రకారం ఈ హెచ్చరికలను విస్మరించారు.[10] 1992 లో రాష్ట్ర అవినీతి నిరోధక విజిలెన్స్ యూనిట్‌లో పోలీసు ఇన్‌స్పెక్టరైన బిధు భూషణ్ ద్వివేది, పశుగ్రాసం కుంభకోణం గురించి వివరిస్తూ ఆ విజిలెన్స్ యూనిట్ డైరెక్టర్ జనరల్ జి. నారాయణ్‌కు సమర్పించిన ఒక నివేదికలో, అందులో ముఖ్యమంత్రి స్థాయిలో ప్రమేయం ఉండవచ్చని సూచించాడు.[11][12] అందుకు ప్రతీకార చర్యగా, ద్వివేదిని విజిలెన్స్ యూనిట్ నుండి పరిపాలనలోని వేరే విభాగానికి బదిలీ చేసి, ఆపై ఉద్యోగం నుండి సస్పెండ్ చేశారు. తరువాత ఈ కుంభకోణానికి సంబంధించిన అవినీతి కేసులు విచారణకు వెళ్లినప్పుడు అతను సాక్షిగా ఉన్నాడు. జార్ఖండ్ హైకోర్టు ఆదేశాల ప్రకారం అతనికి తిరిగి నియామకం లభించింది.

బీహార్ వెటర్నరీ అసోసియేషన్ 1985 లో జరిపిన ఒక పత్రికా సమావేశంలో తొలిసారిగా ఈ పశుసంవర్ధక మాఫియాను బయటపెట్టింది. 1990 లో బీహార్ వెటర్నరీ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీని మార్చేసి, డాక్టర్ దిన్నేశ్వర్ ప్రసాద్ శర్మను దానికి జనరల్ సెక్రటరీగా నియమించారు. ఆ సంఘంపై నియంత్రణ సాధించిన తర్వాత, మాఫియా విజృంభించింది. ఆ సమయంలో, డాక్టర్ ధర్మేంద్ర సిన్హా, డాక్టర్ బిరేష్ ప్రసాద్ సిన్హాలు (BVA మాజీ ఆఫీస్ బేరర్లు) ఈ మాఫియా చేస్తున్న అనైతిక కార్యక్రమాలపై సమాచారాన్ని సేకరించడం ప్రారంభించారు. వారు దీనిని బీహార్‌లోని రాజకీయ నాయకులందరికీ బహిర్గతం చేశారు. ఈ రాజకీయ నాయకులలో సుశీల్ కుమార్ మోడీ కూడా ఉన్నాడు. VS దుబే ఈ సంఘటనను బయటపెట్టిన తర్వాత మోడీ ఈ మొత్తం ఎపిసోడ్‌ను ప్రారంభించాడు.[13] అప్పటికి లాలూ ప్రసాద్ యాదవ్ అవిభక్త బీహార్‌కు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అప్పటి ఆర్థిక కమిషనర్ VS దుబే, భారీ స్థాయిలో ఆర్థిక అవకతవకలను కనుగొన్నాడు. 1992 లో రాష్ట్ర విజిలెన్స్ విభాగంలో పోలీస్ ఇన్‌స్పెక్టరుగా ఉన్న బిధు భూషణ్ ద్వివేది, ముఖ్యమంత్రి ఇతరులతో సహా ఉన్నత స్థాయి వ్యక్తులను చేరుస్తూ వివరణాత్మక నివేదికను సమర్పించాడు. అతని నివేదికలను విస్మరించి, అతన్ని వేరే విభాగానికి బదిలీ చేశారు అనేక పనికిమాలిన వంకలతో సస్పెండు చేసారు. దర్యాప్తును చెయ్యకుండా అతన్ని ఆపేందుకు అతని నివాసంలో బాంబు విసిరి బెదిరించారు. ఆ తరువాత ఇతర అధికారులు, వ్యక్తులూ ఈ కుంభకోణాన్ని ఎత్తి చూపినప్పటికీ, కింది స్థాయి ఉద్యోగి అయినప్పటికీ అతిపెద్ద కుంభకోణాన్ని నిక్కమైన నిజాయితీతో వెలికితీసినందుకు అతనికి ఎప్పుడూ నిజమైన క్రెడిట్ ఇవ్వలేదు.

1996 జనవరి 19 న రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి వి.ఎస్. దూబే అన్ని జిల్లాల జిల్లా మేజిస్ట్రేట్‌లు, డిప్యూటీ కమిషనర్‌లను అధికంగా డబ్బును తీసిన కేసులను విచారించాలని ఆదేశించాడు.[14] దాని తర్వాత ఆయన, రాంచీ ట్రెజరీ నుండి పశుసంవర్ధక శాఖ అధిక మొత్తంలో డబ్బు డ్రా చేసిన అంశాన్ని విచారించేందుకు 1996 జనవరి 20 న తన అదనపు కార్యదర్శులలో ఒకరిని పంపారు.[15] ఈ విచారణలో పెద్దయెత్తున ప్రభుత్వ సొమ్ము దొంగతనం జరిగినట్లు వెల్లడైంది; నకిలీ పత్రాల ద్వారా మోసపూరితంగా డ్రా చేసారు. తరువాత విజయ్ శంకర్ దూబే ఇచ్చిన ఆదేశాల మేరకు 1996 జనవరి 27 న పశ్చిమ సింగ్‌భుమ్ జిల్లా డిప్యూటీ కమిషనర్ అమిత్ ఖరే, చైబాసా పట్టణంలోని పశుసంవర్ధక శాఖ కార్యాలయాలపై దాడి చేశాడు. అతని బృందం స్వాధీనం చేసుకుని బహిరంగపరచిన పత్రాల ప్రకారం, అధికారులూ, వ్యాపారవేత్తల వ్యవస్థీకృత మాఫియా ద్వారా పెద్ద ఎత్తున డబ్బు దుర్వినియోగం జరిగిందని నిశ్చయంగా తెలిసింది. మేత కుంభకోణం వార్తను మొదట బయటపెట్టిన పాత్రికేయుడు, అప్పట్లో కలకత్తాలో ఏషియన్ ఏజ్‌లో పనిచేస్తున్న రవి ఎస్ ఝా, అప్పటి బీహార్ ముఖ్యమంత్రికి ఈ కుంభకోణంలో అంతర్లీనంగా పాత్ర ఉందని పేర్కొన్నాడు. చైబాసా నుండి సేకరించిన ఆధారాల ఆధారంగా, ఝా ఈ కుంభకోణంలో బీహార్ ప్రభుత్వ యంత్రాంగానికి విస్తృతంగా ప్రమేయం ఉందని గుర్తించడమే కాకుండా, మునుపటి ప్రభుత్వాలు కూడా ఒక నీచమైన వ్యవస్థను ఎలా ఉపయోగించుకుంటున్నాయో, మంత్రులతో పాటు ఉన్నత ప్రభుత్వ అధికారులు చట్టవిరుద్ధంగా ఎలా డబ్బు సంపాదించారో కూడా ప్రస్తావించాడు. పబ్లిక్ అఫైర్స్ అసోసియేట్ డైరెక్టర్ అయిన ఝా, ప్రస్తుతం అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు, రాజ్యసభ పార్లమెంటు సభ్యుడు సుపరిపాలన ప్రమోటరు అయిన రాజీవ్ చంద్రశేఖర్‌తో కలిసి పనిచేస్తున్నాడు. [10] అక్రమాలపై దర్యాప్తు చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని లాలూ ఆదేశించాడు.[16]

రాష్ట్ర ప్రభుత్వానికి జవాబుదారీగా ఉండే రాష్ట్ర పోలీసులు, దర్యాప్తు కమిటీ ఈ కేసును సరిగ్గా దర్యాప్తు చేయరనే భయాలతో, కేసును కేంద్ర పరిధిలో ఉన్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ)కి బదిలీ చేయాలనే డిమాండ్లు వచ్చాయి. దర్యాప్తు కమిటీ సభ్యులలో చాలామంది ఈ కుంభకోణంలో భాగస్వాములు అని కూడా ఆరోపణలు వచ్చాయి.[16] భారత సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఇది కోర్టు ప్రమేయానికి దారితీసింది.[16] సుప్రీంకోర్టు జారీ చేసిన అంతిమ ఆదేశాల ఆధారంగా, 1996 మార్చిలో పాట్నా హైకోర్టు ఈ కేసును సిబిఐకి అప్పగించాలని ఆదేశించింది.[17]

సిబిఐ విచారణ ప్రారంభించింది. కొన్ని రోజుల్లోనే, బీహార్ అధికారులు, శాసనసభ్యులు పనిలో రాజకీయ నాయకులు-అధికారులు-వ్యాపార మాఫియాల అనైతిక సంబంధాన్ని బహిర్గతం చేసే పత్రాలను తమకు అందనీయకుండా అడ్డుకుంటున్నారని సిబిఐ హైకోర్టుకు ఫిర్యాదు చేసింది.[18] బీహార్ శాసన మండలిలోని కొంతమంది శాసనసభ్యులు, సిబిఐ కోర్టుకు తప్పుడు సమాచారం అందించిందని పేర్కొంటూ, సిబిఐ ప్రాంతీయ ప్రధాన కార్యాలయంలోని సీనియర్ వ్యక్తులపై తీసుకోదగ్గ చర్యల గురించి చర్చించడానికి ఒక ప్రివిలేజ్ మోషన్‌ను ప్రారంభించారు. ఇది కోర్టు ధిక్కారంపై తీసుకునే చర్యకు సమానంగా ఉంటుంది. ఈ మోషనులో పేర్కొన్న సిబిఐ అధికారుల దర్యాప్తును నిలిపివేయడానికీ వారిపై విచారణకూ అది దారితీయవచ్చు.[18]

అయితే, ప్రాంతీయ సిబిఐ డైరెక్టర్ UN బిశ్వాస్, ఇతర అధికారులు శాసన మండలికి బేషరతు క్షమాపణలు చెప్పడంతో, హక్కుల తీర్మానాన్ని వెనక్కి తీసుకున్నారు. సిబిఐ దర్యాప్తు కొనసాగింది.[18] దర్యాప్తులో సిబిఐ, బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఈ కుంభకోణంతో ఉన్న సంబంధాలను వెలికితీసింది. 1997 మే 10 న సీబీఐ, లాలూను విచారించేందుకు అనుమతినివ్వాలని బీహార్ గవర్నర్‌కు అధికారికంగా అభ్యర్థన చేసింది.[19] అదే రోజు, నిందితులలో ఒకరైన వ్యాపారవేత్త హరీష్ ఖండేల్వాల్ రైలు పట్టాలపై చనిపోయి కనిపించాడు. అతని దేఃఅం వద్ద ఉన్న ఒక నోట్‌లో, ప్రాసిక్యూషన్ తరపున సాక్షిగా మారమని సిబిఐ తనను బలవంతం చేస్తున్నట్లు రాసి ఉంది.[19] సిబిఐ ఈ అభియోగాన్ని తిరస్కరించింది. దాని స్థానిక డైరెక్టర్ UN బిశ్వాస్, గవర్నర్‌కు అప్పీల్‌ చేసాడు. [12] [19] ఆదాయపు పన్ను శాఖ చేసిన ఒక దర్యాప్తులో కూడా లాలూ ఈ కుంభకోణానికి కారణమని తేలింది. 2017 మే 8 న RJD నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది - రూ. 1000 కోట్ల మేత కుంభకోణంలో ఆయనపై నమోదైన నాలుగు కేసులను వేర్వేరుగా విచారించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జార్ఖండ్ హైకోర్టు తనపై కుట్ర అభియోగాలను ఎత్తివేయడాన్ని సవాలు చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్లో సుప్రీంకోర్టు ఈ తీర్పు చెప్పింది. 9 నెలల్లో విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ట్రయల్ కోర్టును ఆదేశించింది.

విచారణకు మార్గం

[మార్చు]

ముఖ్యమంత్రిని విచారించాలని రాష్ట్ర గవర్నర్‌ను సిబిఐ కోరిన తర్వాత, కొన్ని రోజులపాటు అనిశ్చితి నెలకొంది. గవర్నర్ ఎఆర్ కిద్వాయ్, లాలూపై అధికారిక విచారణకు అనుమతించాలంటే, అతనిపై ఉన్న ఆరోపణలకు బలమైన ఆధారాలు ఉన్నాయని తాను సంతృప్తి చెందాలని అప్పటికే చెప్పి ఉన్నాడు.[20] అప్పుడే కొత్తగా పదవి చేపట్టిన ప్రధాన మంత్రి ఇందర్ కుమార్ గుజ్రాల్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం, దాని మనుగడ కోసం లాలూ పార్టీకి చెందిన ఎంపీల మద్దతుపై ఆధారపడి ఉంది.[12] [21] సిబిఐ మొదట గవర్నర్ అనుమతిని ఎందుకు కోరిందనేది కూడా అస్పష్టంగా ఉంది. ఎందుకు కోరారని హైకోర్టు అడిగినపుడు, సిబిఐ అది "ముందు జాగ్రత్త చర్య" అని చెప్పింది.[22] ఈ వ్యూహాన్ని తప్పుబట్టిన హైకోర్టు, ఆ అనుమతి వచ్చేందుకు కొంత సమయం ఇస్తామనీ, కానీ అది ఆలస్యం అవుతోందని భావిస్తే, తని స్వంత అధికారంపై ప్రాసిక్యూషన్‌ మొదలుపెట్టాలని ఆదేశిస్తామనీ చెప్పింది.[22]

జూన్ 17 న లాలూను, ఇతరులనూ విచారించేందుకు గవర్నరు అనుమతి ఇచ్చారు.[23] ఐదుగురు సీనియర్ బీహార్ ప్రభుత్వ అధికారులను (మహేష్ ప్రసాద్, సైన్స్ అండ్ టెక్నాలజీ కార్యదర్శి; కె. అరుముగం, కార్మిక కార్యదర్శి; బెక్ జూలియస్, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి; ఫూల్‌చంద్ సింగ్, మాజీ ఆర్థిక కార్యదర్శి; రామ్‌రాజ్ రామ్, మాజీ AHD డైరెక్టర్) అదే రోజు జ్యుడీషియల్ కస్టడీలోకి తీసుకున్నారు. వీరిలో మొదటి నలుగురు IAS అధికారులు.[24][25] ప్రత్యేక కోర్టులో దాఖలు చేయడానికి లాలూపై చార్జిషీట్‌ను కూడా సిబిఐ సిద్ధం చేయడం ప్రారంభించింది. నిందితుడిగా నిర్ధారించబడి, జైలుశిక్ష పడుతుందని భావించిన లాలూ, ముందస్తు బెయిల్ పిటిషను దాఖలు చేశాడు. దీనిని సిబిఐ వ్యతిరేకించి, లాలూపై ఉన్న ఆధారాలను జాబితా చేసింది. [26] అలాగే, జూన్ 21న, కుంభకోణాన్ని మరింత బహిర్గతం చేయడానికి అవసరమైన ఆధారాలు, పత్రాలు నాశనం అవుతున్నాయని భయపడి, సిబిఐ లాలూ నివాసంపైన, దీనికి సహకరించినట్లు అనుమానిస్తున్న అతని బంధువులు కొందరి నివాసాలపైనా దాడులు నిర్వహించింది.[27]

జూన్ 23 న లాలూ పైన, 55 మంది సహ నిందితులపైనా సిబిఐ చార్జిషీట్లు దాఖలు చేసింది [28] చంద్రదేవ్ ప్రసాద్ వర్మ (మాజీ కేంద్ర మంత్రి), జగన్నాథ్ మిశ్రా (బీహార్ మాజీ ముఖ్యమంత్రి), లాలూ మంత్రివర్గంలోని ఇద్దరు సభ్యులు (భోలా రామ్ తూఫానీ, విద్యా సాగర్ నిషాద్), ముగ్గురు బీహార్ రాష్ట్ర అసెంబ్లీ శాసనసభ్యులు (జనతాదళ్‌కు చెందిన RK రాణా, కాంగ్రెస్ పార్టీకి చెందిన జగదీష్ శర్మ, భారతీయ జనతా పార్టీకి చెందిన ధ్రువ్ భగత్), కొంతమంది ప్రస్తుత, మాజీ IAS అధికారులు (ఇప్పటికే కస్టడీలో ఉన్న 4 మందితో సహా) ఉన్నారు. [25] మిశ్రాకు బీహార్ రాష్ట్ర హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.[29] అయితే, లాలూ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను అదే కోర్టు తిరస్కరించింది. అతను సుప్రీంకోర్టుకు అప్పీల్ చేశాడు, జూలై 29న అక్కడ కూడా బెయిల్ నిరాకరించబడింది.[28] అదే రోజు, అతన్ని అరెస్టు చేయాలని బీహార్ పోలీసులను ఆదేశించారు.[30] మరుసటి రోజు, అతను జైలు పాలయ్యాడు. [31] తరువాత, అరెస్టుకు ఒకరోజు ఆలస్యం అవడాన్ని సమర్థించుకుంటూ బీహార్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, SK సక్సేనా, "తొందరపాటు చర్య పోలీసు కాల్పులకు దారితీసి పెద్ద సంఖ్యలో ప్రజల మరణాలకు కారణమయ్యేది" అన్నాడు.[32]

లాలూ ముఖ్యమంత్రి పదవి ముగింపు

[మార్చు]

ఈ కుంభకోణంలో లాలూ చిక్కుకుంటారని, ఆయనపై విచారణ జరుగుతుందని తేలడంతో, ఆయనను ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించాలని ఇతర పార్టీల నుండేకాక,[33][34] లాలూ సొంత పార్టీ అయిన జనతాదళ్ నుండి కూడా డిమాండ్లు ఊపందుకున్నాయి.[35] జూలై 5 న లాలూ అధికారికంగా జనతాదళ్ నుండి విడిపోయి తన సొంత పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్ (లేదా RJD)ని స్థాపించాడు. బీహార్ రాష్ట్ర శాసనసభ లోని జనతాదళ్ శాసనసభ్యులు దాదాపుగా అందరినీ తనతో తీసుకెళ్లాడు.[36] కొన్ని రోజుల తర్వాత రాష్ట్ర అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని గెలుచుకున్నాడు.[37] అయితే, RJD కేంద్రం లోని సంకీర్ణ ప్రభుత్వానికి ఇస్తున్న మద్దతును కొనసాగించింది.[36] తన రాజీనామా డిమాండ్లు పెరుగుతూనే ఉండటంతో, జూలై 25 న లాలూ తన పదవికి రాజీనామా చేశాడు. కానీ అదే రోజున తన భార్య రబ్రీ దేవిని కొత్త ముఖ్యమంత్రిగా నియమించాడు. 1997 జూలై 28 న, రబ్రీ కొత్త ప్రభుత్వం బీహార్ శాసనసభలో 194–110 తేడాతో విశ్వాస తీర్మానాన్ని గెలుచుకుంది, కాంగ్రెస్, జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీలు RJDతో పొత్తు పెట్టుకుని అనుకూలంగా ఓటు వేయడంతో ఇది సాధ్యపడింది.[38]

హెచ్‌డి దేవెగౌడ ప్రధానమంత్రి కావడానికి తాను కీలక పాత్ర పోషించానని లాలూ చెప్పాడు.[39] అయితే, గౌడ సంకీర్ణ ప్రభుత్వం అంతర్గత వివాదాల్లో చిక్కుకున్నప్పుడు గౌడ రాజీనామా చేయాలని లాలూ పట్టుబట్టినందుకు అతనిపై గౌడ పగ పెంచుకున్నాడనీ, ఈ కారణంగానే లాలూపై విచారణ కోసం సీబీఐ డైరెక్టర్ జోగిందర్ సింగ్‌ను పంపాడనీ పత్రికా ఊహాగానాలు వచ్చాయి.[24][40] సీబీఐని ప్రాసిక్యూషన్ కొనసాగించమని నువ్వే ప్రోద్బలం ఇచ్చావని తాను అడిగినపుడు దేవెగౌడ తన తప్పును ఒప్పుకున్నాడనీ, "ఏడ్చి మూర్ఛపోయాడనీ" లాలూ చాలా కాలం తరువాత, 2008 లో, చెప్పాడు.[39] వెనక్కి తిరిగి చూసుకుంటే, ఈ కుంభకోణం తన రాజకీయ జీవితంపై శాశ్వత ప్రతికూల ప్రభావాన్ని చూపిందనీ, ఏదో ఒక రోజున భారత ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు మూసుకుపోయి ఉండవచ్చని లాలూ అన్నాడు.[41]

కేసును కొనసాగిస్తున్న సమయంలో జోగీందర్ సింగ్, దర్యాప్తు గురించి కొత్త ప్రధానమంత్రి ఐ.కె. గుజ్రాల్‌కు చెప్పకుండా ఆయన్ను చీకటిలో ఉంచి, నిబంధనలను ఉల్లంఘించారని వార్తలు వచ్చాయి.[40] గుజ్రాల్ సొంత కొత్త ప్రభుత్వం పార్లమెంటులో మద్దతు కోసం లాలుపై ఆధారపడి ఉంది.[42] కుంభకోణం దర్యాప్తును కొనసాగించకుండా గుజ్రాల్ నిరోధించడానికి ప్రయత్నించాడని జోగిందర్ సింగ్ తరువాత ఆరోపించాడు.[43][44] జూన్ 30 న కేంద్ర ప్రభుత్వం సింగ్‌ను సిబిఐ నుండి హోం మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది, [42] సాంకేతికంగా ఇది పదోన్నతి అయినప్పటికీ, దర్యాప్తు నుండి ఆయన్ను దూరం పెడుతుంది.[45] ప్రాంతీయ సిబిఐ డైరెక్టర్ UN బిశ్వాస్‌ను బదిలీ చేయడానికి ఒక ఫాలో-ఆన్ చర్య కూడా జరిగింది. దానిపై హైకోర్టు, ఆ బదిలీ జరిగితే, దాన్ని రద్దుచేస్తామని హెచ్చరించింది. [46]

ప్రాసిక్యూషన్

[మార్చు]

తరువాతి సంవత్సరాల్లో సిబిఐ మరిన్ని ఆధారాలను కనుగొన్నందున, బీహార్ ట్రెజరీ నుండి అక్రమంగా డబ్బులు డ్రా చేసిన నిర్దుష్టమైన నేరపూరిత చర్యల ఆధారంగా మోసం, నేరపూరిత కుట్రకు సంబంధించిన అదనపు కేసులను దాఖలు చేసింది. 2000 నవంబరులో బీహార్ రాష్ట్రం, కొత్త బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలుగా విభజించబడిన తర్వాత దాఖలు చేయబడిన చాలా కొత్త కేసులు రాంచీలో ఉన్న కొత్త జార్ఖండ్ హైకోర్టులో దాఖలయ్యాయి. పాట్నాలోని పాట్నా హైకోర్టులో గతంలో దాఖలైన అనేక కేసులు కూడా రాంచీకి బదిలీ అయ్యాయి. 2007 మే నాటికి ఏజెన్సీ దాఖలు చేసిన 63 కేసులలో, ఎక్కువ భాగం జార్ఖండ్ హైకోర్టులోకి వచ్చాయి.[2][47]

మోసపూరితంగా బీహార్ ప్రభుత్వ చైబాసా ఖజానా నుండి రూ 37 కోట్లు డ్రా చేసిన కేసుకు సంబంధించిన RC 20-A/96 కేసుకు వ్యతిరేకంగా, సిబిఐ 1996 ఏప్రిల్ 27 న లాలూపై తొలి ఛార్జిషీట్ దాఖలు చేసింది.[25] ఇది భారత శిక్షాస్మృతిలోని సెక్షన్లు 420 (మోసం), 120(B) (నేరపూరిత కుట్ర), అలాగే అవినీతి నిరోధక చట్టం, 1988 లోని సెక్షన్ 13(2)ల ఆధారంగా రూపొందించబడింది.[48] అతను జైలులో పెట్టినప్పటికీ, అతన్ని బీహార్ మిలిటరీ పోలీసు అతిథి గృహంలో సౌకర్యవంతంగా ఉంచారు.[49] 135 రోజుల జ్యుడీషియల్ కస్టడీ తర్వాత, లాలూను 1997 డిసెంబరు 12 న బెయిల్‌పై విడుదల చేశారు. [50] మరుసటి సంవత్సరం, 1998 అక్టోబరు 28 న, మేత కుంభకోణానికి సంబంధించిన వేరే కుట్ర కేసులో అతన్ని తిరిగి అరెస్టు చేశారు, మొదట అదే అతిథి గృహంలో ఉంచారు, కానీ సుప్రీంకోర్టు అభ్యంతరం చెప్పినప్పుడు పాట్నాలోని బ్యూర్ జైలుకు తరలించారు. [49] [51] బెయిల్ మంజూరు చేసిన తర్వాత, అతను 2000 ఏప్రిల్ 5 న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మళ్ళీ అరెస్టు అయ్యాడు. ఆ తేదీన అతని భార్య, అప్పటి ముఖ్యమంత్రి రబ్రీ దేవిని కూడా లొంగిపోవాలని కోరారు. కానీ వెంటనే బెయిల్ మంజూరు చేయబడింది. [49] లాలూకు ఈ జైలు శిక్ష 11 రోజులు కొనసాగింది, ఆ తర్వాత 2000 నవంబరు 28న మరొక మేత కుంభకోణం కేసులో ఒక రోజు జైలు శిక్ష విధించబడింది. [49]

జగన్నాథ్ మిశ్రాకు 1997 జూన్‌లో బెయిల్ మంజూరైంది. 1997 జూలైలో లాలూను మొదటిసారి అదుపులోకి తీసుకున్నప్పుడు జ్యుడీషియల్ రిమాండ్‌ను తప్పించుకున్నాడు. అయితే, అదే సంవత్సరం సెప్టెంబరు 16న ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అక్టోబరు 13న ఆయన బెయిల్‌పై విడుదలయ్యాడు. కానీ 1998 అక్టోబరు 28 న లాలూతో పాటు అదే సమయంలో మళ్లీ రిమాండ్‌కు పంపారు. లాలూను ఉంచిన గెస్ట్ హౌస్‌లోనే ఉంచారు. ఆ తరువాత ఆయనతో పాటు బ్యూర్ జైలుకు తరలించారు.[51][52] డిసెంబరు 18 న మిశ్రా బెయిల్‌పై విడుదలయ్యాడు.[51] కానీ తరువాత 2000 జూన్ 7 న వేరే మేత కుంభకోణం కేసులో తిరిగి అరెస్టయ్యాడు.[3]

కేసులు ఎక్కువగా ఉండటం వల్ల, లాలూ యాదవ్, జగన్నాథ్ మిశ్రా, ఇతర నిందితులు 2000 సంవత్సరం నుండి అనేకసార్లు రిమాండ్‌కు గురయ్యారు. 2007 లో 58 మంది మాజీ అధికారులు, సరఫరాదారులను దోషులుగా నిర్ధారించి, ఒక్కొక్కరికి 5 నుండి 6 సంవత్సరాల జైలు శిక్ష విధించారు.[51] 2007 మే నాటికి, దాదాపు 200 మందికి 2 నుండి 7 సంవత్సరాల మధ్య జైలు శిక్ష విధించబడింది.[47] జార్ఖండ్ హైకోర్టులో జరిగిన కేసుల్లో ఒకదానిపై (RC 68-A/96) 2005 లో జరిగిన వ్యాజ్యంలో 20 ట్రక్కుల పత్రాలు ఉన్నాయి.[53]

ఈ కేసును సీబీఐ విచారించిన దాదాపు 16 సంవత్సరాల తర్వాత, 2012 మార్చి 1 న, పాట్నాలోని ప్రత్యేక సీబీఐ కోర్టు లాలూ ప్రసాద్ యాదవ్, జగన్నాథ్ మిశ్రాతో పాటు మరో 32 మంది నిందితులపై అభియోగాలు మోపింది. మొత్తం 44 మంది నిందితుల్లో ఆరుగురు మరణించగా, ఇద్దరు అప్రూవర్లుగా మారగా, మరో ఇద్దరు ఇప్పటికీ అరెస్టు నుండి తప్పించుకుంటున్నారు. ఈ కేసులో సీబీఐ 2003 మార్చి 3 న వారిపై చార్జిషీట్ దాఖలు చేసింది. విచారణ త్వరలో ప్రారంభమవుతుందని కోర్టు తెలిపింది.[54][55][56]

ఆదాయానికి మించిన ఆస్తుల కేసు

[మార్చు]

1998 ఆగస్టులో లాలూపై ఆదాయపు పన్ను శాఖ ఆదాయపు పన్ను (DA) కేసు నమోదు చేసింది. లాలూ రూ. 4.6 కోట్ల సంపదను కూడబెట్టారని ఆదాయపు పన్ను శాఖ ఆరోపించింది. ప్రభుత్వ ఖజానా నుండి మిలియన్లు కోల్పోయారు. లాలూ, రబ్రీలపై 2000 ఏప్రిల్‌లో ఛార్జ్ షీటు దాఖలు చేయగా, 2000 జూన్ 9 న కోర్టు అభియోగాలు మోపింది. చివరికి, ప్రత్యేక సిబిఐ కోర్టు 2006 డిసెంబరు 18 న ఈ జంటను నిర్దోషులుగా విడుదల చేసింది.[57]

ఈ తీర్పుపై సీబీఐ హైకోర్టులో అప్పీలు చేసుకోలేదు. అయితే, బీహార్ ప్రభుత్వం పాట్నా హైకోర్టులో (సీబీఐ కోర్టు) తీర్పును సవాలు చేసింది. హైకోర్టు ఆ పిటిషన్‌ను అంగీకరించింది. [58] పాట్నా హైకోర్టు తీర్పును లాలూ, సీబీఐలు సుప్రీంకోర్టులో సవాలు చేశారు.[59] సీబీఐ ట్రయల్ కోర్టు లేదా నిందితులకు అనుకూలంగా ఇచ్చిన హైకోర్టు తీర్పును సవాలు చేయడానికి నిరాకరించిన సందర్భాల్లో కూడా నిందితులను నిర్దోషిగా విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ బీహార్ ప్రభుత్వానికి అప్పీలు దాఖలు చేసే హక్కు లేదని 2010 ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు ప్రకటించింది.[60]

ఈ కేసు మరో మలుపు తిరిగింది. లాలూ యాదవ్ అక్రమ ఆస్తుల కేసులో తన తీర్పును సమీక్షించాలని సుప్రీంకోర్టును ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం అభ్యర్థించింది. మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి కుమారుడు అమిత్ జోగిని హత్య కేసులో నిర్దోషిగా విడుదల చేయడాన్ని సవాలు చేయడానికి ప్రయత్నించినప్పుడు అక్రమ ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు తీర్పుతో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం అసంతృప్తి చెందింది. ఛత్తీస్‌గఢ్‌లోని ట్రయల్ కోర్టు 2007 మేలో అమిత్ జోగిని నిర్దోషిగా ప్రకటించిన మూడున్నర సంవత్సరాల తర్వాత, సిబిఐ మళ్ళీ (లాలూ అక్రమ ఆస్తుల కేసు మాదిరిగానే) ఎటువంటి అప్పీల్ దాఖలు చేయలేదు. లాలూ అక్రమ ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు ఆదేశం (ఇది అందరికీ కట్టుబడి ఉంటుంది) కారణంగా ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ అప్పీల్‌ను తిరస్కరించింది. 2012 మార్చి 19న, లాలూ అక్రమ ఆస్తుల కేసులో తన సొంత నిర్ణయాన్ని సమీక్షించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది.[61] అయితే, 2012 మేలో సుప్రీంకోర్టు రివ్యూ పిటిషన్‌ను తోసిపుచ్చింది. మునుపటి తీర్పులో రికార్డులో సమీక్షకు అవసరమైన తప్పులేమీ లేవని పేర్కొంది. [62] 2018 జనవరి 6 న సిబిఐ కోర్టు, లాలూకు మూడున్నర సంవత్సరాల జైలు శిక్ష. ఐదు లక్షల జరిమానా విధించింది.

నేరారోపణలు

[మార్చు]

2013 మే నాటికి, మొత్తం 53 కేసులకు గాను, 44 కేసులలో విచారణ పూర్తయింది. [6] 500 కంటే ఎక్కువ మంది నిందితులను వివిధ కోర్టులు దోషులుగా నిర్ధారించి శిక్షలు విధించాయి. బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్, [63] మాజీ పార్లమెంటు సభ్యుడు రవీంద్ర కుమార్ రాణా, మాజీ శాసనసభ సభ్యుడు ధ్రువ్ భగత్ వంటి ప్రముఖులు దోషులుగా తేలింది.[7]

2013 సెప్టెంబరు 30 న రాంచీలోని ప్రత్యేక సిబిఐ కోర్టు ఈ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్, జగన్నాథ్ మిశ్రాతో పాటు మరో 44 మందిని దోషులుగా నిర్ధారించింది. ముప్పై ఏడు మందిని జ్యుడీషియల్ కస్టడీలోకి తీసుకున్నారు. లాలూ, జగన్నాథ్ మిశ్రాలకు ఐదు సంవత్సరాలు, నాలుగు సంవత్సరాలు జైలు శిక్షను కోర్టు ప్రకటించింది.[64]

శిక్ష

[మార్చు]

2013 అక్టోబరు 3 న ప్రత్యేక సీబీఐ కోర్టు లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఈ కేసులో ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. భద్రతా కారణాల దృష్ట్యా న్యాయమూర్తి ప్రవాస్ కుమార్ సింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శిక్షను ప్రకటించాడు. రూ.25 లక్షల జరిమానా కూడా విధించాడు. 65 ఏళ్ల లాలూ తన లోక్‌సభ స్థానాన్ని కోల్పోయాడు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వుల కారణంగా శిక్ష పడిన తర్వాత ఆరు సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆటోమాటిగ్గా నిషేధం పడింది.

మరో బీహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రాకు 4 సంవత్సరాల జైలు శిక్ష విధించారు.[65]

ప్రభావం

[మార్చు]

బహిరంగంగా వెలుగులోకి వచ్చినప్పటి నుండి, మేత కుంభకోణం భారతదేశంలో, ముఖ్యంగా బీహార్‌లో, అధికారిక అవినీతి, రాజకీయాల నేరకరణకు ప్రతీకగా మారింది. దీనిని "బీహార్ ప్రభుత్వాన్ని, అనేక ఇతర రాష్ట్ర ప్రభుత్వాలను కూడా పీడిస్తున్న లోతైన, దీర్ఘకాలిక వ్యాధి లక్షణం" అంటారు.[66] భారత పార్లమెంటులో, దేశ రాజకీయాలు, ఆర్థిక శాస్త్రంలో మాఫియా రాజ్యం ఎంత లోతుగా చొచ్చుకుపోయిందో తెలిపేందుకు ఇది ఒక ముఖ్యమైన సూచికగా పేర్కొన్నారు. మాఫియా పరిఢవిల్లినపుడు, ప్రభుత్వ నియంత్రిత ఆర్థిక వ్యవస్థలో జరిగే పాలన యొక్క అరాచక స్వభావం ఎలా ఉంటుందో కూడా చర్చించారు.[67]

మేత కుంభకోణంలో దర్యాప్తు, విచారణలను రాజకీయ ఉద్దేశాలతో, రాజకీయ ప్రేరణతో నడిపించారని అన్నారు. రాజకీయ నాయకులు, అధికారులపై బలమైన కేసును నిర్ధారించడానికి, ఈ కుంభకోణంతో ఎటువంటి సంబంధం లేని దిగువ స్థాయి సిబ్బందితో సహా చాలా మంది అధికారులపై సిబిఐ ప్రాసిక్యూషన్ ప్రారంభించింది. ఈ శాఖలో, కుంభకోణంలో ప్రత్యక్ష ప్రమేయం ఉన్న చాలా మంది ఉద్యోగులను కోర్టులు సస్పెండ్ చేసి శిక్ష విధించాయి.[68] దీని కారణంగా చాలా మంది ఉద్యోగుల కుటుంబాలకు, ఆదాయ మార్గమేదీ లేకుండా పోయింది. 1996లో ప్రారంభించిన విచారణ దశాబ్దాల పాటు జరుగుతూనే ఉంది. చాలా మంది అమాయకుల భవిష్యత్తు ఏమిటో ఖచ్చితంగా తెలియకుండా అనిశ్చితంగా వేలాడుతోంది.

లోక్‌సభ ఒక సెషనంతా పూర్తిగా చర్చించిన ఒకే ఒక్క అంశం మేత కుంభకోణం, ఒకే ఒక్క వ్యక్తి లాలూ ప్రసాద్ యాదవ్. [69]

లాలూ ప్రసాద్ యాదవ్‌కు సీబీఐ కోర్టు 2018 జనవరి 6 న మూడున్నర సంవత్సరాల జైలు శిక్ష, ఐదు లక్షల జరిమానా విధించింది.

2018 జనవరి 24 న కోర్టు మూడవ కేసులో తీర్పు వెలువరించింది. లాలూకు ఐదు సంవత్సరాల జైలు శిక్ష, ₹10,00,000/- జరిమానా విధించింది. మూడు తీర్పులలో మొత్తం జైలు శిక్ష 13½ సంవత్సరాలు.[70]

జనాదరణ పొందిన సంస్కృతిలో

[మార్చు]

2021లో, భారతీయ వెబ్ సిరీస్ మహారాణి ఈ కుంభకోణం ఆధారంగా రూపొందించబడింది.[71] [72]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "How the fodder scam has proved to be Lalu Prasad's Waterloo". 7 February 2022.
  2. 2.0 2.1 "Fodder scam: Charges framed against Lalu", Outlook India, 17 May 2005, archived from the original on 18 April 2009, retrieved 4 November 2008, Snippet: ... The CBI has filed chargesheets in sixty cases, of which 53 are being tried in the courts at Ranchi and seven in Patna ...
  3. 3.0 3.1 "Jail for Bihar politician", BBC, 7 June 2000, retrieved 5 November 2008, Snippet: ... Former chief minister of the northern state of Bihar, Jagannath Mishra, has been remanded in judicial custody in a multi-million dollar fodder scam ...
  4. "What is the fodder scam: A look at what all has happened since 1996". 2017-05-08.
  5. "fodder scam verdict: Lalu Prasad convicted in second fodder scam case; RJD to appeal in HC - The Economic Times". economictimes.indiatimes.com. Archived from the original on 2017-12-31.
  6. 6.0 6.1 "Ex-MP, former Bihar MLA among 10 people convicted in fodder scam". IBN. 31 May 2013. Archived from the original on 4 June 2013. Retrieved 4 June 2013.
  7. 7.0 7.1 "Former RJD MP RK Rana convicted in multi-crore fodder scam". The Times of India. 31 May 2013. Archived from the original on 4 June 2013. Retrieved 4 June 2013.
  8. "Mishra pleads against fresh prosecution", The Tribune, 29 October 1998, retrieved 31 October 2008, Snippet: ... The former Bihar Chief Minister, Mr. Laloo Prasad Yadav and Mr. Jagannath Mishra, were today remanded in judicial custody till tomorrow after a designated court rejected their prayers for a provisional bail on adjournment of hearing for regular bail in a conspiracy angle case of the fodder scam ...
  9. "Fodder scam: AG denies lapses", The Tribune, 8 July 2000, retrieved 31 October 2008, Snippet: ... Comptroller and Accountant General (CAG), Mr T.N.Chaturvedi in a letter to former Bihar Chief Minister Chandrashekhar Singh on 11 February 1985, had pointed out the delay in submission of the monthly account by the treasuries and work divisions ...
  10. 10.0 10.1 "Anatomy of a scam", Rediff, 18 June 1997, retrieved 31 October 2008, Snippet: ... The Rs 9.5 billion fodder scam in Bihar came to light on 27 January 1996 at Chibasa in South Bihar when then deputy commissioner of the district Amit Khare ordered his officials to raid the office of the animal husbandry department ...
  11. Joginder Singh, "Inside CBI", Chandrika Publications, 1999, ISBN 81-87431-00-8.
  12. 12.0 12.1 12.2 "Once there was a scam…", Indian Express, 15 July 2008, retrieved 31 October 2008
  13. "Fodder scam under Lalu Prasad Yadav: When cattle rode a scooter, oil purchased to polish buffalo horns". Retrieved 2017-12-29.
  14. The Hindu Net Desk (2017-05-08). "The fodder scam: a recap". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2017-12-29.
  15. "Lalu Prasad Yadav convicted in fodder scam: How a one line fax unearthed corruption scandal, unseated ex-Bihar CM - Firstpost". www.firstpost.com. 8 January 2018. Retrieved 2018-01-11.
  16. 16.0 16.1 16.2 "CBI convicted 64 in fodder scam", Merinews, 16 July 2008, retrieved 1 November 2008
  17. "NDA Ministers Want Rabri Out", India Today Magazine, 21 May 2001, archived from the original on 24 September 2015, retrieved 1 November 2008
  18. 18.0 18.1 18.2 "Privilege move against CBI in fodder scam dropped", Indian Express, 7 June 1997, retrieved 1 November 2008, Snippet: ... the Bihar Legislative Council today dropped privilege proceedings against five Central Bureau of Investigation (CBI) officials, including its Joint Director (East) U. N. Biswas, following '`their unqualified apology over the allegation of '`non-cooperation by the Council in connection with the Rs 950-crore fodder scam ... the CBI had on 28 March last made a submission in the court for a direction to the Council secretary to provide certain documents said to be relevant to unfold the conspiracy aspect of the scam as '`request to this effect was turned down on the plea that they are privileged documents' ...
  19. 19.0 19.1 19.2 "CBI seeks governor's nod for Laloo's prosecution", Rediff, 10 May 1997, retrieved 31 October 2008, Snippet: ... The Central Bureau of Investigation on Saturday approached Bihar Governor A R Kidwai for seeking sanction to prosecute Chief Minister Laloo Prasad Yadav ...
  20. "Nod for Laloo's prosecution only if there's strong evidence: Bihar governor", Rediff, 9 May 1997, retrieved 31 October 2008
  21. Burns, John F. (20 April 1997), "India Coalition Picks a Premier To End Crisis", The New York Times, retrieved 2 November 2008, Snippet: ... India's coalition Government ended three weeks of political turmoil today by naming as the country's new Prime Minister Inder K. Gujral ... Mr. Gujral, 77, was a surprising choice after days of maneuvering between the 14-party coalition Government and the Congress Party ...
  22. 22.0 22.1 "HC seeks time-frame in fodder scam trial", Indian Express, 18 May 1997, retrieved 2 November 2008, Snippet: ... "Suppose the Governor does not decide within one year, should the High Court be a silent spectator?" the court said. "The sanctioning authorities must realise the import of the case and come up with the sanction at the earliest." ... Though the CBI counsel tried to clarify that Governor's permission was resorted to as a precautionary measure, the court said, "What precaution? If any authority tries to delay, the court will be well within its jurisdiction to give the direction." "We are not drawing any inference. But we simply want a yes or no from them. Don't keep the issue pending for long," the court said. ...
  23. "Kidwai sanctions prosecution of Laloo, 55 others", Business Standard, 18 June 1997, retrieved 31 October 2008
  24. 24.0 24.1 "Countdown begins for Laloo's dethronement", Indian Express, 18 June 1997, retrieved 2 November 2008, Snippet: ... Within the JD, there is no love lost between Laloo and the former Prime Minister H. D. Deve Gowda. There is considerable rancour between the two for the role Laloo played in dislodging the latter from the Prime Minister's post. ... Five senior Bihar officials – including one retired officer and three serving officers of the Indian Administrative Service (IAS) – arrested by the Central Bureau of Investigation (CBI) in connection with the Rs 9.50 billion fodder scam, were today remanded to judicial custody for eight days. ...
  25. 25.0 25.1 25.2 "Laloo charged, stay on arrest declined", Indian Express, 24 June 1997, retrieved 4 November 2008, Snippet: ... The case – RC 20 (A/96) – was registered on 27 April 1996, by the CBI on the orders of the Supreme Court and the Patna High Court. It involved fraudulent withdrawals to the tune of around Rs 370 million during 1994–95 from the Chaibasa treasury on the basis of fake bills from suppliers and fake supply orders. ...
  26. "CBI opposes Laloo's bail plea", Indian Express, 21 June 1997, retrieved 1 November 2008, Snippet: ... Even as investigating officials and legal officers were dotting their I's and crossing their T's on the chargesheet in the CBI office here, counsel Ansari told the court that the investigating agency has strong evidence of not merely Laloo's connivance in the fodder scam but also his master-minding it ...
  27. "CBI raids Laloo's home", The Indian Express, 22 June 1997, retrieved 1 November 2008, Snippet: ... Laloo's ancestral house and residences of his in-laws in Gopalganj and Siwan districts were raided. According to CBI sources, the raids in Mirganj, Fulwaria and Saraikala yielded some incriminating documents and a huge amount of cash. The fathers-in-law of Laloo's two brothers-in-law were arrested.On a tip-off that documents related to the scam were being shifted, a team of nearly fifty sleuths left for Laloo's ancestral village yesterday night. ...
  28. 28.0 28.1 "Spoils of Surrender", India Today Magazine, 9 November 1998, archived from the original on 19 April 2009, retrieved 1 November 2008
  29. "Mishra gets bail, Laloo moves HC", Indian Express, 28 June 1997, retrieved 5 November 2008, Snippet: ... in the first information report nothing has been said about Mishra ... Besides, he has been suffering from several ailments ...
  30. "India Police Order Arrest of Politician in Scandal", The New York Times, 30 July 1997, retrieved 31 October 2008
  31. "Indian Official Jailed on Corruption Charges", The New York Times, 31 July 1997, retrieved 31 October 2008
  32. "DGP defends 'non-cooperation'", Indian Express, 13 August 1997, retrieved 1 November 2008, Snippet: ... At 11.45 pm Kaul phoned the DGP seeking adequate security for execution of the warrant, but intelligence reports emanating from the chief minister's residence said a large number of media persons and ruling party supporters had gathered inside the premises ...
  33. "BJP urges Sharma to dismiss Laloo government", Indian Express, 18 June 1997, archived from the original on 21 April 2009, retrieved 2 November 2008
  34. "CPI asks Governor to sack Laloo govt", Business Standard, 2 July 1997, retrieved 31 October 2008
  35. "Laloo should resign if charge-sheeted: Patel", Indian Express, 26 May 1997, retrieved 2 November 2008
  36. 36.0 36.1 "Laloo breaks JD, forms new party", Indian Express, 6 July 1997, retrieved 2 November 2008
  37. "Laloo puts the smile back on Soren, Mandal's face", Indian Express, 22 July 1997, retrieved 2 November 2008, Snippet: ... Jharkhand Mukti Morcha (JMM) leaders Shibu Soren and Suraj Mandal ... Their rehabilitation inarguably has a lot to do with the role the 18 MLA-strong JMM played in helping the Laloo Prasad Yadav Government survive the 15 July no-confidence motion ... In an apparent quid pro quo for their support, Laloo, who once claimed that a Jharkhand state could only be carved out in Bihar over his dead body, has elevated Soren ... it appears that a resolution for the formation of a Jharkhand state will feature in the Bihar Assembly on Tuesday ...
  38. "Rabri wins trust vote", Indian Express, 29 July 1997, retrieved 1 November 2008, Snippet: ... The Bihar Assembly was plunged into laughter when Rabri Devi said that she was prepared to shift her husband, Laloo Prasad Yadav, out of her official residence and to the house of opposition leader, Sushil Kumar Modi. "You are my elder brother ..... I am prepared to shift my husband to your house," she told Modi when he said that Yadav should not be allowed to stay at the Chief Minister's residence following filing of chargesheet against him in the fodder scam. ...
  39. 39.0 39.1 "PM Gowda wept, fainted when I confronted him over fodder case: Lalu", Indian Express, 4 August 2008, retrieved 2 November 2008, Snippet: ... He told Joginder Singh, the then Director of CBI to file a chargesheet against me... I went to him at his 7, Race Course Road residence and told him, "Why are you hanging me? I will not be able to work in Bihar'. He was rude and I was also hyper. We said a lot of bad things to each other. He started weeping and fainted." ... "I made him the Prime Minister and paid for it. By choosing him, I made a mistake." ...
  40. 40.0 40.1 "Is Joginder taking political advantage of the CBI", Indian Express, 5 May 1997, retrieved 1 November 2008, Snippet: ... It is also odd that Joginder Singh did not inform the new Prime Minister about what he was about to do. No doubt, the CBI has been asked to function under the direct supervision of the courts in certain sensitive cases. But surely the Prime Minister, who heads the CBI and who as the country's executive head should not be caught by surprise by any action of any wing of the government ... Laloo believes that Deve Gowda is using the CBI chief to get at him, and that Gowda's kitchen cabinet, C M Ibrahim, Ram Vilas Paswan and Shrikant Jena, sold him the idea. (Gowda has not forgiven Laloo and others for demanding he step down before the Vote of Confidence.) ...
  41. "Fodder scam cost me dear: Lalu", The Times of India, 20 December 2006, archived from the original on 22 October 2012, retrieved 1 November 2008, Snippet: ... "I have suffered a lot due to the fodder scam – politically and personally. The state has also suffered. But I have no grievance against anybody. Post-fodder scam, I realised that 'I cannot become the PM of the country'. Therefore, I made PMs. A lot of my aides and friends left me." ... But Lalu, the politician soon took over from an emotional Lalu. "As of now, my plan to become PM stands postponed. Manmohanji is a popular PM and a gentleman to boot. I will continue to support him even after the completion of the five-year term. I am a trusted ally of the Congress." ...
  42. 42.0 42.1 "Gujral sends Joginder Home", Indian Express, 1 July 1997, retrieved 2 November 2008, Snippet: ... In a move which is seen as a desperate ploy by Prime Minister I K Gujral to avert a split in the Janata Dal and woo Laloo Prasad Yadav, Central Bureau of Investigation (CBI) director Joginder Singh was today shifted to the Union Home Ministry as Special Secretary. ...
  43. "Fodder scam: Gujral tried to stall probe, says Joginder", Indian Express, 18 December 1998, retrieved 1 November 2008, Snippet: ... The former CBI director virtually accuses Gujral of trying to stymie the investigations in the fodder scam in an effort to shield Laloo Prasad Yadav. ...
  44. "Gujral told me to go slow on Laloo: ex-CBI chief", The Tribune, 27 April 2005, retrieved 1 November 2008, Snippet: ... "Mr Gujral told me that Mr Laloo is from my party, don't arrest him. If you want to go ahead with the proceedings, go ahead, but don't arrest him." Mr Joginder Singh further added that "the matter didn't stop there and he got another call from the then Home Minister, Mr Indrajit Gupta, asking him go slow and save himself and his job." ...
  45. "No more CBI transfers: Gujral", Indian Express, 1 July 1997, retrieved 2 November 2008, Snippet: ... Prime Minister I K Gujral, today said the transfer of outgoing CBI Joginder Singh, was a routine one on promotion, and assured that no further transfer in the department was in the offing ...
  46. "HC against shunting Biswas", Indian Express, 5 August 1997, retrieved 2 November 2008, Snippet: ... The Patna High Court today said it will take "proper steps" in the event of the transfer of Central Bureau of Investigation (CBI) Joint Director (East) U. N. Biswas, heading the agency team probing the fodder scam. ...
  47. 47.0 47.1 "Fodder scam case: 58 convicted, given jail terms", Times of India, 31 May 2007, archived from the original on 1 May 2009, retrieved 5 November 2008, Snippet: ... A total 63 cases were registered in the scam and 41 were transferred to Jharkhand after it was created from Bihar in November 2000 ... The CBI has filed charge sheets in almost every case and trials are under progress. Till now the special CBI court has passed judgment in 16 cases and nearly 200 accused in different cases have been punished with two to seven years imprisonment ...
  48. "Rabri granted bail, Laloo sent to jail", The Tribune, 6 April 2000, retrieved 4 November 2008, Snippet: ... The Judge framed the charges in the case no. RC 20-A/96 of the Rs 950-crore scam under Sections 420, 467, 468, 437 (A) and 120 (B) of the IPC, besides under Section 13(1) read with 13 (2) of the Prevention of Corruption Act. ...
  49. 49.0 49.1 49.2 49.3 "The ride to Ranchi", Frontline Magazine, 8–21 డిసెంబరు 2001, archived from the original on 29 డిసెంబరు 2001, retrieved 5 నవంబరు 2008, Snippet: ... He was lodged at the Bihar Military Police guest house in Patna. On 28 October 1998, Laloo Prasad was detained for 73 days ... after the Supreme Court took exception to his being lodged there, he was shifted to the Beur jail ... The third incarceration which began on 5 April 2000, in connection with a disproportionate assets case ...
  50. "Detained ex-Bihar chief minister freed on bail", Press Trust of India, 12 December 1997, Snippet: ... Laloo Prasad Yadav was released from prison on Friday after 135 days of judicial custody ... freed after he furnished a bail-bond of 100,000 rupees and two sureties of the same amount ... The Patna high court granted bail ... case involves the fraudulent withdrawal of over 370 million rupees from government funds ...
  51. 51.0 51.1 51.2 51.3 "Laloo gets interim bail", Indian Express, 7 January 1999, retrieved 5 November 2008, Snippet: ... The Supreme Court today granted interim bail to former Bihar Chief Minister Laloo Prasad Yadav and five other accused ... The apex court on 18 December had granted bail to former Bihar Chief Minister Jagannath Mishra ... had expressed serious concern over the preferential treatment given to Yadav and Mishra by the Bihar Government, which had lodged them at a guest house after notifying it as a jail. The court had ordered their shifting to Beur Central Jail in Patna ... and sought a compliance report from the Inspector General of Prisons ...
  52. "Laloo & Mishra in judicial custody", Indian Express, 29 October 1998, retrieved 5 November 2008, Snippet: ... The designated special CBI court today remanded former Chief Ministers of Bihar Laloo Prasad Yadav and Jagannath Mishra along with four others to judicial custody till tomorrow after inconclusively hearing their regular bail petitions ...
  53. "Lalu, 69 others, charged in fodder scam", Onlypunjab.com, 26 April 2005, archived from the original on 8 July 2011, Snippet: ... Besides Lalu Prasad ... Charges were also framed against former Bihar chief minister Jagannath Mishra, former MP Rajo Singh, former Bihar animal husbandry minister Vidyasagar Nishad, former central minister Chandradeo Prasad Verma, four bureaucrats of the Indian Administrative Service, veterinary doctors and other government officials. There are 20 truckloads of documents in the case ...
  54. "CBI court frames charges against Lalu, others in fodder scam". Rediff News. 1 March 2012. Retrieved 1 March 2012.
  55. "Charges framed against Lalu Prasad, Jagannath Mishra in fodder scam case". DNA. 1 March 2012. Retrieved 1 March 2012.
  56. "Charges framed against Lalu, Mishra in fodder scam". The Times of India. 1 March 2012. Archived from the original on 26 January 2013. Retrieved 1 March 2012.
  57. "Lalu and Rabri set free by CBI judge in disproportionate assets case". India Today. 1 January 2007. Retrieved 3 May 2012.
  58. "Why was CBI not allowed to challenge order against Lalu?: Nitish". India Today. 3 April 2010. Retrieved 3 May 2012.
  59. "CBI stands by Lalu Yadav, opposes Bihar govt plea in DA case in SC". The Times of India. 10 March 2010. Archived from the original on 29 June 2013. Retrieved 19 May 2013.
  60. "Chhattisgarh govt to SC: Review order in Lalu Prasad's DA case". The Times of India. 22 January 2012. Archived from the original on 3 January 2013. Retrieved 3 May 2012.
  61. "Can States Appeal in Cases Probed by CBI?: SC". PTI. 19 March 2012. Archived from the original on 12 May 2014. Retrieved 3 May 2012.
  62. "State of Bihar v. Lalu Prasad Yadav & Anr. - Review Petition No. 231 & 232 of 2012 in Cr Appeal No. 662 & 670 of 2010". Supreme Court of India. 3 May 2012. Archived from the original (Text) on 4 October 2013. Retrieved 29 September 2013.
  63. "Lalu Prasad, 44 others convicted in fodder scam case". Hindustan Times. 30 September 2013. Archived from the original on 30 September 2013. Retrieved 30 September 2013.
  64. "Fodder scam: Lalu Prasad gets five years in jail, Jagannath Mishra four - The Times of India". The Times of India.
  65. "Lalu Prasad Yadav and Jagannath Mishra convicted in Fodder Scam Case". The Times of India. Retrieved 3 October 2013.
  66. "Economic and Political Weekly", Economic and Political Weekly, 1997, retrieved 5 November 2008, Snippet: ... The fodder scam is a small symptom of a deep and chronic malady afflicting the Bihar government and quite a few other state governments as well ...
  67. N.S. Gehlot (2002), New Challenges to Indian Politics: Coalition Politics and Elections, Population Explosion, Women and Human Rights, Foreign Policy, Constitution, Judiciary and Recent Developments, Deep & Deep Publications, ISBN 978-81-7629-401-0, Snippet: ... The very basis of the recommendation was that not merely the law and order situation had deteriorated in Bihar, the state had withered away. The Mafia raj prevailed there. ...
  68. "Fodder scam accused charges CBI with bias". Rediff.com. 4 Jan 2000. Retrieved 30 Jan 2016.
  69. "Lalu Prasad and the Fodder Scam". MSN India. 30 April 2011. Archived from the original on 7 November 2012. Retrieved 3 May 2012.
  70. "Lalu Yadav convicted in third fodder scam, sentenced to 5 years in jail". The Economic Times. 24 Jan 2018. Retrieved 16 Nov 2018.
  71. Menon, Aditya (2 June 2021). "Jungle Raj Inverted: 'Maharani' Gets Caste Better Than Many Others". TheQuint (in ఇంగ్లీష్). Retrieved 17 September 2021.
  72. "Chaara Ghotala As Daana Ghotala, How Bollywood Passes Off Facts As Fodder For Fiction". Outlook India. Retrieved 17 September 2021.