పశ్చిమ కమెంగ్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
West Kameng జిల్లా
Arunachal Pradesh జిల్లాలు
Arunachal Pradesh రాష్ట్రంలో West Kameng యొక్క స్థానాన్ని సూచించే పటం
Arunachal Pradesh రాష్ట్రంలో West Kameng యొక్క స్థానాన్ని సూచించే పటం
దేశం భారతదేశం
రాష్ట్రం Arunachal Pradesh
ముఖ్యపట్టణం Bomdila
విస్తీర్ణం
 • మొత్తం 7,422
జనాభా (2011)
 • మొత్తం 87,013[1]
జనగణాంకాలు
 • అక్షరాస్యత 69.4%[1]
 • లింగ నిష్పత్తి 755[1]
Website అధికారిక వెబ్‌సైటు

అరుణాచల ప్రదేశ్ రాష్ట్ర 17 జిల్లాలలో పశ్చిమ కమెంగ్ జిల్లా ఒకటి. రాష్ట్రం మొత్తం వైశాల్యంలో ఈ జిల్లా వైశాల్యం 8.86% ఉంది. ఒకప్పు డీ ప్రాంతం చైనా సామంతరాజ్యం అయిన షానన్ న్యాయపరిధిలో ఉండేది. ఈ జిల్లాలో కమెంగ్ నది ప్రవహిస్తున్న కారణంగా ఈ జిల్లాకు ఈ పేరు వచ్చింది. కమెంగ్ నది బ్రహ్మపుత్ర నదికి ఉపనది.

చరిత్ర[మార్చు]

కమెంగ్ నది పరిసర ప్రాంతాలు మాన్ (సంప్రదాయ ప్రజల) సామ్రాజ్యం, భూటాన్, టిబెట్ మరియు అహోం ఆధీనంలో ఉంటూ వచ్చింది. 7వ శతాబ్దంలో గిరిజనుల మద్య లమైస్ం స్థిరంగా కాలూనింది. అందువలన మార్ష్ంగ్ వద్ద కచన్ లామా లగ్యాల గోంపా నిర్మించాడు. ఎప్పుడైతే చక్రవర్తులు బలహీన పడతారో అప్పుడప్పుడు ఈ ప్రాంతపు సామంతులు స్వతంత్రంగా వ్యవహరిస్తూ ఈ ప్రాంతం మీద ఆధిపత్యం సాగిస్తూ ఉండేవారు. అందుకు భలూక్పాంగ్ వద్ద 10-12 శతాబ్ధాలలో నిర్మించబడి ప్రస్తుతం శిథిలమైన కోట మరియు పొరుగు రాజ్యాల నుండి రక్షించుకోవడానికి 17వ శతాబ్దంలో నిర్మించబడిన డరాంగ్ కోట సాక్ష్యంగా ఉంది. బ్రిటిష్ భారతదేశంలోకి ప్రవేశించిన తరువాత ఈ ప్ర్రంతం మొత్తం ఈశాన్య సరిహద్దు ఏజన్సీగా మార్చబడింది. 1919లో తరువాత ఇది " బలిపరా సరిహద్దు ట్రాక్ట్ "గా పేరు మార్చబడింది. దీనికి అస్సాం లోని చార్దుయర్ కేంద్రంగా ఉంటూ వచ్చింది. 1946లో బలిపరా నుండి కొంత భూభాగం వేరుచేసి ఈ జిల్లా రూపొందించబడింది. అప్పుడు ఈ ప్ర్రంతానికి " సెలా సబ్ ఏజంసీ " అని పేరుపెట్టబడింది. దీనికి అస్సాం లోని చార్దుయర్ కేంద్రంగా ఉంటూ వచ్చింది. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత " సెలా సబ్ ఏజంసీ "కి " కమెంగ్ ఫ్రాంటియర్ డివిషన్ " అని నామాంతరం చేయబడింది. 1954లో జిల్లా కేంద్రం బొండిలాకు మార్చబడింది. 1950లో టిబెట్ మీద దండయాత్ర జరిగిన సమయంలో టిబెటన్ ఆశ్రితుల రాకతో ఈ ప్రాంతం జనసమ్మర్ధం అయింది. తరువాత చైనీయుల దాడి జరిగినప్పుడు పలు స్మారకచిహ్నస్లు ధ్వంశం చేయబడ్డాయి. తరువాత ది కమెంగ్ ఫ్రాంటియర డివిషన్‌కు కమెంగ్ జిల్లా అని నామకరణం చేయబడింది. తరువాత రాజకీయ కారణాల వలన 1980 జూన్ 1 న ఈ జిల్లా తూర్పు కమెంగ్ మరియు పశ్చిమ కమెంగ్ జిల్లాలుగా మార్చబడింది.[2] ఒకప్పుడు ఈ జిల్లాలో భాగంగా ఉన్న తవాంగ్ 1984 అక్టోబర్ 6 నుండి జిల్లాగా రూపొందించబడింది.[2]

భౌగోళికం[మార్చు]

పశ్చిమ కమెంగ్ జిల్లా వైశాల్యం 7,442చ.కి.మీ.[3] ఇది పపుయా న్యూ గునియాలోని న్యూఐర్లాండ్ ద్వీపం వైశాల్యానికి సమానం.[4] ఉత్తర అక్ష్క్షంశం 26° 54' నుండి 28° మరియు దక్షిణ రేఖంశం 91° 30' నుండి 92° 40' లో ఉంది. జిల్లా ఉత్తర సరిహద్దులో టిబెట్ దేశంతో, పశ్చిమ సరిహద్దులో భూటాన్ దేశంతో, ఈశాన్య సరిహద్దులో తవాంగ్ జిల్లా మరియు తూర్పు సరిహద్దులో ఈస్ట్ కమెంగ్ జిల్లాలతో సరిహద్దులు పంచుకుంట్జుంది. దక్షిణ సరిహద్దులో షోనీపూర్ జిల్లా మరియు అస్సాం రాష్ట్రంలోని డర్రాంగ్ జిల్లా ఉన్నాయి. జిల్లాలో " ది ఈగల్ నెస్ట్ వన్యప్రాణి అభయారణ్యం " ఉంది.

భూతత్వం[మార్చు]

పశ్చిమ కమెంగ్ జిల్లా భూమి అధికంగా పర్వతమయంగా ఉంటుంది. పశ్చిమ కమెంగ్ జిల్లా హిమాలయాలతో నిండి ఉంటుంది. జిల్లాలో కంగ్టే శిఖరం అత్యధిక ఎత్తైనదిగా గురింపు పొందింది.

వాతావరణం[మార్చు]

తూర్పు కమెంగ్ జిల్లాలోలా పశ్చిమ కమెంగ్ జిల్లాలో చల్లని ఉష్ణోగ్రత ఉంటుంది. నవంబర్ మద్య నుండి ఫిబ్రవరి వరకు హిమాపాతం ఉంటుంది. కుపి, బొండిల, నెచిపు లలో మంచు కురుస్తూ ఉంటుంది. 5690 అడుగుల ఎత్తులో ఉన్న నిచిపో జిల్లాలో ఎత్తైన భుభాగంగా గుర్తించబడుతుంది.

ఆర్ధికం[మార్చు]

మిగిలిన అరుణాచల ప్రదేశ్ వ్యవసాయ భూముల లాగా పశ్చిమ కమెంగ్ జిల్లాలోని దిగువభూములలో జుం లేక షిఫ్టింగ్ కల్టివేషన్ వాడుకలో ఉంది. ఇక్కడ ఉపౌష్ణమండల ఉష్ణోగ్రత వ్యవసాయానికి అనుకూలంగా ఉంది. జిల్లాలో కూడా హార్టికల్చర్ కూడా అధికంగా ఉంది. జిల్లాలో కుటీరపరిశ్రమలు మరియు హస్థకళలు మరియు వస్త్రాల తయారీ పరుశ్రలు కూడా గుర్తించతగినతగా ఉన్నాయి.

విభాగాలు[మార్చు]

  • పశ్చిమ కమెంగ్ జిల్లా 3 ఉప విభాగాలుగా విభజించబడింది :- తిరుజినో, రూపా (అరుణాచల ప్రదేశ్) మరియు బండిల.
  • ఇవి అదనంగా 12 అడ్మినిస్ట్రేటివ్ సర్కిల్స్‌గా విభజించబడ్డాయి :- డిరాంగ్, బొండిలా, కలక్తాంగ్, బలెము, భకుక్పాంగ్, జమెరి, సించంగ్, ంఫ్ర, త్రిజినో, రూపా మరియు షెర్గాన్.
  • జిల్లా 4 డెవెలెప్మెంటు విభాగాలుగా విభజించబడింది :- డిరాంగ్, కలక్తంగ్, నఫ్ర-బురగోయన్ మరియు త్రిజినో.
  • జిల్లాలో 4 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి :- డిరాంగ్, కలక్తాంగ్, త్రిజినో-బురగోయన్ మరియు బొండిల. ఇవి 4 పశ్చిమ అరుణాచల్ పార్లమెంటరీ నియోజకవర్గంలో భాగంగా ఉన్నాయి.

[5]

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 87,013,[1]
ఇది దాదాపు. ఆంటిగువా మరియు బర్బరా దేశ జనసంఖ్యకు సమానం.[6]
అమెరికాలోని. నగర జనసంఖ్యకు సమం.
640 భారతదేశ జిల్లాలలో. 618వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 12 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 16.64%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 755:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 69.4%.[1]
జాతియ సరాసరి (72%) కంటే.

పశ్చిమ కమెంగ్ జిల్లా 5 ప్రధాన గిరిజనజాతులు ఉన్నాయి:- మొంప ప్రజలు (78%), డిరాంగ్, భుట్, లిష్ మరియు కలక్తంగ్ (మొంప),మిజి (సజోలాంగ్), షెర్‌డ్యుక్పెన్, అక (హర్సొ) మరియు ఖోవల్ (బుగన్) జాతులు ఉన్నాయి. అల్పసంఖ్యాకులలో తక్ప, లిషిప, చుగ్ప మరియు బుట్ప.

భాషలు[మార్చు]

అల్పసంఖ్యాకులు మాట్లాడే భాషలు :-

  • పురోయిక్ భాష.
  • హర్సో భాష. (అక)
  • మిజి భాష.
  • ఖో-బ్వా భాష.
  • ఖోవాభాష (బుగన్)
  • ధెర్డుక్పెన్ భాష.
  • సర్తాంగ్ భాష.
  • లిష్ భాష. (చంగ్)
  • బోదిష్ భాష.
  • బ్రొక్ప భాష.
  • త్షంగ్ల భాష

జిల్లా నివాసులలో బౌద్ధులు. అక, ఖొవ మరియు మిజి స్థానిక మతాలను అనుసరిస్తున్నారు. వీరు బుద్ధిజం, హిందూయిజం మరియు జ్డొన్యి-పొలో మతాలమిశ్రిత మతాన్ని అనుసరిస్తున్నారు. ఇది ఒక తరహా అనిమిజం అని చెప్పచ్చు.

వృక్షజాలం మరియు జంతుజాలం[మార్చు]

1989లో పశ్చిమకమెంగ్ జిల్లాలో 217 చ.కి.మీ వైశాల్యంలో " ఈగిల్ నెస్ట్ విల్డ్ లైఫ్ శాంక్చ్యురీ) ఏర్పాటు చేయబడింది.[7]1989 అంతే కాక జిల్లాలో 100చ.కి.మీ వైశాల్యంలో " సీసా ఆర్చిడ్ వన్యప్రాణి అభయారణ్యం " కూడా ఏర్పాటు చేయబడింది.100 km2 (38.6 sq mi).[7]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 1.8 "District Census 2011". Census2011.co.in. Retrieved 2014-01-07. 
  2. 2.0 2.1 Law, Gwillim (25 September 2011). "Districts of India". Statoids. Retrieved 2014-01-07. 
  3. Srivastava, Dayawanti et al. (ed.) (2010). "States and Union Territories: Arunachal Pradesh: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. p. 1113. ISBN 978-81-230-1617-7. 
  4. "Island Directory Tables: Islands by Land Area". United Nations Environment Program. 18 February 1998. Retrieved 2014-01-07. New Ireland 7,404km2  horizontal tab character in |quote= at position 12 (help)
  5. "Assembly Constituencies allocation w.r.t District and Parliamentary Constituencies". Chief Electoral Officer, Arunachal Pradesh website. Retrieved 21 March 2011. 
  6. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Antigua and Barbuda 87,884 July 2011 est.  line feed character in |quote= at position 20 (help)
  7. 7.0 7.1 Indian Ministry of Forests and Environment. "Protected areas: Arunachal Pradesh". Retrieved 25 September 2011. 

వెలుపలి లింకులు[మార్చు]